Germany is among India’s most important partners both bilaterally and in the global context: PM
There is tremendous potential in India-Germany economic collaboration, says PM Modi
Through our ‘Make in India’ initiative, we are committed to transform India as a major player in the global value chain: PM Modi
India has emerged as the fastest growing major economy the last three years with GDP growth rate of over 7%: PM
Our emphasis has been on reducing Government and enhancing Governance: PM Narendra Modi
India has one of the most liberal FDI Policy regimes in the world: Prime Minister

హ‌ర్ ఎక్స్ లెన్సీ, డాక్ట‌ర్ అంజెలా మెర్కెల్‌
ప్రపంచ వాణిజ్య నేత‌లారా
లేడీస్ అండ్ జెంటిల్మాన్‌!

మిమ్మ‌ల్నంద‌ర్నీ క‌లుసుకున్నందుకు నాకు ఎంత‌గానో సంతోషంగా ఉంది. ఛాన్స‌ల‌ర్ మెర్కెల్ లాంటి విశిష్ట నేత స‌మ‌క్షంలో మీతో మాట్లాడ‌డం నాకు మ‌రింత ఆనందాన్నిస్తోంది. నిజానికి ఆమెను క‌లుసుకోవ‌డానికి ఎలాంటి అవ‌కాశం వ‌చ్చినా నేను వ‌దులుకోను. ముఖ్యంగా 2015 ఏప్రిల్ నెల‌లో జ‌ర్మ‌నీ ప‌ర్య‌ట‌న‌లో హ‌న్నోవ‌ర్ ఫెయిర్ సంద్భ‌రంగా ఆమెతో నా సంప్ర‌దింపులను నేను గుర్తు చేసుకుంటున్నాను. ఆ ప్ర‌ద‌ర్శ‌నలో భార‌త‌దేశంకూడా భాగ‌స్వామిగా వుంది. ఆ నా ప‌ర్య‌ట‌న త‌ర్వాత 2015 అక్టోబ‌ర్ లో ఛాన్స‌ల‌ర్ మెర్కెల్ భార‌త‌దేశంలో ప‌ర్య‌టించారు. నాడు మేమిద్ద‌రం క‌లిసి జ‌ర్మ‌నీ, భార‌త‌దేశ సిఇవోల‌తో ప‌లు ద‌ఫాలుగా చ‌ర్చ‌లు చేశాం. ఈ రోజున ఈ హాలులో మ‌రోసారి నాకు అపార‌మైన శ‌క్తి, ఉత్సాహం క‌నిపిస్తున్నాయి. ఈ స‌మావేశానికి ప‌లువురు భార‌తీయ సీఇవోలు కూడా హాజ‌ర‌వ్వ‌డం నేను గ‌మ‌నిస్తూనే వున్నాను.
స్నేహితులారా,
ద్వైపాక్షికంగానూ, అంత‌ర్జాతీయ నేప‌థ్యంలో తీసుకున్నా భార‌త‌దేశానికి సంబంధించి జ‌ర్మ‌నీ చాలా ముఖ్య‌మైన భాగ‌స్వామి. భార‌త‌దేశ వృద్ధి గాధ‌లో జ‌ర్మ‌నీ కంపెనీలు త‌మ పాత్ర నిర్వ‌హించ‌డం నాకు ఎంత‌గానో సంతోషంగా వుంది. అలాగే జ‌ర్మ‌నీలో భార‌త‌దేశ కంపెనీలు త‌మ ఉనికిని చాటుకోవ‌డం కూడా సంతోషాన్నిస్తోంది. భార‌త‌దేశంలో పెట్టుబ‌డులు పెట్టిన దేశాల జాబితాలో జ‌ర్మ‌నీ ఏడో స్థానంలో వుంది. భార‌త‌దేశానికి చెందిన‌ ఇంజినీరింగ్‌, కెమిక‌ల్స్‌, సేవ‌ల రంగాలు జ‌ర్మ‌నీనుంచి విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షిస్తున్నాయి. భార‌త‌దేశంలో ప్ర‌స్తుతం 600కు పైగా ఇండో జ‌ర్మ‌న్ జాయింట్ వెంచ‌ర్ కంపెనీలు ప‌ని చేస్తున్నాయి. వాటి ద్వారా రెండు ల‌క్ష‌ల‌మంది ఉపాధి పొందుతున్నారు. అయితే భార‌త‌దేశం, జ‌ర్మ‌నీల ఆర్ధిక భాగ‌స్వామ్యం మ‌రింత పెరిగ‌డానికి అద్భుత‌మైన అవ‌కాశ‌ముంది. ఇరు దేశాల ఆర్ధిక భాగ‌స్వామ్యం ఉండాల్సిన స్థాయికంటే త‌క్కువ‌గా వుంది. దీన్ని పెంచ‌డానికిగాను భార‌త‌దేశం సిద్ధంగా వుంది. జర్మ‌నీ కంపెనీల‌కు హృద‌య‌పూర్వ‌క స్వాగ‌తం ప‌లుకుతున్నాను. జ‌ర్మ‌నీ కంపెనీలకు స‌హాయం చేయాల‌నే ఉద్దేశ్యంతో మేం వేగ‌వంతంగా స్పందించే వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేశాం. ఈ వ్య‌వ‌స్థ ద్వారా ఇప్ప‌టికే అనేక స‌మ‌స్య‌లు ప‌రిష్కార‌మ‌య్యాయి. ఈ ప‌నిని మేం చాలా నిజాయితీగా చేస్తున్నాం..ఎందుకుంటే జ‌ర్మ‌నీ భాగ‌స్వామ్యానికి మేం ఇచ్చే విలువ అలాంటిది.
