శ్రీ వినీత్ జైన్,
భారతదేశం నుంచి, విదేశాల నుంచి హాజరైన ప్రముఖ అతిథులకు
మీ అందరికీ శుభోదయం
ఈ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్‌లో మరోసారి ఇక్కడ మిమ్మల్ని కలవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది.
ఈ బిజినెస్ సమ్మిట్ ప్రధానాంశానికి ముందుగా సోషల్ అనే పదాన్ని ఎంపిక చేసుకున్నందుకు ముందుగా మీకు అభినందనలు.
సుస్థిరాభివృద్ధి సవాలును ఎదుర్కొవడం ఎలా అనే అంశాన్ని ఇక్కడికి హాజరైన ప్రతినిధులు చర్చించనున్నానరని తెలిసి నాకు సంతోషం వేసింది.ఇది మీ థీమ్‌కు గల రెండో పదం.
ఈ సదస్సు థీమ్ మూడోపదమైన వ్యాప్తి గురించి మీరు మాట్లాడుతుంటే , అది నాకు మరింత ఆశ, విశ్వాసాన్ని కలిగిస్తోంది. అలాగే మీరు భారతదేశానికి సంబంధించి పరిష్కారాలుకూడా చర్చిస్తున్నారనుకుంటాను.
మిత్రులారా,
2013 ద్వితీయార్ధం, 2014 ప్రధమార్థంలో దేశం ఎదుర్కొంటూ ఉండిన సవాళ్ల గురించి ఇక్కడ హాజరైన మీకంటే ఎవరికి ఎక్కువ తెలిసే అవకాశం ఉంటుంది?
నానాటికీ పెరుగుతూ వచ్చిన ద్రవ్యోల్బణం ప్రతి కుటుంబం వెన్ను విరుస్తూ వచ్చింది.
కరెంటు ఖాతా లోటు, అధిక ద్రవ్యలోటు దేశ స్థూల ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బదీస్తూ వచ్చాయి.
అన్ని రకాల సూచికలూ దయనీయమైన భవిష్యత్తునే సూచిస్తూ వచ్చాయి.
దేశం పూర్తిగా విధానపరమైన అచేతనలోకి జారిపోయింది.
దేశ ఆర్థికవ్యవస్థ తన శక్తిమేరకు ఉన్నత స్థాయికి చేరడానికి గల అవకాశాలకు ఇది అడ్డుపడుతూ వచ్చింది.
బలహీన ఆర్థిక వ్యవస్థలకు చెందిన ఐదు దేశాలలో ఒకటిగా దీని పరిస్థితిని చూసి అంతర్జాతీయ సమాజం ఆందోళన చెందుతూ వచ్చింది.
అప్పటి పరిస్థితులకు లొంగిపొతున్న భావన కలుగుతూవచ్చింది.
మిత్రులారా,
ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో మా ప్రభుత్వం ప్రజలకు సేవచేయడానికి ముందుకు వచ్చింది. ఇవాళ ఆ మార్పు స్పష్టంగా కనిపిస్తున్నది.
2014 తర్వాత సంశయం స్థానంలో ఆశ కనిపిస్తోంది.
అడ్డంకుల బదులు ఆశావహ పరిస్థితి కనిపిస్తోంది.
ఇంకా
సమస్యల స్థానంలో చొరవ కనిపిస్తోంది.
2014 నుంచి ఇండియా అంతర్జాతీయంగా దాదాపు అన్ని ర్యాంకింగ్‌లలో, సూచికలలో తన స్థాయిని గణనీయంగా మెరుగుపరుచుకుంది.
ఇది , ఇండియా ఎలా మారుతున్నదో కాకుండా ,ఇండియా పట్ల ప్రపంచ దృక్పథం ఎలా మారుతూ వస్తున్నదో తెలియజేస్తున్నది.
అయితే పరిస్థితి ఇంత వేగంగా మారడాన్నిచూసి కొందరు అభినందించే స్థితిలో లేరని నాకు తెలుసు.
ర్యాంకింగ్‌లు పేపర్లపై పరిస్థితి మెరుగుపడినట్టు కనిపిస్తాయికాని , క్షేత్రస్థాయిలో మార్పు ఏమీ ఉండదని వారు అంటారు.
ఇది వాస్తవ దూరమన్నది నా భావన.
