16 అటల్ అవాసీయ విద్యాలయాలను ప్రారంభం
"కాశీ సంసద్ సాంస్కృతిక మహోత్సవ్ వంటి కార్యక్రమాలు ఈ పురాతన నగరం సాంస్కృతిక చైతన్యాన్ని బలోపేతం చేస్తాయి"
మహాదేవుని ఆశీస్సులతో, కాశీ అపూర్వమైన అభివృద్ధి కోణాలలో సాక్షాత్కరిస్తోంది”
"కాశీ, సంస్కృతి ఒకే శక్తి కి రెండు పేర్లు"
“కాశీలోని ప్రతి మూల సంగీత స్రవంతితో తరిస్తోంది, అన్నింటికంటే, ఇది నటరాజ్ నగరం
"2014లో నేను ఇక్కడికి వచ్చినప్పుడు, నేను ఊహించిన కాశీ అభివృద్ధి, వారసత్వ కల ఇప్పుడు మెల్లగా నెరవేరుతోంది"
"వారణాసి శతాబ్దాలుగా అభ్యాస కేంద్రంగా ఉంది, దీనికి అన్నింటిని కలుపుకొని పోయే స్ఫూర్తి"
"కాశీలో టూరిస్ట్ గైడ్‌ల సంస్కృతి అభివృద్ధి చెందాలని, కాశీకి చెందిన టూరిస్ట్ గైడ్‌లు ప్రపంచంలోనే అత్యంత గౌరవనీయంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను"

ఉత్తరప్రదేశ్‌ పాపులర్‌ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్‌ జి, వేదికమీద ఆశీనులైన అతిథులకు, కాశీ సంసద్‌ సాంస్కృతిక్‌ మహోత్సవ్‌లో పాల్గొంటున్న వారికి, ప్రస్తుతం రుద్రాక్ష్‌ సెంటర్‌ లో ఈ కార్యక్రమానికి హాజరైన కాశీనివాసితులకు స్వాగతం....
శివమహాదేవుడి ఆశీస్సులతో కాశీ ప్రతిష్ఠ ఇవాళ కొత్తశిఖరాలకు చేరుకుంటున్నది. జి`20 శిఖరాగ్ర సమ్మేళనం ద్వారా భారత పతాకం ప్రపంచవేదికపై సమున్నతంగా రెపరెపలాడిరది. అయితే కాశీకి సంబంధించిన చర్చ ఎంతో ప్రత్యేకమైనది. కాశీ సేవలు, ఇక్కడి సంస్కృతి , సంగీతం, ఇక్కడి రుచులు, అన్నీ ప్రత్యేకం.జి20 సమావేశాలకోసం వచ్చి కాశీ సందర్శించిన అతిథులు తమతోపాటు ఎన్నో జాఞపకాలను తమ వెంట తీసుకెళ్లారు. శివమహాదేవుడి ఆశీస్సులతో జి20 సమావేశాలు అద్భుత విజయం సాధించాయని నేను విశ్వసిస్తున్నాను.

    మిత్రులారా,

భగవంతుడి దయవల్ల కాశీ మున్నెన్నడూ లేనంతటి అభివృద్ధిని సాధిస్తోంది. మీరుకూడా ఇదే అనుకుంటున్నారా లేదా?మీరు చెప్తే నే నాకు తెలుస్తుంది. నేను చెబుతున్నది నిజమా కాదా  ?  మీరు చెప్పాలి. మార్పులు గమనిస్తున్నారా లేదా ?  కాశీ అధ్బుతంగా మెరిసిపోతున్నదా లేదా? ప్రపంచవ్యాప్తంగా కాశీ పేరు మారుమోగుతున్నదా లేదా? చెప్పండి.
మిత్రులారా,
నేను ఈరోజు బనారస్‌లో అంతర్జాతీయ క్రికెట్‌స్టేడియంను ప్రారంభించాను.  అలాగే ఉత్తరప్రదేశ్‌లో 16 అటల్‌ ఆవాసీయ విద్యాలయాలను ప్రారంభించే అవకాశంకూడా నాకు ఈరోజు దక్కింది. ఈ విజయాలన్నింటికీ నేను కాశీ ప్రజలకు అభినందనలు తెలుపుతున్నాను. ఉత్తర ప్రదేశ్‌ ప్రజలకు, నా శ్రామిక కుటుంబాలకు అభినందనలు.