స్నేహితులారా,
త‌యారీరంగంలో భార‌త‌దేశాన్ని ప్ర‌పంచ త‌యారీరంగ వేదిక‌గా రూపొందించ‌డానికి మేం కృషి చేస్తున్నాం. త‌యారీ రంగంలో ఇప్ప‌టికే ఒక మంచి వాతావ‌ర‌ణం వుంది. ఇప్ప‌టికే భార‌త‌దేశం అందిస్తున్న ప‌లు అంశాలు ఇలా వున్నాయి.
ప‌పంచ‌వ్యాప్తంగా చూసిన‌ప్పుడు త‌యారీరంగంలో స‌ర‌స‌మైన ధ‌ర‌ల‌ను ఇవ్వ‌గ‌లిగే ఆరోగ్య‌క‌ర‌మైన పోటీ వాతావ‌ర‌ణం.
తెలివితేట‌లు, శ‌క్తియుక్తులు అపారంగాగ‌ల నైపుణ్య నిపుణులు,
అంత‌ర్జాతీయ స్థాయిగ‌ల ఇంగినీరింగ్ విద్య పునాదిగా వుంది. బ‌లమైన ఆర్ అండ్ డి సౌక‌ర్యాలు.
జిడిపిలో, కొనుగోలు శ‌క్తిలో పెరుగ‌ద‌ల కార‌ణంగా దేశీయ మార్కెట్లో మ‌రింత ప్ర‌గ‌తి.
ప్ర‌పంచంలోనే అత్యంత స‌ర‌ళ‌మైన ఎఫ్ డిఐ విధానాలందిస్తున్న దేశం.
మ‌రింత సులువుగా వ్యాపారం చేసుకునే వాతావ‌ర‌ణ క‌ల్ప‌న‌కు ప్ర‌భుత్వ ప్రాధాన్య‌త‌.
ఈ బ‌లాల కార‌ణంగా యూఎన్ ఐ డివో చెప్పిన‌ట్టుగా ప్ర‌పంచంలోనే భార‌త‌దేశం ఆరవ అతి పెద్ద త‌యారీ దేశంగా అవ‌త‌రించింది.
ప్ర‌పంచంలోనే అత్యంత స‌ర‌ళ‌మైన ఎఫ్ డి ఐ విధానాన్ని క‌లిగిన దేశం.
వాణిజ్య వాతావ‌ర‌ణాన్ని మ‌రింత స‌ర‌ళ‌త‌రం చేయ‌డానికి ప్ర‌భుత్వ ప్రాధాన్య‌త‌
ఇలాంటి బ‌లాల కార‌ణంగా యుఎన్ ఐడివో చెప్పిన‌ట్టుగా భార‌త‌దేశం ఇప్ప‌టికే ప్ర‌పంచంలోనే ఆర‌వ అతిపెద్ద త‌యారీ దేశంగా నిలిచింది. దీన్ని మ‌రింత మెరుగుప‌రుచుకోవ‌డానికి ప‌లు అంశాల్లో మేం గ‌ట్టిగా కృషి చేస్తున్నాం.
