అబూదభీ రాజు షేక్ మహమ్మద్ బిన్ జయేద్ అల్ నహ్యాన్ తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుక్రవారం సాయంత్రం టెలిఫోన్‌లో సంభాషించారు. భారత్-యుఏఇ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం కింద వివిధ వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారం నిరంతర పురోగతి తీరును ఉభయ నాయకులు సమీక్షించారు. కోవిడ్-19 మహమ్మారి కాలంలో భారత సంతతి ప్రజలకు యుఏఇ అందించిన మద్దతును ప్రధానమంత్రి ప్రశంసించారు. 2021 అక్టోబర్ 1వ తేదీ నుంచి దుబాయ్ లో ఎక్స్ పో-2020 జరుగనున్న సందర్భంగా శుభాభినందనలు అందచేశారు.
ఉభయ దేశాలకు ఉమ్మడిగా అందోళన కలిగించే పలు అంశాలపై ఉభయులు చర్చించారు. ప్రపంచంలో ఉగ్రవాదం, తీవ్రవాదానికి తావు లేదని వారు అంగీకరించారు. అలాంటి శక్తులకు వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజం దృఢంగా నిలవాల్సిన అవసరాన్ని వారు నొక్కి వక్కాణించారు.
Had a very useful telecon with His Highness @MohamedBinZayed. Reviewed progress in our comprehensive strategic partnership and discussed recent regional developments. Appreciated UAE’s support to Indian community during Covid-19 and conveyed my best wishes for Dubai Expo.
— Narendra Modi (@narendramodi) September 3, 2021