గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ రూపాణి గారు, పండిత దీన్ దయాళ్ పెట్రోలియం విశ్వవిద్యాలయ బోర్డు ఆఫ్ గవర్నర్స్ ఛైర్మన్ శ్రీ ముకేశ్ అంబానీ గారు, స్టాండింగ్ కమిటీ చైర్మన్ శ్రీ రాజగోపాలన్ గారు, డైరెక్టర్ జనరల్ ప్రొ. ఎస్. సుందర్ మనోహర్ గారు, అధ్యాపక బృందం, తల్లిదండ్రులు, నా యువ సహచరులారా..
మీ అందరికీ పండిత దీన్ దయాళ్ పెట్రోలియం విశ్వవిద్యాలయ 8వ స్నాతకోత్సవ అభినందనలు. ఈ రోజున పట్టా అందుకుంటున్నవారందరికీ, వారి తల్లిదండ్రులకీ శుభాభినందనలు. ఈ రోజున దేశానికి మీ రూపంలో పరిశ్రమలో నేరుగా పనిచేయగలిగిన పట్టభద్రులు ( industry ready graduates) అందుబాటులోకి వస్తున్నారు. మీ కృషికి, ఈ విశ్వవిద్యాలయం నుండి మీరు నేర్చుకున్నదానికి మీకు అభినందనలు. దేశ నిర్మాణం(nation building) అనే లక్ష్యాన్ని పెట్టుకొని ఇక్కడనుండి బయలుదేరుతున్నారు. ఆ గమ్యానికి, మీ ఈ నూతన ప్రయాణానికి శుభాకాంక్షలు.
మీరు మీ నైపుణ్యం (skill), ప్రతిభ(talent), వృత్తినిపుణత (professionalism)తో ఆత్మనిర్భర భారత్ కు శక్తిగా మారుతారని నాకు విశ్వాసం ఉంది. ఈ రోజున PDPUతో ముడిపడున్న 5 వివిధ ప్రాజెక్టుల ప్రారంభం, శిలాన్యాసం జరిగింది. ఈ కొత్త వ్యవస్థలు, PDPU, దేశ శక్తి రంగానికే కాక వృత్తి విద్య( professional education), నైపుణ్యాభివృద్ధి , స్టార్ట్ అప్ రంగాలకు ఒక ముఖ్య కేంద్రంగా తయారవుతాయి.
సహచరులారా,
నేను చాలా కాలం నుండి ఈ విశ్వవిద్యాలయ ప్రకల్పాలతో కలిసి ఉన్నాను అందుకని PDPU దేశంలోనే కాక ప్రపంచంలోనే ఒక స్థానాన్ని ఏర్పరుచుకోవడం, తన ముద్ర వేయడం నాకు సంతోషాన్నిచ్చే విషయం. నేను ఈ రోజున ముఖ్య అతిథిగా కాక మీ ఈ మహోన్నత సంకల్ప పరివారంలోని ఒక సభ్యుడిగా మీ మధ్యకు వచ్చాను. ఈ విశ్వవిద్యాలయం అనుకున్నదానికంటే బాగా ముందు ఉండడం నాకు గర్వం కలిగించే విషయం. ఒకప్పుడు ఇలాంటి విశ్వవిద్యాలయం అసలు ముందుకు సాగగలదా ? అనే ప్రశ్నలు వినిపించేవి, కానీ ఇక్కడి విద్యార్థులు, అధ్యాపకులు, ఇక్కడి నుండి ఉత్తీర్ణులైన వృత్తినిపుణులు, వారి కర్తవ్యం ద్వారా వాటన్నింటికీ జవాబు ఇచ్చారు. గత దశాబ్దన్నర కాలంగా PDPU “ పెట్రోలియం” రంగంతో పాటు మొత్తం ఎనర్జీ స్పెక్ట్రమ్ లోని మిగిలిన క్షేత్రాలలో కూడా విస్తరించింది. PDPU ప్రగతి చూసిన తరువాత గుజరాత్ ప్రభుత్వానికి నాదొక సూచన. మొదట్లో పెట్రోలియం విశ్వవిద్యాలయం అనే ఆలోచన మాత్రమే నా మనస్సులో ఉండేది. ఎందుకంటే గుజరాత్ పెట్రోలియం క్షేత్రంలో ముందుకు వెళ్ళడం కోసం అది అవసరం అనిపించింది. కానీ, దేశంతోపాటు ప్రపంచపు అవసరాలు చూసినప్పుడు, అవసరమైతే చట్టసవరణ చేసి దీన్ని పెట్రోలియం విశ్వవిద్యాలయం నుండి ఎనర్జీ విశ్వవిద్యాలయంగా పేరు మార్చమని గుజరాత్ ప్రభుత్వానికి నా సూచన. ఎందుకంటే దీని రూపం , పరిధి చాలా విస్తరించనున్నాయి. మీరందరూ ఇంత తక్కువ సమయంలో సాధించిన దానికి, దేశానికి అందించిన దానికి ఎనర్జీ విశ్వవిద్యాలయం అనేది దేశానికి చాలా ప్రయోజనాకారిగా ఉంటుంది. ఈ పెట్రోలియం విశ్వవిద్యాలయ ఆలోచన నాదే అయినా ఇప్పుడు అదే ఆలోచనని విస్తరించి పెట్రోలియం స్థానంలో పూర్తి శక్తి రంగాన్ని జోడించమని నా సూచన. మీరందరూ దీనిపై ఆలోచన చేయండి. నా ఈ సలహా సరైనదనిపిస్తే దాని ప్రకారం చేయండి. ఇక్కడ స్థాపింపించే 45 మెగావాట్ సోలార్ పానెల్ తయారీ ప్లాంట్ , నీటి సాంకేతికత అభివృద్ధి కేంద్రం PDPU కు దేశం పట్ల ఉన్న దూర దృష్టిని తెలియజేస్తాయి.