నా కుటుంబ సభ్యులారా,
నేను 2014 వ సంవత్సరంలో ఈ నియోజకవర్గం నుంచి పార్లమెంటు సభ్యుడిని అయినపుడు, కాశీ విషయంలో నాకొక దార్శనికత ఉండేది.  ఇవాళ, ఆ అభివృద్ది, విశిష్ట వారసత్వ కల క్రమంగా సాకారం అవుతున్నది. ఢల్లీిలో బిజీగా ఉన్నప్పటికీ, మీ కాశృ సంసద్‌ సాంస్కృతిక మహోత్సవ్‌ గురించి నేను క్రమంతప్పకుండా గమనిస్తూ వచ్చాను.  గతరాత్రి పొద్దుపోయాక నేను ఇక్కడికి వచ్చినపుడు కూడా ఇక్కడ జరుగుతున్నదానిపై కొద్దిసేపు వీడియోలు చూశానే, మీప్రెజెంటేషన్లు ఎంతో అద్భుతంగా ఉన్నాయి.అద్భుతమైన సంగీతం,కాశీ పార్లమెంటు సభ్యుడిగా నేను ఎంతో గర్వపడుతున్నాను. ఈ ప్రాంతంలోని ఎంతో మంది ప్రతిభావంతులతో నాకు ప్రత్యక్ష పరిచయం ఏర్పడిరది. కాశీసంసద్‌ సాంస్కృతిక మహోత్సవ్‌ నాకు ఈ అవకాశం కల్పించింది.
 ఈ కార్యక్రమం సంవత్సరంగా నడుస్తోంది.అయినా సుమారు 40 వేల మంది కళాకారులు, లక్షలాది మంది ప్రేక్షకులు వ్యక్తిగతంగా ఈ కార్యక్రమాలను తిలకించి, పాల్గొని ఆనందించారు. రాగల సంవత్సరాలలో ఈ సాంస్కృతిక ఉత్సవం కాశీప్రత్యేక గుర్తింపుగా నిలవనుంది. బనారస్‌ ప్రజల కృషితో ఇది జరగనుంది. దీని ప్రజాదరణ గణనీయంగా పెరగనుంది. ప్రతి ఒక్కరూ ఈ పోటీలలో తాము పాల్గొన్నామని, బహుమతులు గెలుచుకున్నామని రాసే పరిస్థితి వస్తుంది.అలాగే ప్రపంచం మిమ్మల్ని, ఈ కార్యక్రమాలలో మీరే టాప్‌గా నిలిచినవారు కదా, మీ గురించి పరిచయం అక్కరలేదు, మీగురించి మేం ఎంతో విన్నాం అని చెప్పే పరిస్థితి వస్తుంది. ఇది త్వరలోనే జరగనుంది. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే పర్యాటకులకు కాశీ సరికొత్త గమ్యస్థానం కానుంది.

