మిత్రులారా,
ప్రస్తుత“అమృతకాల”యుగంలోనైపుణ్యాలకల్పన, విద్యరెండూదేశానికికీలకమైనపనిముట్లు. అభివృద్ధిచెందినభారత్విజన్తోసాగుతున్నఈఅమృతయాత్రలోమనయువతనాయకత్వంవహిస్తున్నారు. అందుకే“అమృతకాల”తొలిబడ్జెట్యువత,వారిభవిష్యత్తుకుఅత్యధికప్రాధాన్యంఇచ్చింది. విద్యావ్యవస్థఆచరణీయం, పారిశ్రామికప్రాధాన్యంగలవిగాచేస్తూఈరంగంపునాదులనుబడ్జెట్పటిష్ఠంచేస్తోంది. ఎన్నోసంవత్సరాలుగావిద్యారంగంకాఠిన్యానికిబాధితురాలుగాఉండిపోయింది. ఆపరిస్థితినిమేంమార్చాలనుకున్నాం. యువతఆకాంక్షలు, భవిష్యత్అవసరాలుదృష్టిలోఉంచుకునివిద్య, నైపుణ్యాలవిభాగాలదిశనుమార్చాం. కొత్తవిద్యావిధానంఅభ్యాసం, నైపుణ్యాలురెండింటికీసమానప్రాధాన్యంఇచ్చారు. ఈప్రయత్నంలోఉపాధ్యాయులమద్దతుమాకులభించడంఆనందదాయకం. గతకాలంనాటిభారంనుంచిబాలలనువిముక్తంచేసేఅద్భుతమైనసాహసాన్నిమాకుఇదిఅందించింది. అలాగేవిద్య, నైపుణ్యాలరంగాల్లోమరిన్నిసంస్కరణలుచేపట్టేందుకుమాకుప్రోత్సాహంఅందించింది.
మిత్రులారా,
కొత్తటెక్నాలజీకొత్తరకంతరగతి గదులుసృష్టించడానికిసహాయపడుతోంది. కోవిడ్కాలంలోమనంఈఅనుభవంచూశాం. అందుకేప్రభుత్వంనేడుఇలాంటిసాధనాలపైదృష్టిసారిస్తోంది. “జ్ఞానాన్నిఎక్కడనుంచైనాఅందుకునేందుకు”భరోసాఅందిస్తున్నాం.నేడుమాఇ-లెర్నింగ్వేదికస్వయంలో 3 కోట్లమందిసభ్యులున్నారు. వర్చువల్లాబ్లు, నేషనల్డిజిటల్గ్రంథాలయంఅతిపెద్దజ్ఞానసముపార్జనాప్రదేశాలయ్యేఅవకాశాలున్నాయి. విద్యార్థులుకూడాడిటిహెచ్చానళ్లద్వారాస్థానికభాషలోవిద్యాభ్యాసంచేయగలుగుతున్నారు. నేషనల్డిజిటల్గ్రంథాలయంతోఈకార్యక్రమాలన్నింటికీమరింతఉత్తేజంఏర్పడుతుంది. భవిష్యత్తునుదృష్టిలోఉంచుకునితీసుకున్నఈచర్యలన్నీయావత్విద్య, నైపుణ్యాలు, జ్ఞానసముపార్జనారంగాల ముఖచిత్రాన్నిపూర్తిగామార్చివేయనున్నాయి. నేడుమనఉపాధ్యాయులపాత్రకేవలంక్లాస్రూమ్కేపరిమితంకాదు. నేడుభారతదేశంమాత్రమేకాదు...ప్రపంచంమొత్తంమనఉపాధ్యాయులకుఒకతరగతిగదిగామారిపోయింది. ఇదిఉపాధ్యాయులకుఅవకాశాలద్వారాలనుకూడాతెరుస్తుంది. భిన్నరకాలబోధనాఉపకరణాలు, ఇతరత్రాసాధనాలుస్థానికముఖచిత్రంతోఅందుబాటులోకివస్తున్నాయి. దేశవ్యాప్తంగావిద్యాసంస్థలన్నింటికీఈతరహాఉపకరణాలుఅందుబాటులోకిరానున్నాయి.అంతేకాదు... గ్రామాలు, నగరాల్లోపాఠశాలలమధ్యవ్యత్యాసంతొలగిపోతుంది. ప్రతీఒక్కరికీసమానావకాశాలుఅందుబాటులోకివస్తాయి.