ర్యాంకింగ్‌లే చాలా వరకు ఆలస్యంగా ప్రతిబింబించే సూచికలు.
ముందుగా క్షేత్రస్థాయిలో పరిస్థితులు మారుతాయి. ఆతర్వాత ఎప్పటికోగాని అవి ర్యాంకింగ్‌ల రూపంలోకి ఎక్కవు.
ఉదాహరణకు సులభతర వాణిజ్య ర్యాంకింగ్‌లనే తీసుకుందాం,
నాలుగు సంవత్సరాలలో మా ర్యాంకింగ్ 142 నుంచి చరిత్రాత్మక గరిష్ఠస్థాయిలో 77 కు మెరుగుపడింది.
అయితే అంతకు ముందుగానే క్షేత్రస్థాయిలో పరిస్థితి మెరుగుపడింది. ఇప్పుడు కొత్త వ్యాపారం ప్రారంభించడానికి భవన నిర్మాణ పర్మిట్లు
త్వరగా వస్తున్నాయి. అలాగే ఎలక్టిసిటీ అనుసంధానత , ఇతర అనుమతులు త్వరగా వస్తున్నాయి.
చివరికి చిన్న వ్యాపారులకు సైతం విధి విధానాలు పాటించడం సులభమైంది.
ప్రస్తుతం 40 లక్షల రూపాయల వరకు టర్నోవర్ ఉన్న వ్యాపారులు ఎవరూ జి.ెస్.టి కింద నమోదు చేయించుకోవలసిన అవసరం లేదు.
60 లక్షల రూపాయల వరకు టర్నోవర్ ఉన్న వారు ఎలాంటి ఆయపన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
1.5 కోట్ల రూపాయల టర్నోవర్ కల వ్యాపారులు నామ మాత్రపన్ను రేటుతో కాంపొజిషన్ పథకానికి అర్హులు.
అదే రకంగా , ప్రపంచ ట్రావెల్, టూరిజం పోటీ సూచీలో 2013లో 65 వ సూచికవద్ద భారత దేశం ఉండగా 2017లో అది 45 కు చేరింది.
భారతదేశానికి వచ్చే పర్యాటకుల సంఖ్య సుమారు 45 శాతం పెరిగింది. అనుమతి పొందిన హోటళ్ల సంఖ్య 50 శాతానికి పెరిగింది.
పర్యాటక రంగంలో విదేశీ మారకద్రవ్య ఆర్జన 2013 నుంచి 2017 మధ్య 55 శాతం పెరిగింది.
పరిశుభ్ర భారతావనిని సాధించడం సాధ్యం కాదని అనేవారు. కానీ భారతదేశ ప్రజలు దీనిని సుసాధ్యం చేస్తున్నారు.
అవినీతిని దేశం నుంచి తొలగించడం ఎంతమాత్రం సాధ్యం కాదని చెబుతూ వచ్చారు. కానీ భారత ప్రజలు దానిని సుసాధ్యం చేశారు.
పేదలు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకో లేరని అంటూ వచ్చారు, కానీ భారతదేశ ప్రజలు దీనిని కూడా సుసాధ్యం చేశారు.
విధాన నిర్ణయాలలో విచక్షణాధికారాలను, ఏకపక్షంగా వ్యవహరించడాన్ని తొలగించడం సాధ్యం కాదని అంటూ వచ్చారు. కానీ భారత ప్రజలు వీటిని తొలగించడం సాధ్యమేనని నిరూపించారు.
భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు అసాధ్యమని అన్నారు,భారత ప్రజలు దానిని సుసాధ్యం చేస్తున్నారు.
ప్రభుత్వం ఏక కాలంలో అభివృద్ధికి అనుకూలంగా, పేదలకు అనుకూలంగా ఉండజాలదని చెబుతూ వచ్చారు. కానీ భారత ప్రజలు దీనిని సుసాధ్యం చేస్తున్నారు.
వర్థమాన ఆర్థిక వ్యవస్థ ఏదీ , ద్రవ్యోల్బణ సమస్యను ఎదుర్కొనకుండా దీర్ఘకాలం ఎక్కువ వృద్ధిరేటుతో ముందుకు పోజాలదన్న భావన, సిద్ధాంతం ఉందని నా దృష్టికి వచ్చింది.
