PM Modi greets Mata Amritanandamayi on her 63rd birthday, prays for her long life and good health
Fortunate to be among those who have been receiving Amma’s blessings and unconditional love: PM Modi
India is the land of such saints who have seen God in everything that can be seen. Mankind is prominent among those things: PM
Serving the old and the aged, and helping the needy have been Amma’s childhood passions: PM
Amma’s initiative on building toilets has been a great help in our Swachh Bharat Programme: PM Modi
Amma’s ashram has already completed construction of two thousand toilets: PM Modi
One year ago, Amma generously donated one hundred crore rupees to the Namami Gange programme: PM Modi

అమ్మా మీకు నా ప్రణామాలు

వేదిక మీద ఉన్నమానవీయ వ్యక్తులు

నమస్కారం!

ఈ ధర్మపరాయణ మరియు పవిత్ర సందర్భంలో, అమ్మ కు నా ప్రగాఢ నమస్కారములు అందజేస్తున్నాను. ఆ ఈశ్వరుడు ఆమెకు పూర్ణ జీవనాన్ని చక్కని ఆరోగ్యాన్ని అందించాలని కూడా నేను ప్రార్థిస్తున్నాను. లక్షలాది భక్తులకు మార్గం చూపే వెలుగు ఆమె. అంతే కాదు, అనేక మంది భక్తులకు జీవన సమానార్థక పదం అయ్యారామె. నిజమైన మాత మాదిరిగానే, ఆమె తన భక్తులను ప్రత్యక్ష, పరోక్ష చర్యల ద్వారాను; కనిపించే మరియు కనిపించని హస్తాల ద్వారాను పోషిస్తారు.

అమ్మ ఆశీర్వాదాలను, బేషరతు ప్రేమను అందుకొంటున్న వారిలో నేను ఉన్నందుకు నేను చాలా అదృష్టవంతుడిని. మూడు సంవత్సరాల కిందట, అమ్మ 60వ పుట్టిన రోజు వేడుకల సందర్భంగా నా ప్రణామాలు అర్పించడం కోసం అమృతపురికి చేరుకొనే అవకాశం నాకు దక్కింది. ఈ రోజు వేడుకలకు స్వయంగా హాజరయ్యే భాగ్యం నాకు లభించకపోయినప్పటికీ, సాంకేతిక విజ్ఞానం సాయంతో ఆమెకు శుభాకాంక్షలను అందించగలుగుతున్నందుకు నాకు సంతోషంగా ఉంది. నేను ఇప్పుడే కేరళ నుండి తిరిగి వచ్చాను, కేరళ ప్రజలు నా మీద కురిపించిన ప్రేమ, అనురాగాలకు నేను చలించిపోయాను.

భారతదేశం తాము చూసే ప్రతి దాంట్లోనూ దైవాన్ని చూసిన సాధువుల గడ్డ. అటువంటి వాటిలో మానవజాతి ప్రముఖమైంది. అందువల్లే మానవజాతికి సేవ చేయడం వారి ధర్మసూత్రం అయింది. అమ్మ తన బాల్యంలో సైతం తన ఆహారాన్ని ఇతరులకు ఇవ్వడాన్ని ఇష్టపడేవారన్న సంగతి నాకు తెలుసు. వృద్ధులు, ముసలి వారికి సేవ చేయడం, పేదలను ఆదుకోవడం తన చిన్నతనపు ఉద్వేగాలుగా నిలచాయి.

అలాగే, ఆమె తన చిన్నప్పుడు కృష్ణ భగవానుని పూజించే వారు.

ఈ రెండు గుణాలు ఆమె బలంగా మారాయి. దైవ భక్తి మరియు పేదల పట్ల సమర్పణ భావం ఈ విధంగా అమ్మ తో నా సహవాసం నుండి నేను వ్యక్తిగతంగా స్వీకరించిన సందేశమైంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లక్షలాది భక్తులు కూడా నమ్ముతున్నది ఇదే.

