Published By : Admin |
August 29, 2020 | 12:31 IST
Share
Agricultural institutions will provide new opportunities to students, help connect farming with research and advanced technology, says PM
PM calls for ‘Meri Jhansi-Mera Bundelkhand’ to make Atmanirbhar Abhiyan a success
500 Water related Projects worth over Rs 10,000 crores approved for Bundelkhand region; work on Projects worth Rs 3000 crores already commenced
మన దేశ వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ నరేంద్రసింగ్ తోమర్ జీ, కేంద్ర మంత్రివర్గంలోని నా ఇతర సహచరులు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జీ, విద్యార్థి మిత్రులు, ఈ వీడియో కాన్ఫరెన్స్ తిలకిస్తున్న దేశంలోని భిన్న ప్రాంతాలకు చెందిన సోదరసోదరీమణులారా
రాణి లక్ష్మీబాయి కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కొత్త కళాశాల, కార్యాలయ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా మీ అందరికీ నా శుభాకాంక్షలు. ఇక్కడ యువ సహచరులందరూ తమ విద్యాభ్యాసం అనంతరం వ్యవసాయ రంగం సాధికారత కోసం కృషి చేస్తారు.
ఏర్పాట్లలో నిమగ్నులై ఉన్న విద్యార్థులతో ముఖాముఖి సంభాషించిన సందర్భంగా వారిలోని ఉత్సుకత, ఉత్సాహం, విశ్వాసం నేను గుర్తించగలిగాను. కొత్త భవన నిర్మాణం అనంతరం ఇక్కడ మరిన్ని సదుపాయాలు అందుబాటులోకి రాగలవన్న నమ్మకం నాకుంది. ఈ సదుపాయాలను ఉపయోగించుకుని విద్యార్థులు మరింత అధికంగా పని చేయగల స్ఫూర్తి, ప్రోత్సాహం పొందుతారని నేను భావిస్తున్నాను.
మిత్రులారా,
ఒకప్పుడు ఈ బుందేల్ ఖండ్ ప్రాంతం నుంచి “నా ఝాన్సీని నేను ఎవరికీ ఇచ్చేది లేదు” అంటూ రాణి లక్ష్మీబాయి గర్జించింది. “నా ఝాన్సీని నేను ఎవరికీ ఇచ్చేది లేదు” అన్న వాక్యం మనందరికీ గుర్తుంది. ఈ రోజు బుందేల్ ఖండ్ ప్రాంతంలోని ఝాన్సీ నుంచి కొత్త గర్జన వెలుపలికి రావలసిన అవసరం ఉంది. “నా ఝాన్సీ-నా బుందేల్ ఖండ్” స్వయంసమృద్ధ భారత్ ప్రచారం విజయంలో కొత్త అధ్యాయం లిఖిస్తాయి అనేదే ఆ నినాదం.
వ్యవసాయం అందులో పెద్ద పాత్ర పోషిస్తుంది. వ్యవసాయంలో స్వయం సమృద్ధి గురించి మాట్లాడాలంటే అది ఆహారధాన్యాలకే పరిమితం కాదు, మొత్తం గ్రామీణ ఆర్థిక వ్యవస్థ స్వయం సమృద్ధి అవుతుంది. దేశంలోని విభిన్న ప్రాంతాల్లో ఉత్పత్తి చేసిన వ్యవసాయ పంటలకు విలువ జోడించి ప్రపంచ మార్కెట్లకు చేర్చడమే ఈ ప్రచారం లక్ష్యం. రైతులు కేవలం పంటలు పండించే పాత్రకే పరిమితం కాకుండా పారిశ్రామికులుగా మారేందుకు దోహదపడడం కూడా స్వయం సమృద్ధి వెనుక లక్ష్యం. రైతులు, వ్యవసాయం పరిశ్రమగా పురోగమించినట్టయితే దేశంలో భారీ సంఖ్యలో ఉన్న గ్రామాలు, వాటి సమీప ప్రాంతాల్లో భారీ సంఖ్యలో ఉపాధి అవకాశాలు, స్వయంసమృద్ధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయి.
