When the entire country stands with our forces, the strength of our jawans increases 125 crore times: PM Modi during #MannKiBaat
Decision to implement demonetisation wasn’t easy. There will be inconvenience to rid the country of troubles of 70 years: PM #MannKiBaat
Govt, post offices, banks are working hard & with dedication to fight evils of black money & corruption: PM Modi during #MannKiBaat
Despite inconvenience, people across the country have accepted demonetisation drive. This shows their potential: PM during #MannKiBaat
Villages, farmers & small traders have a pivotal role in our country’s economy: PM Modi during #MannKiBaat
Urge small traders to embrace technology by using banking apps & digital payment systems: PM Modi during #MannKiBaat
By embracing technology, we can build a cashless society. This will be a big transformation: PM during #MannKiBaat
We can gradually move from a ‘less-cash’ society to a cashless society. Youth can play a major role in this: PM Modi during #MannKiBaat
Youth can be the agents of change in fighting black money & corruption: PM Narendra Modi during #MannKiBaat

ప్రియ‌మైన నా దేశ‌ వాసులారా, న‌మ‌స్కారం. గ‌త నెల‌లో మ‌న‌మంతా దీపావ‌ళిని ఆనందంగా జ‌రుపుకొన్నాము. ప్ర‌తి సంవ‌త్స‌రం మాదిరిగానే ఈ సారి కూడా దీపావ‌ళి పండుగ‌ను సైనికుల‌తో క‌లిసి జ‌రుపుకొనేందుకు చైనా స‌రిహ‌ద్దుల‌కు వెళ్లాను. ఐటిబిపి జ‌వాన్ల‌తో, సైన్యానికి చెందిన జ‌వాన్ల‌తో క‌లిసి హిమాల‌య శిఖ‌రాల్లో దీపావ‌ళి జ‌రుపుకొన్నాను. నేను ప్ర‌తిసారి వెళ‌తాను. కానీ ఈసారి దీపావ‌ళి అనుభూతే వేరు. దేశంలోని 125 కోట్ల మంది ఈసారి దీపావ‌ళిని సైన్యానికి, భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌కు అంకితం చేశారు. అక్క‌డి ప్ర‌తి జ‌వాను ముఖంలో ప్ర‌జ‌లు ఇచ్చిన ఈ గౌర‌వం తాలూకు ఆనందం కనిపించింది. ఈ భావ‌న సైనికుల మ‌న‌సుల్లో నిండిపోయింది. అంతేకాకుండా దేశ ప్ర‌జ‌లంతా త‌మ‌కు శుభాకాంక్ష‌లు పంపుతూ పండుగ ఆనందంలో సైనికుల‌ను కూడా భాగ‌స్వాముల‌ను చేయ‌డం అద్భుత‌మైన స్పంద‌న‌. ప్ర‌జ‌లు పంపింది మామూలు శుభాకాంక్ష‌లు కావు. హృద‌యపూర్వ‌క‌ స్పంద‌న‌లు. ఒక‌రు చ‌క్క‌ని క‌విత రాస్తే, మ‌రొక‌రు చిత్రాన్ని రూపొందించారు. ఇంకొక‌రు కార్టూన్ వేశారు. మ‌రొక‌రు వీడియోను రూపొందించి పంపారు. ఆ విధంగా ప్ర‌తి ఇంటా సైనికుల మాటే వినిపించింది. ఈ లేఖ‌ల‌ను చూసిన‌ప్పుడ‌ల్లా నాకు ఆనందంతో పాటు ఆశ్చ‌ర్యం వేసింది. ఎంత ఆత్మీయ‌మైన భావాల‌తో ఈ లేఖ‌లు రాశారో అనిపించింది. అలాంటి వాటిని కొన్ని ఎంపిక‌ చేసి ఒక కాఫీ టేబుల్ బుక్ త‌యారు చేయాల‌ని మై గ‌వ్ లో కొంద‌రు సూచించారు. ఆ ప‌ని జ‌రుగుతున్న‌ది. మీ అంద‌రి స‌హ‌కారంతో దేశ సైనిక జ‌వాన్ల ప‌ట్ల మీరు వ్య‌క్తీక‌రించిన భావాల‌ను, భ‌ద్ర‌తా బ‌ల‌గాల ప‌ట్ల మీ భావాంబ‌ర వీధుల్లో విహ‌రించిన అంశాల‌ను ఒక పుస్త‌క రూపంలో తీసుకురావ‌డం జ‌రుగుతున్న‌ది.

సైన్యంలోని ఒక జ‌వాను ఇలా రాశాడు.. ప్ర‌ధాన మంత్రి గారూ, సైనికులం హోళి, దీపావ‌ళి ప్ర‌తి పండుగ‌ను స‌రిహ‌ద్దుల్లోనే జ‌రుపుకొంటాము. ఎల్ల‌ప్పుడూ మేము దేశ ర‌క్ష‌ణ‌లోనే నిమ‌గ్న‌మై ఉంటాము. అయిన‌ప్ప‌టికీ పండుగ స‌మ‌యాల్లో ఇల్లు గుర్తుకు వ‌స్తుంది. నిజం చెప్పాలంటే ఈసారి అలా జ‌ర‌గ‌లేదు. పండుగ‌నాడు ఇంట్లో లేక‌పోయాం క‌దా అనిపించ‌లేదు. 125 కోట్ల మంది దేశ‌వాసుల‌తో క‌లిసి దీపావ‌ళి జ‌రుపుకొంటున్నా మ‌నిపించింది.

ప్రియమైన నా దేశ వాసులారా..

సైనికుల మ‌ధ్య జ‌రుపుకొన్న ఈ దీపావ‌ళి, ఈ వాతావ‌ర‌ణం, ఈ అనుభూతులను కొన్ని సంద‌ర్భాల‌కే ప‌రిమితం చేయాలా? మ‌నం ఒక దేశంలో, ఒక స‌మాజంలో వ్య‌క్తులుగా ఎలాంటి పండుగ వ‌చ్చినా, ఉత్స‌వం వ‌చ్చినా సైనికుల‌ను ఏదో రూపంలో త‌ప్ప‌క గుర్తు చేసుకోవ‌డం స‌హ‌జ‌మైన అల‌వాటుగా మార్చుకోవాల‌ని మీ అంద‌రినీ అభ్య‌ర్ధిస్తున్నాను. దేశ‌మంతా సైన్యానికి అండ‌గా నిలిస్తే, సైనిక శ‌క్తి 125 రెట్లు పెరుగుతుంది.

కొన్నాళ్ల క్రితం జ‌మ్ము & క‌శ్మీర్ నుండి అక్క‌డి గ్రామ పెద్ద‌లంతా న‌న్ను క‌ల‌వ‌డానికి వ‌చ్చారు. వారంతా జ‌మ్ము & క‌శ్మీర్ పంచాయ‌త్ కాన్ఫ‌రెన్స్ కు చెందిన‌వారు. క‌శ్మీర్ లోయ‌లోని వేర్వేరు ఊళ్ల నుంచి వ‌చ్చారు. వారితో చాలా సేపు మాట్లాడే అవ‌కాశం క‌లిగింది. గ్రామాభివృద్ధి గురించి ప్ర‌స్తావ‌న కూడా వ‌చ్చింది. దేశ‌వాసులం అంద‌ర‌మూ ఈ విష‌యాల గురించి ఎంత‌గా బాధ‌ప‌డ‌తామో, వారు కూడా అంత‌గానూ విచారించారు. అక్క‌డ త‌గ‌ల‌బెట్టింది పాఠ‌శాల‌ల‌ను కాదు, పిల్ల‌ల భ‌విష్య‌త్ ను అని వారు ఆవేద‌న చెందారు. మీరంతా మీమీ గ్రామాల‌కు వెళ్లిన త‌రువాత ఆ పిల్ల‌ల భ‌విష్య‌త్ పైన మ‌న‌స్సును ల‌గ్నం చేయండి అని వారికి విజ్ఞ‌ప్తి చేశాను. క‌శ్మీర్ లోయ నుండి వ‌చ్చిన ఈ అధ్య‌క్షులంతా నాకు ఇచ్చిన మాట‌ను పొల్లుపోకుండా నిల‌బెట్టారు. గ్రామాల‌కు వెళ్లి ఎక్క‌డెక్క‌డో ఉన్న ప్ర‌జ‌ల్లో చైత‌న్యం క‌లిగించ‌డం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. కొన్నాళ్ల క్రితం బోర్డు ప‌రీక్ష‌లు జ‌రిగాయి. క‌శ్మీర్ బాల‌బాలిక‌లంతా సుమారు 95 శాతం ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌య్యారు. బోర్డు ప‌రీక్ష‌ల‌కు విద్యార్థినీ విద్యార్థులు ఇంత పెద్ద సంఖ్య‌లో హాజ‌రు కావ‌డం చూస్తుంటే జ‌మ్ము & క‌శ్మీర్‌ లోని మ‌న పిల్ల‌లు త‌మ ఉజ్జ్వల భ‌విష్య‌త్ కోసం, విద్య ద్వారా స‌మున్న‌త‌మైన అభివృద్ధిని సాధించేందుకు సంక‌ల్పించార‌నేందుకు ఇది ఒక సంకేతంగా నిలుస్తుంది. ఈ ఉత్సాహాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్న విద్యార్థుల‌ను అభినందిస్తున్నాను. వారి త‌ల్లితండ్రుల‌ను, వారి ఇత‌ర కుటుంబ స‌భ్యుల‌ను, ఉపాధ్యాయుల‌ను, గ్రామ అధ్య‌క్షులంద‌రినీ హృద‌యపూర్వ‌కంగా అభినందిస్తున్నాను.

