ఈ రోజు, వారి ఇళ్లకు సంబంధించి యాజమాన్య పత్రాలు లేదా ఆస్తి కార్డులు పొందిన, వారి కార్డులను డౌన్‌లోడ్ చేసుకొన్న లక్ష మందిని నేను అభినందిస్తున్నాను. ఇవాళ, మీరు మీ కుటుంబంతో కలిసి కూర్చోని, సాయంత్రం ఆహారం తినే సమయంలో … ఈ రోజు మీకు కలిగినంత ఆనందం ఇంతకు మునుపెన్నడూ మీకు కలిగి ఉండదని నాకు తెలుసు. ఇది మీ ఆస్తి అని ఇప్పుడు మేము నిశ్చయంగా చెప్పగలం, మీరు దానిని వారసత్వంగా పొందుతారు అని మీరు మీ పిల్లలకు గర్వంగా చెప్పగలుగుతారు.. మన పూర్వీకులు ఇచ్చినది కేవలం కాగితం కాదు, ఈ రోజు కాగితం పొందడం ద్వారా మన బలం పెరిగింది. ఈ సాయంత్రం మీకు చాలా సంతోషకరమైన సాయంత్రం, కొత్త కొత్త కలలు కనే సాయంత్రం మరియు కొత్త కొత్త కలల గురించి పిల్లలతో మాట్లాడే ఓ సాయంత్రం. అందువల్ల, ఈ రోజు మీరు పొందిన హక్కు గురించి నేను మిమ్మల్ని చాలా అభినందిస్తున్నాను.
ఈ హక్కు ఒక విధంగా చట్టపరమైన పత్రం. మీ ఇల్లు మీదే, మీరు మీ ఇంట్లోనే ఉంటారు. మీ ఇంటిని ఏ విధంగా ఉపయోగించాలనే విషయాన్ని మీరు నిర్ణయించుకుంటారు. ప్రభుత్వం గానీ చుట్టుపక్కల ఉన్న ప్రజలు గానీ ఏ విధమైన జోక్యం చేసుకోరు.
స్వమిత్వ పథకం గ్రామీణ భారతాన్ని సమూలంగా మార్చే చారిత్రక ఘట్టం కానుంది. మనమంతా దీనికి సాక్ష్యంగా నిలుస్తున్నాం.
ఈ రోజు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి మండలిలో నా సహచరుడు శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ గారు, హర్యానా ముఖ్యమంత్రి శ్రీ మనోహర్ లాల్ గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ దుష్యంత్ సింగ్ చౌతాలా గారు, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి శ్రీ త్రివేంద్ర సింగ్ రావత్ గారు, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారు, మధ్య ప్రదేశ్ సీఎం శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, వివిధ రాష్ట్రాల మంత్రులు కూడా ఉన్నారు. స్వమిత్వ (యాజమాన్య) పథకం యొక్క ఇతర లబ్ధిదారుల భాగస్వాములు కూడా ఈ రోజు మన మధ్య ఉన్నారు. నరేంద్ర సింగ్ జీ చెప్పినట్లు … ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు 1.25 కోట్లకు పైగా ప్రజలు నమోదు చేసుకున్నారు మరియు ఈ కార్యక్రమంలో మనతో పాటు చేరారు. ఈ రోజు ఈ వర్చువల్ సమావేశంలో చాలా మంది గ్రామస్తులు పాల్గొనడం అంటే స్వమిత్వ (యాజమాన్య) పథకం ఎంత ఆకర్షణీయమైనదో, శక్తివంతమైనదో మరియు ముఖ్యమైనదో చెప్పడానికి ఇది నిదర్శనం
నేడు, దేశం ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ లో మరొక ప్రధాన ముందడుగు వేసింది. గ్రామంలో నివసిస్తున్న మన సోదరసోదరీమణులు స్వయం సమృద్ధి పొందడానికి స్వమిత్వ (యాజమాన్య) పథకం దోహదపడుతుంది. నేడు, హర్యానా, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ మరియు ఉత్తర ప్రదేశ్ లోని వేలాది కుటుంబాలకు వారి ఇళ్ల చట్టపరమైన పత్రాలను అందజేశారు. రాబోయే మూడు, నాలుగు సంవత్సరాల్లో, దేశంలోని ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటికి అలాంటి ఆస్తి కార్డు ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది.
