At every level of education, gross enrolment ratio of girls are higher than boys across the country: PM Modi
Lauding the University of Mysore, PM Modi says several Indian greats such as Bharat Ratna Dr. Sarvapalli Radhakrisnan has been provided new inspiration by this esteemed University
PM Modi says, today, in higher education, and in relation to innovation and technology, the participation of girls has increased
In last 5-6 years, we've continuously tried to help our students to go forward in the 21st century by changing our education system: PM Modi on NEP

నమస్కారం !
కర్ణాటక గవర్నర్, మైసూర్ విశ్వవిద్యాలయం ఛాన్సలర్ శ్రీ వాజు భాయ్ వాలా గారు, కర్ణాటక విద్యాశాఖ మంత్రి డాక్టర్ సి.ఎన్.అశ్వత్ నారాయణ్ గారు, మైసూర్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్.జి.హేమంత్ కుమార్ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, లేడీస్ అండ్ జెంటిల్మెన్! మొదటగా మీ అందరికీ, 'మైసూరు దసరా', 'నడ హబ్బా శుభాకాంక్షలు!
 
కొద్దిసేపటి క్రితం నేను కొన్ని ఛాయాచిత్రాలను చూస్తున్నాను., ఈ సారి కరోనా ప్రమాదం కారణంగా, అనేక ఆంక్షలు ఉండవచ్చు, కానీ ఉత్సవం యొక్క ఉత్సాహం మునుపటి వలెనే ఉంది. అయితే ఈ ఉత్సాహాన్ని కొద్ది రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలు అడ్డుపడే ప్రయత్నం చేశాయి. బాధిత కుటుంబాలకు నా సంతాపం. బాధితులకు ఉపశమనం కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం, కర్ణాటక ప్రభుత్వం సహాయ చర్యలు చేపడుతున్నాయి.

మిత్రులారా, ఈ రోజు మీకు చాలా ముఖ్యమైన రోజు. నిజానికి, ఇలాంటి సందర్భాల్లో, నేను నా యువ స్నేహితులతో ముఖాముఖి కూర్చుని మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. మైసూర్ విశ్వవిద్యాలయం యొక్క అద్భుతమైన వారసత్వాన్ని దృష్టిలో ఉంచుకుని 100 వ కాన్వొకేషన్ వేడుకకు హాజరుకావడం ఖచ్చితంగా గర్వించదగ్గ విషయం. కానీ ఈసారి మనం వ్యక్తిగతంగా కాకుండా వర్చువల్ గా కలుస్తున్నాం . ఘతి-కోత్సవడ ఇ స్మరణ్య సమరన్-భదా సందర్భా-డల్లి నిమ్గెల్లారిగు అభినందనే-గాడు. ఇందూ డిగ్రీ సర్టిఫికేట్ పాడేయుత్తిరు ఎల్లిరిగు శుభాసయ-గాడు.బోధకా సిబ్బందిగూ శుభాశయ- గడన్న కొరుత్తేనే. 

మిత్రులారా, మైసూరు విశ్వవిద్యాలయం ప్రాచీన భారతదేశ సుసంపన్నమైన విద్యా వ్యవస్థ మరియు భావి భారతదేశ ఆకాంక్షలు, సామర్ధ్యాలకు ప్రధాన కేంద్రము. విశ్వవిద్యాలయం "రాజర్షి" నలవాడి కృష్ణరాజ్ వదియార్ మరియు ఎం.విశ్వేశ్వరయ్య గారి దార్శనికత మరియు సంకల్పాలను సాకారం చేసింది.

సరిగ్గా 102 సంవత్సరాల క్రితం, ఈ రోజు, రాజర్షి నల్వాడి కృష్రాజ్ వడయార్ మొదటి మైసూరు విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో ప్రసంగించడం నాకు చాలా సంతోషకరమైన విషయం. అప్పటి నుంచి రత్న గర్భ ప్రాంగణం, ఇటువంటి అనేక మంది సహచరులు ఇదే విధమైన కార్యక్రమంలో దీక్ష చేపట్టడం చూశారు, వీరు దేశ నిర్మాణంలో గణనీయమైన సహకారం అందించారు.. భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వంటి ఎందరో మహానుభావులు ఈ విద్యా సంస్థలో ఎందరో విద్యార్థులకు నూతన స్ఫూర్తిని అందించారు. అటువంటి పరిస్థితిలో, మీ కుటుంబంతో పాటు మా అందరి నమ్మకం కూడా మీ పై ఎక్కువగా ఉంటుంది మరియు అంచనాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ రోజు మీ విశ్వవిద్యాలయం, మీ ప్రొఫెసర్లు, ఉపాధ్యాయులు మీ డిగ్రీతో పాటు దేశం మరియు సమాజం పట్ల మీ బాధ్యతను అప్పగిస్తున్నారు.

