అరేబియా సముద్రాని కి మహారాణి లాంటి కోచి నగరాని కి వచ్చినందుకు నేను సంతోషిస్తున్నాను. నీలి సముద్రం, బ్యాక్ వాటర్స్, మహా పెరియార్ నది, దాని వల్ల పరచుకున్న పచ్చదనం, ఇక్కడి చైతన్య వంతులైన ప్రజలు ఇవన్నీ కోచి ని అన్ని నగరాల లోకి మహరాణి గా నిలుపుతున్నాయి.
భారతదేశ నాగరికత పరిరక్షణ కు, దేశాన్ని ఏకీకరించేందుకు ఆది శంకరుల వారు పాదయాత్ర ను ప్రారంభించింది ఇక్కడి నుండే. ఇవాళ చరిత్రాత్మక దినం. కేరళ లోని అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతం మరో దశ అభివృద్ధి లోకి అడుగుపెడుతోంది. ఇవి ఒక్క కేరళ కే కాదు యావత్తు దేశాని కి గర్వకారణమైన క్షణాలు.
స్వచ్ఛ ఇంధనాన్ని, ఎల్ పిజి ని కేరళ, పరిసర రాష్ట్రాల లో గత 50 సంవత్సరాలకు పైగా బహుళ వ్యాప్తి లోకి తీసుకురావడం లో భారత్ పెట్రోలియమ్ యొక్క కోచి రిఫైనరీ ఒక కీలకమైనటువంటి పాత్ర ను పోషించింది. నా చిన్నతనం లోనూ, నేను యువకుడి గా ఉన్నప్పుడూ ఎందరో మాతృమూర్తులు కట్టెల పొయ్యి తో నానా తంటాలూ పడుతుండటాన్ని నేను గమనించాను. అప్పటి నుండి వారి పరిస్థితులు బాగుపడాలని, మన తల్లులకు, అక్క చెల్లెళ్ల కు ఆరోగ్యకరమైన వంట గది పరిస్థితులను కల్పించాలని నేను భావిస్తూ ఉండే వాడిని. భారత ప్రభుత్వం ప్రారంభించిన ఉజ్వల పథకం ఈ కల ను సాకారం చేసే పథకం. 2016 నుండి ఉజ్వల యోజన పథకం లో భాగం గా సమాజం లో సుమారు 6 కోట్ల మంది అత్యంత నిరుపేదల కు ఎల్ పిజి కనెక్షన్ లను అందించడం జరిగింది.
మిత్రులారా,
పహల్ పథకం లో సుమారు 23 కోట్ల మంది వినియోగదారులు చేరారు. బేనామీ ఖాతా లు, ఒకటి కంటే ఎక్కువ ఖాతా లు, పనిచేయని ఖాతాల ను గుర్తించడం లో పహల్ సహాయపడింది. ప్రపంచం లోనే అతిపెద్ద ప్రత్యక్ష నగదు బదిలీ పథకం గా పహల్ పథకం గినెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల కు ఎక్కింది. సబ్సిడీ ని వదులుకోండి అన్ననినాదాని కి స్పందించి సుమారు కోటి మంది వారి ఎల్ పిజి సబ్సిడీ ని వదులుకున్నారు. ఇటీవలి విస్తరణ పనుల తో ఎల్ పిజి ఉత్పత్తి ని రెట్టింపు చేయడం ద్వారా ఉజ్వల పథకం విజయవంతం కావడాని కి కోచి రిఫైనరీ తన వంతు గొప్ప పాత్ర ను పోషిస్తోంది. సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూశన్ (సిజిడి) నెట్ వర్క్ ను దేశం లో విస్తరించి సిఎన్ జి ని విస్తృతం గా అందుబాటు లోకి తీసుకురావడం ద్వారా వాతావరణ కాలుష్యాన్ని అధిగమించేందుకు పర్యావరణ హితకరమైన రవాణా ఇంధనాన్ని భారత ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.