సహచరులారా,
మీరు ఈరోజున పరిశ్రమ లోకి అడుగుపెడుతున్న సమయంలో, మహమ్మారి వలన ప్రపంచం మొత్తంలో శక్తి రంగంలో పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇటువంటి పరిస్థితులలో మన దేశంలో శక్తి రంగంలో ఎదుగుదలకు, సంస్థాగత స్ఫూర్తికి, ఉద్యోగాలకు ఎన్నో అవకాశాలున్నాయి. అంటే మీరు సరైన సమయంలో సరైన రంగంలోకి వెళ్తున్నారు. మన దేశంలో కేవలం ఆయిల్ అండ్ గ్యాస్ రంగంలో మాత్రమే లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రానున్నాయి. అందుకని పరిశోధన నుండి తయారీ వరకు మీ అవసరం చాలా ఉంది.
సహచరులారా,
దేశం ఈ రోజున తన కార్బన్ ఫుట్ ప్రింట్ ను 30 నుండి 35 శాతం తగ్గించేందుకు లక్ష్యం పెట్టుకొని ముందుకు సాగుతోంది. ఈ మాట నేను ప్రపంచం ముందుకు తీసుకువెళ్ళినప్పుడు భారత్ ఇది చేయగలదా? అని ప్రపంచం ఆశ్చర్య పోయింది. ఈ దశాబ్దంలో మన శక్తి అవసరాలలో సహజ వాయువు వాటాను 4 రేట్లు పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నాం. మన ఆయిల్ శుద్ధీకరణ సామర్థ్యాన్ని కూడా వచ్చే అయిదేళ్లల్లో రెట్టింపు చేసేందుకు పని చేస్తున్నాం. ఇందులో కూడా మీ అందరికీ ఎన్నో అవకాశాలు ఉన్నాయి. దేశంలో శక్తి రక్షణతో ముడిపడిఉన్న స్టార్టప్ వ్యవస్థను కూడా బలోపేతం చేసేందుకు నిరంతరం పని జరుగుతోంది. ఈ రంగంలో మీ వంటి విద్యార్థులు, వృత్తి నిపుణుల కోసం ఒక ప్రత్యేక ఫండ్ కూడా ఏర్పాటు చేయడమైంది. ఒకవేళ మీ దగ్గర ఏదైనా ఆలోచన ఉన్నా, ఏదైనా వస్తువు ఉన్నా, లేదా ఏదైనా ఆలోచనను పరిశీలించదలుచుకున్నా ఈ ఫండ్ మీకు బాగా ఉపయోగ పడుతుంది. ప్రభుత్వం నుండి ఇది మీకు ఇచ్చే బహుమానం. నేను మీతో మాట్లాడుతున్న ఈ సమయంలో మీలో కొంత చింత ఉన్నదని నాకు అర్ధమవుతోంది. కరోనా సమయం , ఎప్పుడు ఇదంతా సరిపడుతుందో తెలీదు అని ఆలోచిస్తూంటారు కదా. మీ మనస్సులో కలిగే చింత సహజం. ప్రపంచం మొత్తం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పుడు పట్టభద్రులు కావడం సులభమైన విషయమేమీ కాదు. కానీ మీ శక్తి, మీ క్షమత ఈ సవాళ్ళ కంటే ఎన్నో రెట్లు పెద్దవని గుర్తుపెట్టుకోండి. ఎన్నడూ విశ్వాసం కోల్పోవద్దు. ప్రతికూలత ఏమిటని కాదు. మీ లక్ష్యం ఏంటి?, మీ ప్రాధాన్యత ఏమిటి? మీ పథకం ఏమిటి? అనే ఆలోచన ఉండాలి. అందుకని మీ దగ్గర ప్రయోజనం, దాని ప్రాధాన్యత నిర్ణయింపబడడం కోసం చక్కటి పథకం ఉండాలి. ఎందుకంటే మీరు మీ జీవితంలో మొదటి సారి ప్రతికూలతను ఎదుర్కొంటున్నారని ఏమీ లేదు. ఇదే ఆఖరిదనీ కాదు. విజయవంతమైన వ్యక్తులకు సమస్యలు రావనేమీ లేదు, కానీ ఎవరైతే ప్రతికూలతలను స్వీకరిస్తారో, వాటితో పోరాడుతారో, వాటిని అధిగమిస్తారో, సమస్యలకు సమాధానాలు సాధిస్తారో వాళ్ళు జీవితంలో విజయం సాధిస్తారు. ఏ విజయవంతమైన వ్యక్తి నైనా చూడండి , ప్రతి ఒక్కరూ ప్రతికూలతలతో యుద్ధం చేసే ముందుకు సాగారు.