మిత్రులారా, విద్య మరియు దీక్ష, యువత జీవితంలో రెండు ముఖ్యమైన దశలుగా భావిస్తారు. వేలాది సంవత్సరాలుగా మనకు ఈ సంప్రదాయం ఉంది. మనం దీక్ష గురించి మాట్లాడేటప్పుడు, దీక్ష అంటే డిగ్రీ పొందడం మాత్రమే కాదు. జీవితంలో తదుపరి లక్ష్యాన్ని సాధించడానికి కొత్త తీర్మానాలు చేయడానికి ఈ రోజు మనకు స్ఫూర్తినిస్తుంది. ఇప్పుడు మనమందరం ఒక అధికారిక విశ్వవిద్యాలయ ప్రాంగణం నుండి విస్తారమైన నిజ జీవిత విశ్వవిద్యాలయ ప్రాంగణంలోకి వెళ్తున్నాము. మీరు ఈ ప్రాంతంలో సంపాదించిన జ్ఞానాన్ని జీవిత రంగంలో ఉపయోగించాలనుకుంటున్నారు.

మిత్రులారా, గొప్ప కన్నడ రచయిత మరియు ఆలోచనాపరుడు గోరురు రామస్వామి అయ్యంగార్ ఇలా అన్నారు – శిక్షాన్వే జీవనాద్ బెల్కు. అంటే, విద్య అనేది జీవితంలో కష్టమైన మార్గాల్లో వెలుగునిచ్చే మాధ్యమం. మన దేశంలో గొప్ప మార్పు జరుగుతున్న సమయంలో, ఆయన మాటలు చాలా నమ్మకంగా ఉన్నాయి. గత ఐదారు సంవత్సరాల   నుండి, 21 వ శతాబ్దపు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగే విద్యార్థుల అవసరాలకు అనుకూలంగా మన విద్యావ్యవస్థ, భారతదేశంలోని విద్యావ్యవస్థ వారికి మరింత సహాయ పడుతుంది . ఉన్నత విద్యారంగంలో మౌలిక సదుపాయాల కల్పన నుండి నిర్మాణాత్మక సంస్కరణలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. భారతదేశాన్ని ఉన్నత విద్య కు  ప్రపంచ కేంద్రంగా మార్చడానికి, మన యువతను మరింత పోటీగా మార్చడానికి ప్రతి స్థాయిలో, గుణాత్మకంగా మరియు పరిమాణాత్మకంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

మిత్రులారా, స్వాతంత్ర్యం పొందిన చాలా సంవత్సరాల తరువాత కూడా, 2014 వరకు దేశంలో 16 ఐఐటిలు ఉన్నాయి. గత ఆరు సంవత్సరాల్లో సగటున ప్రతి సంవత్సరం ఒక నూతన ఐఐటి ప్రారంభించబడింది. వాటిలో ఒకటి కర్ణాటకలోని ధార్వాడ్ వద్ద ఉంది. భారతదేశంలో ట్రిపుల్ ఐటిల సంఖ్య 2014 వరకు 9 గా ఉంది, ఆ తర్వాత  ఐదేళ్లలో 16 ట్రిపుల్ ఐటిలను ఏర్పాటు చేయడం జరిగింది. గత ఐదు-ఆరు సంవత్సరాలలో 7 కొత్త ఐఐఎంలు ఏర్పాటు చేయబడ్డాయి. దీనికి ముందు దేశంలో 13 ఐఐఎంలు ఉండేవి. అదే పంథాలో, దాదాపు ఆరు దశాబ్దాలుగా, దేశం కేవలం ఏడు ఎయిమ్స్ ద్వారా సేవలను అందుకుంటోంది. 2014 తర్వాత  వీటికి రెండు రేట్లు, అంటే  దేశంలో 15 ఎయిమ్స్ ఏర్పాటు చేయబడ్డాయి లేదా ప్రారంభమయ్యే దశలో ఉన్నాయి.

