యునైటెడ్ కింగ్‌డమ్ (యుకె)లో ఇటీవలే ముగిసినటువంటి ఎన్నికల లో విజేత గా నిలచినందుకు యుకె ప్రధాని శ్రీ బోరిస్ జాన్ సన్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ టెలిఫోన్ ద్వారా అభినందనలు తెలిపారు.
యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధాని పదవి కి శ్రీ జాన్ సన్ తిరిగి ఎన్నిక కావడం ఆయన పట్ల మరియు కన్సర్వేటివ్ పార్టీ పట్ల యుకె ప్రజలు వ్యక్తం చేసిన విశ్వాసాన్ని ప్రతిబింబిస్తున్నదని ప్రధాన మంత్రి ఈ సందర్భం గా అన్నారు.
భారతదేశ ప్రజల పక్షాన మరియు స్వయం గా తన తరఫు న ప్రధాన మంత్రి శుభాకాంక్షల ను తెలియజేస్తూ, యుకె కు మరియు భారతదేశాని కి మధ్య గల వ్యూహాత్మక భాగస్వామ్యం శ్రీ జాన్ సన్ యొక్క సమర్థ నాయకత్వం లో మరింత గా బలోపేతం కాగలుగుతుందన్న నమ్మకాన్ని వెలిబుచ్చారు.
ప్రధాన మంత్రి తన కు శుభాకాంక్షలు తెలియజేసినందుకు శ్రీ బోరిస్ జాన్ సన్ ధన్యవాదాలు పలికారు. భారతదేశం-యుకె సంబంధాల ను పటిష్టతరం చేయాలని కోరుకుంటున్నట్టు ఆయన తన వచనబద్ధత ను ప్రకటించారు.
శ్రీ జాన్‌సన్ ను వీలు చూసుకొని సాధ్యమైనంత త్వరలో భారతదేశాన్ని సందర్శించవలసిందిగా ప్రధాన మంత్రి ఆహ్వానం పలికారు. దీని కి శ్రీ జాన్ సన్ ఒప్పుకొన్నారు.