పదో సిజిడి బిడ్డింగ్ రౌండ్ విజయవంతం గా పూర్తి అయ్యే నాటికి దేశం లో సుమారు 400 జిల్లాలు గొట్టపు మార్గం ద్వారా గ్యాస్ సరఫరా కు అనుసంధానం అవుతాయి. గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ ఉండేందుకు, ఫ్యూయల్ బాస్కెట్ లో గ్యాస్ వాటా ను పెంచేందుకు నేశనల్ గ్యాస్ గ్రిడ్ లేదా ‘ప్రధాన మంత్రి ఊర్జా గంగ’ ను ఏర్పాటు చేయడం జరిగింది. భారత ప్రభుత్వం అదనం గా 15,000 కిలో మీటర్ల గ్యాస్ గొట్టపుమార్గ నెట్ వర్క్ ను ఏర్పాటు చేసేందుకు యోచిస్తోంది.
విదేశీ ముడి చమురు దిగుమతి ని తగ్గించేందుకు ప్రభుత్వం నిర్ణయాత్మక చర్యలను చేపట్టింది. పది శాతం ముడి చమురు దిగుమతులు తగ్గించి విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేస్తోంది. ఇందుకు అనుగుణంగా, 11 రాష్ట్రాల లో పన్నెండు 2జి ఇథనాల్ ప్లాంటు లను ఏర్పాటు చేసేందుకు చమురు ప్రభుత్వ రంగ సంస్థలు సెకండ్ జనరేశన్ ఎథ్ నాల్ కు లిగ్నోసెల్యులోస్ రూట్ ను అనుసరిస్తున్నాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఆరు అవగాహనపూర్వక ఒప్పందాలు కుదిరాయి. భారత రిఫైనరీ పరిశ్రమ అంతర్జాతీయం గా కీలక పాత్రధారి గా తనను తాను రుజువు చేసుకునేందుకు అద్భుత ఫలితాలను సాధించింది.
భారతదేశం ఆసియా లో రెండో అతి పెద్ద చమురుశుద్ధి కేంద్రం గా ఉంది. అది తన డిమాండు కు మించి చమురు ను శుద్ధి చేస్తూ రిఫైనరీ హబ్ గా ఎదుగుతోంది. దేశ రిఫైనరీ సామర్ధ్యం ప్రస్తుతం 247 ఎంఎంటిపిఎ గా ఉంది. అలాగే ఐఆర్ ఇపి ని సకాలం లో పూర్తి చేసినందుకు అందరి కి అభినందనలు.
మరో ముఖ్యమైన విషయం, రాత్రనక పగలనక ఇక్కడి నిర్మాణ పనుల ను పూర్తి చేసిన శ్రామికుల శ్రమ ను నేను గుర్తించాను. ప్రాజెక్టు శిఖర దశ లో ప్రాజెక్టు ప్రాంతం లో 20 వేల మందికి పైగా శ్రామికులు పని చేశారని నా దృష్టి కి వచ్చింది.
ఎన్నో రకాలుగా వారు ఈ ప్రాజెక్టు కు నిజమైన కథానాయకులు. ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ విస్తరణ ప్రాజెక్టు తన కార్యకలాపాల ను ఇంధనేతర రంగం లోకి విస్తరించడానికి భారత్ పెట్రోలియమ్ చేపట్టిన వ్యూహాత్మక అడుగుగా చెప్పుకోవచ్చు.
మిత్రులారా,
పెట్రో- కెమికల్స్ ఒక తరహా రసాయనాలే. కానీ మనం వీటి ని గురించి ఎక్కువగా మాట్లాడుకోము. ఇవి కనిపించకుండానే మన జీవితం లోని ఎన్నో పార్శ్వాల ను ప్రభావితం చేస్తున్నాయి. నిర్మాణ పరికరాలు, ప్లాస్టిక్, పెయింట్స్, పాదరక్ష లు,దుస్తులు, ఇతర ఆటోమోటివ్ భాగాలు, కాస్మెటిక్స్, మందుల రంగాల లో వీటి ని ఉపయోగిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఎక్కు వ రసాయనాలు ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నవే. ఈ పెట్రో- కెమికల్స్ దేశం లోనే తయారు అయ్యేటట్టు చూడాలన్నది మా ప్రయత్నంగా ఉంది. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం లో బిపిసిఎల్ ఆక్రిలిక్ యాసిడ్ ఆక్రిలైట్స్, ఆక్సోఆల్కహాల్ ల తయారీ కి సంబంధించి ప్రపంచ శ్రేణి ప్లాంటు లు మూడింటి ని ఏర్పాటు చేసింది. ఐఆర్ ఇపి అమలు అనంతరం కోచి రిఫైనరీ ప్రొప్ లీన్ ఉత్పత్తి సామర్ధ్యాన్ని ఉపయోగించుకుని బిపిసిఎల్ దీని ని ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యేక పెట్రో కెమికల్స్ ను పెయింట్స్, ఇంక్స్, కోటింగ్స్, డిటర్జెంట్ స్ తదితర రంగాల లో వాడుతారు. ప్రస్తుతం, బిపిసిఎల్ ఒక పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ను నిర్మిస్తోంది. ఇక్కడ పాలియోల్స్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఫోమ్స్, ఫైబర్స్, పాదరక్షలు, కాస్మెటిక్స్, మందుల తయారీ లో ఉపయోగపడుతుంది.