భార‌త‌దేశంలోనే త‌యారీ కార్య‌క్ర‌మంద్వారా అంత‌ర్జాతీయ వ్య‌వ‌స్థ‌లో భార‌త‌దేశం ప్రధాన పాత్ర నిర్వ‌హించేలా చూడ‌డానికి మేం నిబ‌ద్ధ‌త‌తో కృషి చేస్తున్నాం. దీని వెన‌క‌గ‌ల ప్ర‌ధాన ఉద్దేశ్యం ఉద్యోగాల క‌ల్ప‌న‌. స‌మాజంలో సంప‌న్నుల‌కు, పేద‌వారికిగ‌ల అంత‌రాన్ని త‌గ్గించ‌డం. భార‌త‌దేశంలోనే త‌యారీ ఇప్ప‌టికే బ‌ల‌మైన ప్ర‌భావాన్ని చూపింది.
భార‌త‌దేశంలోనే త‌యారీ కార్య‌క్ర‌మం విజ‌య‌వంతం కావ‌డంలో జ‌ర్మ‌నీ పెద్ద ఎత్తున త‌న పాత్ర నిర్వ‌హిస్తోంది. ముఖ్యంగా చెప్పాలంటే ఇండో జ‌ర్మ‌న్ భాగ‌స్వామ్యం బ‌ల‌ప‌డ‌డానికి హ‌న్నోవ‌ర్ ఫెయిర్‌లో భాగ‌స్వామిగా భార‌త‌దేశం పాల్గొన‌డం కూడా కార‌ణం. హ‌న్నోవ‌ర్ ఫెయిర్ సంద్భంగా ఇరు దేశాలు క‌లిసి ప‌ని చేయ‌డానికి అనువైన రంగాల‌ను గుర్తించ‌డం జ‌రిగింది. ఇందులో త‌యారీ, నైపుణ్యాల అభివృద్ధి, రైల్వే, న‌దుల శుభ్ర‌త‌, పున‌రుత్పాద ఇంధ‌నం, విద్య‌, సైన్స్ అండ్ టెక్నాల‌జీ రంగాలున్నాయి. వీటికి తోడుగా 2015 సెప్టెంబ‌ర్ నుంచి మ‌నం వ్యూహాత్మ‌క మార్కెట్ ఎంట్రీ స‌పోర్ట్ ప్రోగ్రామ్ ను అమ‌లు చేస్తున్నాం. దీనిని ఎంఐఐఎం ( మేక్ ఇన్ ఇండియా మిట్టెల్ స్టాండ్‌) అని పిలుస్తున్నాం. జ‌ర్మ‌నీకి చెందిన మిట్టెల్ స్టాండ్ కంపెనీలు భార‌త‌దేశ మార్కెట్లోకి ప్ర‌వేశించ‌డానికి ఈ ప్రోగ్రామ్ ప్ర‌ధానంగా స‌హాయం చేస్తుంది.
ప్రతిష్టాత్మ‌క ఎంఐఐఎం కార్య‌క్ర‌మం వాణిజ్యానికి మ‌ద్ద‌తునిచ్చే విస్తృత‌మైన సేవ‌ల‌ను అందిస్తోంది. ఈ కార్య‌క్ర‌మం కార‌ణంగా భార‌త‌దేశంప‌ట్ల‌ జ‌ర్మ‌నీ కంపెనీల్లో సానుకూల‌త పెరుగుతోంది.
ఈ అతి త‌క్కువ స‌మ‌యంలో వ‌చ్చిన ఫ‌లితాలు ఏవంటే..
ఈ కార్య‌క్ర‌మంలో చేర‌డానికి 83 కంపెనీలు సానుకూల‌త‌ను వ్య‌క్తం చేశాయి.
అధికారిక స‌భ్యులుగా 73 కంపెనీలు త‌మ పేర్ల‌ను న‌మోదు చేసుకున్నాయి.