మిత్రులారా, ఈ సంకల్పంతోనే ప్రభుత్వం వ్యవసాయ రంగంలో నిరంతరం చారిత్రక సంస్కరణలెన్నో చేస్తోంది. కార్మికులను శృంఖాల్లో బిగించిన మండి (మార్కెట్) చట్టాలు, నిత్యావసర వస్తువుల చట్టం వంటివి ఎంతో మెరుగుపడ్డాయి. ఇతర పరిశ్రమల వలెనే ఈ రోజు రైతులు తమ ఉత్పత్తులకు మరింత మెరుగైన ధర రాబట్టుకునేందుకు దేశంలో ఎక్కడైనా విక్రయించుకునే స్వేచ్ఛ పొందారు.
దీనికి తోడు గ్రామాలకు చేరువలో పారిశ్రామిక క్లస్టర్లు అభివృద్ధి చేసేందుకు సమగ్ర ప్రణాళిక రూపకల్పన జరిగింది. పరిశ్రమలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడం కోసం లక్ష కోట్ల రూపాయలతో ప్రత్యేక నిధి కూడా ఏర్పాటయింది. మన రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (ఎఫ్ పిఓ) నిల్వ వసతులు, వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ పరిశ్రమల వంటి ఆధునిక మౌలిక వసతులు ఏర్పాటు చేసుకునేందుకు ఈ నిధి ఉపయోగపడుతుంది. వ్యవసాయ విద్యార్థులు ఈ రంగంలో మరింతగా అధ్యయనం చేయడానికి ఇది కొత్త అవకాశాలు కల్పించడమే కాకుండా స్టార్టప్ లు ఏర్పాటు చేయడానికి వారి మిత్రులకు కొత్త మార్గం ఏర్పడుతుంది.
మిత్రులారా, విత్తనాల నుంచి మార్కెట్ల వరకు అన్నింటినీ టెక్నాలజీ, ఆధునిక పరిశోధనతో అనుసంధానం చేసే పని మంచి పురోగతిలో ఉంది. పరిశోధన సంస్థలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ఇందులో అతి పెద్ద పాత్ర ఉంది. కేవలం ఆరు సంవత్సరాల క్రితం దేశంలో ఒకే ఒక కేంద్రీయ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉండేది. ఇప్పుడు మూడు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు పని చేస్తున్నాయి. ఇవి కాకుండా ఐఏఆర్ఐ-జార్ఖండ్, ఐఏఆర్ఐ-అస్సాం, మహాత్మాగాంధీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్-మోతిహారి (బిహార్) కూడా ఏర్పాటవుతున్నాయి. ఈ పరిశోధన సంస్థలు విద్యార్థులకు అవకాశాలు కల్పించడమే కాకుండా స్థానిక వ్యవసాయదారులకు టెక్నాలజీ ప్రయోజనాలు అందించడం ద్వారా వారి సామర్థ్యాలు పెరిగేందుకు దోహదకారి అవుతాయి.
దీనికి తోడు సోలార్ పంపులు, సోలార్ చెట్లు, స్థానిక డిమాండుకు అనుగుణంగా విత్తనాల అభివృద్ధి, మైక్రో ఇరిగేషన్, డ్రిప్ ఇరిగేషన్ వంటి పలు రంగాల్లో కూడా పనులు సాగుతున్నాయి. ఈ కార్యక్రమాలన్నీ దేశంలోని భారీ సంఖ్యలో రైతన్నలకు, ప్రత్యేకించి బుందేల్ ఖండ్ రైతులకు చేర్చడంలో మీ అందరి కృషి కీలకం. వ్యవసాయంలో ఆధునిక టెక్నాలజీని ఉపయోగించినట్టయితే దానికి అనుబంధంగా సవాళ్లు కూడా ఉంటాయని ఇటీవల మరో ఉదాహరణ నిరూపించింది.
