యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడు శ్రీ డోనాల్డ్ జె. ట్రంప్, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ లు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానించిన మీదట 2020వ సంవత్సరం ఫిబ్రవరి 24వ మరియు 25వ తేదీల లో భారతదేశ ఆధికారిక సందర్శన కు తరలి రానున్నారు. ఇది భారతదేశాని కి యుఎస్ అధ్యక్షుడు జరుపుతున్న తొలి యాత్ర కానున్నది.
ఈ సందర్శన కాలం లో, అధ్యక్షుడు శ్రీ ట్రంప్ మరియు ప్రథమ మహిళ న్యూ ఢిల్లీ తో పాటు గుజరాత్ లోని అహమదాబాద్ లో ఆధికారిక కార్యక్రమాల కు హాజరు అవుతారు; భారతీయ సమాజం లో వివిధ వర్గాల వారి తో వారు భేటీ అవుతారు.
భారతదేశాని కి మరియు యుఎస్ కు మధ్య నెలకొన్న ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యం ఉభయ దేశాల ప్రజల మధ్య గల మైత్రి కి మరియు ఆత్మీయత కు సూచకం గా ఉన్నది. ఈ భాగస్వామ్యం విశ్వాసం, ఉమ్మడి విలువ లు, పరస్పర గౌరవం మరియు అవగాహన ల పైన ఆధారపడివుంది. ఈ సంబంధం ప్రధాన మంత్రి శ్రీ మోదీ, అధ్యక్షుడు శ్రీ ట్రంప్ ల నాయకత్వం లో మరింత గా వికసించింది. ఈ క్రమం లో ప్రజల కు- ప్రజల కు మధ్య సంబంధాల తో పాటు వ్యాపార రంగం లో, రక్షణ రంగం లో, శక్తి రంగం లో, ఉగ్రవాదాని కి వ్యతిరేకం గా పోరాడటం లో, ప్రాంతీయ అంశాలు మరియు ప్రపంచపరమైనటువంటి అంశాల లో సమన్వయం.. వీటిలో చెప్పుకోదగ్గ పురోగతి నమోదు అయింది. ఈ పర్యటన ఇరు దేశాల నేతల కు ద్వైపాక్షిక సంబంధాల లో పురోగతి పై సమీక్ష ను నిర్వహించేందుకు మరియు ఉభయ పక్షాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత గా బలోపేతం చేసుకొనేందుకు ఒక అవకాశాన్ని ఇవ్వనున్నది.