“భారత ఆరోగ్య సంరక్షణ రంగం సముపార్జించిన ప్రపంచవ్యాప్త విశ్వాసమేఇటీవలి కాలంలో భారతదేశానికి ‘ప్రపంచ ఔషధ కేంద్రం’గా పేరు తెచ్చింది”
“మొత్తం మానవాళి శ్రేయస్సు మాకు ముఖ్యం… కోవిడ్-19 ప్రపంచ మహమ్మారి సమయంలో ఈ స్ఫూర్తిని మేం ప్రపంచ మొత్తానికీ స్పష్టం చేశాం”
“భారత్లో పరిశ్రమను మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్లే సమర్థులైనశాస్త్రవేత్తలు.. సాంకేతిక నిపుణులు మా దేశంలో పెద్ద సంఖ్యలో ఉన్నారు.ఈ సామర్థ్యాన్ని ‘డిస్కవర్ అండ్ మేక్ ఇన్ ఇండియా’ కోసం వాడుకోవాలి”
“టీకాలు.. మందుల కోసం కీలకమైన పదార్థాల దేశీయ తయారీ పెంపు గురించి మనం ఆలోచించాలి.. ఇది భారత్‌ అధిగమించాల్సిన ఒక హద్దు”
“భారత్‌లో ఆలోచనకు రూపమివ్వండి.. భారత్‌లో ఆవిష్కరించండి..‘మేక్ ఇన్ ఇండియా.. మేక్ ఫర్ ది వరల్డ్’ దిశగా మీ అందరికీ ఇదేమా ఆహ్వానం; మీ సిసలైన శక్తిని కనుగొని ప్రపంచానికి సేవ చేయండి”

నా కేబినెట్ స‌హ‌చ‌రుడు శ్రీ మ‌న్ సుఖ్ భాయ్‌, ఇండియ‌న్ ఫార్మాస్యూటిక‌ల్స్ అల‌యెన్స్ ప్రెసిడెంట్ శ్రీ స‌మీర్ మెహ‌తా, కాడిలా హెల్త్ కేర్ లిమిటెడ్ చైర్మ‌న్ శ్రీ పంక‌జ్ ప‌టేల్‌, విశిష్ట భాగ‌స్వాములంద‌రికీ

న‌మ‌స్తే.

గ్లోబ‌ల్ ఇన్నోవేష‌న్ స‌ద‌స్సు నిర్వ‌హిస్తున్నందుకు ఇండియ‌న్ ఫార్మాస్యూటిక‌ల్స్ అసోసియేష‌న్ కు నా అభినంద‌న‌లు.

కోవిడ్‌-19 మ‌హ‌మ్మారి ఆరోగ్య సంర‌క్ష‌ణ రంగం ప్రాధాన్య‌త‌ను వెలుగులోకి తెచ్చింది. గ‌త రెండేళ్లుగా జీవ‌న‌శైలి కావ‌చ్చు, ఔష‌ధాలు, మెడిక‌ల్ టెక్నాల‌జీ, వ్యాక్సిన్లు స‌హా ఆరోగ్య సంర‌క్ష‌ణ రంగానికి చెందిన‌ అన్ని అంశాలూ ప్ర‌పంచం దృష్టిని ఆక‌ర్షించాయి. భార‌త ఫార్మాస్యూటిక‌ల్ ప‌రిశ్ర‌మ కూడా స‌వాలును దీటుగా ఎదుర్కొనేందుకు స‌మాయ‌త్తం అయింది.

ఇటీవ‌ల కాలంలో భార‌త‌దేశం “ప్ర‌పంచ ఫార్మ‌సీ”గా పేరు పొంద‌డానికి భార‌త ఆరోగ్య సంర‌క్ష‌ణ రంగం సాధించుకున్న ప్ర‌పంచ‌దేశాల విశ్వాసం దోహ‌ద‌ప‌డింది. 30 ల‌క్ష‌ల ఉద్యోగాలు, 13 బిలియ‌న్ డాల‌ర్ల వాణిజ్య మిగులు అందించిన భార‌త ఫార్మా రంగం ఆర్థికాభివృద్ధికి కీల‌క చోద‌క శ‌క్తిగా నిలిచింది.