ఈసారి ‘మ‌న్ కీ బాత్’ (మనసులో మాట) కోసం ప్ర‌జ‌ల స‌ల‌హాలు కోర‌గా ప్రియ‌మైన సోద‌ర సోద‌రీమ‌ణులంద‌రూ ఒకే విధంగా స్పందించార‌ని చెప్ప‌గ‌ల‌ను. 500, 1000 రూపాయ‌ల నోట్ల గురించి మ‌రింత విస్తృతంగా చ‌ర్చించాల‌ని వార‌న్నారు. న‌వంబ‌ర్ 8న రాత్రి 8 గంట‌ల‌కు దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి నేను మాట్లాడుతూ దేశంలో మార్పు తీసుకురావ‌డానికి ఒక మ‌హోన్న‌త ప‌థ‌కాన్ని ప్రారంభిస్తున్నాన‌ని చెప్పాను. ఈ నిర్ణ‌యాన్ని తీసుకొన్న‌ప్పుడు, మీ ముందు ఈ విష‌యాన్ని పెట్టిన‌ప్పుడు, ఈ నిర్ణ‌యం సామాన్యమైన‌ది కాద‌ని, కష్టాలతో కూడుకొని ఉన్న‌ద‌ని నేను బాహాటంగా మీకంద‌రికీ చెప్పాను. ఇది ఎంతో ముఖ్యమైన నిర్ణ‌యం అయితే దీనిని అమ‌లుచేయడం కూడా అంతే ముఖ్యమైంది కూడా. దీని వల్ల మనం మన దైనందిన జీవనంలో వేరు వేరు కొత్త కష్టాలను ఎదుర్కొనవలసి వస్తుంద‌న్న సంగతిని కూడా నేను గ్రహించాను. ఈ నిర్ణ‌యం ముఖ్యమైంద‌ని, దీని ప్ర‌భావం నుండి బ‌య‌ట‌ప‌డ‌డానికి 50 రోజులైనా ప‌డుతుంద‌ని కూడా నేను చెప్పాను. అప్పుడుగాని మ‌నం సాధార‌ణ స్థితి వైపు సాగ‌లేము. 70 ఏళ్ళ నుండి ఏ స‌మ‌స్య‌ల్లో అయితే మ‌నం కొట్టుమిట్టాడుతున్నామో, వాటి నుండి బ‌య‌ట‌ప‌డే కృషి సుల‌భం కానేర‌దు. మీ స‌మ‌స్య‌ల‌ను నేను పూర్తిగా అర్థం చేసుకోగ‌ల‌ను. అయితే నా నిర్ణ‌యాన్ని మీరు స‌మ‌ర్ధించ‌డం చూస్తుంటే, దానికి మీరందిస్తున్న స‌హ‌కారాన్ని చూస్తుంటే, మిమ్మ‌ల్ని త‌ప్పుదోవ ప‌ట్టించేందుకు ఎన్నో శ‌క్తులు ప్ర‌య‌త్నిస్తున్నా, అప్పుడ‌ప్పుడూ మ‌న‌సుకు బాధ క‌లిగించే ఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నా, వాస్త‌వాన్ని పూర్తిగా అర్థం చేసుకుని దేశ‌ హితం కోసం కొన్ని స‌మ‌స్య‌ల్ని కూడా మీరు భ‌రించ‌డం చూస్తుంటే- నాకు ఆనందం క‌లుగుతోంది.

500, 1000 రూపాయ‌ల నోట్లు, మ‌రో వైపు ఇంత పెద్ద దేశం, ఇంత పెద్ద ఎత్తున క‌రెన్సీ, ఈ నిర్ణ‌యం- వీట‌న్నింటినీ యావ‌త్ ప్ర‌పంచం సునిశితంగా గ‌మ‌నిస్తున్న‌ది. ప్ర‌తి ఆర్థిక‌ వేత్త దీనిని లోతుగా విశ్లేషిస్తున్నారు. మదింపు చేస్తున్నారు. భార‌త‌దేశంలోని 125 కోట్ల మంది స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటూ కూడా సాఫ‌ల్యం పొందుతారా లేదా అని ప్ర‌పంచ‌మంతా చూస్తోంది. భార‌త‌దేశంలోని 125 కోట్ల మంది ప‌ట్ల ప్ర‌భుత్వానికి అత్యంత శ్ర‌ద్ధ ఉంద‌ని, అనంత‌మైన విశ్వాసం ఉంద‌ని ప్ర‌పంచం భావిస్తోంది. 125 కోట్ల మంది దేశ‌వాసుల సంక‌ల్పాన్ని ప్ర‌భుత్వం నెర‌వేరుస్తుంద‌ని అనుకుంటోంది. మ‌న దేశం నిక్షేపంగా అన్ని ర‌కాలైన ప్ర‌య‌త్నాల‌తో ఈ స‌మ‌స్య‌ను అధిగ‌మిస్తుంది. అందుకు కార‌కులు ఈ దేశంలోని ప్ర‌జ‌లు, ఆ కార‌కులు మీరే. ఈ సాఫ‌ల్య మార్గం కూడా మీ వ‌ల్ల‌నే సిద్ధిస్తుంది.

దేశ‌ వ్యాప్తంగా కేంద్ర ప్ర‌భుత్వం, రాష్ట్ర ప్ర‌భుత్వాలు, స్థానిక సంస్థ‌ల యావ‌త్ యంత్రాంగం, ల‌క్షా ముప్ఫయ్ వేల బ్యాంకు శాఖ‌లు, ల‌క్ష‌లాదిగా ఉద్యోగులు, ల‌క్ష‌న్న‌ర‌కు పైగా త‌పాలా కార్యాల‌యాలు, ల‌క్ష‌కు పైగా ‘బ్యాంకు మిత్ర‌’లు రాత్రింబ‌వ‌ళ్లూ ఈ ప‌నిలో నిమ‌గ్న‌మై ఉన్నారు. అంకిత‌భావంతో ప‌ని చేస్తున్నారు. ఎంత‌టి ఇబ్బంది ఏర్ప‌డినా వీరంతా శాంత చిత్తంతో ఈ ప‌నిని దేశ సేవా య‌జ్ఞంగా భావించి, ఒక మ‌హా ప‌రివ‌ర్త‌న కృషిగా భావించి ప‌ని చేస్తున్నారు.