సరళీకృత ఆర్థిక విధానల అమలు తర్వాత అంటే 1991 తర్వాత మన దేశంలో ఏర్పడిన దాదాపు అన్ని ప్రభుత్వాలు ఈ సమస్యను ఎదుర్కోవలసి వచ్చింది. స్వల్పకాల వృద్ధి అనంతరం ఆర్థిక వ్యవస్థ ఓవర్ హీటింగ్ స్థాయికి చేరడంగా నిపుణులు అభివర్ణించేవారు.దీనిఫలితంగా మనకు ఎప్పుడూ సుస్థిరమైన ఎక్కువ వృద్ధిరేటు ఉండేది కాదు.
మీకు గుర్తుండే ఉంటుంది, మనకు ఒక ప్రభుత్వం ఉండేది, 1991 నుంచి 1996 మధ్య కాలంలో వృద్ధిరేటు ఐదు శాతం మాత్రమే .కానీ ద్రవ్యోల్బణం మాత్రం పదిశాతం కంటే ఎక్కువ ఉండేది.
అలాగే మాకంటే కాస్త ముందున్న ప్రభుత్వం 2009- 2014 మధ్య ఆరున్నర శాతం సగటు వృద్ధిరేటుమాత్రమే కలిగిఉంది. సగటు ద్రవ్యోల్బణ రేటు రెండంకెల స్థాయిలోనే ఉండేది.
మిత్రులారా,
2014-2019 మధ్య దేశం 7.4 శాతం వృద్ధిరేటును నమోదు చేయనుంది. ద్రవ్యోల్బణం మాత్రం నాలుగున్నర శాతం కంటె తక్కువ వద్ద ఉండనుంది.
సరళీకృత ఆర్థిక వ్యవస్థ అమలులోకి వచ్చిన అనంతరం భారత ఆర్ధిక వ్యవస్థలో ఏ ఇతర ప్రభుత్వ హయాంలో లేని విధంగా ఇదే అత్యధిక వృద్ధిరేటు, అలాగే తక్కువ సగటు ద్రవ్యోల్బణం కలిగి ఉంది.
ఈ మార్పులు, సంస్కరణల కారణంగా , పరివర్తన జరుగుతూ ఆర్థికవ్యవస్థ ఆ దిశగా ముందుకు పోతున్నది
భారత ఆర్థిక వ్యవస్థ తన ఆర్థిక వనరులను విస్తృతం చేసుకోగలిగింది.
ఇప్పుడు ఇది ఇక ఎంతమాత్రం తన పెట్టుబడి అవసరాల కోసం బ్యాంకు రుణాలమీద ఆధారపడిలేదు.
ఉదాహరణకు కేపిటల్ మార్కెట్‌నుంచి నిధుల సమీకరణను గమనించండి.
2011-2012 నుంచి 2013- 14 మధ్య అంటే ఈ ప్రభుత్వం అధికారం చేపట్టడానికి మూడు సంవత్సరాల ముందు, ఈక్విటీ ద్వారా సేకరించిన సగటు నిధులు సంవత్సరానికి సుమారు 14 వేల కోట్ల రూపాయలు. గడచిన నాలుగు సంవత్సరాలలో ఇది సగటున ఏడాదికి 43 వేల కోట్ల రూపాయలకు చేరింది. అంటే ఇంతకు ముందుతో పోలిస్తే దాదాపు మూడు రెట్లు ఎక్కువ.
2011 నుంచి 2014 మధ్య ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధులనుంచి సేకరించి మొత్తం నాలుగువేల కోట్ల రూపాయలకంటె తక్కువ . కానీ మా ప్రభుత్వం ఈ రకమైన ఆర్థికవనరుల సమీకరణను ప్రోత్సహించడానికి పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది. దాని ఫలితం ఏమిటో మీరు గమనించవచ్చు.
204 నుంచి 2018 వరకు నాలుగు సంవత్సరాలలో ప్రత్యామ్నాయ పెట్టుబడి ఫండ్ ద్వారా సేకరించిన మొత్తం 81వేల కోట్ల రూపాయల కంటె ఎక్కువ.
ఇది గతంతో పోలిస్తే సుమారు ఇరవై రెట్లు ఎక్కువ.
అలాగే, కార్పొరేట్ బాండ్ల ప్రైవేట్ ప్లేస్‌మెంట్‌ల ఉదాహరణనే చూడండి.
అది 57 కు చేరింది.
నవకల్పనలలో పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది.