మిత్రులారా, గత ఐదు లేదా ఆరు సంవత్సరాల్లో ఉన్నత విద్యారంగంలో కొనసాగుతున్న ప్రయత్నాలు నూతన సంస్థలను ప్రారంభించటానికి మాత్రమే పరిమితం కాలేదు. పరిపాలన సంస్కరణల నుండి లింగ వివక్షను తొలగించడానికి అలాగే సామాజిక చేరికను నిర్ధారించడానికి ఈ సంస్థలలో కూడా పనులు జరిగాయి. అటువంటి సంస్థలకు మరింత స్వయంప్రతిపత్తి కూడా ఇవ్వబడుతుంది, తద్వారా వారు వారి అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవచ్చు. మొదటి ఐఐఎం చట్టం ప్రకారం దేశవ్యాప్తంగా ఐఐఎంలకు అధిక అధికారాలు ఇచ్చారు. వైద్య విద్యారంగంలో పారదర్శకత లేకపోవడం, దానిని అధిగమించడంపై దృష్టి పెట్టారు. దేశంలో వైద్య విద్యారంగంలో పారదర్శకత ఉండేలా నేడు జాతీయ వైద్య కమిషన్‌ను ఏర్పాటు చేశారు. హోమియోపతి మరియు ఇతర భారతీయ చికిత్సల అధ్యయనాన్ని మెరుగుపరచడానికి రెండు కొత్త చట్టాలను కూడా రూపొందిస్తున్నారు. వైద్య విద్యలో జరుగుతున్న సంస్కరణల వల్ల దేశంలోని యువతకు వైద్య విద్యలో ఎక్కువ సీట్లు వస్తున్నాయి.

మిత్రులారా, రాజర్షి నల్వాడి కృష్ణరాజ్ వడేయర్ మొదటి కాన్వొకేషన్ వేడుకలో ప్రసంగిస్తూ, ఒకరికి బదులుగా పది మంది మహిళా గ్రాడ్యుయేట్లను చూస్తే నేను సంతోషంగా ఉండేవాడిని. ఈ రోజు నా ముందు నేను చాలా మంది అమ్మాయిలను చూస్తున్నాను, ఈ రోజు పట్టభద్రులయ్యారు. ఈ రోజు గ్రాడ్యుయేషన్ చేస్తున్న విద్యార్థులలో అబ్బాయిల కంటే ఎక్కువ మంది బాలికలు ఉన్నారని నాకు చెప్పబడింది. మారుతున్న భారతదేశం యొక్క మరొక గుర్తింపు ఇది. విద్య యొక్క ప్రతి స్థాయిలో దేశంలో బాలికల సగటు నమోదు అబ్బాయిల కంటే ఎక్కువగా ఉంటుంది. ఉన్నత విద్యారంగంలో కూడా, ఇన్నోవేషన్, టెక్నాలజీకి సంబంధించిన కోర్సుల్లో బాలికల సంఖ్య పెరిగింది. నాలుగేళ్ల క్రితం దేశంలోని ఐఐటిలలో ఎనిమిది శాతం మంది బాలికలు మాత్రమే ఉన్నారు. ఆ సంఖ్య ఈ సంవత్సరం రెట్టింపు కంటే ఎక్కువై  20 శాతానికి పెరిగింది.

మిత్రులారా, నూతన జాతీయ విద్యా విధానం విద్యా రంగంలో చోటుచేసుకున్న అన్ని సంస్కరణలకు నూతన దిశను, నూతన  ఉత్సాహాన్ని ఇస్తాయి. శిశు తరగతి నుండి పీహెచ్‌డీ వరకు దేశంలోని మొత్తం విద్యా నిర్మాణంలో ప్రాథమిక మార్పు తీసుకురావడానికి జాతీయ విద్యా విధానం ఒక ప్రధాన ప్రచారం. మన దేశంలోని శక్తివంతమైన యువతను మరింత పోటీగా మార్చడానికి బహుముఖ విధానంపై దృష్టి కేంద్రీకరించబడింది. మారుతున్న ఉద్యోగాల స్వభావానికి మన యువతను అలవాటు చేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్కిల్లింగ్, రీ-స్కిల్లింగ్ మరియు అప్-స్కిల్లింగ్ అనేవి నేటి అతిపెద్ద అవసరాలు.. జాతీయ విద్యా విధానంలో దీనికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడింది.