మే నెలలో బుందేల్ ఖండ్ ప్రాంతంలో పెద్ద ఎత్తున మిడతల దండు దాడి జరిగిన విషయం మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. దండుల కొద్ది మిడతలు దాడి చేసి నెలల తరబడి తాము పడిన కష్టాన్ని ధ్వంసం చేస్తున్నాయన్న కారణంగా రైతులు నిద్ర కూడా పోలేదు. రైతులు పండించిన పంటలు, కూరగాయల ధ్వంసం అనివార్యంగా కనిపించింది. సుమారు 30 సంవత్సరాల విరామం తర్వాత బుందేల్ ఖండ్ పై మిడతల దాడి జరిగిందని నా దృష్టికి వచ్చింది. సాధారణంగా అయితే మిడతలు ఈ ప్రాంతంకి రావని కూడా తెలిసింది.
మిత్రులారా,
ఉత్తరప్రదేశ్ ఒక్కటే కాదు, దేశంలో 10కి పైగా రాష్ర్టాలు మిడతల దాడికి గురయ్యాయి. సాధారణ, సాంప్రదాయిక విధానాల్లో ఈ మిడతల దాడిని అరికట్టడం సాధ్యం కాదు. అందుకే భారత్ ఎంతో శాస్ర్తీయమైన విధానంలో ఈ మిడతల దాడి నుంచి భారత్ విముక్తి పొందింది. భారతదేశం కరోనా మహమ్మారి దాడిలో తల మునకలై ఉండకపోయి ఉంటే దీనిపై మీడియాలో ఎంతో సానుకూలమైన చర్చ చోటు చేసుకుని ఉండేది, అంత అద్భుతం జరిగింది.
మిడతల దాడి నుంచి రైతుల పంటలను రక్షించేందుకు యుద్ధ ప్రాతిపదికపై కృషి జరిగింది.ఝాన్సి సహా పలు పట్టణాల్లో డజన్ల సంఖ్యలో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటయ్యాయి. వీలైనంత త్వరితంగా రైతులకు సమాచారం అందించే ఏర్పాట్లు జరిగాయి. ఇలాంటి దాడులు అసాధారణం కావడం వల్ల మిడతలను నాశనం చేసేందుకు, తరిమి కొట్టేందుకు రసాయనాలు చల్లే ప్రత్యేక యంత్రాలు కూడా భారీ సంఖ్యలో అందుబాటులో లేవు. ప్రభుత్వం డజన్ల సంఖ్యలో ఈ యంత్రాలను కొనుగోలు చేసి జిల్లాలకు పంపింది. రైతులు అధికంగా బాధితులు కావడాన్ని నిరోధించేందుకు టాంకర్లు, వాహనాలు, రసాయనాలు, ఔషధాలు అన్ని వనరులను ప్రభుత్వం మోహరించింది.
భారీ వృక్షాలను రక్షించేందుకు అధిక పరిమాణంలో రసాయనాలు చల్లడం కోసం డజన్ల కొద్ది డ్రోన్లను రంగంలోకి దింపారు. రసాయనాలు చల్లేందుకు హెలీకాప్టర్లు కూడా ఉపయోగించడం జరిగింది. ఈ ప్రయత్నాలన్నింటి వల్ల రైతులు భారీ నష్టం నుంచి రక్షణ పొందారు.
మిత్రులారా,
ఒక జీవితం, ఒకే లక్ష్యం కోసం నిరంతరాయంగా కృషి చేసేందుకు యువ పరిశోధకులు, శాస్త్రవేత్తలు కృషి చేయడం ద్వారా దేశ వ్యవసాయ రంగంలో డ్రోన్ టెక్నాలజీ, కృత్రిమ మేథ, ఆధునిక వ్యవసాయ యంత్రాలు ప్రవేశపెట్టాలి.
గత ఆరు సంవత్సరాల కాలంలో వ్యవసాయ రంగానికి పరిశోధనతో అనుసంధానం కలిగించేందుకు, గ్రామీణ స్థాయిలో చిన్న రైతులకు శాస్ర్తీయ సలహాలు అందుబాటులో ఉంచేందుకు పటిష్ఠమైన కృషి జరిగింది. క్యాంపస్ నుంచి వ్యవసాయ క్షేత్రాలకు ఈ నిపుణుల వ్యవస్థను మయరింత సమర్థవంతంగా విస్తరించడం చాలా అవసరం. ఆ కృషిలో మీ విశ్వవిద్యాలయం కూడా పెద్ద పాత్ర పోషించాల్సి ఉంది.