మిత్రులారా,
చాలాదేశాలు“ఆన్దజాబ్” అభ్యాసంపైదృష్టిపెట్టడాన్నిమనంచూస్తున్నాం. యువతను“తరగతిగదివెలుపలిప్రపంచం”తోఅనుసంధానంచేసేందుకుకేంద్రప్రభుత్వంఇంటర్న్షిప్లు, అప్రెంటిస్షిప్లపైపలుసంవత్సరాలుగాకేంద్రప్రభుత్వందృష్టిసారిస్తోంది. నేడునేషనల్ఇంటర్న్షిప్పోర్టల్లో 75 వేలయాజమాన్యాలునమోదైఉన్నాయి. వారంతా 25 లక్షలఇంటర్న్షిప్ప్రకటనలుఇచ్చాయి. ఇదియువతకు, పరిశ్రమకుఎంతోప్రయోజనకరంకానుంది. ఈపోర్టల్నుగరిష్ఠంగాఉపయోగించుకోవాలనినేనుపరిశ్రమను, విద్యాసంస్థలనుఅభ్యర్థిస్తున్నాను. మనంఇంటర్న్షిప్సంస్కృతినిమరింతగావిస్తరించాల్సిఉంది.
మిత్రులారా,
యువతనుభవిష్యత్సంసిద్ధులనుచేయడానికిఅప్రెంటిస్షిప్ఎంతోఉపయోగపడుతుందనినేనునమ్ముతున్నాను. దేశంలోఅప్రెంటిస్షిప్నుమేంప్రోత్సహిస్తున్నాం. మనపరిశ్రమసరైననైపుణ్యాలుగలకార్మికశక్తినిగుర్తించేందుకుఇదిసహాయకారిఅవుతుంది. అందుకేఈబడ్జెట్లోనేషనల్అప్రెంటిస్షిప్ప్రోత్సాహకపథకంలోని 50 లక్షలమందికిపైగాయువతకుస్టైపెండ్ఇచ్చేఏర్పాటుచేయడంజరిగింది. అందుకేఅప్రెంటిస్షిప్కుఅనుకూలమైనవాతావరణాన్నిసృష్టించడంతోపాటుపరిశ్రమచెల్లింపులకుమేంకూడాసహాయపడుతున్నాం. ఈపథకాన్నిపూర్తిస్థాయిలోపరిశ్రమఉపయోగించుకోగలుగుతుందనినేనునమ్ముతున్నాను.
మిత్రులారా,
నేడుయావత్ప్రపంచంతయారీహబ్గాభారతదేశంవైపుచూస్తోంది. అందుకేభారతదేశంలోపెట్టుబడులుపెట్టడంపైప్రపంచంఅంతాఉత్సుకతప్రదర్శిస్తోంది. ఇలాంటిపరిస్థితుల్లోనిపుణులైనకార్మికశక్తిప్రాధాన్యంఎక్కువగాఉంది. అందుకేఈబడ్జెట్లోమేంగతసంవత్సరాలుగాఅమలులోఉన్న నైపుణ్యాలకల్పననుమరింతముందుకునడుపుతున్నాం. ఈస్కీమ్సహాయంతోగిరిజనులు, భిన్నసామర్థ్యాలుగలవారు, మహిళలఅవసరాలకుఅనుగుణంగాకార్యక్రమాలురూపొందించేవీలుఏర్పడుతుంది. ఇండస్ర్టీ 4.0లోకీలకమైనఎఐ, రోబోటిక్స్, ఐఓటి, డ్రోన్లువంటివిభిన్నరంగాలకుఅవసరమైనమానవవనరులఅభివృద్ధిజరుగుతుంది. ఇదిఅంతర్జాతీయఇన్వెస్టర్లుభారతదేశంలోకార్యకలాపాలుతేలిగ్గాసాగించేవీలుకలుగుతుంది. భారతదేశంలోపెట్టుబడులుపెట్టేవారురీస్కిల్లింగ్కోసంవనరులు, శక్తికేటాయించవలసినఅవసరంఉండదు. ఈఏడాదిబడ్జెట్లోపిఎంవిశ్వకర్మకౌశల్సమ్మాన్యోజనపథకంప్రకటించడంజరిగింది. దీనిసహాయంతోసాంప్రదాయికకళాకారులు, హస్తకళాకారులు, ఇతరకళాకారులవిభాగాల్లోనైపుణ్యాలఅభివృద్ధికిప్రత్యేకప్రాధాన్యంఇవ్వడంజరుగుతుంది. అలాగేఈకళాకారులుఉత్పత్తులకుమంచిధరలురాబట్టడానికికొత్తమార్కెట్లనుపిఎంవిశ్వకర్మయోజనఅందుబాటులోకితెస్తుంది.