ఉద‌యం ప‌నిలో నిమ‌గ్న‌మై, ఎంత రాత్రి అవుతుందో తెలియ‌ని ప‌రిస్థితిలో ప‌ని చేస్తున్నారు. ఈ కార‌ణం వ‌ల్ల భార‌తదేశం ఈ ప‌రిస్థితిని అధిగ‌మిస్తుంద‌ని స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ఇన్ని ఇబ్బందుల మ‌ధ్య బ్యాంకులు, త‌పాలా కార్యాల‌యాల సిబ్బంది అంద‌రూ ప‌ని చేయ‌డం నేను చూశాను. మాన‌వ‌తా దృక్ప‌థంతో వ్య‌వ‌హ‌రించే అంశాలు ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చాయి. ఖండ్ వాలో ఒక పెద్దాయ‌న‌కు ప్ర‌మాదం జ‌రిగింది. అప్ప‌టిక‌ప్పుడు డ‌బ్బులు అవ‌స‌ర‌మ‌య్యాయి. అక్క‌డ స్థానిక బ్యాంకు ఉద్యోగి ఒక‌రి దృష్టికి ఈ విష‌యం వెళ్ళింది. అత‌ను స్వ‌యంగా వారి ఇంటికి వెళ్ళి ఆ పెద్దాయ‌న‌కు డ‌బ్బులు అంద‌జేశాడ‌ని నాకు తెలిసింది. ఇలా నిత్యం టీవీలో, ఇత‌ర మాధ్యమాలలో, ప‌త్రిక‌లలో ఇటువంటి సంఘ‌ట‌న‌ల వార్త‌లు తెలుస్తున్నాయి. ఈ మ‌హా య‌జ్ఞం కోసం ప‌రిశ్ర‌మించేవారంద‌రికీ, ప్రయ‌త్నం చేస్తున్న వారంద‌రికీ కూడా నేను హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు తెలుపుకుంటున్నాను. ప‌రీక్ష‌లో ఉత్తీర్ణులైన‌ప్పుడే అస‌లైన శ‌క్తి అంచ‌నాకు అందుతుంది. ప్ర‌ధాన‌ మంత్రి ద్వారా జ‌న్ ధ‌న్ యోజ‌న ప్ర‌చారం జ‌రుగుతున్న‌పుడు బ్యాంకు ఉద్యోగులంద‌రూ ఆ ప‌నిని ఏ విధంగా త‌మ భుజాల‌పైకెత్తుకుని, 70 ఏళ్ళ‌లో చేయ‌లేక‌పోయిన ప‌నిని చేసి చూపెట్టారో నాకు బాగా గుర్తుంది. వాళ్ళ సామ‌ర్థ్యం అప్పుడు తెలిసింది. ఇవాళ మ‌ళ్ళీ ఇంకొక‌ సారి వారు ఆ స‌వాలును స్వీకరించారు. 125 కోట్ల దేశ ప్ర‌జ‌ల సంక‌ల్పాన్ని, అంద‌రి సామూహిక పురుషార్థం ఈ దేశాన్ని ఒక కొత్త శ‌క్తిగా రూపొందించి విస్తృత‌ప‌రుస్తుంద‌నే న‌మ్మ‌కం నాకు ఉంది.

కానీ దుర్మార్గం ఎంత‌గా ప్ర‌బ‌లిపోయి ఉందంటే ఇవాళ్టికి కూడా కొంద‌రి దుర్మార్గ‌పు అల‌వాట్లు పోవ‌డం లేదు. ఇవాళ కూడా కొంద‌రు ఈ అవినీతి సొమ్మునూ, ఈ న‌ల్ల‌ధ‌నాన్నీ, లెక్క‌లు చూప‌ని సొమ్మునీ, గుప్త ధ‌నాన్ని ఎలాగైనా, ఏ మార్గం ద్వారానైనా వ్య‌వ‌స్థ‌లోకి తీసుకురావాల‌ని చూస్తున్నారు. వాళ్ళు త‌మ అవినీతి సొమ్మును ర‌క్షించుకొనే ప్ర‌య‌త్నంలో ఎన్నో సంఘ విద్రోహ‌క మార్గాల‌ను వెతుకుతున్నారు. ఈ ప‌నికి కూడా వాళ్లు పేద‌వారిని ఉప‌యోగించుకునే మార్గాన్ని ఎంచుకోవ‌డం చింతించాల్సిన విష‌యం. పేద‌వారిని ప్ర‌లోభ‌పెట్టి, ఆశ‌చూపి, ప్ర‌లోభ‌ప‌రిచే మాట‌లు చెప్పి వాళ్ళ ఖాతాల్లో డ‌బ్బు జ‌మ‌ చేసి లేదా వేరే ప‌నులు చేయించుకొని త‌మ దొంగ సొమ్మును ర‌క్షించుకొనే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. మార‌డం, మార‌క‌పోవ‌డం మీ ఇష్టం, చ‌ట్టానికి అనుకూలంగా ఉండ‌డం, అనుకూలంగా ఉండ‌క‌పోవ‌డం మీ ఇష్టం.. కానీ, ద‌య‌చేసి పేద‌ల బ‌తుకుల‌తో ఆడుకోవ‌ద్ద‌ని మాత్రం అటువంటి వారికి ఇవాళ చెప్పాల‌నుకొంటున్నాను. బేనామీ స్థిరాస్తుల‌పై ఎంత‌టి క‌ఠిన‌మైన చ‌ట్టం చేసి అమ‌లుపరుస్తున్నామంటే ఎంత‌టి ఇబ్బంది ఎదుర‌వుతుంద‌ని చూడ‌డం లేదు. దేశ ప్ర‌జ‌ల‌కు ఎటువంటి ఇబ్బందులు క‌ల‌గ‌కూడ‌ద‌ని ప్ర‌భుత్వం అనుకుంటోంది. మ‌ధ్య‌ ప్ర‌దేశ్‌లోని శ్రీ ఆశీస్ నాకు ఫోను చేసి 500, 1000 రూపాయ‌ల నోట్ల ద్వారా అవినీతికి, న‌ల్ల‌ధ‌నానికి వ్య‌తిరేకంగా మొద‌లుపెట్టిన యుద్ధంపై న‌న్ను ఇలా మెచ్చుకున్నారు..

“సార్‌, న‌మ‌స్తే. నా పేరు ఆశీస్ పారే. నేను మధ్య ప్రదేశ్ లోని హర్దా జిల్లా తిరాలి తెహ్ శీల్ పరిధిలోని తిరాలి గ్రామానికి చెందిన ఒక సామాన్య పౌరుడిని. మీరు 500, 1000 రూపాయ‌ల నోట్ల‌ను ర‌ద్దు చేయ‌డం అనేది చాలా మెచ్చుకోద‌గ్గ సంగ‌తి. ప్ర‌జ‌లు ఎన్నో ఇబ్బందుల‌ను, క‌ష్ట‌న‌ష్టాల‌ను ఓర్చుకొని కూడా దేశ ప్ర‌గ‌తి కోసం ఈ క‌ఠిన‌మైన నిర్ణ‌యాన్ని స్వాగ‌తించార‌ని మీ ‘మ‌న్ కీ బాత్’ (మనసులో మాట) కార్య‌క్ర‌మం ద్వారా ఉదాహ‌ర‌ణ పూర్వ‌కంగా తెలుప‌మ‌ని కోరుతున్నాను. అది విని ప్ర‌జ‌లు ఉత్సాహ‌భ‌రితులు అవుతారు. దేశ నిర్మాణానికి న‌గ‌దు ర‌హిత ప్ర‌ణాళిక ఎంతో అవ‌స‌రం. నేను ఈ పోరాటంలో యావ‌త్ దేశంతో పాటు ఉన్నాను. మీరు ఈ 500, 1000 రూపాయ‌ల నోట్ల‌ను ర‌ద్దు చేసినందుకు నేను నిజంగా చాలా ఆనందిస్తున్నాను.”

క‌ర్ణాట‌క నుండి శ్రీ ఎల్ల‌ప్ప వెలాంక‌ర్ కూడా ఫోన్ చేసి ఇదే విధంగా ప్రతిస్పందించారు. ఆయన ఏమన్నారంటే.. “మోదీ గారూ, న‌మ‌స్తే. నేను క‌ర్ణాట‌క‌లోని కొప్పాళ్ జిల్లాలోని ఒక పల్లెటూరు నుండి ఫోన్ చేస్తున్నాను. నా పేరు ఎల్ల‌ప్ప వెలాంక‌ర్. మీకు నేను మ‌నఃపూర్వ‌కంగా ధ‌న్య‌వాదాలు తెలపాల‌నుకుంటున్నాను. మీరు మంచి రోజులు వ‌స్తాయ‌ని చెప్పారు. కానీ, ఇలాంటి పెద్ద అడుగు వేస్తార‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు. 500, 1000 రూపాయ‌ల నోట్ల‌ను ర‌ద్దు చేసి న‌ల్ల‌ధ‌న ఆసాములకు, అవినీతిప‌రుల‌కు గుణ‌పాఠం నేర్పించారు. ప్ర‌తి ఒక్క భార‌తీయుడికి ఇంత‌ క‌న్నా మంచి రోజులు ఎప్ప‌టికి రావు. అందుక‌నే నేను మీకు మ‌నఃపూర్వ‌కంగా ధ‌న్య‌వాదాలు చెప్పాల‌నుకుంటున్నాను.” అని ఆయన అన్నారు.

