‘ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్’ తాలూకు భావ‌న నేటి యువ‌త‌రం మాన‌సికావ‌స్థ తో స‌రిపోయిన‌ట్లుగా ఉంది: ప్ర‌ధాన మంత్రి
క్రికెట్ లో ఆస్ట్రేలియా పై భార‌త‌దేశం సాధించిన విజ‌యం కొత్త యువ భార‌త్ స్వభావాన్ని క‌ళ్ళ‌ కు క‌డుతోంది: ప్ర‌ధాన మంత్రి
ఎన్ఇపి మ‌న విద్య వ్య‌వ‌స్థ ను డేటా, డేటా-ఎన‌లిటిక్స్ కోసం స‌న్న‌ద్ధం చేస్తుంది: ప్ర‌ధాన మంత్రి

నమస్కార్!

అస్సాం గవర్నర్ ప్రొఫెసర్ జగదీశ్ ముఖీ గారూ, కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ రమేశ్ పోఖరియాల్ నిశంక్ గారూ , అస్సాం ముఖ్యమంత్రి శ్రీ సర్వానంద సోనోవాల్ జీ, తేజ్ పూర్ యూనివర్సిటీ వైస్ చాన్స్ ల్ ప్రొఫెసర్ వీ కే జైన్ గారూ, ఇతర బోధనా సిబ్బంది, తేజపూర్ యూనివర్సిటీలోని ప్రతిభావంతులైన, తేజోవంతులైన నా ప్రియమైన విద్యార్థులారా...

నేడు పన్నెండు వందల మందికి పైగా విద్యార్ధులకు తమ జీవితమంతా గుర్తుంచుకునే రోజు. మీ బోధకులు, ఫ్రొఫెసర్లు, మీ తల్లిదండ్రులకు కూడా ది చాలా ముఖ్యమైన రోజు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ వృత్తిజీవితంతో పాటు తేజ్ పూర్ యూనివర్సిటీ పేరు నేటి నుండి సదా సర్వదా ముడిపడిపోయింది. మీరు ఎంత సంతోషంగా ఉన్నారో, నేనూ అంతే సంతోషంగా ఉన్నాను. నేడు మీరు భవిష్యత్తు ఎన్ని ఆశలను కలిగున్నారో, అంతే నమ్మకం మీ అందరిపైనా నాకుంది. మీరు తేజ్ పూర్ లో ఉండి తేజపూర్ విశ్వవిద్యాలయంలో నేర్చుకున్న విషయాలన్నీ అస్సాం పురోగతిని, దేశపురోగతిని కొత్త ఎత్తులకు తీసుకువెళ్తాయని నాకు నమ్మకం ఉంది.

మిత్రులారా

నా ఈ నమ్మకానికి అనేక కారణాలున్నాయి. మొదటి కారణం – తెజపూర్ లోని ఈ చారిత్రిక స్థలం, ఇక్కడి పురాణగాథలనుంచి లభించే ప్రేరణ. రెండవది – తేజ్ పూర్ విశ్వవిద్యాలయంలో మీరు చేస్తున్న పని గురించి నాకు చెప్పారు. అది చాలా ఉత్సాహాన్ని నింపుతంది. మూడవది – తూర్పు భారత దేశపు సామర్థ్యం విషయంలో, ఇక్కడి ప్రజలు, ఇక్కడి యువకుల సామర్థ్యాల విషయంలో, జాతి నిర్మాణ యత్నాల్లో కేవలం నాకే కాదు, యావద్దేశానికి అచంచలమైన విశ్వాసం ఉంది.