నా కుటుంబ సభ్యులారా,
కాశీ, దాని సంస్కృతి వేరు వేరు కాదు. ఒకటే. ఒకే శక్తికి సంబంధించిన రెండు పేర్లు.మీరు వీటిని రెండిరటినీ వేరు చేయలేరు. దేశ సాంస్కృతిక రాజధానిగా కాశీ పేరుతెచ్చుకుంది. కాశీలోని ప్రతి అణువూ పాటలతో పులకించిపోతుంది. ఇది సహజం. ఎందుకంటే ఇది నటరాజు నగరం.అన్ని నృత్యరూపాలు నటరాజు తాండవం నుంచి పుట్టినవే. అలాగే అన్ని సంగీత ధ్వనులూ పరమశివుని డమరునుంచి ఉద్భవించినవే.అన్నికళారూపాలూ పరమశివుడి ఆలోచనలోంచి పుట్టినవే. ఈ కళలు , కళారూపాలకు ఒక క్రమపద్ధతి ఏర్పరచి గొప్ప గొప్ప మునులు, రుషులు మనకు అందించారు. కాశీ అంటే ఏడు కాలాలు, తొమ్మిది ఉత్సవాలు. అంటే ఏ పండుగకూడా సంగీతం , నృత్యంలేనిది పూర్తి అయినట్టుకాదు. ఇంట్లో అందరూ ఆనందంగా కుటుంబసబ్యులు ఒకచోట చేరిన ఉత్సవమైనా, భరత్‌మిలాప్‌అయినా, నాగ్‌ నాతాయియా అయినా సంకట్‌ మోచన్‌ సంగీత ఉత్సవాలైనా, లేదా దేవ్‌ దీపావళి అయినా ప్రతి ఒక్కటీ సంగీతంలో మునిగితేలేదే.

మిత్రులారా,
కాశీ, సంప్రదాయ సంగీతమంత గొప్పది.ఇక్కడి జానపద సంగీతం కూడా అంతే అద్భుతం. షెహనాయ్‌, సితార్‌ తబలా అన్నింటినీ మీరు ఇక్కడ చూస్తారు. ఇక్కడ సారంగీ ట్యూన్లుప్రతిధ్వనిస్తాయి.వీణ వాయిస్తారు. కాశీ వివిధ కళారూపాలను కాపాడుతూ వచ్చింది. ఖయాల్‌, తుమ్రి, దాద్రా, చైతిని, కజ్రి లను శతాబ్దాలుగా కాపాడుతూ వచ్చింది. తరతరాలుగా గురు `శిష్యపరంపర ద్వారా వివిధ కుటుంబాలు భారతీయ ఆత్మను కాపాడుతూ వచ్చాయి. తెలియా, పియారి, రాంపురా, బనారస్‌ లోని కబీర్‌చౌరా మొహల్లాలులకు చెందిన కళాకారులు వీరిలోఉన్నారు. ఇక్కడి వారసత్వం దానికదే గొప్పది. బరారస్‌ ఎంతోమంది గొప్పకళాకారులను తయారుచేసింది.వీరు ప్రపంచంలో తమదైన ముద్రవేశారు. వారందరి పేర్లు చెబుతూ పోతే రోజులుపడుతుంది. ఎంతోమంది అంతర్జాతీయంగా ఖ్యాతి గడిరచిన వారు మన కళ్లెదుటే ఉన్నారు. బనారస్‌కు చెందిన ఎంతోమంది సాంస్కృతిక గురువులను కలుసుకుని వారితో కాసేపు గడిపే అవకాశం నాకు లభించింది.ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను.

మిత్రులారా,
ఇవాళ కావీ సంసద్‌ ఖేల్‌ ప్రత్యోగితా పోర్టల్‌ ను ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది.  ఇది సంసద్‌ ఖస్త్రల్‌ ప్రత్యోగితా లేక సంసద్‌ సాంస్కృతిక్‌ మహోత్సవ్‌? ఇక్కడ రెండు సంప్రదాయాలూ ప్రారంభమవుతున్నాయి. ఇక మనం ఇక్కడ కాశీ సంసద్‌ గ్యాన్‌ ప్రతియోగితను కూడా నిర్వహించాలి. కాశీ చరిత్ర, ఇక్కడి గొప్ప వారసత్వం, ఇక్కడి పండుగలు, ఇక్కడి ఆహార అలవాట్లు, వంటలు వంటి వాటిపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలి. సంసద్‌ గ్యాన్‌ ప్రతియోగితను బనారస్‌ లోని వివిధ పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో నిర్వహించాలి.
మిత్రులారా,

