రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేశియా అధ్యక్షులు, మాన్యులు శ్రీ జోకో విడోడో తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న టెలిఫోన్ లో మాట్లాడారు.
ఇండోనేశియా లోని సులావేసి ప్రాంతం లో ఇటీవల భూకంపం తో పాటు సునామి కూడా సంభవించి ప్రాణ నష్టం వాటిల్లడం పట్ల భారతదేశ ప్రజల పక్షాన మరియు స్వయంగా తన తరఫున ప్రధాన మంత్రి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
ఈ ఘోర ప్రాకృతిక విపత్తు కారణంగా పెద్ద ఎత్తున విధ్వంసం జరిగినందువల్ల ఎదురైన సవాళ్ళ కు తట్టుకొని నిలబడడం లో ఇండోనేశియా ప్రజలు ప్రదర్శించినటువంటి ఉత్థాన శక్తి ని మరియు ధైర్యాన్ని ప్రధాన మంత్రి ప్రశంసించారు.
అంతర్జాతీయ సహాయం కోసం ఇండోనేశియా చేసిన విన్నపానికి ప్రధాన మంత్రి ప్రతిస్పందిస్తూ, భారతదేశం ఇండొనేశియా యొక్క మిత్ర దేశం గాను, సాగర తీర పొరుగు దేశం గాను తన చేతనైనంత సహాయాన్ని అందజేస్తుందని ఇండోనేశియా అధ్యక్షుని కి తెలియజేశారు.
ప్రధాన మంత్రి సంతాపాన్ని వ్యక్తం చేసి, సహాయ హస్తాన్ని అందించినందుకు గాను అధ్యక్షులు శ్రీ విడోడో ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.
భారతదేశం నుండి ఉపశమన పూర్వక సహాయాన్ని ఏయే రూపాలలో అందుకోవాలనే అంశం పై దౌత్యపరమైన మార్గాల లోను, ఆధికారిక మార్గాల లోను చర్చించి ఒక ప్రణాళిక ను రూపొందించుకొందామని ఇరువురు నేతలు అంగీకరించారు.