మిత్రులారా,
ఎన్నికలు ముగిసి నూతన లోక్ సభ ఏర్పడిన తరువాత జరుగుతున్న ఒకటో సమావేశం ఇది. నవీన సహచరుల ను పరిచయం చేయడానికి ఇది ఒక అవకాశం. మరి కొత్త సహచరులు సభ లోకి ప్రవేశించినప్పుడు వారి తో కొత్త ఆకాంక్షలు, నవోత్సాహం, ఇంకా కొంగొత్త స్వప్నాలు కూడా కలసి వస్తాయి. భారతదేశ ప్రజాస్వామ్యాన్ని ఇంత ప్రత్యేకం గా తీర్చిదిద్దుతున్నది ఏమిటి ? భారతీయ ప్రజాస్వామ్యం యొక్క బలాన్ని మరియు ప్రత్యేకతల ను ప్రతి ఎన్నిక లో అర్థం చేసుకొంటూవుంటాము. ఈ సారి జరిగిన పార్లమెంటరీ ఎన్నికల లో వోటింగు యొక్క శాతం గరిష్ఠ స్థాయి కి పెరగడాన్ని మరియు స్వాతంత్య్రం అనంతర కాలం లో మహిళా ప్రతినిధులు గరిష్ట సంఖ్య లో ఎన్నిక కావడాన్ని మనం చూశాము. ఇదివరకటి సందర్భాల తో పోల్చినప్పుడు ఈ సారి మహిళలు అధిక సంఖ్య లో వోట్లు వేశారు. ఈ ఎన్నికలు అనేక విశిష్ట అంశాల తో కూడుకొని ఉన్నాయి.
అనేక దశాబ్దాల అనంతరం, ఒక ప్రభుత్వాని కి వరుస గా రెండవ సారి పూర్తి సంఖ్యాధిక్యం తోను, గడచిన పర్యాయం కన్నా ఎక్కువ సంఖ్య లో సీట్ల తోను ప్రజల కు సేవ చేసే అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. గత అయిదు సంవత్సరాల కాలం లో సభ సమావేశాలు జరిగినప్పుడల్లా ఆ సమావేశాలు ఆరోగ్యదాయకమైన వాతావరణం లో సాగినప్పుడల్లా, దేశ ప్రజల సంక్షేమార్థం తీసుకొన్న నిర్ణయాలు కూడా చాలా చక్క గా ఉన్నాయి. ఈ అనుభవాల ఆధారం గా అన్ని పక్షాలు చర్చల ను, వాదనల ను జరిపి ప్రజాహితం కోసం నిర్ణయాల ను తీసుకొంటాయని, మరి అలాగే ప్రజల ఆకాంక్షల ను వీలైనంత ఉత్తమమైన రీతి లో నెరవేర్చేందుకు చర్యలు చేపడుతాయని నేను నమ్ముతున్నాను, ఆశపడుతున్నాను కూడాను. మనం మన యొక్క ‘సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్’ యాత్ర ను మొదలుపెట్టాము. అయితే, దీని కి – అంటే ‘సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్’కు – దేశ ప్రజలు మరొక అద్భుతమైనటువంటి ‘నమ్మకాన్ని’ లేదా ‘విశ్వాసాన్ని’ జోడించారు. మరి ఈ విశ్వాసం తో మనం సామాన్య మానవుడి ఆకాంక్షల ను మరియు ఆశల ను పండించడాని కి మన యొక్క శ్రేష్ఠమైనటువంటి ప్రయత్నాల ను తప్పక చేద్దాము.
