గౌరవనీయులైన ఛైర్మన్ గారు,
ముందుగా, నూతన ఉప సభాపతి గా ఎన్నికైన శ్రీమాన్ హరివంశ్ గారికి యావత్తు సభ తరఫునా, నా తరఫునా అభినందనలు తెలియజేస్తున్నాను. అరుణ్ గారు కూడా కోలుకొని ఈ రోజున మన అందరి మధ్య కు రావడం మనమందరం సంతోషించవలసినటువంటి విషయం. ఈ రోజు ఆగస్టు 9వ తేదీ. స్వాతంత్య్రోద్యమం లో ఆగస్టు విప్లవం ఒక ముఖ్యమైన మైలు రాయి; ఇందులో బలియా జిల్లా ఒక ప్రముఖ పాత్ర ను పోషించింది. 1857 లో స్వాతంత్య్ర సమరం మొదలైన నాటి నుంచి ఆగస్టు విప్లవ భేరీ ని మోగించడం నుంచి ప్రాణ సమర్పణ వరకు స్వాతంత్య్ర పోరాటం లో బలియా అగ్ర భాగాన నిలచింది. అది మంగళ్ పాండే గారు కావచ్చు లేదా చిట్టూ పాండే గారు కావచ్చు లేదా చంద్రశేఖర్ గారి సంప్రదాయం కావచ్చు.. మరి ఈ పరంపర లో హరివంశ్ గారు కూడా పాలుపంచుకొన్నారు.
జయ ప్రకాశ్ గారి గ్రామం లో ఆయన జన్మించారు. ఈ రోజు వరకు కూడా ఆ గ్రామం తో ఆయన కు అనుబంధం ఉంది. జయ ప్రకాశ్ గారి కల లను పండించడం కోసం ఏర్పాటైన ట్రస్టు లో ఒక ధర్మకర్త గా కూడా ఆయన పని చేస్తున్నారు. తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ను తెచ్చుకొన్న పద స్రష్ట ల సంప్రదాయం లో హరివంశ్ గారు ఒకరు. ఆయన బనారస్ లో ఒక విద్యార్థి గా ఉన్న సంగతి నాకు సంతోషాన్నిచ్చేటటువంటి అంశం. ఆయన బనారస్ లో విద్యాభ్యాసం చేశారు. ఆయన ఆర్థిక శాస్త్రం లో తన ఎం.ఎ. ను బనారస్ లోనే పూర్తి చేశారు. రిజర్వు బ్యాంకు లో సేవ కు ఆయన ఎంపిక అయ్యారు. అయితే, ఆయన రిజర్వు బ్యాంకు కు వెళ్ళలేదు. ఆ తరువాత తన కుటుంబం లోని పరిస్థితి దృష్ట్యా ఒక జాతీయ బ్యాంకు లో ఆయన చేరారు.
శ్రీమాన్ సభాపతి గారు,
ఆయన తన జీవితంలో రెండు ముఖ్యమైన సంవత్సరాల పాటు హైదరాబాద్ లో పని చేశారని తెలిస్తే మీరు ప్రసన్నులవుతారు. అప్పుడప్పుడు ఆయన ముంబయి, హైదరాబాద్, ఇంకా ఢిల్లీ వంటి అనేక చోట్లకు వెళ్ళారు. అయితే, ఆ మహానగరాల కాంతులతో ఆయన ఎన్నడూ ప్రభావితుడు కాలేదు. రవివార్ వార్తా పత్రిక లో పని చేయడానికని ఆయన కలకత్తా కు వెళ్ళారు. ఎస్.పి. సింహ్ గారు ఒక ప్రముఖుడన్న సంగతి మనకు అందరికీ తెలిసిన విషయమే. ఆయన టెలివిజన్ లోకం లో సుపరిచితుడు. ఆయన ఎస్.పి. సింహ్ గారి తో కలసి పని చేశారు. ధరమ్‌వీర్ భారతి లో ఆయన శిక్షణార్థి అయిన పత్రికా రచయిత గా పని చేశారు. ఆయన తన జీవితాన్ని అక్కడి నుంచే ఆరంభించారు. ఆయన ధర్మ్‌యుగ్ లోనూ పని చేశారు.
చంద్రశేఖర్ గారికి ఆయన నమ్మకస్తుడిగా వ్యవహరించారు. ప్రతి ఒక్కరికీ కూడా తను నిర్వహించే విధుల తాలూకు విలువ తో పాటు గౌరవ లక్షణాలు అబ్బుతాయి. చంద్రశేఖర్ గారి బృందం లో తాను పోషించిన పాత్ర రీత్యా, ఆయనకు సకల సమాచారం అందుబాటులో ఉండేది. చంద్రశేఖర్ గారు రాజీనామా చేయబోతున్నారన్న సంగతి ఆయన ముందుగానే ఎరుగుదురు. ఆయన కు సొంత వార్తాపత్రిక ఉంది. పత్రికా రచన తో ఆయన సాన్నిహిత్యాన్ని కలిగి వుండే వారు. అయితే, చంద్రశేఖర్ గారు రాజీనామా చేయనున్నారన్న సంగతి ని ఆయన తన సొంత వార్తాపత్రిక కు సైతం తెలియనీయ లేదు. తన కార్యాలయం యొక్క గౌరవాన్ని కాపాడుతూ ఈ రహస్యాన్ని ఆయన తన వద్దే అట్టిపెట్టుకొన్నారు. తన సొంత వార్తాపత్రిక ఈ కబురు ను ప్రచురించి, ప్రశంసలు పొందడాన్ని ఆయన అనుమతించలేదు.
