రష్యన్ ఫెడరేశన్ అధ్యక్షుడు శ్రీ వ్లాదిమీర్ వ్లాదిమీరోవిచ్ పుతిన్ మరియు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న టెలిఫోన్ ద్వారా ఒకరి తో మరొకరు మాట్లాడుకొన్నారు.
క్రిస్ మస్ ను రష్యన్ ఫెడరేశన్ ఇటీవల రష్యా లోని సంప్రదాయం ప్రకారం జరుపుకోవడాన్ని ప్రధాన మంత్రి గుర్తు చేస్తూ, స్నేహశీలురైన రష్యా ప్రజల కు మరియు అధ్యక్షుడు శ్రీ పుతిన్ కు రుతుపరమైన శుభాకాంక్షల ను తెలియజేశారు. దీని కి అధ్యక్షుడు శ్రీ పుతిన్ తన వంతు గా ప్రతిస్పందించారు; భారతదేశ ప్రజల కు మరియు ప్రధాన మంత్రి శ్రీ మోదీ కి సంతోషం, శాంతి, ప్రగతి, ఇంకా సమృద్ధి సమకూరాలన్న ఆకాంక్ష ను ఆయన వ్యక్తం చేశారు.
ఇటీవలి గత కాలం లో మరీ ముఖ్యం గా 2019వ సంవత్సరం లో ఉభయ దేశాల మధ్య గల ప్రత్యేక విశేషాధికార సహిత వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రముఖమైన మైలురాళ్ళ వంటి ఘటనల ను అధిగమించడం పట్ల నేత లు ఇరువురూ సంతోషాన్ని వెలిబుచ్చారు. భారతదేశం-రష్యా సంబంధాల ను అన్ని రంగాల లోను మరింత గా పటిష్ట పరచుకోవడం కోసం కలసి శ్రద్ధాపూర్వకం గా కృషి చేయడాన్ని 2020వ సంవత్సరం లో కూడాను కొనసాగించాలంటూ వారు వారి యొక్క అంగీకారాన్ని వ్యక్తం చేశారు.
రష్యా కు 2020వ సంవత్సరం ప్రత్యేక ప్రాముఖ్యం కలిగింది గా ఉండబోతోందని ప్రధాన మంత్రి నొక్కి వక్కాణిస్తూ, ఈ సంవత్సరం లో మే నెల లో మాస్కో లో జరిగే 75వ విజయ దినం వేడుక లో పాల్గొనవలసింది గా అధ్యక్షుడు శ్రీ పుతిన్ తనను ఆహ్వానించడాన్ని ప్రధాన మంత్రి కృతజ్ఞత తో గుర్తు కు తెచ్చుకొన్నారు. ఈ సంవత్సరంలో జరిగే శంఘాయి కోఆపరేశన్ ఆర్గనైజేశన్ శిఖర సమిట్ లో, బ్రిక్స్ దేశాల శిఖర సమ్మేళనం లో పాలు పంచుకోవడం కోసం తాను నిరీక్షిస్తున్నట్లు ఆయన అన్నారు. 21వ ద్వైపాక్షిక వార్షిక శిఖర సమ్మేళనం కోసం అధ్యక్షుడు శ్రీ పుతిన్ ను భారతదేశాని కి ఆహ్వానిస్తున్నట్లు శ్రీ మోదీ పేర్కొన్నారు.
ప్రాంతీయ అంశాల పైన మరియు ప్రపంచ అంశాల పైన నేతలు ఇరువురూ వారి యొక్క ఆలోచనల ను ఒకరి కి మరొకరు వెల్లడించుకొన్నారు. ప్రాంతీయ భద్రత, ప్రపంచ భద్రత, శాంతి , ఇంకా సుస్థిరత్వం కోసం పూచీ పడటాని కి రష్యా మరియు భారతదేశం అనుసరిస్తున్న వైఖరుల లో ఎంతో సమానత్వం మరియు కేంద్రీకరణ లు ఉన్నాయి అనే సంగతి ని వారు ఈ సందర్భం గా ప్రముఖం గా ప్రస్తావించుకొన్నారు.