మిత్రులారా

ఇందాక పురస్కారాలు, పతకాలు ఇచ్చే ముందు యూనివర్సిటీ గీతాన్ని గానం చేశారు. అందులో నిహితమైన భావన తేజపూర్ యొక్క గొప్ప చరిత్రకు నమోవాకాలు అర్పించడం జరిగింది. అందులోని కొన్ని పంక్తులను మళ్లీ పలకదలచుకున్నాను. ఎందుకు ఉటంకించదలచుకున్నానంటే ఈ పంక్తుల్లో అస్సాం తాలూకు ఘనతను భారతరత్న భూపేన్ హజారికా రచించారు. ఆయన ఇలా వ్రాశారు. “అగ్నిగఢర్ స్థాపత్య, కలియాభోమొరార్ సేతు నిర్మాణ్, జ్ఞాన్ జ్యతిర్మయ్, సేహి స్థానతే విరాజిసే తేజ్ పూర్ విశ్వవిద్యాలయ్” అంటే అగ్నిగఢ్ గఢ్ స్థాపత్య కళ, కలియా భమరా వంతెన నిర్మాణం, జ్యోతిర్మయమైన జ్ఞానం, ఈ చోటే తేజపూర్ విశ్వవిద్యాలయం విరాజిల్లుతోందని అర్థం. ఈ మూడంటే మూడు వాక్యాల్లో భూపేన్ దా ఎంత విపులమైన వివరణను ఇచ్చారో కదా. అగ్నిగఢ్, రాజకుమారుడు అనిరుద్ధుడు, రాజకుమారి ఉష, శ్రీ కృష్ణ భగవానులతో ముడిపడ్డ చరిత్ర, అహోం శూరవీరుడు కలియా భొమొరా ఫుకన్ దూరదృష్టి, జ్ఞాన భాండాగారం – ఇవన్నీ తేజపూర్ అందిస్తున్న ప్రేరణ. భూపేన్ దా తో పాటే జ్యోతిప్రసాద్ అగ్రవాల్, విష్ణు ప్రసాద్ రాభా వంటి మహాపురుషులు తేజపూర్ ఔన్నత్యానికి ప్రతీకలు. మీరు వీరి జర్మ భూమిలో, జన్మభూమిలో చదువుకున్నారు. అందుకే మీ పట్ల గర్వంగా అనిపించడం, గౌరవం వల్ల ఆత్మవిశ్వాసం నిండిన జీవితాలు రూపొందడం అత్యంత సహజమైన అంశాలు.

మిత్రులారా

మన దేశం ఏ ఏడాది స్వాతంత్ర్యాన్ని సాధించి 75 వ సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. శతాబ్దాల బానిసత్వం నుంచి విముక్తినివ్వడంలో అస్సాం కి చెందిన అగణిత వీరుల పాత్ర ఉంది. ఆరోజుల్లో నివసించిన వారు స్వాతంత్ర్యం కోసం తమ జీవితాలను ఇచ్చారు, తమ యౌవనాన్ని సమర్పించారు. ఇప్పుడు మనం నవ భారతం కోసం, ఆత్మనిర్భర భారతం కోసం జీవించి చూపించాలి. జీవితాలను సార్థకం చేసుకోవాలి. ఇప్పట్నుంచి స్వాతంత్యానికి వందసంవత్సరాలు పూర్తయ్యేవరకూ ఉన్న ఈ 25-26 ఏళ్లు మీ జీవితంలో కూడా సువర్ణ కాలం. ఒక్కసారి ఊహించుకొండి. 1920-21 లో ఇప్పుడు మీ వయసులోనే ఉన్న యువకులు, యువతులు ఆ రోజుల్లో ఏయే కలలను చూసి ఉంటారో? ఏయే అంశాల కోసం తమ జీవితాలను సమర్పించుకున్నారో, ఏ విషయాలకోసం తమను తాము సమర్పించుకున్నారో ఊహించుకొండి. వందేళ్ల క్రితం మీ వయసులోనే ఉన్న వారు ఏం చేశారో ఊహించుకుంటే మీరు ఏం చేయగలరన్న విషయం మీకే బోధపడుతుంది. ఈ సమయం మీకు బంగరుకాలమన్న విషయం కూడా సులువుగానే అర్థమైపోతుంది. తేజపూర్ తేజస్సు భారతదేశంలోనే కాదు, ప్రపంచమంతటా విస్తరింపచేయండి. అస్సాంను, ఈశాన్య భారతాన్ని అభివృద్ధి శిఖరాలకు తీసుకువెళ్లండి. మా ప్రభుత్వం ఈశాన్య భారతదేశపు అభివృద్ధిలో ఎలా పనిచేస్తోందో, ఎలా విద్య, వైద్య, కనెక్టివిటీలతో సహా అన్ని రంగాల్లో పనిచేస్తోందో చూస్తే అర్థమైతే ఎన్ని కొత్త కొత్త అవకాశాలు ఏర్పాటవుతున్నాయో అర్థమౌతుంది. ఈ అవకాశాలనుంచి పూర్తి లాభాన్ని పొందండి. మీ ప్రయత్నాలు మీలో ఆ సామర్థ్యం ఉందని, కొత్తగా ఆలోచించే, కొత్తగా ఏదో చేసే నైపుణ్యం ఉందని కూడా తెలియచేస్తున్నాయి.