కాశీ ప్రజలకు కాశీ గురించి చాలావరకు తెలుసు. ఇక్కడి ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం, వాస్తవానికి కాశీ విషయంలో ఒక నిజమైన బ్రాండ్‌ అంబాసిడర్‌.  అయితే అదే సమయంలో కాశీ కి సంబంధించి ప్రతి ఒక్కరూ ఇతరులకు అద్బుతంగా తెలియజేయగలిగి ఉండాలి. అందుకే తొలిసారిగా దేశంలో ఇక్కడినుంచే ఒకటి   మొదలుపెట్టాలన్నది నా ఆకాంక్ష. ఇందులో ప్రతి ఒక్కరూ పాలుపంచుకుంటారు కదా. అయితే ఇంతకూ నేను ఏం చెప్పబోతున్నానో మీకు తెలియదు కదా, అయినా మీరు నేను విషయం చెప్పక ముందే మీ సమ్మతిని యస్‌ అనిచెప్పేశారు.
మీరు ఏ పర్యాటక ప్రదేశాన్ని అయినా చూడండి, యాత్రాస్థలాన్ని అయినా గమనించండి. అక్కడ మనకు మంచి గైడ్‌ అవసరం. ఈ గైడ్‌ మంచి పరిజ్ఞానం కలిగిన వారై ఉండాలి.సమాచారం సరిగా ఇచ్చేవారై ఉండాలి. కాశీ 200 చరిత్ర కలిగినది అని తప్పుగా చెప్పేవారిలా ఉండకూడదు. మరికొందరు ఇది 250 సంవత్సరాల చరిత్ర కలది అనవచ్చు. మరొకరు 300 సంవత్సరాలది అనవచ్చు. ఇది 240 సంవత్సరాలది.

కాశీ ప్రజలకు కాశీ గురించి చాలావరకు తెలుసు. ఇక్కడి ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం, వాస్తవానికి కాశీ విషయంలో ఒక నిజమైన బ్రాండ్‌ అంబాసిడర్‌.  అయితే అదే సమయంలో కాశీ కి సంబంధించి ప్రతి ఒక్కరూ ఇతరులకు అద్బుతంగా తెలియజేయగలిగి ఉండాలి. అందుకే తొలిసారిగా దేశంలో ఇక్కడినుంచే ఒకటి   మొదలుపెట్టాలన్నది నా ఆకాంక్ష. ఇందులో ప్రతి ఒక్కరూ పాలుపంచుకుంటారు కదా. అయితే ఇంతకూ నేను ఏం చెప్పబోతున్నానో మీకు తెలియదు కదా, అయినా మీరు నేను విషయం చెప్పక ముందే మీ సమ్మతిని యస్‌ అనిచెప్పేశారు.
మీరు ఏ పర్యాటక ప్రదేశాన్ని అయినా చూడండి, యాత్రాస్థలాన్ని అయినా గమనించండి. అక్కడ మనకు మంచి గైడ్‌ అవసరం. ఈ గైడ్‌ మంచి పరిజ్ఞానం కలిగిన వారై ఉండాలి.సమాచారం సరిగా ఇచ్చేవారై ఉండాలి. కాశీ 200 చరిత్ర కలిగినది అని తప్పుగా చెప్పేవారిలా ఉండకూడదు. మరికొందరు ఇది 250 సంవత్సరాల చరిత్ర కలది అనవచ్చు. మరొకరు 300 సంవత్సరాలది అనవచ్చు. ఒక్కొక్కరు ఒక్కోరకంగా చెప్పడం కాక ఖచ్చితంగా ఒకే మాట చెప్పేలా ఉండాలి. ఆ శక్తి కాశీలో ఉండాలి. ప్రస్తుత పరిస్థితులలో టూరిస్టు గైడ్‌ అనేది కూడా మంచి ఉపాధి మార్గం. ఇక్కడికివచ్చే పర్యాటకులు ప్రతి విషయాన్ని తెలుసుకోవాలని కోరుకుంటారు. అలాగే వారు గైడ్‌కు కొంత మొత్తం చెల్లిస్తారు. అందువల్ల నాకొక ఆలోచన వచ్చింది. దానిని అమలుచేయాలని అనుకుంటున్నాను. మనం కాశృ సంసద్‌ టూరిస్ట్‌ గైడ్‌ కాంపిటిషన్‌ నిర్వహిద్దాం. మీరు గైడ్‌ కావచ్చు. ప్రజలకు ఇక్కడి విషయాలు వివరించవచ్చు.బహుమతులు గెలుచుకోవచ్చు. ఈ కంగా గైడ్‌ ల సంస్కృతి నగరంలో పెరుగుతున్న విషయాన్ని ప్రజలు తెలుసుకో గలుగుతారు.  నేను ఎందుకు ఈ పని చేద్దామని అనుకుంటున్నానంటే, ప్రపంచవ్యాప్తంగా కాశీపేరు ప్రతిష్ఠలు ప్రతిధ్వనించాలి.ప్రపంచంలో ఎవరైనా టూరిస్ట్‌ గైడ్‌ గురించి ప్రస్తావిస్తే, కాశీ గైడ్ల పేరు అత్యంత గౌరవప్రదంగా ప్రస్తావించేట్టు ఉండాలి. ఇప్పటినుంచి కాశీలోని ప్రతి ఒక్కరూ ఇందుకు సిద్దం కావాలని కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవలసిందిగా పిలుపునిస్తున్నాను.