నవకల్పనల సంస్కృతిలో కూడా మెరుగుదల కనిపిస్తున్నది.
పేటెంట్‌లు, ట్రేడ్‌మార్క్‌ల నమోదులోనూ చాలా పెరుగుదల కనిపించింది.
మిత్రులారా,
ఈ మార్పు కొత్త తరహా పాలనా తీరువల్ల కలిగినది. అలాగే ఇది ఆసక్తిదాయకమైన రీతిలో స్పష్టంగా గోచరిస్తున్నది కూడా.
2014 తర్వాత పరిస్థితులు ఎలా మారాయో నేను ఆసక్తికరమైన ఉదాహరణలిస్తాను.
మనం ఇప్పుడు రకరకాల పోటీలను చూస్తున్నాం.
మంత్రిత్వశాఖల మధ్య పోటీ,
రాష్ట్రాల మధ్య పోటీ,
అభివృద్ధిలో పోటీ,
లక్ష్యాలు చేరుకోవడంలో పోటీ,
ఇవాళ ఎలాంటి పోటీ ఉందంటే నూరు శాతం పరిశుభ్రతను ముందు సాధిస్తామా లేక నూరు శాతం విద్యుదీకరణను సాధిస్తామా అన్న దానిలో పోటీ కనిపిస్తోంది.
అన్ని ఆవాసాలకు ముందుగా రోడ్డు సదుపాయం కల్పిస్తామా, లేక అన్ని ఇళ్లకు గ్యాస్ సదుపాయం ముందుగా కల్పిస్తామా అన్నదానిలో పోటీ ఉంది.
ఏ రాష్ట్రం ఎక్కువగా పెట్టుబడులను ఆకర్షిస్తుందన్నదానిలో పోటీ కనిపిస్తోంది.
ఏ రాష్ట్రం నిరుపేదలకు ఇళ్లు కట్టడం త్వరగా పూర్తిచేస్తుందన్నదానిలో పోటీ కనిపిస్తోంది.
.ఏ ఆకాంక్షిత జిల్లా త్వరగా అభివృద్ధి సాధిస్తుందన్న దానిలో పోటీ ఉంది.
2014కు ముందు కూడా మనం పోటీ గురించి విన్నాం. కానీ అది వేరే రకమైన పోటీ.
అది మంత్రుల మధ్య పోటీ
వ్యక్తుల మధ్య పోటీ
అవినీతిలో పోటీ
జాప్యంలో పోటీ
ఎవరు గరిష్ఠ స్థాయిలో అవినీతికి పాల్పడగలరన్న దానిలో పోటీ
ఎంత వేగంగా అవినీతికి పాల్పడగలరన్న దానిలో పోటీ
ఎంత కొత్త తరహాలో అవినీతికి పాల్పడగలరన్న దానిలో పోటీ.
బొగ్గు కు ఎక్కువ డబ్బు వస్తుందా, స్పెక్ట్రమ్‌కు ఎక్కువ డబ్బు వస్తుందా అన్నదానిలో పోటీ
సిడబ్ల్యుజి వల్ల ఎక్కువ డబ్బు వస్తుందా లేక రక్షణ ఒప్పందాల వల్ల ఎక్కువ డబ్బు వస్తుందా అన్నదాంట్లో పోటీ
మనమందరం చూశాం, అంతేకాదు, ఈ పోటీలో ప్రధాన వ్యవహర్తలు ఎవరో మనకు తెలుసు
ఏ తరహా పోటీని మీరు స్వాగతిస్తారో నేను మీకే వదిలివేస్తున్నాను.
మిత్రులారా,
భారతదేశంలో కొన్ని విషయాలు అసాధ్యమన్న భావన దశాబ్దాలుగా ఉంది.
కానీ 2014 నుంచి దేశం సాధించిన ప్రగతి చూసిన తర్వాత 130 కోట్ల మంది ప్రజలకు సాధ్యం కానిదేమీ లేదని నాకు అనిపించింది.
नामुमकिन अब मुमकिन है.
2011-2014 మధ్య దీని ద్వారా సేకరించిన సగటు మొత్తం సుమారు 3 లక్షల కొట్ల రూపాయలు.అంటే సుమారు 40 బిలియన్ డాలర్లు.
ఇది గడచిన నాలుగు సంవత్సరాలలో 5.25 లక్షల కోట్ల రూపాయలకు అంటే సుమారు 75 బిలియన్ డాలర్లకు చేరింది.
