యువర్ ఎక్స్‌లెన్సీ ప్రైమ్ మినిస్టర్ శ్రీ ప్రయుత్ చాన్-ఒ-చా
ఎక్స్‌లెన్సీజ్,
యువర్ మెజెస్టీ,
ఇండియా-ఆసియాన్ సమిట్ సందర్భం లో మీతో మరొక్క మారు భేటీ అయినందుకు నేను సంతోషిస్తున్నాను. థాయిలాండ్ చేసిన చక్కని ఏర్పాట్ల కు మరియు అందించినటువంటి ఉన్నత ప్రమాణాలు కలిగిన ఆతిథ్యాని కి ఇవే నా యొక్క ధన్యవాదాలు. అదే విధం గా రాబోయే సంవత్సరం లో ఆసియాన్ సమిట్ కు మరియు ఈస్ట్ ఏశియా సమిట్ కు అధ్యక్ష బాధ్యత లను వహించే వియత్నామ్ కు కూడాను ఇవే నా యొక్క శుభాకాంక్షలు.
ఎక్స్‌లెన్సీజ్,
ఆసియాన్ కు మరియు భారతదేశాని కి మధ్య ఇండో-పసిఫిక్ అవుట్ లుక్ తాలూకు పరస్పర సమన్వయాన్ని నేను స్వాగతిస్తున్నాను. భారతదేశం అనుసరిస్తున్న ‘యాక్ట్ ఈస్ట్’ విధానం మన ఇండో-పసిఫిక్ దార్శనికత లో ఒక ముఖ్య భాగం గా ఉంది. ఆసియాన్ మా యొక్క ‘యాక్ట్ ఈస్ట్’ విధానాని కి ఇప్పుడు, ఎల్లప్పుడు కేంద్రీయ స్థానం లో ఉంటుంది. ఏకీకృతమైనటువంటి, వ్యవస్థీకృతమైనటువంటి మరియు ఆర్థికం గా అభివృద్ధి చెందుతున్నటువంటి ఆసియాన్ భారతదేశాని కి పునాది పరంగా ప్రయోజనకారి గా ఉంటుంది. మేము మన యొక్క భాగస్వామ్యాన్ని బలవత్తరమైనటువంటి భూతల, సముద్ర సంబంధిత మరియు గగనతల సంధానం తో పాటు, డిజిటల్ లింకు ల ద్వారా మరింత గా బలోపేతం చేసుకోవాలన్న నిబద్ధత ను కలిగివున్నాము. ఒక బిలియన్ అమెరికన్ డాలర్ విలువ కలిగిన లైన్ ఆఫ్ క్రెడిట్ భౌతికమైన సంధానాని కి మరియు డిజిటల్ కనెక్టివిటీ కి ఉపయోగపడనుంది. విద్యార్జన కోసం, పరిశోధన ల కోసం, వ్యాపారం కోసం మరియు పర్యటనల కోసం ప్రజల రాక పోకల ను పెద్ద ఎత్తున పెంచాలనేది మా అభిమతం గా ఉంది.
ఈ లక్ష్యాన్ని సాధించడం కోసం భారతదేశం పరస్పర ప్రయోజనాలు ముడిపడి ఉన్న రంగాల లో ఆసియాన్ తో భాగస్వామ్యాన్ని పెంపొందింప చేసుకొనేందుకు సిద్ధం గా ఉంది. కిందటి సంవత్సరం లో సింగపూర్ లో కమెమరేటివ్ సమిట్ లోను, ఇన్‌ఫార్మల్ సమిట్ లోను తీసుకొన్న నిర్ణయాల ను అమలు చేసినందువల్ల మనం మరింత చేరువ అయ్యాము. వ్యవసాయం, విజ్ఞాన శాస్త్రం, పరిశోధన, ఐసిటి, ఇంకా ఇంజినీరింగ్ ల వంటి రంగాల లో భాగస్వామ్యాల ను మరియు కెపాసిటీ బిల్డింగ్ ను మరింత వృద్ధి పరచుకోవడాని కి మేము తయారు గా ఉన్నాము. ఆసియాన్-ఇండియా ఎఫ్‌టిఎ ను సమీక్షించాలని ఇటీవల తీసుకొన్న నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నాను.
ఇది మన ఆర్థిక సంబంధాల ను మరింత బలపరచడం ఒక్కటే కాకుండా మన వ్యాపారాన్ని కూడాను సమతుల్యత కలిగినది గా చేస్తుంది. మనము సముద్ర సంబంధిత రక్షణ, నీలి ఆర్థిక వ్యవస్థ లతో పాటు, మానవీయ సహాయం వంటి రంగాల లో మన భాగస్వామ్యాన్ని బలవత్తరం గా మలచుకోవాలని కోరుకొంటున్నాను. ఎక్స్‌లెన్సీజ్, మీ యొక్క అభిప్రాయాల ను ఆలకించిన తరువాత నేను మరికొన్ని అంశాల పై వివరం గా మాట్లాడాలని అనుకొంటున్నాను. నేను మరొక్క మారు థాయిలాండ్ కు మరియు మీ అందరికీ హృదయ పూర్వక కృతజ్ఞతల ను వ్యక్తం చేస్తున్నాను.

అస్వీకరణ: ప్రధాన మంత్రి హిందీ భాష లో ప్రసంగించారు. ఆ ప్రసంగాని కి ఇది స్థూల అనువాదం.