మరియు మిత్రులారా, ఈ రోజు ఇంత పెద్ద పని జరుగుతుండటం నాకు చాలా సంతోషంగా ఉంది … ఈ రోజు చాలా ముఖ్యమైనది. భారతదేశ చరిత్రలో నేటి రోజు కూడా ఎంతో ప్రాముఖ్యత ను కలిగి ఉంది. అదే, నేడు దేశంలోని ఇద్దరు గొప్ప పుత్రుల జయంతి. ఒకరు భారత్ రత్న లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్, మరొకరు భారత్ రతన్ నానాజీ దేశ్ ముఖ్. ఈ ఇద్దరు మహనీయుల పుట్టినరోజు కేవలం ఒకే రోజున వస్తోందని మాత్రమే కాదు, దేశంలో అవినీతికి వ్యతిరేకంగా ఆలోచించడం, దేశంలో నిజాయితీ, దేశంలోని పేదల సంక్షేమం, గ్రామ సంక్షేమం కోసం ఆలోచించటంలో ఇద్దరి ఆలోచన… ఇద్దరి ఆదర్శాలు… ఇద్దరి ప్రయత్నాలు ఒకటే.
జయప్రకాష్ బాబు సంపూర్ణ విప్లవానికి పిలుపునిచ్చినప్పుడు, బీహార్ భూమి నుండి వచ్చిన ఓ స్వరం, జయప్రకాష్ జీ ఏ కలలైతే కన్నారో .. ఆ కలలు ఫలించేలా… ఒక కవచం లాగా నానాజీ దేశ్ ముఖ్ పనిచేసారు. నానాజీ గ్రామాల అభివృద్ధి కోసం తన కార్యకలాపాలను విస్తరించినప్పుడు, జయప్రకాష్ బాబు నుండి నానాజీ ప్రేరణ పొందారు.
గ్రామం మరియు పేదల గొంతు వినిపించడానికి సహకారం ఎంత అద్భుతమైనదో ఇప్పుడు చూడండి.జయప్రకాష్ బాబు, నానాజీల జీవిత సంకల్పం ఎప్పుడూ ఇదే ఉండేది.
నేను ఎక్కడో చదివాను, ఓ సారి డాక్టర్ కలాం చిత్రకూట్ లో నానాజీ దేశ్ ముఖ్ ను కలిసినప్పుడు, మన చుట్టూ ఉన్న డజన్ల కొద్దీ గ్రామాలు వ్యాజ్యాల నుండి పూర్తిగా విముక్తి పొందాయని నానాజీ అతనితో చెప్పారు, అంటే కోర్టు-కచేరీ లేదు – ఎవరిపై ఎఫ్‌ఐఆర్ లేదు. గ్రామ ప్రజలు వివాదాల్లో చిక్కుకున్నప్పుడు, వారు తమను లేదా సమాజాన్ని అభివృద్ధి చేయలేరని నానాజీ అనేవారు . మన గ్రామాల్లో అనేక వివాదాలకు ముగింపు పలకడానికి స్వమిత్వ (యాజమాన్య) పథకం కూడా ఒక ప్రధాన మాధ్యమంగా మారుతుందని నేను విశ్వసిస్తున్నాను.
మిత్రులారా, భూమి మరియు ఇంటి యాజమాన్యం దేశ అభివృద్ధిలో పెద్ద పాత్ర పోషిస్తోందని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద నిపుణులు పట్టుబట్టి మరీ చెబుతున్నారు. ఆస్తి కి సంబంధించిన రికార్డు ఉన్నప్పుడు, ఆస్తిని సాధికారం చేసినప్పుడు, ఆస్తిని కూడా కాపాడి, పౌరుడి జీవితం కూడా కాపాడబడుతుంది మరియు పౌరుల్లో ఆత్మవిశ్వాసం అనేక రెట్లు పెరుగుతుంది. ఆస్తి కి సంబంధించిన రికార్డు ఉన్నప్పుడు, పెట్టుబడి పెట్టడానికి, కొత్త కొత్త సాహసాలు చేయడానికి, ఆర్థిక పునరుద్ధరణ కోసం కొత్త ప్రణాళికలు రూపొందించడానికి అనేక మార్గాలు తెరుచుకుంటాయి.