పెట్టుబ‌డుల‌ను పెట్టే ద‌శ‌కు 47 కంపెనీలు చేరుకున్నాయి. భార‌త‌దేశం, జ‌ర్మ‌నీకి మ‌ధ్య‌న విజ‌య‌వంతంగా కొన‌సాగుతున్న మ‌రో కార్య‌క్ర‌మం ఇండో జ‌ర్మ‌న్ మేనేజ‌ర్స్ ట్రెయినింగ్ కార్య‌క్ర‌మం. బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్ కోసం ముఖ్యంగా భార‌తీయ ఎస్ ఎంఇల‌లో ప‌ని చేసేవారికి ఉన్న‌త‌స్థాయి శిక్ష‌ణ ఇవ్వ‌డానికి ఉద్దేశించిన‌ది. ఈ కార్య‌క్ర‌మం కార‌ణంగా వ‌చ్చిన ఫ‌లితాలేవంటే ఇరుదేశాల మ‌ధ్య‌న పెట్టుబ‌డులు పెరిగాయి. నూత‌న జాయింట్ వెంచ‌ర్లు మొద‌ల‌య్యాయి. బిజినెస్ టు బిజినెస్ కాంటాక్ట్ లు పెరిగాయి.
ఈ కార్య‌క్ర‌మంద్వారా ఇంత‌వ‌ర‌కూ 500ల‌కు పైగా భార‌తీయ మేనేజ‌ర్లు ల‌బ్ధి పొందారు.
దీనికి తోడుగా ఇప్ప‌టికే ఒక మంచి వాతార‌ణం మ‌నుగ‌డ‌లో వుంది. దీనికి సంబంధించిన ఉదాహ‌ర‌ణ‌ల‌ను తీసుకుంటే
బాస్క్‌, సీమెన్స్‌, బిఏ ఎస్ ఎప్‌, ఎస్ ఏ పి లు ప్ర‌త్యేక ఆర్ అండ్ డి కార్య‌క్ర‌మాల‌ను భార‌త‌దేశానికే ప్ర‌త్యేకంగా ఉండేలా మొదలుపెట్టాయి.
2015 జులై లో మెర్సిడెస్ బెంజ్ కంపెనీ త‌న రెండో త‌యారీ యూనిట్ ను చ‌కాన్ లో ప్రారంభించింది. దీనివ‌ల్ల ఆ సంస్థ ఏడాది ఉత్ప‌త్తులు రెండింత‌ల‌వుతున్నాయి. అంటే ఏడాదికి 20 వేల యూనిట్లు ఉత్ప‌త్తి అవుతాయి.
మేం చేస్తున్న కృషి కార‌ణంగా అంత‌ర్జాతీయంగా మంచి గుర్తింపు పొందుతున్నాం. వాటిలో కొన్నిటిని మీకు తెలియ‌జేయాల‌నుకుంటున్నాను.
ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆర్ధిక‌రంగంలో ఆందోళ‌న‌క‌ర ప‌రిస్థితులు నెల‌కొన్న నేప‌థ్యంలో భార‌త‌దేశం మాత్రం అంద‌రికీ ఆశాజ‌న‌కంగా క‌నిపించింది. 7 శాతానికి పైగా జిడిపి వృద్ధి రేటుతో గ‌త మూడేళ్ల‌లో భార‌త‌దేశం వేంగా అభివృద్ధవుతున్న ప్ర‌ధాన ఆర్ధిక వ్య‌వ‌స్థ‌గా అవ‌త‌రించింది. గ‌త రెండేళ్ల‌లో ప్ర‌పంచ ఆర్ధిక వేదిక వారి గ్లోబ‌ల్ కాంపిటిటివ్ నెస్ ఇండెక్స్ లో 32 స్థానాల‌ను దాటుకొని పైకి వెళ్ల‌డం జ‌రిగింది. ఇది అన్ని దేశాల‌కంటే అధికం.
ప్ర‌పంచ బ్యాంకు ప్ర‌క‌టించిన‌ లాజిస్టిక్స్ ప‌ర్‌ఫార్మెన్స్ ఇండెక్స్ 2016 జాబితాలో భార‌త‌దేశం 19 స్థానాల‌ను దాటుకొని పైకి వెళ్లింది.
డ‌బ్ల్యుఐపిఓ 2016లో ప్ర‌క‌టించిన గ్లోబ‌ల్ ఇన్నోవేష‌న్ ఇండెక్స్ లో బార‌త‌దేశం 16 స్థానాల‌ను దాటుకొని పైకి వెళ్లింది.
యుఎన్ సిటిఏడి ప్ర‌క‌టించిన జాబితా ప్ర‌కారం విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డుల‌ను అధికంగా ఆక‌ర్షిస్తున్న ప‌ది దేశాల్లో భార‌త‌దేశం మూడో స్థానాన్ని సంపాదించింది.
