నా మిత్రుడు, ప్రధాని శ్రీ కిశిదా గారు,
ఇరు దేశాల ప్రతినిధులు,
కేంద్ర మంత్రివర్గం లో నా సహచరులు,
గుజరాత్ ఆర్థిక శాఖ మంత్రి శ్రీ కానుభాయి దేసాయి,
ఇండియా- జపాన్ బిజినెస్ లీడర్స్ ఫోరమ్ కు చెందిన సభ్యులందరు,
మీ అందరికి స్వాగతం.
ప్రతి ఒక్కరి కి నమస్కారం.
ప్రధాని శ్రీ కిశిదా గారికి మరియు జపాన్ నుంచి భారతదేశానికి విచ్చేసినటువంటి స్నేహితులు అందరి కి ఇదే హృదయపూర్వక స్వాగతం.
రెండు సంవత్సరాల కు పైబడిన అంతరం తరువాత మనం భారతదేశానికి మరియు జపాన్ కు మధ్య శిఖర సమ్మేళనం స్థాయి సమావేశాల పరంపర ను మళ్లీ మొదలుపెట్టుకోగలుగుతున్నందుకు నాకు చాలా సంతోషం గా ఉంది.
మన ఆర్థిక సంబంధాలు భారతదేశం- జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక మరియు ప్రపంచ భాగస్వామ్యం తాలూకు అత్యంత బలమైన స్తంభం గా ఉన్నాయి.
కోవిడ్ తరువాతి కాలం లో, ఆర్థికం గా తిరిగి కోలుకోవడం కోసం మరియు ఆర్థికపరమైనటువంటి భద్రత కోసం ఇండియా - జపాన్ ఇకనామిక్ పార్ట్ నర్ శిప్ అనేది ఈ ఇరు దేశాల కు మాత్రమే కాకుండా ఈ ప్రాంతానికి, ఇంకా ప్రపంచానికి కూడాను విశ్వాసాన్ని మరియు ప్రతిఘాతుకత్వాన్ని అందించగలదు.
భారతదేశం లో విస్తృత స్థాయి లో చేపడుతున్నటువంటి సంస్కరణ లు మరియు మా ఉత్పత్తి తో ముడిపెట్టినటువంటి ప్రోత్సాహక పథకాలతో ఇదివరకటి కంటే చాలా అధికమైన సకారాత్మక ఇకోసిస్టమ్ రూపుదాల్చుతున్నది.
ఎక్స్ లన్సి,
భారతదేశం లో నేశనల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైను లో1.8 ట్రిలియన్ డాలర్ విలువయిన 9000కు పైగా పథకాలు ఉన్నాయి. అవి సహకారానికి అనేక అవకాశాల ను అందిస్తాయి.
మా యొక్క ప్రయాసల లో జపాన్ కు చెందిన కంపెనీ లు ఉత్సాహవంతం గా పాలుపంచుకొంటాయని నేను ఆశిస్తున్నాను. మరి దీనికి గాను, మేం సైతం జపాన్ కంపెనీల కు భారతదేశం లో చేతనైన అన్ని విధాలు గాను సమర్థన ను అందించడం కోసం కట్టుబడి ఉన్నాం.
మిత్రులారా,
పురోగతి, సమృద్ధి మరియు భాగస్వామ్యం అనేవి భారతదేశం -జపాన్ సంబంధాల కు కేంద్ర స్థానం లో ఉన్నాయి. ఇరు దేశాల ఆర్థిక సంబంధాల ను ముందుకు తీసుకుపోవడం లో ఇండియా- జపాన్ బిజినెస్ లీడర్స్ ఫోరమ్ ఒక మహత్త్వపూర్ణమైనటువంటి భూమిక ను పోషించవలసి వుంది. దీనికి గాను, మిమ్ములను అందరిని నేను అభినందిస్తున్నాను, మరి మీకు నా శుభకామనల ను వ్యక్తం చేస్తున్నాను.
చాలా చాలా ధన్యవాదాలు.