ఉక్రెయిన్ అధ్యక్షుడు మాన్య శ్రీ వోలోదిమిర్ జెలెన్‌స్కీ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న టెలిఫోన్ ద్వారా సంభాషించారు.
ఉక్రెయిన్ లో జరిగిన అధ్యక్ష ఎన్నికల లో శ్రీ జెలెన్‌స్కీ విజయం సాధించడం పట్ల ఆయన కు ప్రధాన మంత్రి అభినందన లు తెలియజేశారు. ఇటీవల ముగిసిన పార్లమెంట్ ఎన్నికల లో శ్రీ జెలెన్‌స్కీ నాయకత్వం లోని ‘సర్వెంట్ ఆఫ్ ద పీపుల్ పార్టీ’ విజేత గా నిలచినందుకు కూడా ఆయన అభినందన లు తెలిపారు.
ప్రధాన మంత్రి అఖండ ప్రజా తీర్పు తో రెండో సారి పదవీ బాధ్యతల ను స్వీకరించడం పట్ల ఆయన ను అధ్యక్షుడు శ్రీ జెలెన్‌స్కీ అభినందించారు.
భారతదేశాని కి మరియు ఉక్రెయిన్ కు మధ్య ఉన్న హృదయపూర్వకమైన మరియు మైత్రీపూర్వకమైన సంబంధాలు ఉన్న విషయాన్ని ప్రధాన మంత్రి ఈ సందర్భం లో ప్రస్తావిస్తూ, ద్వైపాక్షిక వ్యాపార సంబంధాల లో సంతృప్తికరమైన గతి తో వృద్ధి చేసుకొంటోందని తెలిపారు. ఉక్రెయిన్ తో అనేక రంగాల లో దీర్ఘకాలిక సహకారం కొనసాగుతోందని వివరిస్తూ, ఉక్రెయిన్ లోని వివిధ విశ్వవిద్యాలయాల లో భారతీయ విద్యార్థులు పెద్ద సంఖ్య లో చదువుకొంటూ ఉండడం ఉభయ దేశాల ప్రజల మధ్య సంబంధాలను మరింత బలవత్తరం చేస్తోందని కూడా ఆయన స్పష్టంచేశారు. ఈ సంబంధాల తో పాటు కీవ్ కు, ఢిల్లీ కి మధ్య కిందటి సంవత్సరం లో నేరు గగన తల సంబంధం ఏర్పడినప్పటి నుండి పర్యటన రంగాని కి కూడా లభించినటువంటి ఉత్తేజాన్ని ప్రధాన మంత్రి గుర్తు చేశారు.
పరస్పరం లాభదాయకం గా ఉన్న ద్వైపాక్షిక సంబంధాల ను మరింత పటిష్ట పరచుకొనేందుకు కలసి పని చేయడాని కి ఇరువురు నేత లు వారి సన్నద్ధత ను పునరుద్ఘాటించారు.