మిత్రులారా

తేజ్ పూర్ యూనివర్సిటీకి ఇన్నొవేషన్ సెంటర్ కారణంగా మంచి గుర్తింపు ఉంది. తమ తృణమూల స్థాయి ఇన్నొవేషన్లు, వోకల్ ఫర్ లోకల్ కు అవి వేగాన్ని, కొత్త బలాన్ని ఇస్తున్నాయి. ఈ ఇన్నొవేషన్లు స్థానిక సమస్యల పరిష్కారానికి కూడా పనికివస్తాయి. దీని వల్ల అభివృద్ధి ద్వారాలు కూడా తెరుచుకుంటున్నాయి. మీ కెమికల్ సైన్సెస్ విభాగం వారు చాలా తక్కువ ఖర్చుతో నీటిని శుద్ధీకరించే టెక్నాలజీపైన పరిశోధనలు చేసిందని నాకు చెప్పారు. దీని వల్ల అస్సాంలోని అనేక గ్రామాలకు లాభం చేకూరుతుంది. ఈ టెక్నాలజీని ఛత్తీస్ గఢ్, ఒడిశా, బీహార్, కర్నాటక, రాజస్థాన్ వంటి రాష్ట్రాలకు కూడా విస్తరించవచ్చునని నాకు తెలియచేశారు. అంటే మీ కీర్తి పతాక ఇప్పుడు మరిన్ని ప్రాంతాలకు విస్తరించిందన్నమాట. భారత దేశంలో ఇలాంటి టెక్నాలజీని వికసింపచేయడం ద్వారా ప్రతి ఇంటికి నీటిని అందించే జల్ జీవన్ మిషన్ కు మరింత బలం చేకూరుతుంది.

మిత్రులారా

నీటితో పాటు గ్రామాల్లో వ్యర్థాల నుంచి విద్యుత్తు తయారు చేసే బాధ్యతలను మీరు నెత్తిన వేసుకున్నారు. దీని ప్రభావం కూడా చాలా విస్తృతమైనది. పంటల కోత తరువాత మిగిలిన అవశేషాలు మన రైతులకు, మన పర్యావరణానికి చాలా పెద్ద సవాలు. బయో గ్యాస్, బయో ఫర్టిలైజర్స్ కి సంబంధించిన చాలా తక్కువ ఖర్చుతో కూడిన, ప్రభావవంతమైన టెక్నాలజీ పై మీ యూనివర్సిటీలో జరుగుతున్న పని వల్ల కూడా దేశంలోని ఒక పెద్ద సమస్యకు పరిష్కారం లభిస్తుంది.

మిత్రులారా

తేజ్ పూర్ యూనివర్సిటీ ఈశాన్య భారతపు జీవ వైవిధ్యం, ఇక్కడి విలువైన వారసత్వ సంపదను కాపాడేదిశగా ఒక కార్యక్రమాన్ని చేపట్టిందని కూడా నాకు తెలియచేశారు. ఈశాన్యభారతదేశానికి చెందిన వనవాసి సమాజంలో ఉన్న వివిధ భాషలు అంతరించిపోయే ప్రమాదాన్నిఎదుర్కొంటున్నాయి. వాటిని డాక్యుమెంట్ చేయడం అభినందనీయం. ఇదే విధంగా శ్రీమంత శంకరదేవుల జన్మభూమి నవగావ్ జిల్లా లోని బటద్రవ స్థానంలో శతాబ్దాల క్రితం చెక్కలపై చెక్కిన దారు కళను పరిరక్షించే విషయంలో, బానిస యుగంలో అస్సాంలో లిఖితమైన పుస్తకాలు, పత్రాల డిజిటలీకరణ వంటి అనేకపనులను మీరు చేపడుతున్నారు. ఇంత సుదూర ప్రాంతంలో ఈశాన్యంలోని ఒక మూలన తేజ్ పూర్ లో ఈ తపస్సు కొనసాగుతోందని, సాధన కొనసాగుతున్నది తెలిస్తే గర్వం కలుగుతుంది. మీరునిజంగా అద్భుతాలు చేస్తున్నారు.

మిత్రులారా

ఇవన్నీ తెలుసుకున్నాక మీకు స్థానిక అంశాలపైన, స్థానిక ఆవసరాల పట్ల పనిచేయాలని, పరిశోధించాలన్న ఈ ప్రేరణ ఎక్కడి నుంచి వచ్చిందన్న ప్రశ్నకూడా మనసులో తలెత్తింది. ఈ ప్రశ్నకు జవాబు మీ క్యాంపస్ నుంచి, మీ హాస్టల్స్ నుంచి లభిస్తుంది. చరాయిదేవ్, నీలాచల్, కాంచన్ జంఘా, పట్ కాయి, ధన్ సిరి, సుబన్ సిరి, కపిలి ఈ హాస్టళ్లని పర్వతాల పేరిట, నదుల పేరిట, శిఖరాల పేరిట ఉన్నాయి. ఇవి కేవలం పేర్లు మాత్రమే కావు. ఇవి సజీవ ప్రేరణాదాయకాలు. జీవన యాత్రలో మనకు అనేక సమస్యలను అధిగమించాల్సి ఉంటుంది పర్వతాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. నదులను దాటాల్సి వస్తుంది. ఏదో ఒక సారి కాద్. మీరు ఒక కొండను అధిగమించి ఇంకో కొండ వైపు వెళ్తారు. ప్రతి పర్వతారోహణతో కొత్త సంగతులు తెలుస్తాయి. మీ నైపుణ్యాలు కూడా పెరుగుతాయి. కొత్త సవాళ్ల విషయంలో మీకు దృక్పథాలు ఏర్పడతాయి. ఇదే విధంగా నదులు కూడా మనకు చాలా విషయాలను నేర్పిస్తాయి. నదులు అనేక చిన్న చిన్న ధారలు కలవడం ద్వారా ఏర్పడతాయి. తరువాత సముద్రంలో కలిసిపోతాయి. మనం కూడా జీవితంలో వివిధ వ్యక్తుల నుంచి జ్ఞానాన్ని పొందవచ్చు. నేర్చుకోవచ్చు. ఈ నేర్చుకున్న అంశాల ఆధారంగా ముందుకు సాగాలి. మన లక్ష్యాన్ని చేరుకోవాలి.

మిత్రులారా

ఇదే దృక్పథంతో మీరు ముందుకు వెళ్లతే అస్సాం, ఈశాన్య భారతం, భారత దేశాల అభివృద్ధిలో మీ పాత్ర ఉంటుంది. ఈ కరోఆ సమయంలో ఆత్మనిర్భర్ భారత్ మన పదజాలంలో ప్రధాన అంతర్భాగంగా మారిపోవడాన్ని కూడా మనం చూశాము. ఇది మన కలలతో కలగలిసిపోయింది. మన పురుషార్థం, మన సంకల్పం, మన సిద్ధి, మన ప్రయత్నాలు అన్నీ దీని చుట్టూ తిరగడాన్ని చూడా మనం చూస్తున్నాం. ఇంతకీ ఈ ఉద్యమం ఏమిటి? ఎలాంటి మార్పు వస్తోంది? ఈ మార్పు కేవలం వనరుల విషయంలోనేనా? కేవలం భౌతికంగా మౌలిక వసతుల విషయంలోనేనా?

ఈ మార్పు కేవలం టెక్నాలజీలోనేనా? కేవలం ఆర్థిక, వ్యూహాత్మక శక్తి విషయంలోనేనా? ఈ ప్రశ్నలన్నిటికీ అవుననే జవాబు వస్తుంది. కానీ నిజానికి వీటన్నిటికన్నా పెద్ద మార్పు స్వభావం విషయంలో, చర్య విషయంలో, ప్రతి చర్య విషయంలో వస్తోంది. ప్రతి సవాలు, ప్రతి సమస్య ను ఎదుర్కొనే విషయంలో మన యువభారతం శైలి, దేశ ప్రజల ధోరణి మిగతా ప్రపంచం కన్నా భిన్నంగా ఉంది. దీనికి ఇటీవలి భారతీయ క్రికెట్ టీమ్ ఆస్ట్రేలియా పర్యటన ఒక ఉదాహరణ. మీరు ఆ టూర్ ను గమనించే ఉంటారు. ఈ టూర్ లో మన టీమ్ ఎన్ని సమస్యలను ఎదుర్కోలేదు? మనం ఎంత ఘోరంగా ఓడిపోయామో అంతే త్వరగా లేచి నిలుచోగలిగాం. తరువాతి మ్యాచ్ ను గెలుచుకోగలిగాం. గాయాల బాధ ఉన్నప్పటికీ మన ఆటగాళ్లు మైదానంలో దృఢంగా నిలుచున్నారు. సవాళ్లతో కూడిన పరిస్థితుల్లోనూ నిరాశకు లోను కావడానికి బదులుగా మన యువ క్రీడాకారులు సవాళ్లను ఎదుర్కొన్నారు. కొత్త పరిష్కారాలను కనుగొన్నారు. కొందరు ఆటగాళ్లకు అనుభవం తక్కువగా ఉన్న మాట నిజమే. కానీ వారి ఉత్సాహానికి మాత్రం కొదవ లేదు. వారికి అవకాశం లభించగానే వారు చరిత్ర సృష్టించారు. ఒక మెరుగైన టీమ్ గా తమ ప్రతిభతో, తమ ఆలోచనా సరళితో, తమకన్నా ఎక్కువ అనుభవం ఉన్న, పాత ఆటగాళ్లున్న టీమ్ ను చిత్తు చేశారు.

యువ మిత్రులారా

క్రికెట్ మైదానంలో మన ఆటగాళ్ల ప్రదర్శన కేవలం ఆట దృష్ట్యానే ప్రముఖమైనది కాదు. దీనిలో ఒక జీవన గుణపాఠం ఉంది. మొదటి పాఠం ఏమిటంటే మన సామర్థ్యం పై మనకు నమ్మకం ఉండాలి. ఆత్మ విశ్వాసం ఉండాలి. రెండో పాఠం మన మనో భూమికకు సంబంధించింది. మనం సకారాత్మకమైన మనో భూమికతో ముందుకు వెళ్తే ఫలితం కూడా పాజిటివ్ గా ఉంటుంది. మూడో పాఠం అన్నిటికన్నా ప్రధానమైనది. ఒక వైపు ఏదో ఒక విధంగా సురక్షితంగా బయటపడే మార్గం ఉండి, కష్టంతో గెలిచే అవకాశం ఉన్నప్పుడు గెలిచేందుకు పోరాడటాన్నే ఎంచుకోవాలి. గెలిచే ప్రయత్నంలో ఒక్కోసార ఓడిపోయినా ఎలాంటి నష్టమూ లేదు. రిస్కు తీసుకోవాలి. ప్రయోగాలు చేయడానికి భయపడకూడదు. మనకం క్రియాశీలకంగా, నిర్భయంగా ఉండాల్సిందే. మన మనసుల్లో ఓడిపోతామేమోనన్న భయం కూడా ఉంటుంది. దీని వల్ల మనం అనవసరమైన ఒత్తిడికి లోనవుతాము. భయం నుంచి బయటకు వస్తే నిర్భయులుగా ఎదుగుతాం.

మిత్రులారా

ధైర్యం నిండి, లక్ష్య సాధనకు సమర్పితులైన భారతీయులు కేవలం క్రికెట్ మైదానంలోనే దొరుకుతారని అనుకోవద్దు. మీరు కూడా ఈ లక్షణాలకు ప్రతిరూపమే. మీలోనూ ఆత్మ విశ్వాసం నిండి ఉంది. మీరు కూడా కొత్తగా ఆలోచించగలుగుతున్నారు. ముందుకు వెళ్లే విషయంలో వెనుకాడరు. మీవంటి యువ శక్తే కరోనా వ్యతిరేక పోరరులో భారత్ కు బలాన్ని చేకూర్చింది. మీకు గుర్తుండే ఉంటుంది. ఈ పోరాటపు ప్రారంభ సమయంలో ఇంత జనాభా ఉన్న భారతదేశం, ఇంత తక్కువ వనరులు ఉన్న భారత దేశం కరోనా వల్ల పూర్తిగా ధ్వంసమైపోతుందని అనుమానాలు ఉండేవి. కానీ దృఢ సంకల్పం, కృతనిశ్చయం మీలో పుష్కలంగా ఉంటే వనరులు తయారు చేసుకోవడానికి సమయం పట్టదని మన దేశం నిరూపించింది. పరిస్థితులతో రాజీ పడకుండా, కష్టాలు పెరిగే దాకా ఆగకుండా, వేగంగా నిర్ణయాలు తీసుకుంది. క్రియాశీలకంగా నిర్ణయాలు తీసుకుంది. వీటి ఫలితంగా మన దేశంలో వైరస్ ప్రమాదకరంగా పెరగలేదు. మేడిన్ డియా పరిష్కారాలతో వైరస్ విస్తరణను మనం తగ్గించగలిగాం. మన ఆరోగ్య వసతులను మెరుగుపరచుకున్నాం. మన వ్యాక్సిన్ పరిశోధనలు, ఉత్పాదనలు మన దేశంతో పాటు ప్రపంచంఓ అనేక దేశాలకు సురక్షా కవచాన్ని అందించగలవనే విశ్వాసాన్ని ఇస్తున్నాయి.

మనం మన శాస్త్రవేత్తలు, పరిశోధకులు, పండితులు, విజ్ఞాన వేత్తలు, పరిశ్రమలపై నమ్మకం ఉంచకపోయినట్టయితే మనం ఈ సాఫల్యాన్ని సాధ్యమయ్యేదా?? మిత్రులరా, కేవలం ఆరోగ్య రంగం మాత్రమే కాదు. మన డిజిటల్ మౌలిక వసతులను కూడా చూడండి. భారత్ లో నిరక్షరాస్యత వల్ల ప్రత్యక్ష ప్రయోజనాల బదలాయింపు, డిజిటల్ లావాదేవీలు సాధ్యం కాదని మనం భావించి ఉంటే ఈ కరోనా సంకట సమయంలో ప్రభుత్వం పేదలకు లాభాలను పంచగలిగి ఉండేదా? నేడు ఫిన్ టెక్ ద్వారా, డిజిటల్ ఇంక్లూజన్ ద్వారా మనం ప్రపంచంలోని ముందున్న దేశాల వరుసలో మనం ఉండగలుగుతున్నాం. నేడు సమస్య పరిష్కారం విషయంలో భారత్ ప్రయోగాలు చేయడానికి భయపడటం లేదు. పెద్ద ఎత్తున పనిచేయడానికి కూడా వెనుకాడడం లేదు. అన్నిటికన్నా పెద్ద బ్యాంకింగ్ ఇంక్లూజన్ కార్యక్రమం భారత్ లో జరుగుతుంది. ప్రపంచంలోని అతి పెద్ద టాయ్ లెట్ల నిర్మాణ ఉద్యమం కూడా భారత్ లోనే జరుగుతోంది. ప్రతి ఇంటికీ నీరు అందించే అతి పెద్ద కార్యక్రమం కూడా భారత్ లోనే జరుగుతోంది. అన్నిటికన్నా పెద్ద ఆరోగ్య హామీ పథకం కూడా భారత్ లోనే జరుగుతోంది. అతి పెద్ద టీకాలు వేసే కార్యక్రమం కూడా భారత్ లోనే జరుగుతోంది. వీటన్నిటి వల్ల ఈశాన్య భారతానికి అతి పెద్ద లబ్ది చేకూరంది. ఇలాంటి కార్యక్రమాలు దేశంలో, సమాజంలో ఆత్మ విశ్వాసం నిండి ఉన్నప్పుడే సాధ్యమౌతాయి. ఇవన్నీ దేశంలో పరిస్థితిని మార్చే విషయంలో, వినూత్నతను సాధించే విషయంలో పూర్తి శక్తిని వెచ్చించగలిగినప్పుడే జరుగుతాయి.

మిత్రులారా

నేడు ప్రపంచంలో భారత సాంకేతికత విస్తరించడం వల్ల పలు రంగాల్లో కొత్త కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తున్ఆనయి. నేను బ్రాంచ్ లేకుండానే బ్యాంక్ పనిచేయగలుగుతోంది. షోరూమ్ లేకుండానే రీటెయిల్ బిజినెస్ సాధ్యమౌతుంఓది. డైనింగ్ హాల్ లేకుండానే క్లౌడ్ కిచెన్ ఇలాంటి అనేకానేక ప్రయోగాలు మన దైనందిన జీవితంలో చూడగలుగుతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో మొత్తం యూనివర్సిటీ వర్చువల్ గా మారి, ప్రపంచం మొత్తం నుంచి విద్యార్థులు, వివిధ యూనివర్సిటీల ఫాకల్టీ యూనివర్సిటీలో అంతర్భాగం అయ్యే పరిస్థితి వస్తుంది. ఇలాంటి మార్పు కోసం మన వద్ద ఒక నియంత్రణ వ్యవస్థ ఏర్పాటు కావడం అత్యవసరం. కొత్త జాతీయ విద్యావిధానం ద్వారా ఈ దిశగా నిరంతర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ విధానంలో వీలైనంత ఎక్కువగా టెక్నాలజీని ఉపయోగించడం, మల్టీ డిసిప్లినరీ విద్య ను అందించడం, మరింత ఫ్లెక్సిబిలిటీని అమలు చేయడానికి ప్రోత్సాహం ఇవ్వడం జరుగుతోంది. కొత్త జాతీయ విద్యా విధానం, డేటా, డేటా ఎనలిటిక్స్ కోసం మన విద్యా వ్యవస్థను సంసిద్ధం చేయడంపై దృష్టి పెట్టింది. డేటా ఎనలిటిక్స్ తో కాలేజీల్లో ప్రవేశం నుంచి , బోధన, మూల్యాంకనల వంటి ప్రక్రియలన్నీ చాలా మెరుగుపడతాయి.

జాతీయ విద్యా విధానంలోని ఈ లక్ష్యాల సాధనలో తేజ్ పూర్ యూనివర్సిటీ కీలకమైన పాత్ర వహిస్తుందని నా నమ్మకం. తేజ్ పూర్ యూనివర్సిటీ ట్రాక్ రికార్డు, దాని సామర్థ్యం పై నాకు పూర్తి నమ్మకం ఉంది. మీ నియత విద్య పూర్తవుతోంది కానీ ఇది కేవలం మీ భవిష్యత్తు కోసమే కాక, జాతి భవిష్యత్తు కోసం కూడా పనిచేయాల్సి ఉందని విద్యార్థి మిత్రులకు తెలియచేయదలచుకున్నాను. ఒక్క విషయాన్ని గుర్తుంచుకొండి. మీరు చేస్తున్న పని తాలూకు ప్రయోజనం ఉన్నతమైనదైతే జీవితంలోని ఎత్తుపల్లాలపై ఎలాంటి ప్రభావమూ పడబోదు. మీరు మీ జీవితంలోని రానున్న 25-26 ఏళ్లలో మీ వృత్తి జీవనంతో పాటు దేశపు భాగ్యాన్ని కూడా నిర్ధారించబోతున్నారు.

మీరందరూ దేశాన్నిఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తారన్న నమ్మకం నాకు ఉంది. 2047 లో దేశం వందవ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్నప్పుడు ఇదే 25-26 ఏళ్ల కాలఖండం మీరు చేసిన యోగదానం, మీ పురుషార్థం, మీ కలలతో నిండి ఉంటుంది. ఒక్క సారి ఆలోచించండి. వందేళ్ల స్వాతంత్ర్యంలో మీ పాతికేళ్లు ఎంత పెద్ద పాత్రను పోషించబోతున్నాయో. రండి మిత్రులారా... ఆ కలలను సాకారం చేసుకునేందుకు మిమ్మల్ని మీరు సచేతనులుగా చేసుకొండి, ముందుకు సాగుదాం. ఒక సంకల్పంతో ముందుకు సాగుదాం. కలలను వెంట తీసుకుని సాగుదాం. సాధించే లక్ష్యంతో ముందుకు సాగుదాం. చూస్తూ ఉండండి. జీవన సాఫల్యంలో ఒక్కొక్క ఎత్తునూ మనం దాటేస్తూ పోతాము. నేటి ఈ పవిత్ర సమయంలో మీ కుటుంబ సభ్యులకు, మీకు పాఠాలు చెప్పిన్న ఉపాధ్యత్త జగత్తుకు, ఫ్యాకల్టీ సభ్యులందరికీ, మీ స్వప్నాలకు అనేకానేక శుభాకాంక్షలను తెలియచేస్తున్నాను.

ధ‌న్య‌వాద‌ములు!!

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
India’s organic food products export reaches $448 Mn, set to surpass last year’s figures

Media Coverage

India’s organic food products export reaches $448 Mn, set to surpass last year’s figures
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister lauds the passing of amendments proposed to Oilfields (Regulation and Development) Act 1948
December 03, 2024

The Prime Minister Shri Narendra Modi lauded the passing of amendments proposed to Oilfields (Regulation and Development) Act 1948 in Rajya Sabha today. He remarked that it was an important legislation which will boost energy security and also contribute to a prosperous India.

Responding to a post on X by Union Minister Shri Hardeep Singh Puri, Shri Modi wrote:

“This is an important legislation which will boost energy security and also contribute to a prosperous India.”