ప్రసార మాధ్యమాల ద్వారా, ప్ర‌జ‌ల ద్వారా, ప్ర‌భుత్వ వ‌ర్గాల ద్వారా కొన్ని విష‌యాలు తెలుస్తూ ఉండ‌డం వ‌ల్ల ప‌ని చేయ‌డానికి ఉత్సాహం రెట్టింపు అవుతుంది.

నా దేశ సామాన్య మాన‌వుడి యొక్క అద్భుత సామ‌ర్ధ్యాన్ని చూస్తే ఎంతో ఆనందంగా, ఎంతో గ‌ర్వంగా ఉంటుంది. మ‌హారాష్ట్రలోని అకోలాలో 6వ నెంబ‌ర్ జాతీయ ర‌హ‌దారిపై ఒక రెస్టారెంట్ ఉంది. మీ జేబుల్లో పాత నోట్లు ఉంటే, మీకు భోజ‌నం చేయాల‌ని ఉంటే, మీరు డ‌బ్బు గురించి చింతించ‌కండి. ఇక్క‌డి నుండి ఆక‌లితో వెళ్ళ‌కండి. భోజ‌నం చేసే వెళ్ళండి. మ‌ళ్ళీ ఈ దారిలో వెళ్ళే అవ‌కాశం వ‌స్తే త‌ప్ప‌కుండా డ‌బ్బు ఇచ్చి వెళ్ళండి అని వాళ్ళు ఒక పెద్ద బోర్డు పెట్టారు. జ‌నం అక్క‌డికి వెళ్ళి భోజ‌నం చేస్తున్నారు. మ‌ళ్ళీ రెండు మూడు రోజుల్లో అటుగా వెళ్ళినప్పుడు డ‌బ్బులు తిరిగి ఇచ్చేస్తున్నారు. ఇదీ నా దేశ శ‌క్తి. అందులో సేవాభావం, త్యాగ భావం, నిజాయతీ లు ఇమిడి ఉన్నాయి.

నేను ఎన్నిక‌ల‌ప్పుడు చాయ్ తాగుతూ చ‌ర్చ‌లు జ‌రిపే వాడిని. ఈ సంగ‌తి ప్ర‌పంచమంతా వ్యాపించింది. ప్ర‌పంచంలోని అనేక దేశాల ప్ర‌జ‌లు ‘చాయ్ తాగుతూ చ‌ర్చ’ అనే మాట‌లు ప‌ల‌క‌డం నేర్చుకున్నారు. కానీ చాయ్ తాగుతూ చేసే చ‌ర్చ‌ల ద్వారా పెళ్ళిళ్ళు కూడా జ‌రుగుతాయ‌ని నాకు తెలియ‌దు. న‌వంబ‌ర్ 17న సూర‌త్ లో ఒక అమ్మాయి వారింటికి పెళ్ళికి వ‌చ్చిన వారంద‌రికీ చాయ్ మాత్ర‌మే తాగించింది. వేరే విందు కార్య‌క్ర‌మాలు ఏమీ చేయ‌లేదు. ఎందుకంటే నోట్ల ర‌ద్దు వ‌ల్ల కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదుర‌య్యాయి. పెళ్ళివారంద‌రూ కూడా దానిని అంతే గౌర‌వ‌పూర్వ‌కంగా స్వీక‌రించారు. సూర‌త్ లోని భ‌ర‌త్ మారు, ద‌క్షా ప‌ర్మార్ లు – అవినీతికి, న‌ల్ల‌ధ‌నానికి వ్య‌తిరేకంగా జ‌రుగుతున్న పోరాటానికి వాళ్ళు త‌మ పెళ్ళి ద్వారా మ‌ద్ద‌తును తెల‌ప‌డం ఒక స్వ‌యం ప్రేర‌ణాత్మ‌క‌మైన విష‌యం. ఈ నూత‌న వ‌ధూవ‌రుల‌కు నేను మన:పూర్వక ఆశీర్వాదం అందజేస్తున్నాను. ఈ మ‌హాయ‌జ్ఞంలో త‌మ పెళ్ళిని కూడా ఒక భాగంగా చేసి అవ‌కాశంగా మార్చుకున్నందుకు చాలా అభినంద‌న‌లు తెలుపుతున్నాను.

నేను ఒక‌సారి రాత్రి ఆల‌స్యంగా వ‌చ్చిన‌పుడు టీవీలో వార్త‌ల్లో చూశాను.. అస్సాంలోని ధేకియాజులీ అనే ఒక చిన్న గ్రామం ఉంది. అక్క‌డ తేయాకు తోట ప‌నివారు ఉంటారు. వాళ్ళ ప‌నికి వారాంతంలో డ‌బ్బులు ఇస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళ‌కి 2000 రూపాయ‌ల నోటు ఇవ్వ‌గానే వాళ్ళు ఏం చేశారంటే, ఇరుగు పొరుగున ఉన్న న‌లుగురు మ‌హిళ‌ల‌ను క‌లుపుకొని కొనుగోళ్లు జరిపి 2000 రూపాయ‌ల నోటు ఇచ్చారు. అందువ‌ల్ల వాళ్ళ‌కి చిల్ల‌ర నోట్ల అవ‌స‌ర‌మే ప‌డ‌లేదు. ఎందుకంటే, న‌లుగురు క‌లిసి కొనుక్కుని మ‌ళ్ళీ వారం క‌లుసుకున్న‌ప్పుడు ఖ‌ర్చు తాలూకూ లెక్క చేసుకోవ‌చ్చు అని నిర్ణ‌యించుకొన్నారు. ఈ విధంగా ప్ర‌జ‌లు తామే మార్గాలు వెతుక్కుంటున్నారు. ఈ మార్పును కూడా మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు. ప్ర‌భుత్వానికి ఒక సందేశం వ‌చ్చింది. అందులో టీ తోట‌ల్లో ప‌నిచేసే శ్రామికులు త‌మ‌కు ఎటిఎమ్ కావాల‌ని కోరారు. గ్రామాల్లో కూడా ఎటువంటి మార్పులు వ‌స్తున్నాయో చూడండి. ఈ ప్ర‌చారం వ‌ల్ల కొంద‌రు వ్య‌క్తుల‌కు తాత్కాలిక లాభం క‌లిగింది. రాబోయే రోజుల్లో దేశానికి కూడా లాభం చేకూరుతుంది. ఈ నోట్ల ర‌ద్దు ఫ‌లితం ఎలా ఉంద‌ని నేను అడిగిన‌ప్పుడు, చిన్న చిన్న ప‌ట్ట‌ణాల్లో నుండి కొంత‌ స‌మాచారం ల‌భించింది. దాదాపు 45, 50 ప‌ట్ట‌ణాల నుండి నాకు వ‌చ్చిన స‌మాచారం ప్ర‌కారం, ఎన్నాళ్ళుగానో వ‌సూలు కాని పాత బాకీ డ‌బ్బు, ప‌న్నులు, మంచినీటి ప‌న్ను, క‌రెంటు బిల్లుల బ‌కాయిలు వ‌సూల‌య్యాయి. మీకు బాగా తెలుసు- పేద ప్ర‌జ‌లు ఎప్పుడూ 2-3 రోజులు ముందుగానే వారి బకాయిలను తీర్చివేసే అల‌వాటు ఉన్న‌వారు. బాగా పెద్ద చేతులు ఉన్న పెద్ద మ‌నుషులు అనే వాళ్ళే, ఎవ‌రూ అడిగే వారుండ‌ర‌న్న ధీమాతో డ‌బ్బులు ఎగ‌వేస్తారు. అందువ‌ల్ల వారిది చాలా బాకీ ఉండిపోయేది. ప్రతి న‌గ‌ర‌పాల‌క సంస్థ‌కూ అతి క‌ష్టం మీద 50 శాతం ప‌న్నులు మాత్ర‌మే వ‌సూల‌య్యేవి. కానీ, ఈసారి 8వ తేదీ నిర్ణ‌యం త‌రువాత అంద‌రూ వారి వారి త‌మ పాత నోట్ల‌ను జ‌మ చేయ‌డానికి ప‌రుగులు పెట్టారు. 47 ప‌ట్ట‌ణాల లెక్క‌ల్లో కింద‌టి ఏడాది దాదాపు మూడు వేల కోట్ల రూపాయల నుండి మూడున్న‌ర వేల కోట్ల రూపాయ‌ల ప‌న్ను వ‌సూల‌యింది. అలాంటిది.. ఈ ఒక్క వారంలో వాళ్ళ‌కి 13 వేల కోట్ల రూపాయ‌ల ప‌న్ను వ‌సూలైంద‌ని విని మీరు ఆశ్చ‌ర్య‌పోతారు, ఆనందిస్తారు కూడా. ఎక్క‌డ మూడు, మూడున్న‌ర వేలు? ఎక్క‌డ 13 వేల కోట్లు? అది కూడా నేరుగా వ‌చ్చింది. ఇప్పుడా న‌గ‌ర‌పాల‌క సంస్థ‌ల‌కు నాలుగు రెట్లు డ‌బ్బులు రావ‌డం వ‌ల్ల మురికివాడ‌ల్లో మురుగు కాల్వ‌ల వ్య‌వ‌స్థ‌, మంచినీటి స‌దుపాయాలు, అంగ‌న్ వాడీల వ్య‌వ‌స్థ ఏర్ప‌డుతుంద‌న‌డంలో సందేహం లేదు. న‌గ‌ర‌పాల‌క సంస్థ‌ల‌కు ఎన్నో ర‌కాలైన లాభాలు ప్ర‌త్య‌క్షంగా క‌న‌బ‌డుతూ ఉన్నాయ‌న‌డానికి ఇలాంటి ఎన్నో ఉదాహ‌ర‌ణ‌లు ల‌భిస్తున్నాయి.