మిత్రులారా,
దేశంలో విద్యారంగంలో వేగవంతమైన మార్పు తీసుకురావడానికి పరిశ్రమ, విద్యారంగం భాగస్వామ్యం, పాత్ర అత్యంత కీలకం. దీని వల్ల మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పరిశోధన జరిగేందుకు అవకాశం ఏర్పడడంతో పాటు పరిశోధనకు అవసరమైన నిధులు పరిశ్రమ నుంచి అందుబాటులోకి వస్తాయి. ఈ బడ్జెట్లో ప్రస్తావించిన మూడు ఎఐ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ తో పరిశ్రమ-విద్యా రంగం భాగస్వామ్యం శక్తివంతం అవుతుంది. అంతే కాదు, ఐసిఎంఆర్ లాబ్ లను వైద్యకళాశాలలు, ప్రైవేటు రంగంలోని ఆర్ అండ్ డి బృందాలకు అందుబాటులో ఉంచాలని కూడా నిర్ణయించడం జరిగింది. దేశంలో ఆర్ అండ్ డి వ్యవస్థను పటిష్ఠం చేయడానికి తీసుకునే ప్రతీ ఒక్క చర్యను ప్రైవేటు రంగం గరిష్ఠంగా వినియోగించుకుంటుందని నేను నమ్ముతున్నాను.
మిత్రులారా,
బడ్జెట్లో మేం తీసుకున్న చర్యలను బట్టి మా ప్రభుత్వ వైఖరి స్పష్టం అవుతుంది. విద్య, ‘నైపుణ్యకల్పన’ ఏదో ఒక శాఖకు మాత్రమే పరిమితమైన అంశం కాదని మేం భావిస్తున్నాం. ప్రతీ శాఖలోను వాటికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థ పరిమాణంలో పెరుగుదలకు దీటుగా ఈ రంగాలు కూడా విస్తరిస్తున్నాయి. నైపుణ్యాలు, విద్యతో సంబంధం గల వర్గాలవారందరూ విభిన్న రంగాల్లో అందుబాటులోకి వస్తున్న అవకాశాలపై అధ్యయనం చేయాలని నేను కోరుతున్నాను. కొత్త రంగాలకు అవసరమైన మానవ వనరులను తయారుచేసుకోవడానికి ఇది మనకి సహాయకారిగా ఉంటుంది. పౌర విమానయాన రంగం వేగవంతమైన విస్తరణకు సంబంధించిన వార్తలు చూస్తుంటే భారతదేశంలో ప్రయాణ, పర్యాటక రంగాలు ఏ విధంగా విస్తరిస్తున్నది తెలుస్తుంది. ఇవి ఉపాధికి మంచి అవకాశాలు కల్పిస్తాయి. అందుకే మన నైపుణ్య కేంద్రాలు, విద్యా సంస్థలు కొత్త సామర్థ్యాలను అభివృద్ధి చేసుకోవాలి. చాలా మంది యువతకు నైపుణ్యాలను పెంచాల్సిన అవసరం ఉన్నందు వల్ల ‘‘స్కిల్ ఇండియా మిషన్’’ కింద శిక్షణ పొందిన యువత డేటాబేస్ ను తయారుచేయాలని మేం భావిస్తున్నాం. డిజిటల్ టెక్నాలజీ, ఏఐ విస్తరిస్తున్న నేటి వాతావరణంలో కూడా ఈ సుశిక్షితులైన మానవ వనరులు వెనుకబడిపోకూడదు. ఇప్పటి నుంచి మనం ఆ దిశగా ప్రయత్నించాల్సి ఉంటుంది.
మిత్రులారా,
దీనిపైఫలవంతమైనచర్చలుజరుగుతాయని; చక్కనిసలహాలు, మంచిపరిష్కారాలుఅందుబాటులోకివస్తాయనినేనుసంపూర్ణంగావిశ్వసిస్తున్నాను. కొత్తకట్టుబాటు, తాజాశక్తితోయువతరంఉజ్వలభవిష్యత్తుకుమీఆలోచనలుఅత్యంతకీలకంగానిలుస్తాయని, మీసంకల్పాలతోవారినిముందుకునడుపుతాయనినేనునమ్ముతున్నాను. ప్రభుత్వంమీతోభుజంభుజంకలిపిసాగుతోంది. ఈవెబినార్లోపాల్గొన్నవారందరికీశుభాభినందనలుతెలియచేస్తున్నాను.
ధన్యవాదాలు.
గమనిక : ప్రధానమంత్రిహిందీప్రసంగానికిఇదిఅనువాదంమాత్రమే.