అంటే ఇది సుమారు 75 శాతం పెరుగుదల.
ఇవన్నీ భారత ఆర్థిక వ్యవస్థపై చూపుతున్న విశ్వాసానికి ఉదాహరణలు.
ఈ రకమైన విశ్వాసాన్ని దేశీయ ఇన్వెస్టర్లుమాత్రమే చూపడం లేదు.ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు చూపుతున్నారు.
అంతేకాదు భారత దేశంపై విశ్వాసం కనబరచడం కొనసాగుతోంది. ఇంతకు ముందులాగా ఎన్నికల ముందు సంవత్సరాలలో పరిస్థితికి భిన్నంగా ఇప్పుడు పరిస్థితులు ఉన్నాయి.
గడచిన నాలుగు సంవత్సరాలలో దేశం అందుకున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 2014కు ముందు ఏడు సంవత్సరాల కాలంపాటు అందుకున్న దానితో సమానం.
ఇవన్నీ సాధించడానికి , పరివర్తనకు భారత దేశానికి సంస్కరణలు అవసరం.
దివాళా కోడ్,జిఎస్‌టి,రియల్ ఎస్టేట్ చట్టం లాంటివి రాగల దశాబ్దాలలో ఎక్కువ వృద్ధి సాధించడానికి గట్టి పునాదితొ కూడిన తగిన మార్గం ఏర్పాటు చేశాయి.
, మూడు లక్షల కోట్ల రూపాయలు లేదా 40 బిలియన్ డాలర్లు అప్పుతీసుకుని ఎగవేసిన వారు ఆర్థిక సంస్థలకు, రుణదాతలకు తిరిగి చెల్లిస్తారని నాలుగు సంవత్సరాల క్రితం ఎవరైనా ఊహించారా
దివాలా, ఇన్‌సాల్వెన్సీ కోడ్ ప్రభావం ఇది.
ఇది ఆర్థికవనరులను మరింత సమర్ధంగా కేటాయించడానికి దేశానికి ఉపయోగపడుతుంది.
ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే పని పట్టించుకోకుండా వదిలేసిన అనంతరం మేం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థికవ్యవస్తను గాడిలోపెట్టే పని చేపట్టినపుడు, పని జరుగుచున్నది, నెమ్మదిగా వెళ్లండి వంటి బోర్డు పెట్టరాదని నిర్ణయించుకున్నాం.
సమాజ విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పనులు ఏమాత్రం ఆగకుండా అన్నిసంస్కరణలూ అమలు చేయాలని నిర్ణయించాం..
మిత్రులారా,
భారతదేశం అంటే 130 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలు అందువల్ల అభివృద్ధి , ప్రగతి విషయంలో ఏక దార్శనికత పనికిరాదు.
నవభారతదేశానికి సంబంధించి మన దార్శనికత సమాజంలోని అన్ని వర్గాల ప్రజల అవసరాలు తీర్చేదిగా ఉండాలి. వారి ఆర్థిక స్థితిగతులు, వారి కులం, మతం, వర్గం, భాష వీటితో ఏమాత్రం సంబంధం లేకుండా ఉండాలి.
మేం భారతదేశ 130 కోట్ల మంది ప్రజల ఆశలు, ఆకాంక్షలు నేరవేర్చే నవభారత నిర్మాణానికి కష్టపడి పనిచేస్తున్నాం.
నవభారతదేశానికి సంబంధించి మా నూతన దార్శనికత ఎలా ఉంటుందంటే, గత సమస్యలను పరిష్కరించుకుంటూ భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనే విధంగా ఉంటుంది.
అందువల్ల, ఇవాళ భారతదేశం వేగవంతమైన రైలును నిర్మించగలిగింది. కాపలా లేని రైల్వే క్రాసింగ్‌లను అన్నింటినీ తొలగించగలిగింది.
ఇవాళ భారతదేశం ఐఐటిలు, ఎఐఐఎంఎస్‌లను పెద్ద ఎ త్తున ఏర్పాటు చేస్తున్నది.దేశవ్యాప్తంగా పాఠశాలల్లో టాయిలెట్లను నిర్మిస్తున్నది.
ఇవాళ, భారతదేశం దేశవ్యాప్తంగా 100 స్మార్ట్ నగరాలను నిర్మిస్తున్నది. 100 ఆకాంక్షా జిల్లాలలో శరవేగంతో అభివృద్ధి సాధిస్తున్నది.
ఇవాళ , భారత దేశం నికరంగా విద్యుత్‌ను ఎగుమతి చేసే దేశంగా ఎదిగింది. స్వాతంత్ర్యానంతరం నుంచి చీకటిలో మగ్గిన ఎన్నో ఇళ్లకు ఇప్పుడు విద్యుత్ సదుపాయం లభించింది.
ప్రస్తుతం ఇండియా అంగారక గ్రహంపై అడుగుపెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాదు ప్రతి భారతీయుడికి ఉండడానికి గృహ వసతి కల్పించాలని నిర్ణయించబడింది.
అంతేకాదు అత్యంత వేగంగా పేదరికాన్ని రూపుమాపుతున్నది కూడా.
మిత్రులారా,
మనం ఎ,బి,సి ధోరణి నుంచి బయటపడ్డాం, ఎ- అంటే అవాయిడింగ్, బి- అంటే బరీయింగ్, సి- అంటే కన్ఫూజింగ్
ఒక అంశాన్ని పక్కనపడేసే బదులు మేం ఆ సమస్యను పరిష్కారానికి చేపట్టాం.
దానిని పాతిపెట్టే బదులు మేం వెలికితీసి ప్రజలకు తెలియజేశాం.
అంతేకాదు,
వ్యవస్థను తికమకపెట్టేబదులు, సమస్యకు పరిష్కారం సాధ్యమని రుజువు చేశాం.
ఇది మాకు సామాజిక రంగంలో మరింత సానుకూల చర్యలు చేపట్టడానికి , వాటిని మరింత ముందుకు తీసుకుపోవడానికి విశ్వాసాన్ని చ్చింది.
ప్రతి సంవత్సరం ఆరువేల రూపాయల ఆర్థిక సహాయం అందించడం ద్వారా మేం 12 కోట్ల మంది చిన్న ,సన్నకారు రైతులకు చేరువ అవుతున్నాం. అంటే ఇది 7.5 లక్షల కోట్ల రూపాయలు లేదా రైతులకు రాగల పది సంవత్సరాలలో మేం ఇస్తున్న 100 బిలియన్ డాలర్లు
కోట్లాదిమంది అసంఘటితరంగ కార్మికులకు మేం ఒక పెన్షన్ పథకాన్ని తీసుకువస్తున్నాం.
అభివృద్ధికి సంబంధించిన ఈ ప్రభుత్వ ఇంజిన్ సమాంతరంగా రెండు ట్రాక్‌లపై వెళుతున్నది.ఒకటి సామాజిక మౌలిక సదుపాయాలను అందరికీ కల్పించడం ముఖ్యంగా అభివృద్ధి పథం నుంచి వదిలివేయబడిన వారిని పట్టించుకోవడం.
మరొకటి, అందరికీ మౌలిక సదుపాయాలను కల్పించడం,ప్రత్యేకించి రాబోయే తరం వారి అవసరాలకు అనుగుణంగా , వారి కలలను సాకారం చేసే విధంగా మౌలిక సదుపాయాల కల్పన.
గతంలో ఏం జరిగిందన్నది మన చేతులలో ఏమీ లేదు.భవిష్యత్తులో ఏం జరుగుతుందన్నది మన చేతుల్లోనే ఉంది.
గతంలో మనం పారిశ్రామిక విప్లవాన్ని అందుకోలేకపోయామని తరచూ అనుకుంటుంటాం.కానీ ఇవాళ మనం గర్వించదగ్గ విషయం ఏమంటే, భారతదేశం నాలుగవ పారిశ్రామిక విప్లవానికి చురుకైన పాత్ర వహిస్తున్నది..
మన చేయూత స్థాయి,మనం పోషిస్తున్న కీలక పాత్ర ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నది.
మొదటి మూడు పారిశ్రామిక విప్లవాలను భారతదేశం సకాలంలో అందుకోలేక పోయి ఉండవచ్చు. కానీ ఈ సారి నాలుగో పారిశ్రామిక విప్లవ బస్‌లో భారత్ ఎక్కడమే కాదు, డ్రైవ్ కూడా చేయగలదని నేను గట్టి విశ్వాసంతో ఉన్నాను.
నవకల్పనలు, టెక్నాలజీ వంటివి తిరిగి మన సత్తా చాటడానికి పునాదిగా ఉపకరిస్తాయి.
డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా,మేక్ ఇన్ ఇండియా, ఇన్నొవేట్ ఇంటియా వంటి ఫలితాలు సమ్మిళతమై మంచి ప్రయోజనాలు సమకూరుస్తున్నాయి.
2013,2014 సంవత్సరాలలో నాలుగువేల పెటెంట్లు మంజూరైతే 2017-18లో 13 వేల పేటెంట్లు మంజూరయ్యాయని మీకు తెలుసా?
అంటే మూడు రెట్లు అధికం అన్నమాట.
అలాగే, 2013-14 లోసుమారు 68 వేల ట్రేడ్‌మార్క్‌లు రిజిస్టర్ అయితే, 2016-17లో వీటి సంఖ్య 2.5 లక్షలకు పెరిగాయి.
అంటే ఇది సుమారు నాలుగురెట్ల వృద్ధి.
ఇవాళ భారతదేశంలో రిజిస్టర్ అయిన స్టార్టప్‌లలో 44 శాతం స్టార్టప్‌లు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచి వచ్చినవని తెలిస్తే మీరు సంతోషిస్తారు.
దేశవ్యాప్తంగా అటల్ టింకరింగ్ ల్యాబ్‌ల నెట్‌వర్క్ ఏర్పడుతున్నది. ఇది నవకల్పనలకు అవకాశం కల్పించనుంది.
ఇది మన విద్యార్థులను భవిష్యత్ లో నవకల్పనల ఆవిష్కర్తలుగా తీర్చిదిద్దడానికి ఉపయోగపడుతాయి.
పాములు పట్టి ఆడించే కమ్యూనిటీకి చెందిన ఒక బాలిక, కంప్యూటర్ మౌస్‌ను చేతపట్టి డిజిటల్ ఇండియాను సార్థకం చేస్తుంటే నాకు ఎంతో ముచ్చటేసింది.
గ్రామాలలో యువత వైఫైని వాడడం చూసి కూడా నాకు సంతోషం వేసింది. డిజిటల్ ఉపకరణాలు పోటీ పరీక్షల సాధకులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.
దేశంలో ఉన్నవారు, లేనివారి మధ్య అంతరాన్ని టెక్నాలజీ తొలగిస్తున్నది.
ఇలాంటి కథనాలు భారతదేశ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తున్నాయి.
మిత్రులారా,
ప్రజల మద్దతు, భాగస్వామ్యంతో భారతదేశం 2014నుంచి అద్భుత ప్రగతి సాధించింది.
జన్ భాగిదారి లేనిదే ఇది సాధ్యమయ్యేది కాదు.
ఈ అనుభవమే మాకు కొండంత బలాన్ని ఇస్తున్నది.మన దేశం ప్రజలందరికీ సమాన అవకాశాలు కల్పించగలదని, వృద్ధి లోకి రాగలదని, సుసంపన్నతతో అన్ని రంగాలలో ఉజ్వలంగా ముందుకు పోగలదన్న విశ్వాసం ఇది కలిగిస్తున్నది.
భారతదేశాన్ని పది ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా రూపొందించే దిశగా భవిష్యత్‌ను దర్శిస్తున్నాం.
మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను చూడాలనుకుంటున్నాం.
అపరిమిత స్టార్టప్‌ల దేశంగా ఇండియాను రూపొందించాలనుకుంటున్నాం.
పునరుత్పాదక ఇంధన వనరుల విషయంలో అంతర్జాతీయ ప్రయత్నాలకు నాయకత్వం వహించాలనుకుంటున్నాం.
మేం ప్రజలకు ఇంధన భద్రత కల్పించాలను కుంటున్నాం.
దిగుమతులపై ఆధారపడడాన్ని బాగా తగ్గించాలని మేం కోరుకుంటున్నాం.
ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో, ఇంధనాన్ని భద్రపరిచే ఉపకరణాల విషయంలో భారతదేశాన్ని ప్రపంచానికి నాయకత్వ స్థానంలో ఉంచాలని భావిస్తున్నాం.
ఈ లక్ష్యాలు మనసులో పెట్టుకుని , నవభారత నిర్మాణానికి , మన కలల్ని సాకారం చేసుకోవడానికి మనం పునరంకిత మవుదాం.
ధన్యవాదాలు