ఇవి కొన్ని ఉదాహ‌ర‌ణ‌లు మాత్ర‌మే. మా ప్రాధాన్య‌తంతా ప్ర‌భుత్వ ప్ర‌మేయాన్ని త‌గ్గించి ప‌రిపాల‌న‌ను అధికంచేయ‌డ‌మే. దీనికి సంబంధించి నేను కొన్ని ఉదాహ‌ర‌ణ‌లు చెబుతాను.
డిజిట‌ల్ ఎక‌న‌మీగా అవ‌త‌రించ‌డానికి వేగంగా అడుగులు వేస్తున్నాం.
గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా భార‌త‌దేశం చేప‌ట్టిన చారిత్రాత్మ‌క సంస్క‌ర‌ణ జిఎస్ టి. వ‌చ్చే నెల‌నుంచి ఇది అమ‌లులోకి రానున్న‌ది.
గ‌త రెండు సంవ‌త్స‌రాల్లో ప‌న్నుల విష‌యంలో వ్య‌క్తిగ‌తంగాను, కార్పొరేట్ ప‌రంగాను అతి త‌క్కువ ప‌న్ను వుండే విధానాన్ని భార‌త‌దేశం అమ‌లు చేస్తోంది.
కార్పొరేట్ ట్యాక్స్ ను 30 శాతాన్నుంచి 25 శాతానికి త‌గ్గించాం. ముఖ్యంగా నూత‌నంగా పెట్టుబ‌డులు పెట్టేవారికోసం, చిన్న వెంచ‌ర్ల‌ను క‌లిగిన‌వారికోసం ఈ నిర్ణ‌యం తీసుకున్నాం.
దివాలా వ్య‌వ‌హారాల‌ను చూడ‌డానికి కొత్త చ‌ట్టాల‌ను, సంస్థ‌ల‌ను ఏర్పాటు చేశాం. ఐపిఆర్, ఆర్బిట్రేష‌న్ అమ‌లులో వున్నాయి.
వాణిజ్యాన్ని సులువుగా చేసుకోవ‌డానికి వీలుగా ఏడు వేల‌కుపైగా సంస్క‌ర‌ణ‌ల‌ను అమ‌లు చేయ‌డం జ‌రిగింది.
ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తుల‌ను తీసుకోవాల్సిన కంపెనీల జాబితానుంచి 36 శ్వేత పరిశ్ర‌మ‌ల‌ను తొల‌గించడం జ‌రిగింది.
ర‌క్ష‌ణ జాబితానుంచి 50 ఐట‌మ్స్ ను తొల‌గించ‌డం జ‌రిగింది.
పారిశ్రామిక లైసెన్సుల కాల ప‌రిమితిని 15 సంవ‌త్స‌రాల‌కు పెంచ‌డం జ‌రిగింది.
19 పోర్టుల‌లోను, 17 ఎయిర్ కార్గో కాంప్లెక్స‌ల‌లోను క‌స్ట‌మ్స్‌ అనుమ‌తుల‌ను 24X7 ఇవ్వ‌డం జ‌రుగుతోంది.
డిఐఎన్, పిఏఎన్‌, టిఏఎన్ , సిఐఎన్ ల‌ను కేటాయిస్తూ కంపెనీకి అనుమ‌తినివ్వ‌డం ఒక రోజులోనే అయిపోతుంది.
ప‌దిహేను రోజుల్లో విద్యుత్ సౌక‌ర్యాన్ని క‌ల్పించ‌డం జ‌రుగుతుంది.
ప్ర‌పంచ బ్యాంకు ప్ర‌క‌టించిన విద్యుత్ సౌక‌ర్యం పొంద‌గ‌లిగే దేశాల జాబితాలో 111 స్థానాల‌ను దాటి పైకి వెళ్లింది.
రాష్ట్రాలు చేసిన వేలాది సంస్క‌ర‌ణ‌ల‌కు పై ఉదాహ‌ర‌ణ‌లు అద‌నం. స‌మైక్య స్ఫూర్తిని చాటే కేంద్ర ప్ర‌భుత్వంతోపాటు రాష్ట్రాలు కూడా సంస్క‌ర‌ణ‌ల‌కు పెద్ద‌పీట వేసి అమ‌లు చేస్తున్నాయి. దీనికి సంబంధించి నేను కొన్ని ఉదాహ‌ర‌ణ‌లు ఇస్తాను.