మిత్రులారా, మైసూర్ విశ్వవిద్యాలయం ఈ విధానాన్ని అమలు చేయడానికి నిబద్ధత మరియు సంసిద్ధతను చూపించినందుకు నేను సంతోషంగా ఉన్నాను. ఈ వ్యూహం ఆధారంగా మీరు బహుళ ఎంపిక కోర్సును ప్రారంభిస్తున్నారని నేను భావిస్తున్నాను. ఇప్పుడు మీరు మీ కలలు మరియు బలాలకు తగిన అంశాలను ఎంచుకోవచ్చు. మీరు ఒకే సమయంలో గ్లోబల్ టెక్నాలజీ మరియు స్థానిక సంస్కృతిని అధ్యయనం చేయవచ్చు. స్థానిక వ్యవహారాల అభివృద్ధికి మీరు సాంకేతికతను ఉపయోగించవచ్చు.

మిత్రులారా, మన దేశంలో జరుగుతున్న ఈ సర్వతోముఖసంస్కరణలను ఇంతకు ముందెన్నడూ చూడలేదు.. గతంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ఏదో ఒక రంగంలో మాత్రమే, ఇతర రంగాలకు మినహాయింపు ఇచ్చారు. గత 6 సంవత్సరాల్లో బహుళ సంస్కరణలు జరిగాయి, బహుళ రంగాలలో సంస్కరణలు జరిగాయి. దేశ విద్యా రంగం యొక్క భవిష్యత్తును ఎన్‌ఇపి నిర్ధారిస్తుంటే, అది మీలాంటి యువ మిత్రులకు సాధికారతను కల్పిస్తుంది… వ్యవసాయ సంస్కరణలు రైతులను శక్తివంతం చేస్తుంటే, కార్మిక సంస్కరణలు కార్మిక మరియు పరిశ్రమలకు వృద్ధి, భద్రత మరియు ఉత్సాహాన్ని ఇస్తున్నాయి.. ప్రత్యక్ష ప్రయోజన బదిలీలు మన ప్రజా పంపిణీ వ్యవస్థలో మెరుగుదలలను చూశాయి, మన గృహ కొనుగోలుదారులకు రెరా నుండి రక్షణ లభించింది. పన్ను వల నుండి దేశాన్ని విముక్తి చేయడానికి జీఎస్టీని తీసుకువస్తే, పన్ను చెల్లింపుదారుడిని ఇబ్బందుల నుండి కాపాడటానికి ఫేస్‌లెస్ అసెస్‌మెంట్ సౌకర్యం ఇటీవల ప్రవేశపెట్టబడింది. దివాలా మరియు దివాలా కోడ్ దివాలా సమస్యకు చట్టపరమైన చట్రాన్ని రూపొందించింది, తద్వారా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రంగంలో సంస్కరణల ద్వారా మన దేశంలో పెట్టుబడులు పెరుగుతాయి.

మిత్రులారా, గత 6-7 నెలల కాలంలో సంస్కరణల వేగం, పరిధి రెండూ పెరుగుతున్నాయని మీరు గమనించి ఉంటారు.. వ్యవసాయం, అంతరిక్షం, రక్షణ, విమానయానం, కార్మిక రంగం వంటివి ప్రతి రంగంలోనూ అభివృద్ధి చెందడానికి అవసరమైన మార్పులు చోటు చేసుకోవడం జరుగుతుంది.. ఇది దేని కోసం చేస్తున్నారు? మీలాంటి కోట్ల మంది యువతక కోసం ఈ మార్పులు చేస్తున్నారు. ఈ దశాబ్దాన్ని భారత్ దశాబ్దంగా తీర్చిదిద్దే ప్రయత్నం జరుగుతోంది.  ఈ రోజు మన పునాదిని బలోపేతం చేస్తేనే, ఈ దశాబ్దం భారత దశాబ్దం అని పిలువబడుతుంది. ఈ దశాబ్దం యువ భారత జీవితంలో గొప్ప అవకాశాలను తెచ్చిపెట్టింది.