మిత్రులారా, వ్యవసాయ విద్యను, దానికి సంబంధించిన ప్రాక్టికల్ అప్లికేషన్లను పాఠశాలల స్థాయికి కూడా చేర్చాల్సిన అవసరం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో మాధ్యమిక విద్య స్థాయిలో వ్యవసాయం కోర్సు ప్రవేశపెట్టే యోచన కూడా ఉంది. దీని నుంచి రెండు రకాల ప్రయోజనాలుంటాయి. గ్రామీణ ప్రాంతాల పిల్లకు వ్యవసాయంతో ముడిపడి ఉన్న అంశాలపై సహజసిద్ధమైన అవగాహన ఏర్పడడం ఒకటైతే వ్యవసాయం, అనుబంధ టెక్నాలజీలు, వ్యాపార, వాణిజ్యాలపై వారు తమ కుటుంబాలకు మరింత సమాచారం ఇవ్వగల స్థితి ఏర్పడడం రెండో ప్రయోజనం. దీని వల్ల దేశంలో వ్యవసాయాధారిత పరిశ్రమలకు కూడా ప్రోత్సాహం ఏర్పడుతుంది. కొత్త విద్యావిధానంలో ఇందుకు సంబంధించి అవసరమైన సంస్కరణలు కూడా ప్రతిపాదించడం జరిగింది.
లక్ష్మీబాయి కాలం నుంచే కాదు బుందేల్ ఖండ్ ఎప్పుడూ పలు రకాల సవాళ్లను ఎదుర్కొనడంలో ముందువరుసలో ఉంటుంది. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనగలిగే సంసిద్ధతే బుందేల్ ఖండ్ ప్రత్యేక గుర్తింపు.
బుందేల్ ఖండ్ ప్రాంత ప్రజలు కరోనాపై పోరాటానికి కూడా ఎంతో కట్టుబడి ఉన్నారు. ప్రజలకు కష్టాలు తక్కువగా ఉండేలా చూసేందుకు ప్రభుత్వం కూడా కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే పేదల ఇళ్లలో పొయ్యి వెలుగుతూ ఉండేందుకు వీలుగా దేశంలోని అన్ని ప్రాంతాల వారితో సమానంగా ఉత్తరప్రదేశ్ లోని గ్రామీణ కుటుంబాలకు, కోట్లాది మందికి ఉచిత రేషన్ అందించడం జరిగింది. బుందేల్ ఖండ్ కు చెందిన 10 లక్షల మంది పేద సోదరీమణులకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ జరిగింది. సోదరీమణుల జన్ ధన్ ఖాతాల్లో కోట్లాది రూపాయలు జమ చేయడం జరిగింది. ఒక్క గరీబ్ కల్యాణ్ రోజ్ గార్ అభియాన్ కార్యక్రమం కిందనే ఉత్తరప్రదేశ్ లో రూ.700 కోట్లు ఖర్చు చేశారు. లక్షలాది మంది కార్మికులకు ఉద్యోగం ఇచ్చే ప్రయత్నం జరిగింది. దీని కింద బుందేల్ ఖండ్ లో వందలాది చెరువుల మరమ్మత్తు, కొత్త చెరువుల నిర్మాణం జరిగినట్టు నాకు తెలియచేశారు.
