శ్రేష్ఠులైన ప్ర‌ధాని శ్రీ స్టీఫన్ లోఫ్‌వెన్,

ప్రసార మాధ్యమాల నుండి విచ్చేసినటువంటి మిత్రులారా,

ఇది స్వీడ‌న్ లో నా ఒక‌టో ప‌ర్య‌ట‌న‌. దాదాపు మూడు ద‌శాబ్దాల విరామం అనంత‌రం భార‌త‌దేశ ప్ర‌ధాన మంత్రి స్వీడ‌న్ లో ప‌ర్య‌టిస్తున్నారు. మా గౌర‌వార్థం స్వీడ‌న్ లో సాద‌ర స్వాగ‌తాన్ని అందించినందుకు స్వీడిష్ ప్ర‌భుత్వానికి మ‌రియు ప్ర‌ధాని శ్రీ లోఫ్‌వెన్ కు నేను నా హృద‌య పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌ల‌ను తెలియజేసుకొంటున్నాను. ఈ ప‌ర్య‌ట‌న కాలంలో ఇత‌ర నార్డిక్ దేశాల‌తో భార‌త‌దేశం యొక్క శిఖ‌ర స‌మ్మేళ‌నాన్ని కూడా ప్ర‌ధాని శ్రీ లోఫ్‌వెన్ ఏర్పాటు చేశారు. అందుకు కూడా నేను నా యొక్క హృద‌య పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు తెలియజేసుకొంటున్నాను.

|

భార‌త‌దేశంలో మేక్ ఇన్ ఇండియా కార్య‌క్ర‌మం ఆరంభమైన నాటి నుండి ఆ కార్యక్రమంలో స్వీడ‌న్ ఒక బ‌ల‌మైన భాగ‌స్వామిగా ఉంది. 2016వ సంవ‌త్స‌రంలో ముంబ‌యి లో నిర్వ‌హించిన ‘మేక్ ఇన్ ఇండియా’ కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాని శ్రీ లోఫ్‌వెన్ స్వ‌యంగా ఒక పెద్ద వ్యాపార‌స్తుల ప్ర‌తినిధి బృందాన్ని వెంట‌బెట్టుకు వ‌చ్చి, పాలుపంచుకొన్నారు. ‘మేక్ ఇన్ ఇండియా’ యొక్క అత్యంత ప్ర‌ముఖ కార్య‌క్ర‌మాన్ని భార‌త‌దేశానికి వెలుప‌ల నిర్వ‌హించ‌డ‌ం సైతం గ‌త సంవ‌త్స‌రం అక్టోబ‌రు లో స్వీడ‌న్ లోనే జరిగింది. ఈ కార్య‌క్ర‌మంలోనూ ప్ర‌ధాని శ్రీ లోఫ్‌వెన్ స్వ‌యంగా పాలుపంచుకోవ‌డం మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిన‌టువంటి అంశ‌మే కాకుండా గ‌ర్వ‌కార‌ణం కూడాను. భార‌త‌దేశం యొక్క అభివృద్ధిని ఉద్దేశించిన అవ‌కాశాల‌లో భార‌త్ తో క‌లిసి ఇరు ప‌క్షాల‌కు గెలుపు ల‌భించేట‌ట్లుగా స్వీడన్ ఏ విధంగా పాటుప‌డ‌గ‌లుగుతుంద‌న్న‌దే ఈ రోజు మా సంభాష‌ణలో అత్యంత ముఖ్య‌మైన ఇతివృత్తమని నేను న‌మ్ముతున్నాను. దీని ప‌ర్య‌వ‌సానంగా, ఈ రోజు మేము ఒక నూత‌న ఆవిష్క‌ర‌ణ సంబంధ భాగ‌స్వామ్యానికి మ‌రియు సంయుక్త కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌కు సమ్మతించాము.

