నమస్కారం,
ఈ కార్యక్రమంలో మనతోపాటు హాజరైన కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ రమేశ్ పోఖ్రియాల్ నిశంక్ జీ, అస్సాం ముఖ్యమంత్రి శ్రీ సర్బానంద్ సోనోవాల్ జీ, కేంద్ర కేబినెట్ సహచరుడు, విద్యాశాఖ సహాయ మంత్రి శ్రీ సంజయ్ ధోత్రే జీ, బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ మోదీజీ, మెంబర్స్ ఆఫ్ సెనేట్, ఈ స్నాతకోత్సవానికి ఆహ్వానితులు, ఫ్యాకల్టీ సభ్యులు, ఉద్యోగులు, నా ప్రియ విద్యార్థులారా,
ఐఐటీ గౌహతి 22వ స్నాతకోత్సవంలో మీ అందరికీ కలిసి పాలుపంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. సాధారణంగా ప్రతి విద్యార్థి జీవితంలో స్నాతకోత్సవం ప్రత్యేకమైనదనడంలో సందేహం లేదు. కానీ ఈసారి స్నాతకోత్సవం మరీ ప్రత్యేకమైనది. కరోనా నేపథ్యంలో స్నాతకోత్సవ ప్రదానం పద్ధతులు పూర్తిగా మారిపోయాయి. పరిస్థితులు అనుకున్నట్లుగా ఉంటే నేను మీతో నేరుగా మాట్లాడేవాడిని. అయినప్పటికీ ఈ కార్యక్రమం చాలా మహత్వమైనది, విలువైనది. ఈ సందర్భంగా మీ అందరికీ, నా యువ మిత్రులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మీ ఉజ్వల భవిష్యత్ కార్యాచరణకోసం మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
మిత్రులారా, మన పురాణాల్లో ‘జ్ఞానం విజ్ఞాన సహితం, యత్ జ్ఞాత్వా మోక్షసే అశుభాత్’ అని చెప్పబడింది. అంటే.. విజ్ఞానం, జ్ఞానానం ద్వారా అన్ని సమస్యలకు పరిష్కారం, దుఖం నుంచి ముక్తి లభిస్తుందని దాని అర్థం. ఇదే భావన మరింత సేవనందిచేందుకు సరికొత్త శక్తినిస్తుంది. ఈ శ్లోకమే వేల ఏళ్లుగా మన దేశ జీవనయాత్రను బతికిస్తోంది, గొప్పగా నిలబెడుతోంది. ఈ భావన ఆధారంగానే మన ఐఐటీ వంటి సంస్థలు ముందుకెళ్తున్నాయి. ఐఐటీ గౌహతిలో మీ ప్రయాణం మొదలైనప్పటినుంచి పోలిస్తే కోర్సు పూర్తయిన తర్వాత మీలో ఎంతటి మార్పు వచ్చిందో, మీ ఆలోచనాశైలి ఎలా విస్తరించిందో మీకు అవగతం అయ్యేఉంటుంది. మీలోని నూతన వ్యక్తిత్వాన్ని మీరే గమనించి ఉంటారు. ఇది ఈ సంస్థకు, మీ ప్రొఫెసర్లకు మీరిచ్చే విలువైన కానుక.
