‘‘వికసిత్ భారత్ కోసం ఉద్దేశించిన బడ్జెట్ సమ్మిళిత వృద్ధికి పూచీ పడుతుంది, ఇది సమాజంలో ప్రతి ఒక్క వర్గానికి మేలు చేస్తుంది, అంతేకాకుండా అభివృద్ధి చెందిన భారతదేశానికి బాటను వేస్తుంది’’
‘‘ఉద్యోగంతో ముడిపెట్టిన ప్రోత్సాహం పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఇది కోట్ల కొద్దీ కొత్త ఉద్యోగాలను సృష్టించనుంది.’’
‘‘ఈ బడ్జెట్ విద్యకు, నైపుణ్యాభివృద్ధికి ఒక కొత్త విస్తృతిని ప్రసాదిస్తుంది’’
‘‘మేం ప్రతి నగరంలో, ప్రతి గ్రామంలో, ప్రతి ఇంట్లో నవ పారిశ్రామికులను తయారు చేస్తాము’’
‘‘గత పదేళ్ళలో పేదలు, మధ్యతరగతి పన్ను సంబంధ ఉపశమనాన్ని పొందుతూ ఉండేటట్లుగా ప్రభుత్వం పూచీ పడింది’’
‘‘అంకుర సంస్థలకు, నూతన ఆవిష్కరణ సంబంధ వ్యవస్థకు బడ్జెట్ కొత్త మార్గాలను తెరిచింది’’
‘‘బడ్జెట్ ప్రధానంగా రైతులపై ఎంతగానో శ్రద్ధ వహించింది’’
‘‘నేటి బడ్జెట్ కొత్త అవకాశాలను, కొత్త శక్తిని, కొత్త ఉద్యోగావకాశాలతోపాటు, స్వతంత్రోపాధి అవకాశాలను తీసుకు వచ్చింది. అది శ్రేష్ఠమైన వృద్ధిని, ప్రకాశవంతమైన భవిష్యత్తును తీసుకు వచ్చింది.’’
‘‘భారతదేశాన్ని ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడంలో ఒక ఉత్ప్రేరకంగా

దేశాన్ని అభివృద్ధి పరంగా నూతన శిఖరాలకు చేర్చే ఈ ముఖ్యమైన బడ్జెటు విషయంలో నా దేశ ప్రజలందరికీ నేను నా అభినందనలను తెలియజేస్తున్నాను. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి, ఆమె బృందానికి కూడా నేను హృదయపూర్వక అభినందనలను తెలియజేస్తున్నాను.

మిత్రులారా,

సమాజంలో అన్ని వర్గాలకు సాధికారిత ను ఈ బడ్జెటు ప్రసాదిస్తుంది.  ఇది మన గ్రామాలలో సమృద్ధితో పాటు పేదల, రైతుల సమృద్ధికి కూడా బాటను వేస్తుంది.  గత పదేళ్ళలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుండి బయటపడ్డారు.  ఈ బడ్జెటు మధ్య తరగతి ఆదాయ వర్గంలోకి ఇటీవలె ప్రవేశించిన వారికి సాధికారితను కల్పిస్తూ ఉండటంతో పాటు విద్యకు, నైపుణ్యాభివృద్ధికి సరికొత్త అవకాశాలను అందిస్తుంది.  ఇది మధ్య తరగతికి కొత్త బలాన్ని ఇవ్వడంతో పాటు, ఆదివాసీలకు, దళితులకు, వెనుకబడిన వర్గాలకు సాధికారిత కల్పనకై పటిష్టమైన ప్రణాళికలను తీసుకు వస్తుంది.  దీనికి తోడు, ఈ బడ్జెటు ఆర్థిక వ్యవస్థలో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచడంతో పాటుగా చిరు వ్యాపారులు, ఎమ్ఎస్ఎమ్ఇ లు లేదా చిన్న పరిశ్రమల పురోగతికి కొత్త దారులను పరుస్తుంది.  తయారీ, మౌలిక సదుపాయాల కల్పన రంగాలపై ప్రత్యేక శ్రద్ధ వహించడం ద్వారా ఈ బడ్జెటు ఆర్థికాభివృద్ధిని బలోపేతం చేయడంతోపాటు, ఆర్థికాభివృద్ధి సంబంధ జోరును కూడా కొనసాగిస్తుంది.