సోదర సోదరీమణులారా..

మ‌న గ్రామాలు, రైతులు మ‌న దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు మూల స్తంభాలు. ఒక‌వైపున ఆర్థిక‌ వ్య‌వ‌స్థ‌లో వ‌స్తున్న కొత్త మార్పుల కార‌ణంగా, క‌ష్టాల మ‌ధ్య‌ ప్ర‌తి పౌరుడు త‌మ‌కు తాము స‌ర్దుకుపోతున్నారు. కానీ, ఇవాళ నేను నా దేశ రైతుల‌కు ప్ర‌త్యేక‌మైన ధ‌న్య‌వాదాల‌ను తెల‌పాల‌నుకుంటున్నాను. ఇప్పుడు విత్తిన పంట గ‌ణాంకాల‌ను స‌మీక‌రిస్తున్నాను. గోధుమ‌లైనా, ధాన్య‌మైనా, నూనె గింజ‌లైనా, న‌వంబ‌రు 20వ తేదీ దాకా వీటిపై నా ద‌గ్గ‌ర లెక్క ఉంది; కింద‌టి ఏడాది క‌న్నా ఈసారి చాలా ఎక్కుగా పంట దిగుబ‌డి పెరిగింద‌ని చెప్ప‌డానికి చాలా సంతోషిస్తున్నాను. ఎన్నో క‌ష్టాల మ‌ధ్య‌ రైతులు మార్గాలు వెతుక్కున్నారు. ప్ర‌భుత్వం కూడా రైతుల‌కూ, గ్రామాల‌కు ప్రాధాన్యం అందించే విధంగా ఎన్నో ముఖ్య‌మైన నిర్ణ‌యాలు తీసుకుంది. అయినా కూడా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. కానీ, మ‌న ప్ర‌తి క‌ష్టాన్నీ, ప్రకృతి విపత్తులను కూడా అధిగ‌మిస్తూ ఎప్పుడూ ధైర్యంగా నిల‌బడే మ‌న రైతు ఇప్పుడు కూడా అలానే ధైర్యంగా నిల‌బ‌డ‌తాడ‌ని నాకు న‌మ్మ‌కం ఉంది.

మ‌న దేశంలోని చిన్న వ్యాపారులు ఉద్యోగాలు ఇస్తారు. ఆర్థిక కార్య‌క‌లాపాల‌ను కూడా ముందుకు న‌డిపిస్తారు. పెద్ద పెద్ద మాల్స్ వలె గ్రామాల్లోని చిన్న చిన్న దుకాణాల వారు కూడా 24 గంట‌లు వాళ్ళ వ్యాపారాన్ని చేసుకోవ‌చ్చున‌నీ, ఏ చ‌ట్ట‌మూ వారిని ఆప‌ద‌నే ఒక ముఖ్య‌మైన నిర్ణ‌యాన్ని కింద‌టి బ‌డ్జెట్టులో మేము తీసుకున్నాము. ఎందుకంటే నా అభిప్రాయం ప్ర‌కారం, పెద్ద పెద్ద మాల్స్ 24 గంట‌లు వ్యాపారం చేసుకుంటున్న‌ప్పుడు, గ్రామాల్లోని చిన్న‌పాటి పేద దుకాణదారుకు అదే అవ‌కాశం ఎందుకు ల‌భించ‌కూడ‌దు? ‘ముద్ర యోజ‌న’ ద్వారా వాళ్ల‌కు రుణం ఇవ్వ‌డానికి అనేక చ‌ర్య‌లు మొద‌లుపెట్టాము. ల‌క్ష‌ల‌, కోట్ల రూపాయ‌లు ‘ముద్ర యోజ‌న’ ద్వారా అటువంటి చిన్న చిన్న వ్యాపారస్తులకు రుణాలుగా ఇచ్చాము. ఎందుకంటే ఈ చిన్న వ్యాపార‌మే కోట్ల రూపంలో ప్ర‌జ‌లు చేస్తుంటారు. వంద‌ల వేల కోట్ల రూపాయ‌ల వ్యాపారాన్ని వారు న‌డిపిస్తారు. కానీ ఈ నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం వ‌ల్ల వారికి కూడా కొంత ఇబ్బందులు ఎదుర‌వ‌డం స‌హ‌జ‌మే. కానీ, నేను గ‌మ‌నించిందేమిటంటే, టెక్నాల‌జీ ద్వారా, మొబైల్ యాప్ ద్వారా, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా, క్రెడిట్ కార్డు ద్వారా న‌మ్మ‌కం ఆధారంగా కూడా ఈ చిన్న చిన్న వ్యాపారులు వారి వారి ప‌ధ్ధ‌తుల‌లో వినియోగ‌దారుల‌కు సేవ‌ల‌ను అందిస్తున్నారు. ఇదే అవ‌కాశంగా, మీరంద‌రూ కూడా డిజిట‌ల్ ప్రపంచంలోకి అడుగుపెట్టాల‌ని మ‌న చిన్న వ్యాపార సోద‌ర సోద‌రీమ‌ణులంద‌రినీ నేను కోరుతున్నాను. మీరు కూడా మీ మొబైల్ ఫోన్ లలో బ్యాంకుల యాప్ లు డౌన్ లోడ్ చేసుకోండి. మీరు కూడా క్రెడిట్ కార్డుల పిఒఎస్ మెషిన్ ను మీ వ‌ద్ద ఉంచుకోండి. మీరు కూడా నోటు లేకుండా వ్యాపారం ఎలా చేయ‌వ‌చ్చునో తెలుసుకోండి. మీరు చూడండి, పెద్ద పెద్ద మాల్స్ టెక్నాల‌జీ మాధ్యమం ద్వారా వాటి వ్యాపారాల‌ను ఎలా పెంపొందించుకొంటాయో, అలాగే ఒక చిన్న వ్యాపారి కూడా ఈ సాధార‌ణ వినియోగ‌దారుల‌కు అనుకూల‌మైన టెక్నాల‌జీ ద్వారా త‌న వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవ‌చ్చు. ఇందువ‌ల్ల అభివృద్ధికి అవ‌కాశ‌మే త‌ప్ప వ్యాపారం దెబ్బ‌తినే ప్ర‌శ్నే లేదు. న‌గ‌దు ర‌హిత స‌మాజాన్ని త‌యారు చేయ‌డానికి మీరు ముఖ్య‌మైన పాత్ర వ‌హించ‌గ‌ల‌ర‌నే న‌మ్మ‌కంతో నేను మిమ్మ‌ల్ని ఆహ్వానిస్తున్నాను. మీ వ్యాపారాన్ని పెంచుకోవ‌డానికి మొబైల్ ఫోన్ లో మొత్తం బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేయ‌గ‌ల‌ర‌ని భావిస్తున్నాను. ఇవాళ వ్యాపారం న‌డ‌ప‌డానికి నోటు ర‌హిత అనేక మార్గాలు ఉన్నాయి. సాంకేతికప‌ర‌మైన దారులు ఉన్నాయి. అవి క్షేమ‌క‌ర‌మైన‌వి, సుర‌క్షిత‌మైన‌వి, వేగ‌వంత‌మైన‌వి. ఈ ప్ర‌య‌త్నాన్ని విజ‌య‌వంతం చేయ‌డానికి మీరు మ‌ద్ద‌తు ఇవ్వాల్సి ఉంద‌ని నేను కోరుకుంటున్నాను. ఇంతే కాదు, మార్పునకు మీరు నాయకత్వం వ‌హించాలి. ఇంతే కాదు, మార్పునకు మీరు నాయకత్వం వ‌హించాలి. అది మీరు చేయ‌గ‌ల‌ర‌ని నాకు న‌మ్మ‌కం ఉంది. మీరు మొత్తం గ్రామంలో ఈ టెక్నాల‌జీ ఆధారంగా వ్యాపారం చేసుకోవ‌చ్చ‌ని నేను న‌మ్ముతున్నాను.