కుటుంబ సభ్యులారా,
బెనారస్‌ నగరం, శతాబ్దాలుగా విద్యకు కేంద్రంగా ఉంటూ వచ్చింది. బనారస్‌ విద్యా సంస్థల విజయానికి  పునాది వాటి సమగ్రతలో ఉంది. దేశం నలుమూలల నుంచి విద్యార్థులు ఇక్కడకు విద్యనభ్యసించడానికి వస్తారు.
ఇవాళ్టికి కూడా చాలా మంది ఇక్కడికి సంస్కృతం నేర్చుకోవడానికి వస్తారు. ఈ సెంటిమెంట్‌ తోనే మనం ఇవాళ అటల్‌ ఆవాసీయ (రెసిడెన్షియల్‌) విద్యాలయాలను ఇక్కడ ప్రారంభించుకున్నాం.  ఈ అటల్‌ ఆవాసీయ విద్యాలయాలకు అవుతున్న ఖర్చు 1100 కోట్ల రూపాయలు. ఈ పాఠశాలలు శ్రామికులు, సమాజంలోని బలహీన వర్గాల పిల్లల కోసం ఏర్పాటు చేసినవి. ఈ చర్య ద్వారా వారికి మంచి విలువలతో కూడిన ఆధునిక విద్య అందుతుంది. కోవిడ్‌ 19 సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ఈ అటల్‌ ఆవాసీయ విద్యాలయాలలో ఉచిత విద్యను అందించడం జరుగుతుంది.  ఈ విద్యాలయాలలో మ్యూజిక్‌, కళలు, క్రాఫ్ట్‌, కంప్యూటర్స్‌, క్రీడలకు ప్రత్యేకంగా టీచర్లు ఉంటారని నాకు చెప్పారు. రెగ్యులర్‌ పాఠ్యాంశాలకు తోడుగా ఇవి ఉంటాయి. ఈ విద్యాలయాల ద్వారా అణగారిన వర్గాల వారిపిల్లలు మంచి నాణ్యమైన విద్యను, సమగ్ర విద్యను అభ్యసించి తమ కలలను సాకారం చేసుకోవడానికి వీలు కలుగుతుంది. అలాగే మనం గిరిజన తెగల కుటుంబాలకు చెందిన పిల్లల కోసం ఏకలవ్య పాఠశాలలు నిర్మించాం. నూతన జాతీయ విద్యావిధానం ద్వారా మనం , విద్యావ్యవస్థగురించి పాత ధోరణిలో ఆలోచించడం మార్చాము. ఇప్పుడు మన పాఠశాలలు ఆధునికం అవుతున్నాయి. తరగతి గదులు మరింత ఆధునికం అవుతున్నాయి. ప్రభుత్వం పిఎం` శ్రీ అభియాన్‌ కింద దేశంలోని వందలాది పాఠశాలలను ఆధునీకరిస్తోంది. ఈ ప్రచారం కింద దేశంలోని వేలాది పాఠశాలలు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నాయి.

