మిత్రులారా,
సవాలు విసిరే అనేక చిక్కుముడుల ను విప్పేందుకు మీరంతా 36 గంటల నుండి నిర్విరామం గా శ్రమిస్తున్నారు. మీ హుషారు కు నా జేజే లు. మీ లో క్షణక్షణం ఇనుమడిస్తున్న ఉత్సాహం తప్ప ఎటువంటి అలసట నాకు కనిపించడం లేదు. కార్యసాఫల్య సంతృప్తి ఒక్కటే మీలో ప్రస్ఫుటం అవుతోంది. బహుశా ఇడ్లీ, దోశ, వడ, సాంబార్ సహిత చెన్నై ప్రత్యేక అల్పాహారం నుండే ఈ సంతృప్తి సాధ్యం అయిందని నాకు అనిపిస్తోంది. చెన్నై నగరం అందించిన అద్భుతమైనటువంటి ఆతిథ్యం, అందులోని సహృదయత్వం లో ప్రతిబింబిస్తున్నది. ఈ కార్యక్రమాని కి హాజరైన ప్రతి ఒక్కరు, ప్రత్యేకించి సింగపూర్ నుండి విచ్చేసిన అతిథులు, చెన్నై ఆతిథ్య మధురిమ ను మనస్ఫూర్తి గా ఆస్వాదిస్తున్నారని నేను విశ్వసిస్తున్నాను.
మిత్రులారా,
ఈ హ్యాకథన్ విజేతల కు నా అభినందన లు. అలాగే ఇక్కడ హాజరైన యువ మిత్రులు ప్రతి ఒక్కరి ని.. ప్రత్యేకించి నా విద్యార్థి మిత్రుల ను కూడా నేను అభినందిస్తున్నాను. ఈ పోటీ లో నెగ్గడం కన్నా మీ లో కనిపిస్తున్న- సవాళ్ల ను ఎదుర్కొనే సంసిద్ధత, ఆచరణాత్మక పరిష్కరాన్వేషణ, సామర్థ్యం, ఉత్సాహం చాలా విలువైనవి.
నా యువ మిత్రులారా..
ఇవాళ మనం ఇక్కడ చాలా సమస్యలను పరిష్కరించాం. ఎవరెంత శ్రద్ధగా ఉన్నారో గమనించడంపై కెమెరాల సామర్థ్యాన్ని మెరుగుపరచే దిశగా చూపిన పరిష్కాంర ప్రత్యేకించి నన్ను ఆకట్టుకుంది. దీని వల్ల ప్రయోజనం ఏమిటంటే… ఉదాహరణకు- నేను పార్లమెంటు లో స్పీకరు ను ఉద్దేశించి మాట్లాడుతుంటాను. అలాంటప్పుడు పార్లమెంటు సభ్యుల కు ఇది ఎంతో ఉపయోగకరం గా ఉంటుందనడం లో సందేహం లేదు. నా అభిప్రాయం ప్రకారం… మీ లో ప్రతి ఒక్కరూ విజేతలే. ఎటువంటి సవాలు ను అయినా ఎదుర్కొనేందుకు వెనుదీయరు; కాబట్టే మీరందరూ విజేత లు. ఫలితాల పై చింత లేకుండా మీరందరూ మీ వంతు కృషి కి నిబద్ధులై పనిచేస్తారు. మొత్తం మీద ఇండియా- సింగపూర్ హ్యాకథన్ విజయవంతం కావడం లో సహాయ సహకారాల ను అందించిన సింగపూర్ విద్య శాఖ మంత్రి శ్రీ ఓంగ్-ఏ-కుంగ్ తో పాటు నాన్ యాంగ్ టెక్నికల్ యూనివర్సిటీ (ఎన్ టియు) వారి కి ఈ సందర్భం గా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఇండియా- సింగపూర్ రెండో హ్యాకథన్ సంపూర్ణ విజయం సాధించడం లో భారతదేశం పక్షం నుండి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ లోని ఆవిష్కరణల విభాగం సహా, మద్రాస్ ఐఐటీ, అఖిల భారత సాంకేతిక విద్య మండలి (ఎఐసిటిఇ) లు అద్భుతంగా కృషిచేశాయి.
మిత్రులారా,
ఆది నుండి ప్రతి ఒక్కరూ మమేకం అయినప్పుడు ఒక గొప్ప కార్యం ఉత్తేజపూరిత రీతి లో సాఫల్యం కావడాన్ని చూసినప్పుడే కాకుండా మరికొన్ని అంశాలూ ఎంతో సంతృప్తి ని ఇస్తాయి. హ్యాకథన్ సంయుక్త నిర్వహణ గురించి ఇంతకు ముందు నా సింగపూర్ పర్యటన సందర్భం గా నేను సూచించాను. ఆ మేరకు గత సంవత్సరం ఎన్ టియు దీని ని సింగపూర్ లో నిర్వహించింది. ఈసారి చరిత్రాత్మకమైన.. అత్యాధునిక మద్రాస్ ఐఐటీ ప్రాంగణం లో నిర్వహించడం ఎంతో ముదావహం.
