స్వీడన్ ప్రధానమంత్రి మాన్యులు స్టీఫన్ లోఫ్వెన్ తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మంగళవారం టెలిఫోన్ లో సంభాషించారు.
ప్రస్తుతం విశ్వ మహమ్మారి కోవిడ్ -19 మానవాళిని పట్టి పీడిస్తున్న నేపధ్యంలో తమతమ దేశాలలో కోవిడ్ వ్యాప్తిని నియంత్రించడానికి తీసుకుంటున్న చర్యలు, ఆరోగ్యం, ఆర్ధికరంగంపై దాని ప్రభావం గురించి ఇద్దరు నాయకులు చర్చించారు.
కోవిడ్ -19పై జరుగుతున్నపరిశోధనల్లో ఇండియా, స్వీడన్ దేశాల పరిశోధకులు, శాస్త్రజ్ఞుల మధ్య సమన్వయము, డేటాను పంచుకోవడం ప్రపంచదేశాలు జరుపుతున్న ప్రయత్నాలకు తోడ్పడగలదని ఇరువురు నాయకులుఅంగీకరించారు.
విమాన ప్రయాణాలపై ఆంక్షలు ఉన్న ప్రస్తుత తరుణంలో చిక్కుబడి పోయిన తమ పౌరులను పంపడానికి అవసరమైన వెసులుబాటును కల్పించేందుకు ఇద్దరు నాయకులు పరస్పరం హామీ ఇచ్చారు. కోవిడ్ -19ను ఎదుర్కొనేందుకు అవసరమైన వైద్య సరఫరాలు లభ్యమయ్యేలా చూసేందుకు అధికారుల మధ్య పరస్పర సంప్రదింపులు జరపాలని కూడా వారు అంగీకరించారు.