హరివంశ్ గారు బిహార్ లో రవివార్ వార్తాపత్రిక లో చేరారు. ఆ కాలం లో అది అవిభక్త బిహార్ గా ఉండింది. ఝార్ ఖండ్ ఆ తరువాత ఏర్పడింది. ఆయన ప్రభాత్ ఖబర్ లో చేరడం కోసం రాంచీ కి వెళ్ళారు. ఆయన అందులో చేరేటప్పటికి ఆ వార్తాపత్రిక సర్‌క్యులేశన్ 400 ప్రతులు మాత్రమే. జీవితం లో అనేక అవకాశాలను పొందిన వ్యక్తి కి ఒకవేళ అతడు బ్యాంకింగ్ రంగంలోకి వెళ్ళినా మంచి అవకాశాలు దక్కేవి. ఏమైనా, ఆయన ఒక ప్రతిభావంతుడు. కేవలం 400 కాపీల సర్‌క్యులేశన్ కలిగిన ఒక వార్తాపత్రిక కు ఆయన తనను తాను అంకితం చేసుకొన్నారు. తన నాలుగు దశాబ్దాల పత్రికారచన వృత్తి లో శక్తివంతమైన పత్రికారచన కు ప్రతిబింబంగా ఉన్నారు. ఆ పత్రికారచన కూడా సమాజం హితం కోసం ముడిపడినటువంటిది. అది అధికారంలో ఉన్న వారి కోసం పాటుపడలేదు.
హరివంశ్ గారి ఎన్నిక వెనుక ఒక అతి పెద్ద అంశం ఏదంటే, సమాజ హితం కోసం పాటుపడిన పత్రికారచన తో ఆయనకు అనుబంధం ఉండడమే అని నేను నమ్ముతాను. ఆయన పాలక వర్గం వైపు మొగ్గు చూపిన పత్రికారచన కు దూరంగా ఉంటూ వచ్చారు.
ఆయన వార్తాపత్రికను ప్రజా ఉద్యమంగా నిర్వహించ సాగారు. పరమవీర సాహస పురస్కార విజేత అల్బర్ట్ ఎక్కా గారు దేశం కోసం ప్రాణ సమర్పణ చేసినప్పుడు, ఒక వార్తాపత్రిక లో ఆయన సతీమణి పేదరికం లో మగ్గుతున్నారన్న ఒక వార్త అచ్చయింది. ఇది 20 సంవత్సరాల నాటి మాట. హరివంశ్ గారు కర్తవ్యోన్ముఖులు అయ్యారు. ఆయన ప్రజల వద్ద నుంచి డబ్బును పోగు చేశారు; నాలుగు లక్షల రూపాయలను సేకరించి, ఆ మృత వీరుడి వితంతు మహిళ కు అందజేశారు.
ఒకసారి నక్సల్స్ ఒక మాననీయుడైన వ్యక్తి ని అపహరించారు. హరివంశ్ తన వార్తాపత్రిక ద్వారా తనకు సమకూరిన వనరులను ఉపయోగించి వాటి మూలంగా ధైర్యం చేసి నక్సల్ ప్రాంతానికి వెళ్ళారు. ఆయన వారితో సహేతుకంగా వాదించి, ఆ వ్యక్తి ని విడిపించుకు వచ్చారు. ఆయన తన ప్రాణాన్ని పణంగా పెట్టారు.
అంటే ఆయన బాగా చదువుకున్న వ్యక్తి, అంతేకాకుండా, అనేక పుస్తకాలు రాసిన వారు కూడాను. ఒక వార్తాపత్రికను నడపడం మరియు పత్రికా రచయితలను పర్యవేక్షిస్తూ ఉండడం సులభతరమైన విషయం కావచ్చని నేను నమ్ముతాను. సమాజ హితం పట్ల సామాజిక కృషి పట్ల మొగ్గు చూపే వారికి అది ఒక భిన్నమైన అనుభవం. పాలకవర్గం తో ఉండే అనుభవం సంగతి వేరు.
మీరు పార్లమెంటు లో ఒక సభ్యుడి గా ఫలప్రదమైన పదవీకాలాన్ని గురించి ప్రతి ఒక్కరికి ఒక ఉదాహరణ ను చాటారు. అయితే, సభలో చాలా వరకు పరిస్థితి ఎలా ఉందంటే, ఆటగాళ్ళ కన్నా అంపైర్ లే బోలెడు చిక్కులను ఎదుర్కొనే మాదిరి స్థితి నెలకొంది. ఈ కారణంగా ప్రతి ఒక్కరిని నియమాలకు అనుగుణంగా ఆట ఆడవలసిందిగా బలవంత పెట్టడం ఒక సవాలుతో కూడినటువంటి పని. ఇది చాలా పెద్ద పని. అయితే ఈ పనిని హరివంశ్ గారు తప్పక నెరవేర్చగలుగుతారు.