సహచరులారా,
దేశంలోని ప్రతి పౌరుడు ఒక్కసారి వందేళ్ల క్రితం కాలాన్ని గుర్తుచేసుకోవాలని నా విన్నపం. ఇవాళ మనం 2020 లో ఉన్నాం, 1920 లో ఎవరైతే మీ వయసులో ఉన్నారో , ఈ రోజున 2020 లో మీరు అదే వయసులో ఉన్నారు. 1920 లో మీ వయసులో ఉన్నవాళ్ళ కలలు ఏమిటి? 1920 లో మీ వయసులో ఉన్నవాళ్ళ పట్టుదల ఏమిటి, వాళ్ళ ఆలోచన ఏమిటి? వంద ఏళ్ల నాటి చరిత్రని కొద్దిగా తిప్పి చూడండి. 1920లో గడిచిన కాలం మన దేశ స్వాతంత్ర్య పోరాటంలో చాలా మహత్తు కలిగిందని గుర్తుకు వస్తుంది. విదేశిపాలన కాలంలో స్వాతంత్ర్యం కోసం ప్రయత్నించని క్షణమే లేదు, 1857 లోని స్వాతంత్ర్య సంగ్రామం దీన్ని మలుపు తిప్పింది కానీ 1920 నుండి 1947 వరకు గిడిచిన సమయం పూర్తి భిన్నంగా సాగింది. ఈ సమయంలో మనకు ఎన్నో ఘటనలు కనిపిస్తాయి, దేశంలోని ప్రతి ప్రాంతం నుండి, ప్రతి వర్గం నుండి, ప్రతి క్షేత్రం నుండి అంటే దేశం మొత్తంలో ప్రతి పిల్లవాడు, ప్రతి వ్యక్తి , గ్రామాల్లో, నగరాల్లో, చదువుకున్నవారు , ధనవంతులు, పేదవారు, ప్రతి ఒక్కరూ స్వాతంత్ర్య సంగ్రామంలో సైనికులయ్యారు. ప్రజలు ఏకమయ్యారు. తమ జీవితానికి సంబంధించిన కలలను ఆహుతినిచ్చి స్వాతంత్ర్య సాధనకు సంకల్పం తీసుకున్నారు. 1920 నుండి 1947 వరకు ఉన్న యువతరం తమ సర్వస్వాన్ని ఎదురొడ్డడం మనకి కనిపిస్తుంది. ఈ రోజున మనకు ఆ యువతరాన్ని చూస్తే ఈర్ష్య కూడా కలుగుతూంటుంది. అప్పుడప్పుడూ మనస్సులో అనిపిస్తూంటుంది కదా మనం కూడా 1920 నుండి 1947 సమయంలో పుట్టి ఉంటే, భగత్ సింగ్ లాగా ముందుకురికేవారమని. కానీ మిత్రులారా, మనకి ఆ రోజున దేశం కోసం మరణించే అవకాశం దొరకలేదు , కానీ దేశం కోసం జీవించే అవకాశం దొరికింది. ఆ రోజున ప్రతి పౌరుడూ తన సర్వస్వాన్ని అర్పించి కేవలం ఒక లక్ష్యం కోసం పని చేశాడు. ఏమిటా లక్ష్యం? అది భారతదేశ స్వాతంత్ర్యం. పరతంత్రం నుండి తల్లి భారతిని విముక్తం చేయడం. అందులో అనేక ధోరణులున్నాయి, వివిధ భావాల వారు ఉన్నారు , కానీ అన్నీ ఆలోచనలూ ఒకే దిశలో నడిచాయి. మహాత్మా గాంధీ నేతృత్వం కావచ్చు, సుభాష్ చంద్ర బోస్ నాయకత్వం కావచ్చు, భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్ గురుల కార్యం, ధోరణులు వేరు వేరు కావొచ్చు . మార్గాలు వేరై ఉండొచ్చు, కానీ గమ్యం మాత్రం ఒకటే. అదే భరతమాతను విముక్తం చేయడం. కాశ్మీరు నుండి కాలాపానీ వరకు, ప్రతి చెరసాలలో, ప్రతి ఉరికంబం మీద నుండి ఒకే నినాదం వినిపించేది , గోడలు ఒకే మాటతో ప్రతిధ్వనించేవి, ఉరి తాళ్ళు ఒకే నినాదంతో సుశోభితమయ్యేవి, ఇదే నినాదంగా , ఇదే సంకల్పంగా ఉండేది, అదే జీవిత లక్ష్యం అయ్యేది. అదే భారతమాతకు స్వాతంత్ర్యం.