నూత‌న ఆవిష్క‌ర‌ణ‌, పెట్టుబ‌డి, స్టార్ట్‌-అప్ లు, త‌యారీ ల వంటివి మా భాగ‌స్వామ్యం తాలూకు ప్ర‌ధాన పార్శ్వాలు. వీటితో మేము నవీకరణ యోగ్య శ‌క్తి, ప‌ట్ట‌ణ ర‌వాణా, వ్య‌ర్థాల నిర్వ‌హ‌ణ ల వంటి అనేక అంశాల పైన కూడా శ్ర‌ద్ధ వహిస్తున్నాము. ఈ అంశాలు భార‌త‌దేశంలో ప్ర‌జ‌ల జీవ‌న నాణ్య‌త‌తో సంబంధం ఉన్న‌టువంటి అంశాలు. ప్ర‌ధాని శ్రీ లోఫ్‌వెన్ మ‌రియు నేను వ్యాపారం మ‌రియు పెట్టుబ‌డుల‌కు సంబంధించిన అంశాల‌పై స్వీడ‌న్ కు చెందిన ప్ర‌ముఖ సిఇఒ ల‌తో ఈ రోజు చ‌ర్చించ‌నున్నాము.

|

ర‌క్ష‌ణ మ‌రియు భ‌ద్ర‌తప‌ర‌మైన స‌హ‌కారం మ‌న ద్వైపాక్షిక సంబంధాల‌లో మ‌రొక కీల‌క‌మైన అంశం. ర‌క్ష‌ణ రంగంలో భార‌త‌దేశానికి స్వీడ‌న్ చిర కాల భాగ‌స్వామిగా ఉంటూ వ‌చ్చింది. భ‌విష్య‌త్తులో ఈ రంగంలో, ప్ర‌త్యేకించి ర‌క్ష‌ణ ఉత్ప‌త్తి విష‌యంలో, మన స‌హ‌కారానికి గాను అనేక నూత‌న అవ‌కాశాల‌ను సృష్టించ‌డం జ‌రుగుతుంద‌ని నేను న‌మ్ముతున్నాను.

మ‌న భ‌ద్ర‌త సంబంధ స‌హ‌కారాన్ని, మ‌రీ ముఖ్యంగా సైబ‌ర్ సెక్యూరిటీ విష‌యంలో, మ‌రింత బ‌లోపేతం చేసుకోవాల‌ని మేము నిర్ణ‌యించాము. మ‌రొక విష‌యాన్ని కూడా మేము అంగీక‌రించాము. అది ఏమిటంటే, మ‌న సంబంధాలు ప్రాంతీయ మ‌రియు ప్ర‌పంచ స్థాయిల‌లో ప్రాముఖ్యాన్ని సంత‌రించుకొన్నాయ‌న్న‌దే. అంత‌ర్జాతీయ వేదిక మీద మ‌నం స‌న్నిహిత స‌హ‌కారాన్ని చాటుకొంటున్నాము. ఇది మ‌రింత‌గా కొన‌సాగ‌నుంది.

ఈ రోజు యూరోప్ లో, ఆసియా లో చోటుచేసుకొంటున్న ప‌రిణామాల‌పైన మేము మా అభిప్రాయాల‌ను పరస్పరం స‌మ‌గ్రంగా తెలియ‌జెప్పుకోవడం జరిగింది.

ముగించే ముందు నేను మ‌రొక్క మారు ప్ర‌ధాని శ్రీ లోఫ్‌వెన్ కు నా హృద‌యాంత‌రాళం నుండి ధ‌న్య‌వాదాలు తెలియ జేయాల‌నుకొంటున్నాను.

మీకంద‌రికీ అనేకానేక ధ‌న్య‌వాదాలు.

|
Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
India eyes potential to become a hub for submarine cables, global backbone

Media Coverage

India eyes potential to become a hub for submarine cables, global backbone
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 10 మార్చి 2025
March 10, 2025

Appreciation for PM Modi’s Efforts in Strengthening Global Ties