మిత్రులారా, దేశ యువత నేడు ఎలా ఆలోచిస్తుందనేదే ఆ దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుందని.. మీ కలలు దేశ వాస్తవికతను నిర్ధారిస్తాయని నేను బలంగా విశ్వసిస్తున్నాను. అందుకే ఈ సమయం భవిష్యత్తుకు మిమ్మల్ని సిద్ధం చేసే సమయంగా భావించాలి. ఎలాగైతే మన సమాజంలో, ఆర్థిక వ్యవస్థలో మార్పులు వస్తున్నాయో.. ఆధునీకరణ జరుగుతోందో.. దానికి అనుగుణంగానే భారత శాస్త్ర,సాంకేతిక రంగంలోనూ అవసరమైన మార్పులు చేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఐఐటీ గౌహతి ఈ దిశగా తన ప్రయత్నాన్ని ముందుగానే ప్రారంభించినందుకు నాకు చాలా సంతోషంగాఉంది. ఐఐటీ గౌహతిలో ఈ-మొబిలిటీ ద్వారా రెండేళ్లపాటు పరిశోధనాత్మక కార్యక్రమాలను ప్రవేశపెట్టారని తెలిసి హర్షం వ్యక్తం చేస్తున్నాను. దీంతోపాటుగా బీటెక్ స్థాయిలోని అన్ని కార్యక్రమాల్లో సైన్స్, ఇంజనీరింగ్ విషయాలను సమన్వయ పరుస్తూ కోర్సులు జరగడం ప్రశంసనీయం. ఈ ఇంటర్-డిసిప్లినరీ కార్యక్రమాలు మన దేశ విద్యావ్యవస్థను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మార్చగలవని నేను విశ్వసిస్తున్నాను. ఎప్పుడైతే ఇలాంటి భవిష్యత్ దర్శిత విధానం ఆధారంగా విద్యాసంస్థలు ముందుకెళ్తాయో.. దాని ఫలితాలు కూడా అద్భుతంగా ఉంటాయి.
ఐఐటీ గౌహతి ద్వారా కరోనా సమయంలో కరోనా సంబంధిత కిట్లు (వైరల్ ట్రాన్స్ పోర్ట్ మీడియా, వైరల్ ఆర్ఎన్ఏ ఎక్స్‌ట్రాక్షన్ కిట్, ఆర్టీ-పీసీఆర్ కిట్లు మొదలైన) వాటిని రూపొందించడం ద్వారా మరోసారి సమాజహితంలో తన బాధ్యతను చాటుకుంది. కరోనా సమయంలో విద్యాపాఠ్యప్రణాళికను కొనసాగిస్తూనే.. ఇలాంటి పరిశోధనాత్మక కార్యక్రమాలు చేపట్టడం ఎంత కష్టమో నాకు బాగా తెలుసు. కానీ ఐఐటీ గౌహతి ఈ దిశగా విజయం సాధించింది. మీరు చేసిన ఈ ప్రయత్నం దేశాన్ని ఆత్మనిర్భరంగా మార్చేదిశగా ముందుకు తీసుకెళ్తుంది. మీ ఈ ప్రయత్నానికి నా అభినందనలు.
మిత్రులారా, ఆత్మనిర్భర భారత నిర్మాణంలో మన విద్యావ్యవస్థ పాత్ర అత్యంత కీలకం. ఈ విషయం మీకు కూడా బాగా తెలుసు. ఈ మధ్య మన నూతన విద్యావిధానం గురించి మీరు చదివే ఉంటారు. చర్చించి ఉంటారు కూడా. 21వశతాబ్దంలో ప్రపంచాన్ని ముందుకు నడిపించేలా, శాస్త్ర, సాంకేతిక రంగంలో భారత్‌ను ప్రపంచశక్తిగా మార్చేలా.. మన యువతను సన్నద్ధం చేసే దిశగా ఈ విధానం రూపొదించబడింది. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఉద్దేశించిన చక్కటి అంశాలన్నీ ఈ విద్యావిధానంలో పొందుపరచబడి ఉన్నాయి.