మిత్రులారా, అయితే, నాకు అందిన సమాచారం ప్రకారం.. నిరుటి హ్యాకథన్ పోటీ ప్రధానాంశం గా సాగింది. కానీ, ఈసారి రెండు దేశాల సంయుక్త విద్యార్థి బృందాలు కొన్ని సమస్యల పరిష్కారం కోసం తమ శక్తిసామర్థ్యాల ను వెచ్చించారు. కాబట్టి మనం పోటీతత్వం నుండి సమష్టి తత్వం వైపు నకు పయనించడం ఒక శుభ పరిణామం. మనకు కావలసింది ఇదే సంయుక్త శక్తి, మన రెండు దేశాలూ ఎదుర్కొనబోయే సవాళ్ల ను ఛేదించేందుకు సమష్టి గా కృషి చేయడమే దీని పరమార్థం కావాలి.
మిత్రులారా,
ఇటువంటి హ్యాకథన్ లు యువతరాని కి ఎంతో అవసరం. ఇందులో పాల్గొనే వారికి అంతర్జాతీయ సమస్యల పరిష్కారాని కి అవసరమైన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటు లోకి వస్తుంది. అందునా నిర్దిష్ట వ్యవధి లో సదరు సవాళ్ల ను పరిష్కరించే శక్తి వారి కి అలవడుతుంది. వీటి లో పాల్గొనే యువజనులు వారి యొక్క ఆలోచన ల బలాన్ని, ఆవిష్కరణ నైపుణ్యాన్ని ఈ వేదిక మీద పరీక్షించుకొనే అవకాశం లభిస్తుంది. అలాగే నేటి హ్యాకథన్ లలో ఆవిష్కృతం అయ్యే పరిష్కారాలు రేపటి స్టార్ట్- అప్ లుగా ఆవిర్భవించే వీలు ఉందని నేను గట్టి గా విశ్వసిస్తున్నాను. కొన్ని సంవత్సరాలు గా భారతదేశం లో మేము ‘స్మార్ట్ ఇండియా హ్యాకథన్’ను నిర్వహిస్తున్నాము. తద్వారా ప్రభుత్వ విభాగాలు, ప్రజలు, పరిశ్రమలు, అత్యున్నత సంస్థ లు పరస్పరం చేరువ అయ్యేందుకు వీలు ఉంటుంది. ఈ హ్యాకథన్ కార్యక్రమాల లో ఆవిష్కారం అయ్యే ఆలోచనల ను ప్రోత్సహించడం తో పాటు పరిష్కారాల కు అవసరమైన నిధులను, చేయూతను ఇవ్వడం ద్వారా వాటి ని స్టార్ట్- అప్ లుగా రూపుదిద్దడానికి మేము ప్రయత్నిస్తాము. అదే తరహాలో ఎన్ టియు, ఎంహెచ్ ఆర్ డి, ఎఐసిటి ఇ లు కూడా ఈ సంయుక్త హ్యాకథన్ సందర్భం గా వెల్లడి అయ్యే ఆలోచనల తో కొత్త సంస్థ ల ఏర్పాటు అవకాశాల ను సమష్టి గా అన్వేషించగలవని నేను ఆశిస్తున్నాను.
మిత్రులారా,
భారతదేశం నేడు ఐదు లక్షల కోట్ల రూపాయల విలువైన ఆర్థిక వ్యవస్థ గా ఎదిగేందుకు సిద్ధం గా ఉంది. ఆ దిశ గా ఆవిష్కరణలు, స్టార్ట్- అప్ లు వాటి వంతు గా కీలక పాత్ర ను పోషిస్తాయి. ఆ మేరకు భారతదేశం ఇప్పటికే ప్రపంచం లోని మూడు అగ్రశ్రేణి స్టార్ట్- అప్ సంస్థ ల సన్నిహిత పర్యావరణ వ్యవస్థల లో ఒకటి గా ఆవిర్భవించింది. గడచిన ఐదు సంవత్సరాల లో ఆవిష్కరణ, సంరక్షణల కు ప్రోత్సాహం ఇచ్చేందుకు మేము కూడా ఎంతో ప్రాధాన్యాన్ని ఇచ్చాము. ‘‘అటల్ ఆవిష్కరణల కార్యక్రమం, ప్రధాన మంత్రి పరిశోధక ఉపకార వేతనాలు, భారత స్టార్ట్- అప్ ల కార్యక్రమం అన్నవి 21వ శతాబ్దపు ఆవిష్కరణ ల సంస్కృతి ని ప్రోత్సహించే భారతావని కి పునాదులు. తదనుగుణం గా మశీన్ లర్నింగ్, ఆర్టిఫిశల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ల వంటి అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలను 6వ తరగతి నుండే మా విద్యార్థుల కు పరిచయం చేయడానికి ప్రయత్నిస్తున్నాము. ఆ మేరకు పాఠశాల నుండి ఉన్నత విద్య లో పరిశోధనల వరకు ఆవిష్కరణల కు మాధ్యమం కాగల పర్యావరణాన్ని సృష్టిస్తున్నాము.
మిత్రులారా,
ఆవిష్కరణ- సంరక్షణలను రెండు కారణాల రీత్యా మేం ప్రోత్సహిస్తున్నాము. ఒకటి.. భారతదేశం లో జీవన సౌలభ్యం సాధన దిశ గా జాతీయ సమస్యల కు సులభ పరిష్కారాల ను మేము ఆకాంక్షిస్తున్నాము. రెండోది.. మా ఒక్కరి కోసమే కాకుండా యావత్తు ప్రపంచాని కి పరిష్కారాల కోసం మేము పరితపిస్తున్నాము. ‘‘ప్రపంచాని కి వర్తించే భారత పరిష్కారాలు’’- మా లక్ష్యం. మా నిబద్ధత అందుకోసమే. అంతేకాకుండా మేం కనుగొనే పరిమిత వ్యయ పరిష్కారాలు ప్రపంచం లోని నిరుపేద దేశాల అవసరాల ను తీర్చేవి గా కూడా ఉండాలని మేము ఆకాంక్షిస్తున్నాము. ఏ దేశం లో నివసించేవారు అయినప్పటికీ ఏ సదుపాయాలూ అందని, అత్యంత నిరుపేదల కు భారతీయ ఆవిష్కరణలు అండ గా నిలవాలి.
మిత్రులారా,
ఖండం ఏదైనా, దేశం ఏదైనా వాటి కి అతీతం గా సాంకేతిక పరిజ్ఞానం ప్రజల ను ఏకం చేస్తుందని నేను ప్రగాఢం గా విశ్వసిస్తాను. ఈ సందర్భం గా మంత్రి శ్రీ ఓంగ్ సూచనల ను ఆహ్వానిస్తున్నాను. ఇలాంటి హ్యాకథన్ లో పాల్గొనేందుకు ఆసక్తి చూపే ఇతర ఆసియా దేశాల లో ఎన్ టియు తో పాటు సింగపూర్, భారతదేశం ప్రభుత్వాల యొక్క తోడ్పాటు, మద్దతు లతో వాటి నిర్వహణ ను చేపడితే బాగుంటుందని ఈ సందర్భం గా నేను ప్రతిపాదిస్తున్నాను. ‘‘భూ తాపం- వాతావరణ మార్పుల సవాలు’’కు ఆవిష్కరణాత్మక పరిష్కారం దిశ గా ఆసియా దేశాల లోని అద్భుత మేధోశక్తులు పోటీ పడాలని అభిలషిస్తున్నాను. చివరగా, ఈ కార్యక్రమం యొక్క ఘన విజయాని కి తోడ్పడిన నిర్వాహకుల కు, పాల్గొన్న వారి కి మరొక్క సారి అభినందనలు తెలియజేస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. ఇంకొక విషయం-
మీరంతా ఇప్పుడు చెన్నై లో ఉన్నారు. సుసంపన్న సంస్కృతి, ఘనమైన వారసత్వం, రుచికరమైన ఆహారాని కి ఈ నగరం పేరుగాంచింది. అందువల్ల ఇక్కడ బస చేసిన సందర్భం గా చెన్నై ఆతిథ్యాన్ని మనసారా ఆస్వాదించవలసింది గా ఈ కార్యక్రమం లో పాల్గొన్న వారికి, మరీముఖ్యం గా సింగపూర్ మిత్రుల కు, నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రపంచ ప్రసిద్ధ శిల్పకళా సంపద కు నెలవైన మహాబలిపురాన్ని, అక్కడి రాతి శిల్పాలను, శిలా దేవాలయాలను సందర్శించడాని కి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నాను. అవి యునెస్కో యొక్క ప్రపంచ వారసత్వ సంపద గా ప్రకటితం అయ్యాయి.
ధన్యావాదాలు. మీకు అందరి కి అనేకానేక ధన్యావాదాలు.