The Prime Minister also extended his heartiest congratulations and best wishes to Vice President-elect Senator Kamala Harris
The leaders agreed to work closely to further advance the India-U.S. Comprehensive Global Strategic Partnership, built on shared values and common interests

అమెరికా అధ్య‌క్షులుగా ఎన్నికైన హిస్ ఎక్స్ లెన్సీ శ్రీ జోసెఫ్ ఆర్. బిడెన్ తో ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ టెలిఫోన్ ద్వారా మాట్లాడారు. 
శ్రీ బిడెన్ కు ప్ర‌ధాని శ్రీన‌రేంద్ర మోదీ త‌న హృద‌య‌పూర్వ‌క శుభాకాంక్ష‌లు తెలిపారు. ఆయ‌న ఎన్నిక‌ అనేది అమెరికాలో నెల‌కొన్న ప్ర‌జాస్వామ్య సంప్ర‌దాయాల ప‌టిష్ట‌త‌, డృఢ‌త్వానికి నిద‌ర్శ‌న‌మ‌ని ప్ర‌ధాని ప్ర‌శంసించారు. 
అమెరికా ఉపాధ్య‌క్షురాలిగా ఎన్నికైన సెనేట‌ర్ క‌మ‌లా హ్యారిస్ కు కూడా ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ త‌న  హృద‌య పూర్వ‌క శుభాకాంక్ష‌లు, అబినంద‌న‌లు తెలిపారు. 
శ్రీ జోసెఫ్ ఆర్. బిడెన్ తో గ‌తంలో తాను జ‌రిపిన సంభాష‌ణ‌ల గురించి… ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని గుర్తు చేశారు. 2014లోను, 2016లోను ప్ర‌ధానిగా తాను జ‌రిపిన అమెరికా అధికారిక‌ ప‌ర్య‌ట‌న‌లను ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు. 2016లో ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ అమెరికా ప‌ర్య‌ట‌న చేసిన స‌మ‌యంలో ఆయ‌న అమెరికా కాంగ్రెస్ ఉమ్మ‌డి స‌మావేశంను ఉద్దేశించి ప్ర‌సంగించారు. ఆ స‌మావేశానికి శ్రీ ఆర్ బిడెన్ అధ్యక్షునిగా వ్య‌వ‌హ‌రించారు. 
ఇండియా అమెరికా సంబంధాలు మ‌రింత బ‌లోపేతం కావ‌డంకోసం క‌లిసిక‌ట్టుగా ప‌ని చేయాల‌ని  ఇరువురు నేత‌లు అంగీక‌రించారు. ఇరు దేశాల మ‌ధ్య‌న పంచుకునే విలువ‌లు, ఉమ్మ‌డి ప్రాధాన్య‌త‌ల మీద నిర్మిత‌మైన‌ స‌మ‌గ్రమైన అంత‌ర్జాతీయ వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యాన్ని  బ‌లోపేతం చేయాల‌ని నిర్ణయించారు. ఇరు దేశాల ప్రాధాన్య‌త‌ల గురించి కూడా ఇరువురు నేత‌లు చ‌ర్చించారు. కోవిడ్ 19 మ‌హ‌మ్మారి క‌ట్ట‌డి, వ్యాక్సిన్ల‌ను అంద‌రికీ అందుబాటులోకి తేవ‌డం, వాతావ‌ర‌ణ మార్పు స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డం, ఇండోప‌సిఫిక్ ప్రాంతంలో స‌హ‌కారం మొద‌లైన అంశాల గురించి ఇరువురు నేత‌లు చ‌ర్చించ‌డం జ‌రిగింది. 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
In a first, micro insurance premium in life segment tops Rs 10k cr in FY24

Media Coverage

In a first, micro insurance premium in life segment tops Rs 10k cr in FY24
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Chief Minister of Andhra Pradesh meets Prime Minister
December 25, 2024

Chief Minister of Andhra Pradesh, Shri N Chandrababu Naidu met Prime Minister, Shri Narendra Modi today in New Delhi.

The Prime Minister's Office posted on X:

"Chief Minister of Andhra Pradesh, Shri @ncbn, met Prime Minister @narendramodi

@AndhraPradeshCM"