ఐఐటీ గౌహతి 22వ స్నాతకోత్సవంలో మీ అందరికీ కలిసి పాలుపంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. సాధారణంగా ప్రతి విద్యార్థి జీవితంలో స్నాతకోత్సవం ప్రత్యేకమైనదనడంలో సందేహం లేదు. కానీ ఈసారి స్నాతకోత్సవం మరీ ప్రత్యేకమైనది. కరోనా నేపథ్యంలో స్నాతకోత్సవ ప్రదానం పద్ధతులు పూర్తిగా మారిపోయాయి. పరిస్థితులు అనుకున్నట్లుగా ఉంటే నేను మీతో నేరుగా మాట్లాడేవాడిని. అయినప్పటికీ ఈ కార్యక్రమం చాలా మహత్వమైనది, విలువైనది. ఈ సందర్భంగా మీ అందరికీ, నా యువ మిత్రులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మీ ఉజ్వల భవిష్యత్ కార్యాచరణకోసం మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
మిత్రులారా, మన పురాణాల్లో ‘జ్ఞానం విజ్ఞాన సహితం, యత్ జ్ఞాత్వా మోక్షసే అశుభాత్’ అని చెప్పబడింది. అంటే.. విజ్ఞానం, జ్ఞానానం ద్వారా అన్ని సమస్యలకు పరిష్కారం, దుఖం నుంచి ముక్తి లభిస్తుందని దాని అర్థం. ఇదే భావన మరింత సేవనందిచేందుకు సరికొత్త శక్తినిస్తుంది. ఈ శ్లోకమే వేల ఏళ్లుగా మన దేశ జీవనయాత్రను బతికిస్తోంది, గొప్పగా నిలబెడుతోంది. ఈ భావన ఆధారంగానే మన ఐఐటీ వంటి సంస్థలు ముందుకెళ్తున్నాయి. ఐఐటీ గౌహతిలో మీ ప్రయాణం మొదలైనప్పటినుంచి పోలిస్తే కోర్సు పూర్తయిన తర్వాత మీలో ఎంతటి మార్పు వచ్చిందో, మీ ఆలోచనాశైలి ఎలా విస్తరించిందో మీకు అవగతం అయ్యేఉంటుంది. మీలోని నూతన వ్యక్తిత్వాన్ని మీరే గమనించి ఉంటారు. ఇది ఈ సంస్థకు, మీ ప్రొఫెసర్లకు మీరిచ్చే విలువైన కానుక.
మిత్రులారా, ఆత్మనిర్భర భారత నిర్మాణంలో మన విద్యావ్యవస్థ పాత్ర అత్యంత కీలకం. ఈ విషయం మీకు కూడా బాగా తెలుసు. ఈ మధ్య మన నూతన విద్యావిధానం గురించి మీరు చదివే ఉంటారు. చర్చించి ఉంటారు కూడా. 21వశతాబ్దంలో ప్రపంచాన్ని ముందుకు నడిపించేలా, శాస్త్ర, సాంకేతిక రంగంలో భారత్‌ను ప్రపంచశక్తిగా మార్చేలా.. మన యువతను సన్నద్ధం చేసే దిశగా ఈ విధానం రూపొదించబడింది. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి ఉద్దేశించిన చక్కటి అంశాలన్నీ ఈ విద్యావిధానంలో పొందుపరచబడి ఉన్నాయి.
మిత్రులారా, మన విద్యావ్యవస్థలో విద్య, పరీక్షలు విద్యార్థికి భారం కాకూడదని నేను భావిస్తాను. విద్యార్థులు తమకు నచ్చిన విషయాలను చదువుకునే స్వాతంత్ర్యం ఉండాలి. అందుకే నూతన జాతీయ విద్యావిధానంలో వివిధ విషయాలను క్రోఢీకరించాం. విద్యార్థులు తమకు నచ్చిన విషయాలను ఎంచుకోవడంతోపాటు.. వీలైనన్ని వేర్వేరు విషయాలను నేర్చుకునేందుకు వీలు కల్పించాం. అన్నింటికంటే ముఖ్యంగా సాంకేతికతను విద్యలో భాగంగా మార్చడం ద్వారా వారి ఆలోచనల్లో సాంకేతికతను ఓ అంతర్భాగంగా మార్చేయడమే ఈ విధానం ఉద్దేశం. విద్యార్థులు సాంకేతికతను, సాంకేతికత ద్వారానే చదువుకుంటారు. విద్యలో కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వినియోగం ఉంటుంది, ఆన్ లైన్ శిక్షణ పెరుగుతుంది.