ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు నార్వే ప్రధానమంత్రి హిజ్ ఎక్సలెన్సీ జొనాస్ గర్హ్ స్టోర్ తో ఫోన్‌లో మాట్లాడారు.
ఇరువురు నాయకులు, ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలను, పరస్పర ప్రయోజనకర అంశాలను చర్చించారు. అలాగే వర్ధమాన దేశాలలో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు క్లైమేట్ ఫైనాన్స్ ను సమకూర్చేంఉదకు తీసుకోవలసిన చర్యలను వారు చర్చించారు. వర్ధమాన ప్రపంచానికి సకాలంలో, తగినంత , న్యాయబద్ధమైన క్లైమేట్ ఫైనాన్స్ అందేలా చేయాల్సిన అంశం ప్రాధాన్యత గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఈ దిశగా హిజ్ ఎక్సలెన్సీ స్టోర్ నిబద్ధతను ప్రధానమంత్రి ప్రశంసించారు.
ఇరువురు నాయకులు బ్లూ ఎకానమీపై ఏర్పడిన టాస్క్ ఫోర్స్ తోపాటు ప్రస్తుతం కొనసాగుతున్న ద్వైపాక్షిక సహకార కార్యక్రమాలను సమీక్షించారు. ఇండియా -నార్వే లమధ్య హరిత హైడ్రోజన్, షిప్పింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ , విద్యారంగాలలో పరస్పర సహకారం విషయంలో వారు సంతృప్తి వ్యక్తం చేశారు.