హరివంశ్ గారి భార్య శ్రీమతి ఆశా గారు. ఆవిడ చంపారణ్ కు చెందిన వారు. అంటే ఒక రకంగా వీరి కుటుంబం యావత్తూ జెపి గారితోను, గాంధీ గారితోను ఏదో ఒక రకంగా అనుబంధం కలిగివున్నవారే అని చెప్పాలి. ఆమె రాజనీతి శాస్త్రం లో ఎం.ఎ. చేశారు. ఆమె కు ఉన్న విద్యా సంబంధమైనటువంటి జ్ఞానం ప్రస్తుతం మీకు మరింత సహాయకారి కాగలదు.
పార్లమెంటు లో సభ్యులమైన మనకు అందరికీ ప్రస్తుతం భగవంతుడి (హరి) కరుణ లభిస్తుందని నేను విశ్వసిస్తున్నాను. ఇప్పుడిక ప్రతి ఒక్కరూ హరి (హరివంశ్ గారి) పైన ఆధారపడతారు. మరి మనకు- ఇటు వైపు వారు కావచ్చు, లేదా అటు వైపు వారు కావచ్చు- ఎంపీ లందరికీ మీ మద్దతు ఉంటుంది.
ఏ వైపున చూసినా ‘హరి’ పేరు కలిగిన వారు అభ్యర్థులుగా ఉన్నటువంటి ఎన్నిక ఇది. ఒక అభ్యర్థి తన పేరుకు ముందు బికె అనే ఉపసర్గ ను కలిగివున్నారు: ఆయనే బికె హరి గారు. అతడికి బికె అనే ఉపసర్గ గాని లేదా వికె అనే ప్రత్యయం గాని లేదు.
అయితే, బికె హరి ప్రసాద్ గారిని కూడా నేను అభినందించాలనుకొంటున్నాను. ప్రజాస్వామ్యం గౌరవాన్ని నిలబెట్టే బాధ్యత ను ఆయన నెరవేర్చారు. వారికి ఫలితం ఏమిటన్నది తెలిసినప్పటికీ, ప్రక్రియ లో పాలుపంచుకోవాలని నిర్ణయించుకొన్నారని ప్రతి ఒక్కరూ అంటున్నారు. వోట్లను వేయడం ఎలాగన్న విషయంలో ఎంతో మంది కొత్త వారు శిక్షణ ను అందుకొన్నారన్నమాట.
మరి, ఈ యావత్తు ప్రక్రియ ను ఎంతో చక్కని రీతిలో ముందుకు తీసుకు వెళ్ళినందుకు- గౌరవనీయులైన సభ్యులు అందరికీ, ప్రముఖులు అందరికీ, అలాగే ఉప సభాపతి కి- నేను ధన్యవాదాలను తెలియ జేయాలనుకొంటున్నాను. ఆయనకు ఉన్న అనుభవం పట్ల, సామాజిక హితం కోసం ఆయన కనబరచే అంకిత భావం పట్ల నేను విశ్వాసంతో ఉన్నాను. ‘మనకు ఎటువంటి ఎంపీ కావాలి?’ అనే ఒక శీర్షిక ను హరివంశ్ గారు తన వార్తాపత్రిక లో మొదలుపెట్టడం అనేది ఓ విశిష్టమైన అంశం. ఆ కాలంలో తానే ఒక ఎంపీ ని అవుతానన్న సంగతి ని ఆయన ఎరుగరు. కానీ, మనకు ఏ విధమైన ఎంపీ లు కావాలనే అంశం పై ఆయన ఒక బ్రహ్మాండమైన ప్రచార ఉద్యమాన్ని నడిపారు. ఆయన తన కలలను పండించుకొనే ఒక పెద్ద అవకాశాన్ని పొందారని, అంతేకాక మన ఎంపీలందరమూ ఆయన వద్ద నుంచి శిక్షణను పొందుతామని నేను ఎరుగుదును. భారతదేశం లో విస్తృత చర్చ జరిగిన దశరత్ మాంఝి ని గురించి మొట్టమొదటి సారిగా పరిశోధించి, ఆయన కథ ను ప్రచురించిన వ్యక్తి హరివంశ్ బాబు యే. అంటే, సమాజంలో అట్టడుగు స్థాయిలో ఉన్న ప్రజల పట్ల సదా అనుబంధాన్ని ఏర్పరచుకొన్న ఒక సజ్జనుడి ద్వారా మనం ప్రస్తుతం మార్గదర్శకత్వాన్ని పొందబోతున్నామన్న మాట.
ఆయనను నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను; ఆయనకు ఇవే నా శుభాకాంక్షలు.