నా ప్రియ నవయువ సహచరులారా,
మనం ఈ రోజున ఆ పరిస్థితులలో లేము కానీ మాతృభూమికి సేవ చేయాల్సిన అవసరం ఈ రోజుకీ అలాగే ఉంది. ఆ రోజున ప్రజలు తమ జీవితాలను స్వాతంత్ర్యం కోసం అర్పిస్తే మనం ఆత్మనిర్భర భారత్ కోసం జీవించడం నేర్చుకోవచ్చు, జీవించి చూపించచ్చు. ఆత్మనిర్భర భారత్ కోసం మనమే ఒక ఉద్యమంగా మారాలి, ఆ ఉద్యమంలో సైనికుడివలే పాల్గొనాలి, ఆ ఉద్యమానికి నేతృత్వం వహించాలి. ఆత్మ నిర్భర భారత్ కోసం ప్రతి భారతీయుడు, ముఖ్యంగా నా యువ సహచరుల నుండి నేను ఆశించేది ఇదే.
ఈరోజున దేశం మారుతోంది. వర్తమానంతో పాటు భవిష్య భారతాన్ని నిర్మించే పెద్ద బాధ్యత మీ మీద ఉంది. ఎటువంటి ముఖ్యమైన కాలంలో ఉన్నారో ఒకసారి ఆలోచించండి. భారతదేశ స్వాతంత్ర్యానికి 2022 లో 75 ఏళ్లు, 2047 లో 100 ఏళ్లు పూర్తవుతాయి. అంటే ఈ 25 ఏళ్లు మీ అందరి జీవితాల్లో అత్యంత ప్రత్యేక సమయం. దేశంతోపాటు మీ అందరి జీవితాల్లో ముఖ్యమైన 25 సంవత్సరాలు ఒకేసారి రానున్నాయి. ఈ అదృష్టం మరెవరికీ దొరికుండదు, మీకు దొరికింది. మీరు గమనించండి, ఎవరికైతే బాధ్యతకలిగి ఉంటారో వాళ్ళే జీవితంలో ఏదైనా సాధిస్తారు, చేసి చూపిస్తారు. విజయం మొదలయ్యేది ఈ బాధ్యత నుంచే. విఫలమైనవారి జీవితాలను గమనిస్తే వారి వైఫల్యానికి కారణం వారు పనిని బాధ్యతగా కాకుండా బరువు భావించడం కనిపిస్తుంది. చూడండి మిత్రులారా, బాధ్యత అనేది అవకాశ దృక్పధాన్ని పుట్టిస్తుంది. వారికి తమ దారిలో అడ్డంకులు కాదు అవకాశాలే కనిపిస్తాయి. బాధ్యతా భావం జీవిత ప్రయోజనంతో సమ్మిళితమై ఉండాలి. వీటి మధ్య వైరుధ్యం తగదు. బాధ్యతా భావం (Sense of Responsibility), జీవన ప్రయోజనత్వం(Sense of Purpose) అనే ఈ రెండు పట్టాల మీద సంకల్పం అనే రైలు బండి వేగంగా పరిగెడుతుంది. మీకు నా విజ్ఞప్తి ఏమిటంటే మీలో ఈ బాధ్యతా భావాన్ని నిలుపుకోండి. ఈ బాధ్యతా భావం దేశం పట్ల , దేశ అవసరాలను తీర్చడానికి ఉండాలి. ఈ రోజున దేశం వివధ రంగాలలో వేగంగా ముందుకు వెళుతోంది.