మీరెంతో దోపిడీకి గుర‌య్యార‌ని శ్రామిక సోద‌ర సోద‌రీమ‌ణులు అంద‌రికీ నేను చెప్ప‌ద‌లుచుకున్నాను. కాగితంపై ఒక జీతం క‌న‌బ‌డుతుంది. చేతికి అందే జీతం మ‌రొక‌టి ఉంటుంది. ఎప్పుడైనా జీతం పూర్తిగా దొరికితే బ‌య‌ట నిల‌బ‌డి ఉన్న‌ వాడికి ఎంతో కొంత ఇవ్వ‌వ‌ల‌సి ఉంటుంది. శ్రామికుల‌కు ఈ దోపిడి వారి జీవ‌నంలో ఒక త‌ప్ప‌నిస‌రి భాగంగా అయిపోయింది. ఈ కొత్త వ్య‌వ‌స్థ ద్వారా మీకు కూడా బ్యాంకులో ఖాతా ఉండాల‌ని, మీ జీతం డ‌బ్బు మీ ఖాతాలో జ‌మ కావాల‌ని, త‌ద్వారా క‌నీస వేత‌నాలు మీకు అందాల‌ని కోరుకుంటున్నాను. ఏ క‌త్తిరింపులు లేకుండా మీ పూర్తి జీతం మీకు అందాలి. మీరు దోపిడీకి గురి కాకూడ‌దు. ఒకసారి మీ బ్యాంకు ఖాతాలోకి డ‌బ్బు రాగానే మీరు కూడా స్మార్ట్ ఫోన్ అవ‌స‌రం లేకుండా మీ చిన్న మొబైల్ ఫోన్ లోనే లావాదేవీలు జ‌రుపుకోవ‌చ్చు. ఇవాళ్టి రోజున మీ మొబైల్ ఫోన్ కూడా ఇ-ప‌ర్స్ రూపంలో ప‌ని చేస్తుంది. ఇరుగు పొరుగున ఉన్న చిన్న‌పాటి దుకాణాల్లో కొనుగోళ్ళు జ‌రుపుకోవ‌చ్చు. ఫోను ద్వారానే పైకాన్ని చెల్లించ‌వ‌చ్చు.

అందుక‌నే శ్రామిక సోద‌ర సోద‌రీమ‌ణులంద‌రినీ ఈ ప్ర‌ణాళిక‌లో భాగ‌స్వాముల‌ను చేయాల‌ని విశేషంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే, చివ‌రిగా ఇంత పెద్ద నిర్ణ‌యాన్ని నేను దేశంలోని పేద ప్ర‌జ‌ల కోసం, రైతుల కోసం, శ్రామికుల కోసం, వంచిత‌ుల కోసం, పీడితుల కోసం, వాళ్ళ హ‌క్కు వారికి అంద‌డం కోస‌మే తీసుకున్నాను. ఇవాళ నేను ముఖ్యంగా యువ మిత్రుల‌తో మాట్లాడాల‌నుకుంటున్నాను. భార‌తదేశ జ‌నాభాలో 65 శాతం జ‌నాభా 35 ఏళ్ళ లోపు వ‌య‌స్సు వారేన‌ని మ‌నం ప్ర‌పంచానికి గొప్ప‌గా చెప్పుకొంటాము. నా దేశ యువ‌తీయువ‌కులారా.. నా నిర్ణ‌యం మీకు న‌చ్చింద‌ని నాకు తెలుసు. మీరంతా ఈ నిర్ణ‌యాన్ని స‌మ‌ర్ధిస్తున్నార‌ని కూడా నేనెరుగుదును. ప్ర‌యోజ‌న‌క‌ర‌మైన ఈ విష‌యాన్ని ముందుకు తీసుకువెళ్ళ‌డానికి మీరంతా స‌హ‌క‌రిస్తార‌ని కూడా నాకు ఎరుకే. అయితే మిత్రులారా.. మీరే నా నిజ‌మైన నేస్తాలు. త‌ల్లి భార‌తికి సేవ చేసుకునే ఒక అద్భుత‌మైన అవ‌కాశం మ‌న‌కు అంద‌రికీ వ‌చ్చింది.

దేశాన్ని ఆర్థిక‌ప‌రంగా ఉన్న‌త శిఖ‌రాల‌కు తీసుకువెళ్ళ‌గ‌లిగే అవ‌కాశం మ‌న‌కు ల‌భించింది. నా యువ‌తీయువ‌కులారా, మీరు నాకు సాయం చేయ‌గ‌ల‌రా? ఇది ఇంత‌టితో పూర్తయ్యే విష‌యం కాదు. నాకు తోడుగా నిలుస్తారా? ఇవాళ మీకున్న ప్ర‌పంచానుభ‌వం పాత త‌రానికి లేదు. మీ కుటుంబంలో పెద్ద‌న్న‌కు కూడా మీకున్న ప్ర‌పంచ జ్ఞానం తెలిసి ఉండ‌క‌పోవ‌చ్చు. అమ్మ‌, నాన్న‌, పిన్ని, బాబాయి, అత్త‌, మామ‌ల‌కు కూడా లేక‌పోవ‌చ్చు. ‘యాప్’ అంటే ఏమిటో మీకు తెలుసు. ‘ఆన్ లైన్ బ్యాంకింగ్’ ఏమిటో మీకు తెలుసు. ‘ఆన్ లైన్ టికెట్ బుకింగ్’ ఎలా చేస్తారో మీకు తెలుసు. మీకు ఇవ‌న్నీ చాలా సాధార‌ణ విష‌యాలు. మీరు ఉపయోగించ‌గ‌ల‌రు కూడా. కానీ, ఇవాళ దేశం ‘న‌గదుకు తావులేని స‌మాజం’ అనే ఒక గొప్ప కార్య‌క్ర‌మాన్ని త‌ల‌పెట్టింది. అదే మ‌న స్వ‌ప్నం. నూటికి నూరు పాళ్ళు న‌గ‌దు ర‌హిత స‌మాజం సంభ‌వం కాద‌ని మ‌న‌కు తెలుసు. అందుక‌ని ‘త‌క్కువ న‌గ‌దు స‌మాజం’ దిశ‌గా భార‌త‌దేశం ఎందుకు అడుగు వేయ‌కూడ‌దు? ఒక‌సారి ఇవాళ మ‌నం ‘త‌క్కువ న‌గ‌దు స‌మాజం’ దిశ‌గా అడుగు వేస్తే, ఇక న‌గ‌దు ర‌హిత స‌మాజం అనే గ‌మ్యం ఎంతో దూరం లేదు. అందుకోసం నాకు మీ స‌హాయం కావాలి. మీ స‌మ‌యం కావాలి. మీ సంక‌ల్పం కావాలి. మీరు న‌న్ను ఎప్పుడూ నిరాశ‌ప‌ర‌చ‌ర‌ని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే మ‌న‌మంద‌ర‌మూ భార‌త‌దేశ పేద ప్ర‌జ‌ల జీవితాల్లో మార్పు రావాల‌ని కోరుకునే వాళ్ళ‌మే. న‌గ‌దు ర‌హిత స‌మాజం కోసం, డిజిట‌ల్ బ్యాంకింగ్ కోసం, లేదా మొబైల్ బ్యాంకింగ్ కోసం ఎన్ని అవ‌కాశాలు ఉన్నాయో మీకు తెలుసు. ప్ర‌తి బ్యాంకు ఆన్ లైన్ స‌దుపాయం క‌ల్పిస్తుంది. భార‌తేద‌శంలో ప్ర‌తి బ్యాంకుకు వారి ‘మొబైల్ యాప్’ అంటూ ఉంది. ప్ర‌తి బ్యాంక్ కు వాళ్ళ వాలెట్ అంటూ ఉంది. వాలెట్ అంటే ఇ-ప‌ర్స్ అని సాధార‌ణ అర్థం. ర‌క‌ ర‌కాల కార్డులు కూడా ల‌భిస్తున్నాయి. జ‌న్ ధ‌న్ ప‌థ‌కం ద్వారా భార‌త‌దేశంలోని కోట్లాది పేద కుటుంబాల ద‌గ్గ‌ర రూపే కార్డులు ఉన్నాయి. ఇంకా 8వ తేదీకి ముందు రూపే కార్డ్ ఉప‌యోగం బాగా త‌క్కువ‌గా ఉండేది. ఇప్పుడు పేద‌లు రూపే కార్డ్ వాడ‌డం మొద‌లుపెట్టారు. అందులో ద‌గ్గ‌ర ద‌గ్గ‌ర‌గా 300 శాతం అభివృద్ధి జ‌రిగింది. మొబైల్ ఫోన్ లో ప్రీపెయిడ్ కార్డు ఉన్న‌ట్లే, బ్యాంకులో కూడా డ‌బ్బు ఖ‌ర్చుపెట్ట‌డానికి ప్రీపెయిడ్ కార్డు దొరుకుతుంది. వ్యాపారం చేయ‌డానికి ఒక యుపిఐ చాలా ఉపయోగకరమైన వేదిక. దీనితో కొనుగోలు చేయ‌వ‌చ్చు, డ‌బ్బు పంప‌వ‌చ్చు, డ‌బ్బు తీసుకోవ‌చ్చు కూడా. ఈ ప‌ని మీరు వాట్స‌ప్ (WhatsApp) మెసేజ్ లు పంపినంత తేలిక‌.