దీని వల్ల ఎన్నో అనుబంధ రంగాలు కోచి కి వస్తాయని నేను ఖచ్చితం గా విశ్వసిస్తున్నాను.
రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనున్న పెట్రో కెమికల్ పార్క్ త్వరలోనే అందుబాటు లోకి రానుంది. ఇది బిపిసిఎల్ కు చెందిన పెట్రో కెమికల్ వెంచర్ అందించే అవకాశాల ను అందిపుచ్చుకోనుంది.
యువతీయువకుల కు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ఇతర పిఎస్ యు లతో కలసి బిపిసిఎల్ కూడా నైపుణ్య అభివృద్ధి శిక్షణ సంస్థ ను ఏర్పాటు చేసిందని తెలిసి హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాను.
పవిత్ర మహదేవ ఆలయాని కి సమీపం లోని ఎట్టుమనూరు దగ్గర ఈ ఇన్‌స్టిట్యూట్ కు సంబంధించిన రెండో క్యాంపస్ కు శంకుస్థాపన చేస్తున్నందుకు నాకు ఆనందం గా ఉంది.
అలాగే ఇండియన్ ఆయిల్ కార్పొరేశన్ 50 కోట్ల రూపాయల వ్యయం తో ఇక్కడి నుండి 12 కిలోమీటర్ల దూరం లో తన కొచ్చిన్ బాట్లింగ్ ప్లాంటు లో మౌల్డెడ్ స్టోరేజ్ ఫెసిలిటీ ని ఏర్పాటు చేస్తుండటం సంతోషదాయకం.
ఇది ఎల్ పిజి స్టోరేజ్ సామర్ధ్యాన్ని పెంచడంతో పాటు రహదారి మార్గం లో ఎల్ పిజి టాంకర్ లను పంపడాన్ని తగ్గిస్తుంది.
గత ఆగస్టు లో, కేరళ గత వంద సంవత్సరాల లో ఎన్నడూ ఎరుగనటువంటి రీతి లో వరదల బారి న పడినపుడు కూడా బిపిసిఎల్ కోచి రిఫైనరీ అన్ని అడ్డంకుల ను అధిగమించి కొనసాగుతూ వచ్చిందని తెలిసి సంతోషంగా ఉంది.
పెట్రోల్, డీజిల్, ఎల్ పిజి నిరంతరాయ సరఫరా కోసం ఎందరో ఉద్యోగులు రిఫైనరీ లోనే ఉండి వుంటారని నేను అర్థం చేసుకోగలను. ఇది సహాయ వాహనాల కు, హెలికాప్టర్ లకు ఉపకరించడంతో పాటు సహాయక, రక్షణ కార్యకలాపాలు సజావు గా సాగడానికి దోహదపడింది.
కష్టించి పనిచేసే తత్వం, సామాజిక బాధ్యత, నూతన ఆవిష్కరణ ల స్ఫూర్తి ని కొనసాగించవలసింది గా బిపిసిఎల్ కోచి రిఫైనరీ కి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది సంస్థ ను మరో దశ అభివృద్ధి కి తీసుకుపోగలదు. జాతి నిర్మాణం లో కోచి రిఫైనరీ అందిస్తున్న తోడ్పాటు మనకు గర్వకారణం.
అయితే ఇప్పుడు మనకు మరిన్ని ఆకాంక్షలు ఉన్నాయి. దక్షిణ భారతదేశం లో పెట్రోరసాయనిక విప్లవాని కి కోచి రిఫైనరీ నాయకత్వం వహించాలని, న్యూ ఇండియా యొక్క పెరుగుతున్నటువంటి అవసరాల కు అండ గా నిలవాలని నేను ఆకాంక్షిస్తున్నాను.
జయ్ హింద్.