ప్రజాస్వామ్యాని కి ఒక తప్పనిసరి ముందస్తు షరతు ఏమిటి అంటే అది ఒక సకారాత్మకమైనటువంటి ప్రతిపక్షం యొక్క ఉనికి అని చెప్పాలి. ప్రతిపక్షాలు సంఖ్యల ను గురించి ఆందోళన చెందడం ఇక ఆపివేయాలని నేను ఆశిస్తున్నాను. ప్రజలు వాటి కి కొన్ని సంఖ్యల ను ఇచ్చారు. కానీ, మాకు వారి యొక్క ప్రతి మాట మరియు భావన అమూల్యమైనవి గా ఉన్నాయి. మరి మనము సభ లో ఉన్నప్పుడు, ఎంపీ లుగా ఆసీనులైనప్పుడు, ఎవరు అధికారం లో ఉన్నారు మరి ఎవరు ప్రతిపక్షం లో ఉన్నారు అనే దానిక న్నా తటస్థ స్ఫూర్తి సర్వోపరి అవుతుంది. శత్రుత్వాన్ని పక్కనపెట్టి, రాబోయే అయిదు సంవత్సరాల లో ప్రజా సంక్షేమం కోసం నిస్పాక్షికం గా పని చేయడం ద్వారా సభ యొక్క గౌరవాన్ని నిలబెట్టడాని కి మనం ప్రయత్నించవలసి ఉంది. మన సభ లు ఇదివరకటి తో పోలిస్తే మరింత నిర్మాణాత్మకం గా ఉంటాయని, మనం మరింత ఉత్సాహం తో, వేగం తో, మెరుగైన సమష్టి ఆలోచనల తో పని చేసే అవకాశాన్ని పొందుతామన్న విశ్వాసం నాలో ఉంది.
సభ లో అర్థవంతమైన చర్చలు జరపగలిగే వారు, కొన్ని అద్భుతమైన ఆలోచనల ను వెల్లడించే వారు చాలా మంది ఉన్నారు. అయితే, వాటి లో చాలా వరకు నిర్మాణాత్మకమైనవి కావడం వల్ల టిఆర్‌పి లతో అవి సరి తూగలేవు. కానీ, కొన్ని సార్లు సభ్యులు టిఆర్‌పి ల కన్నా మిన్నగా ఉండేటటువంటి అవకాశాన్ని దక్కించుకోగలుగుతారు. ప్రభుత్వాన్ని ఒక నిర్మాణాత్మకమైన పద్ధతి లో విమర్శించినప్పుడు, దాని కి తరువాయి గా సభ లో ఒక పార్లమెంటు సభ్యుడు లేదా సభ్యురాలు వాదనల ను మరియు కారణాల ను వినిపించినప్పుడు, అది ప్రజాస్వామ్యాన్ని ఉత్తేజితం చేయగలుగుతుంది. ప్రజాస్వామ్యాన్ని బలపరచడం లో మీ అందరి పైనా నేను ఎన్నో అంచనాలు పెట్టుకొన్నాను. ఆ అంచనాల ను మనం తప్పక నెరవేర్చుకొందాము. అయితే, రాబోయే అయిదు సంవత్సరాల లో ఈ స్ఫూర్తి ని బలవత్తరం చేయడం లో మీరు ఒక సకారాత్మకమైన భూమిక ను పోషిస్తారు. మీరు ఒక సకారాత్మకమైన పాత్ర ను పోషించినప్పుడు, అలాగే సానుకూలమైనటువంటి ఆలోచనల ను వ్యాప్తి లోకి తెచ్చినప్పుడు.. అదే గనుక జరిగితే.. ప్రతి ఒక్కరు సానుకూలత దిశ గా మొగ్గు చూపిన వారు అవుతారు. అందుకని, 17వ లోక్ సభ కాలం లో నవోత్సాహం, నూతన నమ్మకం, నవీన సంకల్పం, ఇంకా కొత్త కొత్త కలల తో ముందుకు సాగిపోవాలని మీ అందరినీ నేను కోరుకుంటున్నాను. సామాన్య మానవుడి ఆకాంక్షల ను మరియు ఆశల ను నెరవేర్చడం కోసం మనం శాయశక్తుల ప్రయత్నిద్దాము. ఈ నమ్మకం తో, మీ అందరి కి ఇవే ధన్యవాదాలు.