చ‌దువు రాని వ్య‌క్తికి కూడా ఈ రోజున వాట్స‌ప్ చేయ‌డం, మెసేజ్ పంప‌డం, ఫార్వ‌ర్డ్ చేయ‌డం వ‌చ్చు. ఇంతేకాక టెక్నాల‌జీ ఇవాళ ఎంత సుల‌భ‌మైందంటే ఈ ప‌నికోసం పెద్ద స్మార్ట్ ఫోను అవ‌స‌రం కూడా లేదు. మామూలు చిన్న‌పాటి సాధార‌ణ సౌక‌ర్యాలు ఉన్న ఫోను ద్వారా కూడా న‌గ‌దు బ‌దిలీ అవుతుంది. బ‌ట్ట‌లు ఉతికేవార‌యినా, కూర‌గాయ‌ల వ్యాపారి అయినా, పాల వ్యాపారి అయినా, వార్తా ప‌త్రిక‌లు అమ్మే వారైనా, చాయ్ అమ్మే వారైనా, శ‌న‌గ‌లు అమ్మే వారైనా, ఎవ‌రైనా స‌రే దీనిని సుల‌భంగా ఉప‌యోగించుకోచ్చు. ఈ వ్య‌వ‌స్థ‌ను ఇంకా సుల‌భ‌త‌రం చేయ‌డానికి నేను గ‌ట్టి ప్ర‌య‌త్నం చేస్తున్నాను. అన్ని బ్యాంకులు ఈ ప‌నిని మొద‌లుపెట్టాయి. ఇదే ప‌ని చేస్తున్నాయి. ఇప్పుడు ఆన్ లైన్ స‌ర్ చార్జ్ ను కూడా ర‌ద్దు చేశాము. గ‌త రెండు మూడు రోజులుగా వార్తా ప‌త్రిక‌ల‌లో మీరు చూసే ఉంటారు; న‌గ‌దు ర‌హిత స‌మాజ ఉద్య‌మానికి బ‌లం చేకూరాల‌నే ఉద్దేశంతో ఇలాంటి కార్డుప‌ర‌మైన ఇత‌ర ఖ‌ర్చుల‌ను కూడా మేము ర‌ద్దు చేశాము.

ఓ నా యువ మిత్రులారా… ఇదంతా జ‌రుగుతున్నా కూడా, ఇవ‌న్నీ ఏమీ తెలియ‌కుండా ఉన్న ఒక త‌రం ఉంది. మీరంతా ఈ గొప్ప కార్య‌క్ర‌మంలో పాలుపంచుకుంటున్నార‌ని నాకు బాగా తెలుసు. వాట్స‌ప్ లో మీరు ఇచ్చే సృజ‌నాత్మ‌క సందేశాలు – నినాదాలు, క‌విత‌లు, క‌థ‌లు, కార్టూన్లు, కొత్త కొత్త ఆలోచ‌న‌లు, హాస్యం- అంతా నేను చూస్తున్నాను. ఈ స‌వాళ్ళ మ‌ధ్య మ‌న యువ‌త‌రం సృజ‌నాత్మ‌క శ‌క్తిని చూస్తుంటే నాకేమ‌నిపిస్తోందంటే, ఒక‌ప్పుడు యుద్ధ మైదానంలో భ‌గ‌వ‌ద్గీత జ‌న్మించింది. అలానే ఇవాళ ఇంత‌టి మార్పులు జ‌రుగుతున్న కాలంలో మ‌నం ప్ర‌యాణిస్తున్న‌ప్పుడు కూడా మీలోని మౌలిక‌మైన సృజ‌నాత్మ‌క ప్ర‌క‌టిత‌మ‌వుతోంది. కానీ, ప్రియ‌మైన నా యువ మిత్రులారా.. ఈ ప‌నిలో నాకు మీ స‌హాయం కావాలి. మీరంతా ముఖ్యంగా కోట్లాది యువ‌తరం నాకు ఈ స‌హాయం చేస్తార‌ని నాకు న‌మ్మ‌కం ఉంది. మీరొక ప‌ని చేయండి.. స్వ‌యంగా న‌గ‌దు ర‌హిత స‌మాజ నిర్మాణంలో భాగ‌మ‌వుతామ‌ని ఈ రోజే సంక‌ల్పించండి.

మీ మొబైల్ ఫోన్ లో ఆన్ లైన్ సౌక‌ర్యాన్ని ఉప‌యోగించుకోవ‌డానికి సాంకేతిక ప‌రిజ్ఞానం ల‌భిస్తుంది. అంతే కాదు ప్ర‌తి రోజూ గంట‌, రెండు గంట‌లు కేటాయించి సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని ఏ విధంగా ఉప‌యోగించాలి, త‌మ బ్యాంకు యాప్ ను ఏ విధంగా డౌన్ లోడ్ చేయాలి? మీ ఖాతాలో ఉన్న డ‌బ్బును ఏ విధంగా ఖ‌ర్చు చేయాలి? దుకాణ‌దారుకు ఏ విధంగా చెల్లించాలి? దుకాణ‌దారు కూడా టెక్నాల‌జీ ద్వారా ఏ విధంగా వ్యాపారం చేయ‌వ‌చ్చున‌నే విష‌యంలో శిక్ష‌ణ ఇవ్వండి. న‌గ‌దురహిత స‌మాజానికై, నోట్ల తిప్ప‌లు త‌ప్పించే కార్య‌క్ర‌మం కోస‌మై, దేశంలో అవినీతిని అంత‌మొందించే కార్య‌క్ర‌మం కోసం, న‌ల్ల‌ధ‌నం నుండి విముక్తిని క‌ల్పించే కార్య‌క్ర‌మం కోసం, ప్ర‌జ‌ల‌కు క‌ష్ట‌న‌ష్టాలు లేకుండా చేసే కార్య‌క్ర‌మం కోసం మీరు నాయ‌క‌త్వం వ‌హించాలి. పేద‌ల‌కు ఒక‌సారి రూపే కార్డ్ ఉప‌యోగించే విధానాన్ని నేర్పారంటే, వారి ఆశీర్వాదాలు మీకు ల‌భిస్తాయి.