భ‌రించ‌గ‌ల ధ‌ర‌ల్లో అధిక‌ నాణ్యత‌, గుణాత్మ‌కత క‌లిగిన మందులు అందించిన భార‌త ఫార్మా రంగం ప్ర‌పంచ‌దేశాల దృష్టిని ఆక‌ర్షించింది. 2014 నుంచి భార‌త ఆరోగ్య సంర‌క్ష‌ణ రంగం 12 బిలియ‌న్ డాల‌ర్ల‌కు పైబ‌డిన విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షించింది. ఇంకా ఎన్నో ఎఫ్ డిఐల‌ను ఆక‌ర్షించ‌గ‌ల సామ‌ర్థ్యం ఆ రంగానికి ఉంది.

మిత్రులారా,

సంక్షేమం నిర్వ‌చ‌నానికి భౌతిక హ‌ద్దులు లేవు. యావ‌త్ మాన‌వాళి సంక్షేమం ప‌ట్ల మ‌న విశ్వాసం అపారం.

స‌ర్వే భ‌వంతు సుఖినః స‌ర్వే సంతు నిరామ‌యాః

ప్ర‌పంచ మ‌హ‌మ్మారి కోవిడ్‌-19 స‌మ‌యంలో యావ‌త్ ప్ర‌పంచానికి మ‌నం ఇదే స్ఫూర్తిని ప్ర‌ద‌ర్శించి చూపించాం.

మ‌హ‌మ్మారి ప్రారంభ కాలంలో మ‌నం 150 పైగా దేశాల‌కు ప్రాణాధార ఔష‌ధాలు, వైద్య ప‌రిక‌రాలు ఎగుమ‌తి చేశాం. ఈ ఏడాది సుమారు 100 దేశాల‌కు 65 మిలియ‌న్ కోవిడ్ వ్యాక్సిన్ల‌ను ఎగుమ‌తి చేశాం. రాబోయే నెల‌ల్లో మ‌న వ్యాక్సిన్ ఉత్ప‌త్తిని పెంచిన త‌ర్వాత మనం మ‌రింత‌గా చేయ‌గ‌లుగుతాం.

మిత్రులారా,

కోవిడ్‌-19 శ‌కం ప్ర‌జాజీవితంలోని అన్ని రంగాల్లోనూ ఇన్నోవేష‌న్ ప్రాధాన్యాన్ని ఎత్తి చూపింది.

మ‌నం ఎదుర్కొన్న అంత‌రాయాలు మ‌న జీవ‌న‌శైలిని, ఆలోచ‌నా ధోర‌ణుల‌ను, ప‌ని తీరును పూర్తిగా మార్చుకునేలా చేశాయి. భార‌త ఫార్మారంగం కూడా వేగం, ప‌రిధి, ఇన్నోవేష‌న్ ప‌ట్ల సంసిద్ధ‌త‌ను ప్ర‌ద‌ర్శించింది. ఆ ఇన్నోవేష‌న్ స్ఫూర్తితోనే భార‌త‌దేశం అతి పెద్ద‌ పిపిఇల ఉత్ప‌త్తి, ఎగుమ‌తి దేశంగా మారింది.  కోవిడ్‌-19 వ్యాక్సిన్ల ఇన్నోవేష‌న్‌, ఉత్ప‌త్తి, వ్యాక్సినేష‌న్‌, ఎగుమ‌తుల్లో కూడా అదే స్ఫూర్తిని ప్ర‌ద‌ర్శించింది.

మిత్రులారా,

ఫార్మా రంగం వృద్ధిని ప్రోత్స‌హించ‌డానికి భార‌త ప్ర‌భుత్వం తీసుకున్న చ‌ర్య‌ల్లో కూడా ఇదే ఇన్నోవేష‌న్ స్ఫూర్తి ప్ర‌ద‌ర్శించింది. గ‌త నెల‌లోనే ప్ర‌భుత్వం “భార‌త ఫార్మా-మెడ్ టెక్ రంగంలో ప‌రిశోధ‌న‌, అభివృద్ధి, ఇన్నోవేష‌న్ కు దోహ‌ద‌ప‌డే విధానం” ముసాయిదా ప‌త్రం విడుద‌ల చేసింది. ఫార్మాస్యూటిక‌ల్స్, మెడిక‌ల్ డివైస్ ల రంగంలో ఆర్ అండ్ డిని ప్రోత్స‌హించేందుకు భార‌త‌దేశం క‌ట్టుబాటును ఈ విధానం ప్ర‌తిబింబించింది.

 

ఔష‌ధ అన్వేష‌ణ‌, మెడిక‌ల్ డివైస్ ల రంగంలో ఇన్నోవేష‌న్ కు అనుకూల వాతావ‌ర‌ణం క‌ల్పించ‌డం, భార‌త‌దేశాన్ని అగ్ర‌గామిగా నిల‌ప‌డం మా ఉద్దేశం. ఆయా రంగాల‌కు చెందిన వారంద‌రితోనూ విస్తృతంగా జ‌రిపిన సంప్ర‌దింపుల ఆధారంగానే మా విధానాల రూప‌క‌ల్ప‌న జ‌రిగింది. నియంత్ర‌ణ‌ప‌ర‌మైన అంశాల‌పై ప‌రిశ్ర‌మ డిమాండ్ల‌న్నీ మాకు తెలుసు. వాటిని ప‌రిష్క‌రించే దిశ‌గా తీవ్రంగా కృషి చేస్తున్నాం. మేం రూపొందించిన ఉత్ప‌త్తి అనుసంధానిత ప్రోత్సాహ‌కాల ప‌థ‌కం కింద అందించిన 30 వేల కోట్ల రూపాయ‌ల‌కు పైబ‌డిన ప్రోత్సాహ‌కాలు ఫార్మాస్యూటిక‌ల్స్, మెడిక‌ల్ డివైస్ ల రంగానికి పెద్ద ఉత్ర్పేర‌కంగా నిలిచాయి.

మిత్రులారా,

ప‌రిశ్ర‌మ‌, విద్యారంగం ప్ర‌త్యేకించి  ప్ర‌తిభావంతులైన యువ‌త మ‌ద్ద‌తు ప్ర‌భుత్వానికి అత్యంత ప్ర‌ధానం. ఈ ల‌క్ష్యంతోనే మేము విద్యా,  పారిశ్రామిక రంగాల మ‌ధ్య భాగ‌స్వామ్యాల‌ను ప్రోత్స‌హిస్తున్నాం. ప‌రిశ్ర‌మ‌ను మ‌రింత ఉన్న‌త శిఖ‌రాల‌కు చేర్చ‌గ‌ల శాస్త్రవేత్త‌లు, టెక్నాల‌జిస్టుల అపార సంప‌ద మ‌న‌కుంది. “డిస్క‌వ‌ర్‌, మేక్ ఇన్ ఇండియా”కు ఈ బ‌లాన్ని ఉప‌యోగించుకోవాల్సిన అవ‌స‌రం ఉంది.

మిత్రులారా,

మీరు అత్యంత జాగ‌రూక‌త‌తో అన్వేషించాల్సినవిగా నేను భావిస్తున్న‌ రెండు అంశాల‌ను మీ ముందుంచాల‌నుకుంటున్నాను. అందులో మొద‌టిది ముడిస‌ర‌కు అవ‌స‌రాలు. కోవిడ్‌-19పై పోరాడుతున్న స‌మ‌యంలో ఇది అధికంగా దృష్టి సారించాల్సిన అంశ‌మ‌ని మాకు అర్ధ‌మ‌యింది. నేడు 1.3 బిలియ‌న్ భార‌తీయులు భార‌త‌దేశాన్ని ఆత్మ‌నిర్భ‌ర్ గా నిలిపే కృషి భుజ‌స్కంధాల‌పై వేసుకున్న త‌రుణంలో వ్యాక్సిన్లు, ఔష‌ధాల్లో వినియోగించే కీల‌క ముడి ప‌దార్థాల ఉత్ప‌త్తిని దేశీయంగా పెంచే అంశం మ‌నం ఆలోచించాలి. భార‌త‌దేశం విజ‌యం సాధించాల్సిన కీల‌క విభాగం ఇది. ఈ స‌వాలును దీటుగా అధిగ‌మించేందుకు గ‌ట్టిగా కృషి చేయాల‌ని ఇన్వెస్ట‌ర్లు, ఇన్నోవేట‌ర్లు భావిస్తున్నార‌ని నేను న‌మ్ముతున్నాను.

భార‌త సాంప్ర‌దాయిక ఔష‌ధాలు మ‌నం దృష్టి సారించాల్సిన రెండో అంశం. అంత‌ర్జాతీయ మార్కెట్లో ఈ ఉత్ప‌త్తుల‌కు డిమాండు గ‌ణ‌నీయంగా ఉండ‌డ‌మే కాకుండా పెరుగోతంది. ఇటీవ‌ల కాలంలో ఈ ఉత్ప‌త్తుల ఎగుమ‌తులు విశేషంగా పెర‌గ‌డ‌మే ఇందుకు తార్కాణం. ఒక్క  2020-21 సంవ‌త్స‌రంలోనే భార‌త‌దేశం 1.5 కోట్ల డాల‌ర్లకు పైబ‌డిన విలువ గ‌ల మూలికా ఔష‌ధాలు ఎగుమ‌తి చేసింది.  భార‌త‌దేశంలో  ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ భార‌త సాంప్ర‌దాయిక ఔష‌ధాల అంత‌ర్జాతీయ కేంద్రం ఏర్పాటు చేయ‌నుంది. అంత‌ర్జాతీయ అవ‌స‌రాలు, శాస్ర్తీయ ప్ర‌మాణాలు, ఉత్త‌మ త‌యారీ విధానాల‌తో సాంప్ర‌దాయిక ఔష‌ధాల‌ను మ‌రింత ప్రాచుర్యంలోకి తెచ్చే విష‌యం మ‌నంద‌రం ఆలోచించాలి.

మిత్రులారా,

భార‌త‌దేశంలోనే కొత్త ఐడియాలకు శ్రీ‌కారం చుట్టేందుకు, భార‌త్ లోనే ఇన్నోవేట్ చేసేందుకు, భార‌త్ లోనే త‌యారీకి, ప్ర‌పంచం కోసం త‌యారీకి మిమ్మ‌ల్ని ఆహ్వానిస్తున్నాను. మీ అస‌లైన బ‌లం ఏమిటో క‌నుగొని ప్ర‌పంచానికి సేవ‌లందించండి.

ఇన్నోవేష‌న్‌, ఎంట‌ర్ ప్రైజ్ కు అవ‌స‌రం అయిన ప్ర‌తిభ‌, వ‌న‌రులు, అనుకూల వాతావ‌ర‌ణం మా ద‌గ్గ‌ర ఉన్నాయి. ఫార్మా రంగంలో మేం వేస్తున్న వేగ‌వంత‌మైన అడుగులు, ఇన్నోవేష‌న్ స్ఫూర్తి, విజ‌యాల ప‌రిధిని ప్ర‌పంచం గుర్తించింది. మ‌రింత ముంద‌డుగేసి కొత్త శిఖ‌రాలు చేర‌డానికి ఇది ఉత్త‌మ‌ స‌మ‌యం. ఇన్నోవేష‌న్ కు అనుకూల‌మైన వాతావ‌ర‌ణం విస్త‌రించ‌డానికి భార‌త‌దేశం క‌ట్టుబ‌డి ఉన్న‌ద‌ని నేను ప్ర‌పంచ‌, దేశీ పారిశ్రామిక వేత్త‌లు, ఇత‌ర భాగ‌స్వాముల‌కు నేను హామీ ఇస్తున్నాను. ఆర్ అండ్ డి, ఇన్నోవేష‌న్ విభాగాల్లో భార‌త ఫార్మాస్యూటిక‌ల్స్ స్థానాన్ని బ‌లోపేతం చేసుకునేందుకు ఈ స‌మావేశం దోహ‌ద‌ప‌డాల‌ని నేను ఆకాంక్షిస్తున్నాను.

ఈ స‌ద‌స్సు నిర్వాహ‌కుల‌ను నేను మ‌రోసారి అభినందిస్తూ ఈ రెండు రోజుల స‌ద‌స్సు ఫ‌ల‌వంతం కావాల‌ని శుభాకాంక్ష‌లు అందిస్తున్నాను.

ధ‌న్య‌వాదాలు.

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
PLI, Make in India schemes attracting foreign investors to India: CII

Media Coverage

PLI, Make in India schemes attracting foreign investors to India: CII
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 నవంబర్ 2024
November 21, 2024

PM Modi's International Accolades: A Reflection of India's Growing Influence on the World Stage