ఆస్ట్రేలియా ప్రధాని శ్రీ స్కాట్ మారిసన్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ టెలిఫోన్ ద్వారా ఈ రోజు న సంభాషించారు.
ఆస్ట్రేలియా లో తీవ్రమైన కార్చిచ్చు కారణం గా ప్రాణ నష్టం మరియు ఆస్తి నష్టం వాటిల్లడం పట్ల భారతీయులు అందరి పక్షాన, అలాగే స్వయం గా తన తరఫు న ప్రధాన మంత్రి శ్రీ మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఇదివరకు ఎన్నడూ ఎరుగనటువంటి ఈ ప్రాకృతిక విపత్తు ను ధైర్యం గా ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా కు మరియు ఆస్ట్రేలియా ప్రజల కు భారతదేశం ఉదారమైన రీతి లో సాయపడటానికి సిద్ధమని కూడా ఆయన అన్నారు.
ఇటీవలి కాలం లో ద్వైపాక్షిక సంబంధాల లో చోటు చేసుకొన్న పురోగతి పట్ల ప్రధాన మంత్రి శ్రీ మోదీ తన సంతృప్తి ని వెలిబుచ్చుతూ, ఆస్ట్రేలియా తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పటిష్ట పరచుకొనేందుకు భారతదేశం వచనబద్ధత ను పునరుద్ఘాటించారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆయన కు వీలయినంత త్వరగా భారతదేశాని కి ఆధికారిక యాత్ర కు వస్తే గనక ఆయన కు స్వాగతం పలికేందుకు తాను ఎదురుచూస్తున్నట్లు ప్రధాన మంత్రి తెలిపారు.
2020వ సంవత్సరం లో మిగతా కాలానికి గాను ఆస్ట్రేలియా ప్రధాని శ్రీ మారిసన్ కు మరియు ఆస్ట్రేలియా ప్రజల కు ప్రధాన మంత్రి తన శుభాకాంక్షల ను తెలియజేశారు.