ఈ వ్య‌వ‌స్థ‌ను గురించి సామాన్యుల‌కు నేర్పిస్తే వారికి చింత‌ల నుండి ముక్తి ల‌భిస్తుంది. ఈ ప‌నిని దేశంలోని యువ‌తీ యువ‌కులంద‌రూ చేయాలి. దీనికి ఎక్కువ స‌మ‌యం కూడా ప‌ట్ట‌దు. నెల రోజుల లోపు ప్ర‌పంచంలోని ఒక నూత‌న ఆధునిక భార‌త‌దేశంగా మ‌నం నిల‌బ‌డ‌గ‌లుగుతాము. ఈ ప‌నిని మీరు మొబైల్ ఫోన్ ద్వారా చేయ‌గ‌ల‌రు. రోజుకు పది ఇళ్ళ‌కు వెళ్ళి ఈ ప‌ని చేయ‌ండి. ఆ ప‌ది ఇళ్ళ‌కు అనుసంధానం ఏర్ప‌ర‌చ‌ండి. మిమ్మ‌ల్నంద‌రినీ ఆహ్వానిస్తున్నాను నేను. రండి. ఊరికే స‌మ‌ర్ధించ‌డం కాదు. ఈ ప‌రివ‌ర్త‌న‌కు ఒక సేనానిగా మారితే మార్పు తీసుకొచ్చి తీరగలుగుతాము.

దేశాన్ని అవినీతి బారి నుండి, న‌ల్ల‌ధ‌నం బారి నుండి విముక్తం చేసే ఈ యుద్ధాన్ని మ‌నం ముందుకు తీసుకెళ‌దాం. ప్ర‌జాజీవితంలో న‌వ‌ యువ‌త మార్పును తీసుకువ‌చ్చిన దేశాలు ప్ర‌పంచంలో అనేకం ఉన్నాయి. యువ‌తే మార్పు తీసుకువ‌స్తుంది. యువ‌త వ‌ల్లే విప్ల‌వం వ‌స్తుంది. ఈ విష‌యాన్ని అంగీక‌రించ‌వ‌ల‌సిందే. కెన్యాలో ఇటువంటి మార్పునే యువ‌త తీసుకువ‌చ్చింది. ఎమ్‌-పాస్ లో ఇలాంటి మొబైల్ వ్య‌వ‌స్థ‌ను అభివృద్ధిప‌రిచింది. సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని ఉప‌యోగించింది. ఈనాడు ఆఫ్రికాలోని ఈ ప్రాంతంలో కెన్యా పూర్తిగా అన్ని వ్య‌వ‌హారాల‌కు సాంకేతిక ప‌రిజ్ఞానం వినియోగించే దిశ‌గా మార్పు చెందింది. ఈ విధంగా ఈ దేశం గొప్ప విప్ల‌వాన్ని తెచ్చింది.

నా యువ‌తీ యువ‌కులారా…. ఈ కృషిని మ‌రింత ముందుకు తీసుకువెళ్లాల‌ని మిమ్మ‌ల్ని మ‌రీ మ‌రీ కోరుతున్నాను. ప్ర‌తి పాఠ‌శాల‌, విశ్వ‌విద్యాల‌యం, ఎన్ సి సి, ఎన్ ఎస్ ఎస్ – వ్యష్టిగాను, స‌మ‌ష్ఠిగాను ఈ కృషిలో పాలుపంచుకోవాల‌ంటూ మిమ్మ‌ల్ని నేను ఆహ్వానిస్తున్నాను. మ‌న‌కు దేశ సేవ చేసే ఉత్త‌మ త‌రుణం వ‌చ్చింది. ఈ అవ‌కాశాన్ని జార‌విడుచుకోకుండా ప‌ని చేద్దాము.

ప్రియ‌మైన సోద‌ర‌ సోద‌రీమ‌ణులారా.. మ‌న దేశానికంత‌టికీ మ‌హాక‌వి అయిన శ్రీమాన్ హ‌రివంశ్ రాయ్ బ‌చ్చ‌న్‌ గారి జ‌యంతిని ఈనాడు జ‌రుపుకుంటున్నాం. హ‌రివంశ‌రాయ్ బ‌చ్చ‌న్ గారి జ‌యంతి సంద‌ర్భంగా శ్రీమాన్ అమితాబ్ బచ్చ‌న్ “స్వ‌చ్ఛ‌తా అభియాన్” కోసం ఒక నినాదం ఇచ్చారు. ఈ శ‌తాబ్దంలోనే అత్యున్న‌తమైన ప్ర‌జాభిమానాన్ని చూర‌గొన్న అమితాబ్ గారు స్వ‌చ్ఛ‌త కార్య‌క్ర‌మాన్ని ఎంతో మ‌న‌సుపెట్టి కొన‌సాగిస్తున్నార‌ని మీకు తెలుసు. వారి తండ్రి జ‌యంతి నాడు కూడా స్వ‌చ్ఛ‌త కార్య‌క్ర‌మానికే ప్రాధాన్యం ఇవ్వ‌డం చూస్తుంటే.. ఈ కార్య‌క్ర‌మం వారి న‌ర‌న‌రాన ఎంత‌గా స్థానం సంపాదించుకుందో మ‌న‌కు అర్థ‌మ‌వుతుంది. వారు హ‌రివంశ‌రాయ్ గారి ఒక క‌విత‌ లోని పంక్తిని రాశారు. “మ‌ట్టి దేహం, ఆనంద‌మ‌య‌మైన మ‌న‌స్సు, క్ష‌ణ‌భంగుర‌మైన జీవితం – నా ప‌రిచ‌యం” అన్నారు. ఈ పంక్తి ద్వారా హ‌రివంశ‌రాయ్ గారు త‌మ‌ను ప‌రిచయం చేసుకునేవారు. అయితే వారి కుమారుడు శ్రీ అమితాబ్ ఆ పంక్తిని స్వ‌చ్ఛ భార‌త్ కు వ‌ర్తింప‌జేస్తూ.. ఈ విధంగా స‌వ‌రించి పంపారు. “స్వ‌చ్ఛ‌మైన త‌నువు, స్వ‌చ్ఛ‌మైన మ‌న‌స్సు, స్వ‌చ్ఛ‌మైన భార‌త్ – నా ప‌రిచ‌యం” హ‌రివంశ‌రాయ్ గారికి ఆద‌ర‌ పూర్వ‌క‌మైన న‌మ‌స్సులు అర్పిస్తున్నాను. స్వ‌చ్ఛ‌త ఉద్యమాన్ని అణువణువున నింపుకున్న అమితాబ్ – తండ్రి క‌విత‌ను మ‌ల‌చి, స్వ‌చ్ఛ‌తా స్ఫూర్తిని వ్యాప్తి చేస్తున్నందుకు అమితాబ్ గారికి కూడా ‘మ‌న్ కీ బాత్’ (మనసులో మాట) ముఖంగా ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాను.

ప్రియమైన నా దేశ వాసులారా… మై గ‌వ్ లో, న‌రేంద్ర మోదీ యాప్ లో సందేశాలు, లేఖ‌ల ద్వారా పంపుతున్న మీ అభిప్రాయాలు, మీ భావాలు – మిమ్మ‌ల్నీ, న‌న్ను క‌లుపుతున్నాయి. వీట‌న్నింటికీ ‘మ‌న్ కీ బాత్’ (మనసులో మాట) వేదిక‌గా నిలుస్తోంది. ఇప్పుడు 11 గంట‌ల‌కు ‘మ‌న్ కీ బాత్’ (మనసులో మాట) ప్ర‌సార‌మ‌వుతోంది. ఇది పూర్త‌యిన వెంట‌నే ప్రాంతీయ భాష‌లలో కూడా ప్ర‌సార‌మ‌వుతుంది. హిందీ భాషను విరివిగా వాడ‌ని ప్రాంతాల్లోని నా దేశ‌వాసుల‌ను కూడా ఈ కార్య‌క్ర‌మంతో అనుసంధానం చేయడానికి ఈ నూత‌న కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టినందుకు ఆకాశ‌వాణికి నేను కృత‌జ్ఞ‌డిని. మీ అంద‌రికీ అనేకానేక ధ‌న్య‌వాదాలు.

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
PLI, Make in India schemes attracting foreign investors to India: CII

Media Coverage

PLI, Make in India schemes attracting foreign investors to India: CII
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...

Prime Minister Shri Narendra Modi paid homage today to Mahatma Gandhi at his statue in the historic Promenade Gardens in Georgetown, Guyana. He recalled Bapu’s eternal values of peace and non-violence which continue to guide humanity. The statue was installed in commemoration of Gandhiji’s 100th birth anniversary in 1969.

Prime Minister also paid floral tribute at the Arya Samaj monument located close by. This monument was unveiled in 2011 in commemoration of 100 years of the Arya Samaj movement in Guyana.