మిత్రులారా,

ఉపాధికి, స్వయంఉపాధికి మునుపెన్నడూ లేనన్ని అవకాశాలను కల్పించడం మా ప్రభుత్వ విధానంగా ఉంటూ వచ్చింది.  ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెటు ఈ నిబద్ధతను మరింత బలపరుస్తుంది.  ఉత్పత్తితో ముడిపెట్టిన ప్రోత్సాహకాల (పిఎల్ఐ) పథకం ఎంతగా సఫలం అయిందో దేశమూ, ప్రపంచమూ గమనించాయి.  ప్రస్తుతం ఈ బడ్జెటులో ప్రభుత్వం ‘ఉద్యోగంతో ముడిపెట్టిన ప్రోత్సాహక పథకా’న్ని ప్రకటించింది.  ఈ పథకం దేశమంతటా కోట్ల కొద్దీ కొత్త ఉద్యోగాలను సృష్టించనుంది;  ఈ పథకంలో భాగంగా యువతీ యువకులు తమ మొదటి ఉద్యోగాన్ని ఆరంభించినప్పుడు వారికి మొట్టమొదటి జీతాన్ని మా ప్రభుత్వం చెల్లిస్తుంది.  అది నైపుణ్యాభివృద్ధికి మరియు ఉన్నత విద్యకు ఉద్దేశించిన సహాయం కావచ్చు, లేదా ఒక కోటి మంది యువజనులకు ఇంటర్న్ షిప్ పథకం కావచ్చు.. పల్లెల్లో నివసించే వారికి, పేదరికంతో సతమవుతున్న నేపథ్యాల నుంచి వచ్చే యువజనులకు అగ్రగామి వ్యాపార సంస్థలలో పని చేసేందుకు వీలు కల్పిలంచి, వారికి కొత్త అవకాశాల తలుపులను తెరుస్తుంది.  ప్రతి పట్టణంలో, గ్రామంలో, కుటుంబంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం.  దీని కోసం పూచీకత్తు అక్కరలేని ‘ముద్ర’ రుణాల పరిమితిని ఇప్పుడున్న 10 లక్షల రూపాయల నుంచి 20 లక్షల రూపాయలకు పెంచడమైంది.  ఇది చిన్న వ్యాపారులు, ప్రత్యేకించి మహిళలు, దళితులు, వెనుకబడిన వర్గాలతో పాటు ఆదివాసీ సముదాయాల స్వయం ఉపాధికి సాయపడుతుంది.

మిత్రులారా,

మనం అందరం కలసికట్టుగా భారత్ ను ప్రపంచ తయారీ కేంద్రం (గ్లోబల్ మేన్యుఫేక్చరింగ్ హబ్) గా తీర్చిదిద్దుదాం.  దేశంలో సూక్ష్మ, లఘు, మధ్యతరహా వాణిజ్య వ్యవస్థ (ఎమ్ఎస్ఎమ్ఇ) ల రంగం మధ్య తరగతితో సన్నిహితంగా పెనవేసుకొని ఉండడంతో పాటు పేదలకు ప్రధానమైన ఉద్యోగాలను కూడా సమకూర్చుతున్నది.  చిన్న పరిశ్రమలను పటిష్ట పరచడం ఈ దిశలో ఒక కీలకమైన చర్య అని చెప్పాలి.  ఈ బడ్జెటు  ఎమ్ఎస్ఎమ్ఇ లకు పరపతి లభ్యతలో సౌలభ్యాన్ని మెరుగు పరచడానికి కొత్త పథకాన్ని తీసుకువచ్చింది.  దీనికి అదనంగా, ప్రతి జిల్లాలో తయారీ, ఎగుమతి వ్యవస్థలను పెంచడానికి ఉద్దేశించిన ముఖ్య చర్యలు కూడా ఉన్నాయి.  ‘ఒక జిల్లా, ఒక ఉత్పత్తి’ ఉద్యమానికి దన్నుగా నిలచే కార్యక్రమాలలో భాగంగా ఇ-కామర్స్ ఎగుమతి కేంద్రాలు (ఎక్స్ పోర్ట్ హబ్స్), ఆహార నాణ్యత పరీక్షకు ఉద్దేశించిన 100 యూనిట్ లు ఉన్నాయి.