మిత్రులారా, ఎన్నికలకు ముందు నేను ఝాన్సీ వచ్చినప్పుడు గత ఐదు సంవత్సరాలు మరుగుదొడ్ల నిర్మాణం జరిగిందని, రాబోయే ఐదు సంవత్సరాలు నీటి సరఫరాకు కృషి చేస్తామని బుందేల్ ఖండ్ సోదరీమణులకు తెలియచేశాను. వారందరి ఆశీస్సులతోనే అన్ని ఇళ్లకు మంచినీటి సరఫరా ప్రయత్నాలు త్వరితగతిన సాగుతోంది. బుందేల్ ఖండ్ ప్రాంతంలోని అన్ని జిల్లాల్లోనే కాకుండా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ అంతటా కూడా జలవనరుల నిర్మాణం, పైప్ లైన్ల నిర్మాణం నిరంతరాయంగా జరుగుతోంది. ఈ ప్రాంతానికి రూ.10,000 కోట్ల విలువ గల 500 కోట్ల వరకు నీటి ప్రాజెక్టులు మంజూరయ్యాయి. గత రెండు నెలల కాలంలో సుమారు రూ.3,000 కోట్ల విలువ గల ప్రాజెక్టుల పనులు ప్రారంభమయ్యాయి. ఈ ప్రాజెక్టులు పూర్తయితే బుందేల్ ఖండ్ ప్రాంతంలో లక్షలాది కుటుంబాలు దీని ద్వారా ప్రత్యక్షంగా లాభపడతాయి. బుందేల్ ఖండ్ లో నీటి వనరులను పెంచడం కోసం అటల్ భూజల్ యోజన పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఝాన్సి, మహోబా, బందా, హమీర్ పూర్, చిత్రకూట్, లలిత్ పూర్ ప్రాంతాల్లో భూగర్భ జలవనరులు పెంచేందుకు రూ.700 కోట్లకు పైగా విలువ గల పనులు పురోగతిలో ఉన్నాయి.
మిత్రులారా, బుందేల్ ఖండ్ కు ఒక పక్కన బెత్వా నది, మరో వైపున కెన్ నది ప్రవహిస్తున్నాయి. ఉత్తరదిశగా యమునా నది ఉంది. ఇన్ని నదులున్నప్పటికీ వాటి ప్రయోజనాలు ఈ ప్రాంతం అంతటా విస్తరించలేదు. ఆ పరిస్థితిని మార్చేందుకు ప్రభుత్వం నిరంతరాయంగా కృషి చేస్తోంది. కెన్-బెత్వా నదుల అనుసంధానం ప్రాజెక్టుతో ఈ ప్రాంతం స్వరూపమే మారిపోతుంది. మేం రెండు రాష్ట్ర ప్రభుత్వాలతో నిరంతరాయంగా చర్చిస్తూ ఆ కృషిలో నిమగ్నమై ఉన్నాం. తగినంత నీరు అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతంలో జీవనం పూర్తిగా మారిపోతుందనే నమ్మకం నాకు పూర్తిగా ఉంది.
బుందేల్ ఖండ్ ఎక్స్ ప్రెస్ వే, రక్షణ కారిడార్ వంటి వేలాది కోట్ల రూపాయల విలువ గల విభిన్న ప్రాజెక్టులు కొత్త ఉపాధి అవకాశాలు అందుబాటులోకి తెస్తాయి. సాహసవంతులైన భూమిగా పేరొందిన ఝాన్సి, చుట్టుపక్కల ప్రాంతాలు రక్షణ రంగం స్వయంసమృద్ధిలో అతి పెద్ద భాగస్వాములుగా అభివృద్ధి చెందే రోజులు ఎంతో దూరంలో లేవు. జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్ మంత్రం నాలుగు దిశలా ప్రసరిస్తుంది. బుందేల్ ఖండ్ పురాతన గుర్తింపును, పురాతన గర్వాన్ని తిరిగి ఆర్జించి పెట్టేందుకు కేంద్రప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నాయి.
మీ అందరికీ శుభాకాంక్షలు అందచేస్తూ విశ్వవిద్యాలయం అందుబాటులోకి వచ్చినందుకు శుభాశినందనలను తెలిచేస్తున్నాను. రెండు గజాల దూరం, మాస్క్ ధరించడం అనే మంత్రాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోండి. మీరు సురక్షితంగా ఉంటే దేశం కూడా సురక్షితంగా ఉంటుంది.