మిత్రులారా, దేశంలోని అత్యుత్తమ విద్యా సంస్థ అయిన మైసూర్ యూనివర్సిటీ కూడా ప్రతి కొత్త పరిస్థితులకు అనుగుణంగా ఆవిష్కరణ లు చేయాల్సి ఉంటుంది.  మాజీ ఛాన్సలర్, గొప్ప కవి-సాహిత్యవేత్త 'కువెంపు' గారు విశ్వవిద్యాలయ ప్రధాన క్యాంపస్‌కు   'మన్-సాగంగోత్రి' అని పేరు పెట్టారు, అంటే మనస్సు యొక్క శాశ్వతమైన ప్రవాహం ', దీని నుండి మీరు నిరంతరం ప్రేరణ పొందాలని కోరుకుంటారు. మీరు ఇంక్యుబేషన్ సెంటర్, టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్, పరిశ్రమ మరియు విద్య మధ్య సంబంధం, అలాగే ఇంటర్ డిసిప్లినరీ పరిశోధనలపై ఎక్కువ దృష్టి పెట్టాలి. సమకాలీన మరియు ప్రపంచ సమస్యలతో పాటు స్థానిక సంస్కృతి, స్థానిక కళ మరియు ఇతర సామాజిక సమస్యలకు సంబంధించిన పరిశోధనలను ప్రోత్సహించే సంప్రదాయాన్ని కూడా ఈ విశ్వవిద్యాలయం విస్తరిస్తుందని భావిస్తున్నారు.

మిత్రులారా, ఈ రోజు మీరు ఈ గొప్ప క్యాంపస్ నుండి బయటికి వెళుతున్నారు. ఈ సమయంలో, మీ సామర్ధ్యాలు, బలాల ఆధారంగా ఉత్తమమైన వాటిని సాధించడానికి ప్రయత్నిస్తూ ఉండాలని మీ అందరిని నేను కోరుతున్నాను. ఒక నిర్దిష్ట చుట్టుకొలతలో చిక్కుకోవటానికి, ఒక నిర్దిష్ట మూసకు తనను తాను పరిమితం చేసుకోవలసిన అవసరం లేదు. మీరు సరిపోయే ప్రయత్నం చేస్తున్న పెట్టె మీ కోసం రూపొందించబడి ఉండకపోవచ్చు. మీ కోసం సమయాన్ని వెచ్చించండి, ఆత్మపరిశీలన చేసుకోండి మరియు జీవితం మీ ముందు అందించే ప్రతిదాన్ని అనుభవించండి, దాని నుండి మనమందరం ముందుకు వెళ్ళే మార్గాన్ని ఎంచుకోవచ్చు. నవభారతం అవకాశాల భూమి. కరోనా సంక్షోభ సమయంలో కూడా, మన విద్యార్థులు చాలా కొత్త స్టార్టప్‌లను ప్రారంభించినట్లు మీరు గమనించి ఉండవచ్చు. ఈ స్టార్టప్ లు కర్ణాటకకే కాదు, దేశ పటిష్టతకు కూడా నాంది. అసంఖ్యాక అవకాశాలు ఉన్న ఈ భూమిలో, మన శక్తి మరియు ప్రతిభతో దేశం కోసం ఎంతో కృషి చేస్తామని నేను నమ్ముతున్నాను. మనందరి అభివృద్ధి మనకు మాత్రమే పరిమితం కాదు, అది దేశ అభివృద్ధి కూడా అవుతుంది. మీరు స్వావలంబన పొందినప్పుడు, దేశం కూడా స్వావలంబన అవుతుంది. నేను మరోసారి నా స్నేహితులందరి మంచి ఉజ్వలమైన భవిష్యత్తుకై శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 

చాలా చాలా ధన్యవాదాలు .

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Mutual fund industry on a high, asset surges Rs 17 trillion in 2024

Media Coverage

Mutual fund industry on a high, asset surges Rs 17 trillion in 2024
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Chief Minister of Andhra Pradesh meets Prime Minister
December 25, 2024

Chief Minister of Andhra Pradesh, Shri N Chandrababu Naidu met Prime Minister, Shri Narendra Modi today in New Delhi.

The Prime Minister's Office posted on X:

"Chief Minister of Andhra Pradesh, Shri @ncbn, met Prime Minister @narendramodi

@AndhraPradeshCM"