మిత్రులారా,

ఈ బడ్జెటు మన అంకుర సంస్థల (స్టార్ట్-అప్స్)కు, నూతన ఆవిష్కరణల వ్యవస్థకు అనేక కొత్త కొత్త అవకాశాలను  కల్పించింది.  అంతరిక్ష ప్రధాన  ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడానికి 1,000 కోట్ల రూపాయల నిధి కావచ్చు, లేదా ఏంజెల్ ట్యాక్స్ ను రద్దు చేయాలన్న నిర్ణయం కావచ్చు.. అనేక ముఖ్య చర్యలను తీసుకోవడమైంది.

మిత్రులారా,

రికార్డు స్థాయిలో అధిక మూలధన వ్యయం (కేపెక్స్) ఆర్థిక వ్యవస్థను మునుముందుకు వేగంగా నడిపించనుంది.  12 కొత్త పారిశ్రామిక కేంద్రాలు, నూతన శాటిలైట్ టౌన్ ల అభివృద్ధి, 14 ప్రధాన నగరాలకు రవాణా ప్రణాళికల వల్ల దేశవ్యాప్తంగా సరికొత్త ఆర్థిక నిలయాలను (ఇకానామిక్ హబ్స్) ఏర్పడనుండడంతో, కొత్త ఉపాధి అవకాశాలు అసంఖ్యాకంగా పెరగనున్నాయి.

మిత్రులారా,

ప్రస్తుతం రక్షణ రంగ సంబంధ ఎగుమతులు ఇదివరకు ఎరుగనంత అధిక స్థాయిలో ఉన్నాయి.  ఈ బడ్జెటులో రక్షణ రంగాన్ని స్వయం సమృద్ధంగా తీర్చిదిద్దేందుకు అనేక అవకాశాలను కల్పించడమైంది.  భారత్ అంటే ప్రపంచంలో ఆసక్తి పెరిగి, తత్ఫలితంగా పర్యాటక రంగంలో కొత్త అవకాశాలు వికసిస్తున్నాయి. పేదలకు, మధ్యతరగతికి ఎన్నో అవకాశాలను పర్యటక రంగం అందిస్తున్నది.  ఈ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రస్తుత బడ్జెటు ప్రత్యేక ప్రాధాన్యాన్ని కట్టబెడుతున్నది.

మిత్రులారా,

గత పదేళ్ళలో, పేదలకు, మధ్యతరగతికి ఎన్ డిఎ ప్రభుత్వం పన్ను సంబంధ ఊరటను అందిస్తూ వస్తోంది.  ఈ బడ్జెటులో ఆదాయపు పన్ను తగ్గింపులను, స్టాండర్డ్ డిడక్షన్ పెంపుదలను ప్రకటించడమైంది; దీనికి తోడు టిడిఎస్ నియమాలను సరళతరం చేయడంతో ప్రతి ఒక్క పన్ను చెల్లింపుదారుకు కొంత అదనపు మొత్తం మిగలనుంది.

మిత్రులారా,

దేశ ప్రగతికి భారత్ లో ఈశాన్య ప్రాంత సమగ్ర అభివృద్ధి కీలకం.  ‘పూర్వోదయ’ దృష్టికోణం తో మా ప్రచార ఉద్యమం సరికొత్త జోరును, శక్తిని పుంజుకోనుంది.  రహదారులు, నీటి పథకాలు, విద్యుత్తు పథకాల వంటి ముఖ్యమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటుచేయడం ద్వారా భారత్ ఈశాన్య రాష్ట్రాలలో అభివృద్ధిని మేం వేగవంతం చేస్తాం.

మిత్రులారా,

ఈ బడ్జెటు దేశ రైతులకు గొప్ప ప్రాధాన్యాన్ని కట్టబెడుతోంది.  ప్రపంచంలో కెల్లా అతి పెద్దదైన ఆహార ధాన్యాల నిలవ పథకాన్ని తీసుకు వచ్చిన తరువాత  మేం ఇప్పుడు కాయగూరల ఉత్పత్తి క్లస్టర్ లను ఏర్పాటు చేస్తున్నాం.  ఈ కార్యక్రమం చిన్న రైతులకు వారు పండించిన ఫలాలు, కూరగాయలతో పాటు ఇతర ఉత్పత్తులను మెరుగైన ధరలకు అమ్ముకొనేందుకు కొత్త బజారులను అందుబాటులోకి తెస్తుంది.  అదే కాలంలో మధ్యతరగతికి పండ్లు, కాయగూరల లభ్యతను పెంచడానికి దోహదపడుతుంది, మధ్యతరగతి కుటుంబాలకు శ్రేష్ఠ పోషకాహారం దక్కేందుకు కూడా మార్గం సుగమం అవుతుంది.  వ్యవసాయ రంగంలో స్వయం సమృద్ధ స్థితికి చేరుకోవడం భారత్ కు ఎంతైనా అవసరం.  ఈ కారణంగా పప్పుధాన్యాలు, నూనె గింజల ఉత్పత్తిని పెంచడానికి వీలుగా పటిష్టమైన చర్యలను ప్రకటించడమైంది.

మిత్రులారా,

పేదరికాన్ని నిర్మూలించడానికి, పేదలకు సాధికారితను కల్పించడానికి ఉద్దేశించిన ప్రధాన కార్యక్రమాలను నేటి బడ్జెటులో చేర్చడమైంది.  పేదల కోసం మూడు కోట్ల కొత్త ఇళ్ళను నిర్మించాలనే నిర్ణయాన్ని తీసుకోవడమైంది.  ‘జన్ జాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్’ లో భాగంగా 5 కోట్ల ఆదివాసీ కుటుంబాలకు కనీస సౌకర్యాలను అందించడం జరుగుతుంది.  దీనికి తోడు, ‘గ్రామ్ సడక్ యోజన’ ఏడాది పొడవునా 25,000 కొత్త గ్రామీణ ప్రాంతాలను రహదారి సదుపాయంతో జోడించి, దేశంలో అన్ని రాష్ట్రాలలో సుదూర గ్రామాలకు మేలు చేయనుంది.

మిత్రులారా,

నేటి బడ్జెటు కొత్త అవకాశాలను, సరికొత్త శక్తిని తీసుకువచ్చింది.  ఈ బడ్జెటు లెక్కలేనన్ని ఉద్యోగాలను మరియు స్వయంఉపాధి అవకాశాలను సృష్టించి, శ్రేష్ఠమైన వృద్ధి ని, ప్రకాశవంతమైన భవిష్యత్తును ప్రోత్సహిస్తుంది.  ఈ బడ్జెటు భారత్ ను ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దే ప్రక్రియలో ఉత్ప్రేరకంగా పని చేస్తూ, అభివృద్ధి చెందిన దేశంగా భారత్ మారేందుకు ఒక దృఢమైన పునాదిని వేస్తుంది.

దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు.

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi