India has entered the third decade of the 21st century with new energy and enthusiasm: PM Modi
This third decade of 21st century has started with a strong foundation of expectations and aspirations: PM Modi
Congress and its allies taking out rallies against those persecuted in Pakistan: PM

గౌర‌వ‌నీయులైన శ్రీ సిద్ధ‌లింగేశ్వ‌ర స్వామి గారు, క‌ర్నాట‌క ముఖ్య‌మంత్రి శ్రీ బి.ఎస్. యడియూర‌ప్ప గారు, నా మంత్రివ‌ర్గ స‌హ‌చ‌రులు శ్రీ డి.వి. స‌దానంద గౌడ గారు, శ్రీ ప్రహ్లాద్ జోశి గారు, క‌ర్నాట‌క ప్ర‌భుత్వ మంత్రులు, ఆద‌ర‌ణీయ సంత్ స‌మాజం భ‌క్తులు, ఇక్క‌డ‌ కు విచ్చేసిన మ‌హిళ‌లు మ‌రియు  స‌జ్జ‌నులారా, ప్ర‌తి ఒక్క‌రి కీ శుభాకాంక్ష‌లు.  తుమ‌కూరు లో డాక్ట‌ర్ శివ‌కుమార్ స్వామీ జీ యొక్క ప్రదేశమైన‌ సిద్ధగంగా మ‌ఠాని కి నేను చేరుకొన్నందుకు నాకు ఎంతో సంతోషం గా ఉంది.  అన్నిటి క‌న్నా ముందు, మీకు అంద‌రి కి సంతోషప్ర‌ద‌మైన‌టువంటి నూత‌న సంవ‌త్స‌రం ప్రాప్తించుగాక‌.

 

మీ అంద‌రి కి 2020వ సంవ‌త్స‌రం లో అంతా మంచే జ‌రగాలి.

 

ఈ ప‌విత్ర‌మైన ప్ర‌దేశం తుమ‌కూరు లో, మీ అంద‌రి స‌మ‌క్షం లో 2020వ సంవ‌త్స‌రాన్ని నేను ఆరంభిస్తుండడం నా భాగ్యం.  సిద్ధ‌గంగా మ‌ఠం తాలూకు పావ‌న‌మైన‌ శ‌క్తి పౌరులు అంద‌రి ని ప్ర‌స‌న్నం గా ఉంచాలి అని నేను అభిల‌షిస్తున్నాను.

మిత్రులారా,

 

ఎన్నో ఏళ్ళ త‌రువాత ఈ రోజు న ఇక్క‌డ‌ కు వ‌చ్చినందుకు నేను ఎంతో అదృష్ట‌వంతుడి ని.  అయితే, అదే కాలం లో ఒంట‌రితనపు భావన కూడా న‌న్ను క‌మ్మివేస్తున్నది.  పూజ్య స్వామి శ్రీ ‌శ్రీ శివ‌కుమార్ జీ లేని లోటు ను మ‌న అందరి కి అనుభవం లోకి వస్తోంది.  నా అనుభ‌వాన్ని బట్టి, ఆయ‌న ను సంద‌ర్శించినంత మాత్రాన‌నే ఎవ‌రి జీవితం లో అయినా స‌రే  శ‌క్తి తో నిండిపోయేది.  ఆయ‌న యొక్క స్ఫూర్తిదాయ‌క‌ వ్య‌క్తిత్వం తో, ఈ పావ‌న‌మైన‌ ప్రదేశం స‌మాజాని కి ద‌శాబ్దాల త‌ర‌బ‌డి దిశ ను అందిస్తూ వ‌చ్చింది.  ప్ర‌త్యేకించి, ఒక విద్యావంత‌మైన‌టువంటి మ‌రియు స‌మ‌తా భావ‌న క‌లిగిన‌టువంటి స‌మాజాన్ని నిర్మించాలి అనేటటువంటి ఒక శాశ్వ‌త ప్ర‌వాహం ఇక్క‌డ నుండి జనిస్తున్న‌ది.  స్వామీ జీ త‌న జీవితం లో భారీ సంఖ్య లో ప్ర‌జ‌ల‌ ను ప్ర‌భావితుల ను చేశారు.  ఇది నిజంగానే చాలా అరుదు గా సంభవించేటటువంటిది.

 

శ్రీ‌ శ్రీ శివ‌కుమార్ జీ స్మృతి లో నిర్మించే ఓ వ‌స్తు ప్ర‌ద‌ర్శ‌న శాల కు పునాది రాయి ని వేసే అవ‌కాశం నాకు చిక్క‌ినందుకు నేను  అదృష్టవంతుడి ని.  ఈ వ‌స్తు ప్ర‌ద‌ర్శ‌న శాల ప్ర‌జ‌ల ను స్ఫూర్తిమంతుల ను చేయ‌డం ఒక్క‌టే కాకుండా సామాజిక స్థాయి లో మరియు జాతీయ స్థాయి లో మ‌న‌కు ఒక దిశ ను కూడా అందించగలదు.  నేను  పూజ్య స్వామీజీ చ‌ర‌ణాల కు మ‌రో మారు శ్ర‌ద్ధాంజ‌లి ని అర్పిస్తున్నాను.

 

మిత్రులారా,

 

మ‌రియొక గొప్ప సాధువు క‌ర్నాట‌క గ‌డ్డ ను వీడి వెళ్లిపోయిన త‌రుణం లో నేను ఇక్క‌డ‌ కు త‌ర‌లివ‌చ్చాను.  పేజావర మ‌ఠం అధిప‌తి విశ్వేశ తీర్థ స్వామి మ‌ర‌ణం భార‌తీయ స‌మాజాని కి వాటిల్లిన‌టువంటి మరొక న‌ష్టం.  ఆ కోవ‌ కు చెందిన స్తంభాలు నేలకు ఒరగడం మ‌న ఆధ్యాత్మిక జీవనం లో మ‌రియు మన సామాజిక జీవ‌నం లో ఒక పెద్ద శూన్యాన్ని వ‌ద‌లిన‌ట్లే.  ఈ చ‌క్రాన్ని మ‌న‌ము ఆప‌జాల‌ము.  కానీ, మ‌న‌ం ఈ సంతులు చూపిన మార్గం లో త‌ప్ప‌క ముందుకు సాగ‌గ‌లుగుతాము.  మ‌రి అలాగే త‌ల్లి భార‌తి కి సేవ చేయ‌డం కోసం మ‌రియు మాన‌వత్వాని కి సేవ చేయ‌డం కోసం మ‌న‌ ను మనం అంకితం చేసుకోగ‌లుగుతాము.

 

మిత్రులారా,

 

భార‌త‌దేశం స‌రిక్రొత్త శ‌క్తి తో మ‌రియు ఉత్సాహం తో 21వ శ‌తాబ్దం యొక్క మూడో ద‌శాబ్ది లోకి అడుగిడిన కార‌ణం గా కూడా ఇది ఎంతో ముఖ్య‌మైన విష‌యం.  గ‌డ‌చిన ద‌శాబ్ది ఏ విధం గా ఆరంభమయిందీ మీకు జ్ఞాప‌కం ఉండేవుంటుంది.   కానీ, 21వ శ‌తాబ్దం లో ఈ మూడో ద‌శాబ్ది మట్టుకు ఆశ‌ లు మ‌రియు ఆకాంక్ష‌ ల బలమైన పునాది తో మొద‌లైంది.

 

ఈ ఆకాంక్ష ‘న్యూ ఇండియా’ కోస‌ం ఉద్దేశించినటువంటిది.  ఈ ఆకాంక్ష యువ స్వ‌ప్నాల‌ కు సంబంధించింది.  ఈ ఆకాంక్ష దేశ సోద‌రీమ‌ణుల యొక్క మ‌రియు పుత్రిక‌ల యొక్క ఆకాంక్ష‌గా ఉన్నది.  ఈ ఆకాంక్ష దేశం లోని ఆదివాసీ లు, వెనుక‌బ‌డిన వ‌ర్గాల వారు, క్షతగాత్రులు, ఆద‌ర‌ణ కు నోచుకోని వారు, అణ‌చివేత కు లోనైన వర్గాల వారు మ‌రియు పేద‌ల కు సంబంధించిన ఆకాంక్ష‌.  ఈ ఆకాంక్ష ఏమిటసలు?  ఈ ఆకాంక్ష భార‌త‌దేశం ఒక స‌మృద్ధ‌మైన‌టువంటి, ద‌క్ష‌త క‌లిగినటువంటి, ఉదారం అయిన‌టువంటి ప్ర‌పంచ శ‌క్తి గా మారాలి అనే దానికి సంబంధించినటువంటిది.  ఈ ఆకాంక్ష ప్ర‌పంచ ప‌టం లో భారతదేశం త‌నది అయిన స్వాభావిక‌మైన స్థానాన్ని ఏర్పరచుకోవాల‌ని చూడాలనుకొనేట‌టువంటిది.

మిత్రులారా,

 

ఈ ఆకాంక్ష‌ ను నెర‌వేర్చ‌టానికి దేశ ప్ర‌జ‌లు పెద్ద మార్పుల కు ఒక జాతి గా అగ్ర ప్రాధాన్యాన్ని ఇచ్చారు.  ప్ర‌స్తుతం ఇది మ‌న‌కు సంక్ర‌మించిన స‌మ‌స్య ల‌ను ప‌రిష్క‌రించాలి అని భార‌త‌దేశం లో ప్ర‌తి ఒక్క‌రూ వారి అంత‌రంగం లో కోరుకోవ‌డం వలె మారిపోయింది.  స‌మాజం నుండి అందుతున్న‌టువంటి ఇదే త‌ర‌హా సందేశం మా ప్ర‌భుత్వాన్ని ప్రోత్స‌హిస్తూ, మా ప్ర‌భుత్వాని కి స్ఫూర్తి ని అందిస్తున్నది.  ఈ కార‌ణం గానే 2014వ సంవ‌త్సరం మొద‌లుకొని సాధార‌ణ భార‌తీయుని జీవ‌నం లో అర్థ‌వంత‌మైన మార్పుల ను తీసుకు వ‌చ్చేందుకు ఇది వ‌ర‌కు ఎరుగ‌న‌టువంటి ప్ర‌య‌త్నాల ను దేశం చేసింది.

 

ఒక స‌మాజం గా, ఒక దేశం గా మ‌న ప్ర‌య‌త్నాల ను గొప్ప శిఖ‌ర స్థాయి లో తీసుకు పోవ‌డాని కి గ‌డ‌చిన సంవ‌త్స‌రం తోడ్ప‌డింది.  ఆరుబ‌య‌లు ప్రాంతాల లో మ‌ల‌మూత్రాదుల విస‌ర్జ‌న కు తావు ఉండ‌న‌టువంటి ఘ‌న‌త ను సాధించాల‌న్న సంక‌ల్పం ఇప్పుడు నెర‌వేరింది.  దేశం లోని పేద సోద‌రీమ‌ణుల ను పొగ బారి నుండి విముక్తం చేయాల‌న్న ప్ర‌తిజ్ఞ కార్యరూపం లోకి వస్తున్నది.  దేశం లో ప్ర‌తి ఒక్క రైతు కుటుంబాని కి ప్ర‌యోజ‌నాల ను నేరు బ‌దిలీ ద్వారా అందించాల‌న్న సంక‌ల్పం, అలాగే రైతు కూలీ లు, శ్రామికులు, ఇంకా చిన్న వ్యాపారుల ను సామాజిక భ‌ద్ర‌త‌ మరియు పింఛ‌న్ వ్య‌వ‌స్థ తో జోడించే సంక‌ల్పం కూడాను నెర‌వేరే దశ లో ఉన్నాయి.

 

ఉగ్ర‌వాదాని కి వ్య‌తిరేకం గా భార‌త‌దేశం యొక్క విధానాన్ని, భారతదేశం ఆచరిస్తున్న అభ్యాసాన్ని మార్చాల‌నే సంక‌ల్పం సైతం నెర‌వేరుతోంది.  ప్ర‌జ‌ల జీవితాల లో నుండి అనిశ్చితి ని తొల‌గించడం కోసం, అలాగే హింస కు స్వ‌స్తి ప‌ల‌కడం కోసం  జ‌మ్ము- క‌శ్మీర్ నుండి 370వ అధిక‌ర‌ణాన్ని ర‌ద్దు చేయ‌టం సైతం జ‌మ్ము, క‌శ్మీర్, ఇంకా ల‌ద్దాఖ్ ల ప్ర‌జ‌ల సార‌థ్యం లో అభివృద్ధి తాలూకు ఒక నూత‌న యుగం ఆరంభం అవుతున్నట్టు నిరూపణ ను ఇస్తున్నది.  వేరే మ‌తాన్ని విశ్వసించారన్న కార‌ణం గా ఇరుగు పొరుగు దేశాల లో నుండి త‌రిమివేయ‌బ‌డినటువంటి అల్ప‌సంఖ్యాక వ‌ర్గాల వారి యొక్క గౌర‌వాన్ని పున‌రుద్ధ‌రించ‌డం కోసం దేశం చ‌ర్య‌ల ను తీసుకొన్నది.  దీనికి అంత‌టి కి మ‌ధ్య, భ‌గ‌వాన్ రాముని జ‌న్మ స్థ‌లం లో ఒక భ‌వ్య‌ దేవాల‌యాన్ని నిర్మించేందుకు పూర్తి శాంతి తోను, సహకారం తోను బాట ను పరచడం జరిగింది.

మిత్రులారా,

 

కొన్ని వారాల క్రితం, మ‌న పార్ల‌మెంటు.. మ‌న ప్ర‌జాస్వామ్యం లోని అతి పెద్ద సంస్థ.. సైతం పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టం రూపొందించాలన్న ఒక చ‌రిత్రాత్మ‌క‌ నిర్ణ‌యాన్ని తీసుకొంది.  అయితే, కాంగ్రెస్ మ‌నుషులు, ఆ పార్టీ మిత్ర‌ప‌క్షాలు, మ‌రి వారి పనుపున ప‌ని చేసే వ‌ర్గాలు భార‌త‌దేశ పార్ల‌మెంటు కు వ్య‌తిరేకం గా నిల‌బ‌డ్డాయి.  వారి కి మేమంటే ఉన్న ద్వేషం ప్ర‌స్తుతం దేశ పార్ల‌మెంటు ప‌ట్ల ప్ర‌ద‌ర్శిత‌ం అవుతున్న‌ది.  వీరు భార‌త‌దేశ పార్ల‌మెంటు కు వ్య‌తిరేకం గా ఒక ఉద్య‌మాన్ని మొద‌లు పెట్టారు.  వీరు పాకిస్తాన్ లో దోపిడి బారిన పడ్డ, అణ‌చివేత‌ కు గురైన‌ వర్గాలకు మరియు ద‌ళితుల కు వ్య‌తిరేకం గా ఆందోళ‌న చేస్తున్నారు.

 

మిత్రులారా,

 

పాకిస్తాన్ మ‌తం ప్రాతిపదిక‌ న ఆవిర్భ‌వించింది.  మ‌తం ప్రాతిప‌దిక‌ న దేశాన్ని విభజించ‌డ‌ం జరిగింది.  ఆ విభ‌జ‌న కాలం లో, పాకిస్తాన్ లో అన్య మ‌త‌స్తుల పై దురాగ‌తాలు జ‌రిగాయి.  కొంత కాలం పాటు, మ‌తం ఆధారం గా పీడన కు లోను చేయడం అనే ధోరణి- వారు హిందువులు అయినా, సిఖ్కులు అయినా, క్రైస్తవులు అయినా  లేదా జైనులు అయినా- పాకిస్తాన్ లో ముమ్మరించింది.  వేలాది గా ప్ర‌జానీకం వారి యొక్క ఇళ్ళ ను విడ‌చిపెట్టి, శ‌ర‌ణార్థులు గా భార‌త‌దేశాని కి రావ‌ల‌సిన ప‌రిస్థితి తల ఎత్తింది.

 

పాకిస్తాన్ హిందువుల ను పీడించి, సిక్కుల ను, జైనుల ను మ‌రియు క్రైస్త‌వుల‌ ను అణ‌చివేత కు గురి చేసింది; కానీ కాంగ్రెస్ మ‌రియు ఆ పార్టీ మిత్రప‌క్షాలు పాకిస్తాన్ కు వ్య‌తిరేకం గా మాట్లాడ‌ లేదు.  ప్ర‌స్తుతం దేశం లోని ప్ర‌తి ఒక్క‌రి వ‌ద్ద ఒక ప్ర‌శ్న ఉంది.  అది ఏమిటి అంటే, స్వీయ ప్రాణాల ను కాపాడుకోవడం కోసం మరియు అత్యాచారాలకు పాల్పడే వారి బారి నుండి వారి యొక్క పుత్రికల ను రక్షించుకోవడం కోసం పాకిస్తాన్ నుండి ఇక్క‌డ‌ కు వ‌చ్చినటువంటి వారి కి వ్య‌తిరేకం గా ప్ర‌ద‌ర్శ‌న‌ల ను ఎందుకు జ‌రుపుతున్నట్టు? ;  అయితే అటువంటి వారు దురాగ‌తాల కు ఒడిగ‌ట్టిన పాకిస్తాన్ ప‌ట్ల మాత్రం మౌనం గా ఎందుకు ఉన్నారు? అనేదే.

 

పాకిస్తాన్ నుండి వ‌చ్చిన కాందిశీకుల‌ కు స‌హాయం చేయడం  మ‌న క‌ర్త‌వ్యం గా ఉన్నది.  పాకిస్తాన్ లో అణ‌చివేత కు గురైన హిందువుల ను, ద‌ళితుల ను వారి విధి కి వ‌ద‌లి వేయ‌కుండా మరి వారి కి స‌హాయాన్ని అందించ‌టం మ‌న కు క‌ర్త‌వ్యం గా ఉన్నది.  పాకిస్తాన్ నుండి విచ్చేసిన సిఖ్కుల ను వారి విధి కి వ‌ద‌లి వేయ‌కుండా వారి కి స‌హాయం చేయ‌డం మ‌న క‌ర్త‌వ్యం గా ఉన్నది.  పాకిస్తాన్ నుండి వ‌చ్చిన క్రైస్త‌వుల ను మ‌రియు జైనుల ను వారి విధి కి వ‌ద‌లి వేయ‌కుండా స‌హాయాన్ని అందించ‌డం మ‌న క‌ర్తవ్యం గా ఉన్నది.

 

మిత్రులారా,

 

ప్ర‌స్తుతం భార‌త‌దేశ పార్ల‌మెంటు కు వ్య‌తిరేకం గా ఉద్య‌మిస్తున్న వారి కి ఈ రోజు న పాకిస్తాన్ యొక్క ఈ చేష్ట ను అంత‌ర్జాతీయ స్థాయి లో ఎండ‌గ‌ట్ట‌వ‌ల‌సిన అవ‌స‌రం ఉంది అని నేను చెప్పదలచుకొన్నాను.  మీకు గ‌నుక ఆందోళ‌న చేయాలి అనే ఆలోచ‌న వ‌స్తే, అటువంట‌ప్పుడు గ‌డ‌చిన 70 సంవ‌త్స‌రాలు గా పాకిస్తాన్ ఒడిగ‌ట్టిన దురాగ‌తాల‌ కు వ్య‌తిరేకం గా మీ యొక్క వాణి ని బిగ్గ‌ర‌ గా వినిపించ‌డండి.

 

మీరు నినాదాలు చేయాలి అని కోరుకొంటే, అటువంట‌ప్పుడు పాకిస్తాన్ లో చిత్రహింసల పాలబడుతున్న అల్ప‌సంఖ్యాక వ‌ర్గాల వారి దీన‌ స్థితి కి వ్య‌తిరేకం గా నినాదాలు చేయండి.  ఒక ప్ర‌ద‌ర్శ‌న ను నిర్వ‌హించాలి అని మీరు గనక అనుకొంటే, అటువంట‌ప్పుడు ఆ యొక్క ప్ర‌దర్శ‌న ను పాకిస్తాన్ నుండి ఇక్క‌డ కు శరణు కోరి వ‌చ్చిన ద‌ళితులు, హిందువులు, పాకిస్తాన్ లో అణ‌చివేత కు, దోపిడి కి గురి అయిన వ‌ర్గాల వారి కి మద్దతు తెలుపుతూ నిర్వ‌హించండి.  నిర‌స‌నల ను వ్యక్తం చేయాల‌ని మీరు అనుకొంటే, అటువంట‌ప్పుడు వాటి ని పాకిస్తాన్ కు వ్య‌తిరేకం గా చేప‌ట్టండి.

మిత్రులారా,

 

దేశం ఎదుర్కొంటున్న ద‌శాబ్దాల నాటి స‌వాళ్ళ ను ప‌రిష్క‌రించ‌డం కోసం మా ప్ర‌భుత్వం ప‌గ‌ల‌న‌క‌ రాత్ర‌న‌క కృషి చేస్తున్నది.  దేశ ప్ర‌జ‌ల జీవితాల ను స‌ర‌ళ‌త‌రం గా మార్చ‌డం అనేది మా యొక్క ప్రాధాన్యం గా ఉంది.  దేశం లో ప్ర‌తి ఒక్క పేద వ్య‌క్తి కి త‌ల‌దాచుకొనేందుకు ఒక నీడ ఉండేట‌ట్లు చూడాల‌ని, ప్ర‌తి ఇంటి లో గ్యాస్ క‌నెక్శన్ ఉండాల‌ని, ప్ర‌తి ఇంటి కి గొట్ట‌పు మార్గం ద్వారా నీటి స‌ర‌ఫ‌రా ను స‌మ‌కూర్చాల‌ని, ప్ర‌తి ఒక్క వ్య‌క్తి కి ఆరోగ్య సౌక‌ర్యాలు ల‌భ్యం కావాల‌ని, ప్ర‌తి ఒక్క వ్య‌క్తి బీమా ర‌క్ష‌ణ ను క‌లిగి ఉండాల‌ని, ప్ర‌తి ఒక్క గ్రామాన్ని బ్రాడ్ బ్యాండ్ తో సంధానించాల‌ని.. ఇలాగ ప్ర‌తి ఒక్క ల‌క్ష్యాన్ని సాధించ‌డం కోసం మేము శ్రమిస్తున్నాము.

 

2014వ సంవ‌త్స‌రం లో స్వ‌చ్ఛ్ భార‌త్ అభియాన్ లో పాలు పంచుకోవల‌సింది గా మిమ్మ‌ల్ని నేను అభ్య‌ర్ధించిన‌ప్పుడు, మీరు అందుకు మీ యొక్క తోడ్పాటు ను అందించారు.  మీ వంటి కోట్లాది అనుయాయుల స‌హ‌కారం తో గాంధీ గారి 150వ జ‌యంతి నాడు భార‌త‌దేశం బ‌హిరంగ మ‌ల‌ మూత్రాదుల విస‌ర్జ‌న బారి నుండి త‌న‌ ను తాను విముక్తం చేసుకొన్నది.

 

ఇప్పుడు ఈ ప‌విత్ర‌మైన భూమి కి నేను ఈ రోజు న  వ‌చ్చాను కాబట్టి 3 సంక‌ల్పాల విష‌యం లో సంత్ స‌మాజ్ నుండి క్రియాశీల‌ మ‌ద్ధ‌తు ను నేను పొంద‌గోరుతున్నాను.  ఒక‌టో సంక‌ల్పం ఏమిటి అంటే – అది మ‌న విధులు మ‌రియు బాధ్య‌త‌ల కు ప్రాముఖ్యాన్ని ఇచ్చేట‌టువంటి మ‌న సంస్కృతి ని ప‌టిష్ట ప‌ర‌చ‌డం.  ఈ విష‌యం లో ప్ర‌జ‌ల ను నిరంత‌రం జాగృతం చేస్తూ ఉండ‌టం.  రెండో సంకల్పం ఏమిటి అంటే అది ప‌ర్యావ‌ర‌ణాన్ని మ‌రియు ప్ర‌కృతి ని ప‌రిర‌క్షించ‌డం.  ఇక మూడోది: జ‌ల సంర‌క్ష‌ణ మ‌రియు ఇంకుడు గుంత‌ల విష‌యం లో ప్ర‌జా చైత‌న్యాన్ని రగుల్కొలపడం లో స‌హకారం.

 

మిత్రులారా,

 

భార‌త‌దేశం సంతుల ను, మునుల ను, గురువుల ను స‌రి అయిన మార్గం చూపేట‌టువంటి ఒక దీప స్తంభం గా చూసింది.  ‘న్యూ ఇండియా’లో కూడా దేశం లోని ప్రతి ఒక్క నాయకత్వ భూమిక కూడాను సిద్ధగంగా మ‌ఠాని కి చెందిన నాయ‌క‌త్వాని కి, ఆధ్యాత్మిక‌త కు మ‌రియు విశ్వాసానికి సంబంధించినటువంటివి.

 

మీ అంద‌రి యొక్క, సాధువుల యొక్క ఆశీర్వాదాలు మాతో ఉండుగాక‌.  మీ యొక్క దీవెన‌ల తో మేము మా సంక‌ల్పాన్ని నెర‌వేర్చెద‌ము గాక‌.  ఈ అపేక్ష తో నేను నా ప్ర‌సంగాన్ని ముగిస్తున్నాను.

 

మీ అంద‌రి కి అనేకానేక ధ‌న్య‌వాదాలు.

 

భార‌త్ మాతా కీ జ‌య్‌.

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
PLI, Make in India schemes attracting foreign investors to India: CII

Media Coverage

PLI, Make in India schemes attracting foreign investors to India: CII
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...

Prime Minister Shri Narendra Modi paid homage today to Mahatma Gandhi at his statue in the historic Promenade Gardens in Georgetown, Guyana. He recalled Bapu’s eternal values of peace and non-violence which continue to guide humanity. The statue was installed in commemoration of Gandhiji’s 100th birth anniversary in 1969.

Prime Minister also paid floral tribute at the Arya Samaj monument located close by. This monument was unveiled in 2011 in commemoration of 100 years of the Arya Samaj movement in Guyana.