మిత్రులారా,
ఒక ఎంపీగా, కాశీలో ప్రారంభిస్తున్న అన్ని కార్యక్రమాలకు నాకు పూర్తి మద్దతు లభిస్తోంది. ఈ అటల్‌ ఆవాసీయ విద్యాలయాలు , జీవనోపాధికోసం ఒక ఊరు నుంచి మరో ఊరుకు వెళ్లే నిర్మాణ రంగ పిల్లల విద్య దెబ్బతినకుండా ఉండేందుకు వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ పిల్లల కోసం బడ్జెట్‌లో నిధులు కేటాయించడం జరిగింది. తక్షణ రాజకీయ ప్రయోజనాలు ఏవీ చూడని వారిని మీరుఇప్పుడు చూస్తున్నారు.వీరికి స్వార్థ ప్రయోజనాలు ఏవీ లేవు. వారు ఎలా పనిచేస్తున్నారో చూడండి.మరోవైపు కొందరు నిరంతరం ఎన్నికలనే కలవరిస్తూ, ఏవిధంగానైనా ఓట్లు పొందాలని నాటకాలు ఆడుతున్నవారు ఉన్నారు. వారు ఈ నిధులను దుర్వినియోగం చేస్తారు. ఈవిషయమై మీరు సమాచారం సేకరించదలిస్తే మీకు విషయాలు తెలుస్తాయి. ఈ నిధులు అన్ని రాష్ట్రాల దగ్గర ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది. అయితే చాలా రాష్ట్రాలు ఈ నిధులను ఓట్లు దండుకునేందుకు వాడుకుంటున్నాయి.నేను ఈ విషయాన్ని చాలా కాలం క్రితం యోగీజీతో చర్చించాను. ఈ నిర్మాణరంగ పిల్లలు మంచి చదువులు చదివి, ఇక వారి కుటుంబాలు కూలిపనులు చేయాల్సిన అవసరం లేకుండా చేయాలన్నది  సంకల్పం. వీరిని ఆ రకంగా తీర్చిదిద్దడం దీని లక్ష్యం. నేను అటల్‌ ఆవాసీయ విద్యాలయ విద్యార్థులు కొందరితో మాట్లాడాను. వారు కార్మిక కుటుంబాల నుంచి వచ్చిన వారు. వారు తమ కళ్ల ఎదుట ఏనాడూ పక్కా గృహాన్ని చూసి ఎరుగరు.  అయితే ఈ పిల్లలో ఉన్న ఆత్మ విశ్వాసం నన్ను అబ్బుర పరిచింది. వీరి టీచర్లకు నా అభినందనలు. వారు ఎంతో ఆత్మ విశ్వాసంతో మాట్లాడుతున్న తీరు, వారు ప్రధానమంత్రిని సంబోధించిన తీరు, అడుగుతున్న ప్రశ్నలు గమనించినపుడు ఈ పిల్లలోని శక్తిసామర్ధ్యాలు, స్పార్క్‌ ఎంతో ముచ్చటగొలుపుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌, కాశీ ప్రగతి పరివర్తన ఈ విద్యాలయాల ద్వారా రాగల 10 సంవత్సరాలలో గణనీయంగా ఉండటాన్ని మీరు గమనించగలరన్న గట్టి విశ్వాసం నాకు ఉంది.
ప్రియమైన కాశీ నివాసులారా,
ఈ రకంగా మీరు నన్ను దీవిస్తూ ఉండండి.
మీ అందరికీ ధన్యవాదాలు.
హర హర మహదేవ్‌

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world

Media Coverage

PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi