ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ అఫ్గానిస్తాన్ యొక్క అధ్యక్షుడు డాక్టర్ అశ్ రఫ్ గనీ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ టెలిఫోన్ ద్వారా ఈ రోజు న సంభాషించారు. హర్షభరితమైన పండుగ ‘ఈద్- ఉల్- అజ్ హా’ సందర్భం లో నేత లు ఉభయులు ఒకరి కి మరొకరు శుభకామనల ను వ్యక్తం చేసుకొన్నారు.
అఫ్గాన్ అవసరాల ను తీర్చడం కోసం సకాలం లో ఆహార పదార్థాల ను మరియు చికిత్స సంబంధి సహాయాన్ని అందించినందుకుగాను ప్రధాన మంత్రి శ్రీ మోదీ కి అధ్యక్షుడు శ్రీ ఘనీ ధన్యవాదాలు తెలిపారు. శాంతియుతమైనటువంటి, సమృద్ధమైనటువంటి మరియు అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని పోయేటటువంటి అఫ్గానిస్తాన్ ఆవిష్కరింపబడాలని ఆకాంక్షిస్తున్న అఫ్గాన్ ప్రజానీకాని కి వెన్నంటి నిలచే అంశం లో భారతదేశం యొక్క నిబద్ధత ను ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు. ఈ ప్రాంతం లో నూత్నమైన రూపు ను దాల్చుతున్న భద్రత పరిస్థితి పైన మరియు పరస్పర హితం ముడిపడిన ఇతర ద్వైపాక్షిక రంగాల పైన ఇరువురు నేత లు వారి వారి అభిప్రాయాల ను ఒకరి కి మరొకరు వెల్లడి చేసుకొన్నారు.