అమ్మ నడుపుతున్న వివిధ సంస్థలు, కార్యక్రమాలు చేపడుతున్న సామాజిక, దాతృత్వ కార్యక్రమాల గురించి నేనెరుగుదును. ప్రపంచంలోని బీదలకు వారి అయిదు మౌలిక అవసరాలైన ఆహారం, ఆశ్రయం, ఆరోగ్య సంరక్షణ, విద్య, జీవనాధారం సమకూర్చుకోవడంలో సహాయపడాలని ఆమె ఎల్లప్పుడూ ఉత్సుకతతో ఉంటారు.

మరీ ముఖ్యంగా పారిశుద్ధ్యం, నీరు, గృహ‌ నిర్మాణ‌ం, విద్య మరియు ఆరోగ్య రంగాలలో చేసిన పనులు, ఇచ్చిన విరాళాలను గురించి నేను ప్రస్తావించదలచాను. ఆ ప్రయోజనాలను అందుకొన్న వారిలో కొంత మంది ఈ రోజు వారి సర్టిఫికెట్ లను అందుకొంటారు. ప్రత్యేకించి, మరుగుదొడ్లను నిర్మించడంలో అమ్మ తీసుకొన్న చొరవ మన స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంలో ఎంతో గొప్ప సహాయంగా నిలచింది. కేరళలో పారిశుద్ధ్య కృషి కోసం ఒక వంద కోట్ల రూపాయలను ఇస్తామంటూ అమ్మ వాగ్దానం చేశారు. ఈ వాగ్దానంలో పేదవారికి పదిహేను వందల మరుగుదొడ్ల నిర్మాణం కూడా కలసి ఉంది. ఈ రోజు, రాష్ట్రం అంతటా రెండు వేల మరుగుదొడ్ల నిర్మాణాన్ని అమ్మ ఆశ్రమం ఇప్పటికే పూర్తి చేసినట్లు నాకు సమాచారం ఉంది.

 

పర్యావరణ పరిరక్షణ, స్థిరత్వ రంగాలలో చేపడుతున్న అనేక కార్యక్రమాలలో ఇది ఒక ఉదాహరణ మాత్రమే అని నేను ఎరుగుదును. ఒక ఏడాది క్రితం, నమామి గంగే కార్యక్రమానికి అమ్మ ఉదారంగా ఒక వంద కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు బాధితుల కష్టాలను ఉపశమింపచేయడం కోసం అమ్మ ఆపన్న హస్తాలు చాచారు.. ఈ విషయం కూడా నాకు తెలుసును. ప్రపంచం యొక్క అత్యంత తీవ్ర సమస్యలలో కొన్నింటిని పరిష్కరించడం కోసం అమృత యూనివర్సిటీ పరిశోధకులు కొత్త కొత్త వైఖరులను కనుగొనేందుకు కృషి చేస్తుండడం కూడా ధైర్యాన్ని ఇచ్చే అంశమే.

చివరలో, ఈ వేడుకలలో పాలుపంచుకొనే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు నేను నా హృద‌య‌పూర్వక ధన్యవాదాలను తెలియజేయదలచుకుంటున్నాను.

మరో సారి అమ్మ కు నేను నా ప్రగాఢ ప్రణామాలను అందజేస్తున్నాను.

 
Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Snacks, Laughter And More, PM Modi's Candid Moments With Indian Workers In Kuwait

Media Coverage

Snacks, Laughter And More, PM Modi's Candid Moments With Indian Workers In Kuwait
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister Narendra Modi to attend Christmas Celebrations hosted by the Catholic Bishops' Conference of India
December 22, 2024
PM to interact with prominent leaders from the Christian community including Cardinals and Bishops
First such instance that a Prime Minister will attend such a programme at the Headquarters of the Catholic Church in India

Prime Minister Shri Narendra Modi will attend the Christmas Celebrations hosted by the Catholic Bishops' Conference of India (CBCI) at the CBCI Centre premises, New Delhi at 6:30 PM on 23rd December.

Prime Minister will interact with key leaders from the Christian community, including Cardinals, Bishops and prominent lay leaders of the Church.

This is the first time a Prime Minister will attend such a programme at the Headquarters of the Catholic Church in India.

Catholic Bishops' Conference of India (CBCI) was established in 1944 and is the body which works closest with all the Catholics across India.