ఇక్క‌డ నేను కొన్ని రాష్ట్రాల గురించి మాత్ర‌మే ప్ర‌స్తావిస్తున్నాను. పోటీత‌త్వం కార‌ణంగా సంస్క‌ర‌ణ‌లు అన్ని రాష్ట్రాల‌కు విస్త‌రిస్తున్నాయి.
సంస్క‌ర‌ణ‌లు వివరాలు ఏంటంటే..
చెల్లింపులు, అనుమ‌తుల‌కు సంబంధించి 16 రాష్ట్రాల్లో నూరుశాతం సింగిల్ విండో సిస్ట‌మ్ అమ‌లు
13 రాష్ట్రాల్లో ఎల‌క్ట్రానిక్ ప‌ద్ధ‌తిలో టాక్స్ రిట‌ర్స్న్ అమ‌లు వంద‌శాతం.
13 రాష్ట్రాల్లో ఆటోమేటెడ్‌ ఆన్ లైన్ బిల్డింగ్ ప్లాన్ అనుమ‌తి.
వాణిజ్య త‌గాదాల‌కు సంబంధి ఎలక్ట్రానిక్ ఫైలింగ్ సిస్ట‌మ్ 11 రాష్ట్రాల్లో అమ‌లు
13 రాష్ట్రాల్లో జిల్లా స్థాయిలో ప్ర‌త్యేక వాణిజ్య కోర్టుల‌ను ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది.
స్నేహితులారా
ప్ర‌పంచంలోనే అత్యంత స‌ర‌ళ‌మైన ఎఫ్ డిఐ విధానాన్ని క‌లిగిన దేశంగా భార‌త‌దేశానికి గుర్తింపు ల‌భించింది. ఆటోమేటిక్ రూట్లో 90 శాతానికి పైగా పెట్టుబ‌డులు వ‌స్తున్నాయి. ఫారిన్ ఇన్వెస్ట్ మెంట్ ప్ర‌మోష‌న్ బోర్డును ర‌ద్దు చేయాల‌ని గ‌త వారం నిర్ణ‌యించ‌డం జ‌రిగింది. ఎఫ్ డిఐ ప్ర‌తిపాద‌న‌ల‌ను ప‌రిశీలించ‌డానికి దీన్ని 1990ల‌లో ఏర్పాటు చేశారు. భార‌త‌దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో విదేశీ మ‌దుప‌రుల సంఖ్య‌ను పెంచ‌డానికే ఈ నిర్ణ‌యం తీసుకున్నాం. ఈ నిర్ణ‌యం కార‌ణంగా ప‌లు అంత‌ర్జాతీయ సంస్థ‌లు భార‌త‌దేశ ఎఫ్ డి ఐ విధానం అత్యంత అనువైన‌దిగా వుంద‌ని ప్ర‌శంసించాయి.
గ‌త మూడు సంవ‌త్స‌రాల్లో ఎఫ్ డి ఐల ప్ర‌వాహం గ‌ణ‌నీయంగా పెరిగింది. 2016-17 నాటికి భార‌త‌దేశంలో ఎఫ్ డిఐ విలువ 60 బిలియ‌న్ అమెరికా డాల‌ర్లు.
స్నేహితులారా,
భార‌త‌దేశం చాలా పెద్ద దేశం. అభివృద్ధి విష‌యానికి వ‌స్తే ఎంతో చేయాల్సి వుంది. మాకు చాలా క‌ల‌లు వున్నాయి. అవి చాలా భారీగా వున్నాయి. కానీ మాకు చాలా త‌క్కువ స‌మ‌యం వుంది. ఇది మీ ముందున్న అవ‌కాశం.
మీ ముందున్న అవ‌కాశాలు అనేకం. మిలియన్ల కొద్దీ ఇళ్ల నిర్మాణంనుంచి వంద‌లాది ఆకర్ష‌ణీయ న‌గ‌రాల‌ను రూపుదిద్ద‌డంవ‌ర‌కూ అనేక అవ‌కాశాలున్నాయి. రైల్వే నెట్ వ‌ర్కులను, స్టేష‌న్ల‌ను ఆధునీక‌రించ‌డం ద‌గ్గ‌ర‌నుంచి అత్యంత వేగ‌వంత‌మైన రెయిల్ కారిడార్ల వ‌ర‌కూ నిర్మించ‌వచ్చు. పున‌రుత్పాద‌క ఇంధ‌న ఉత్ప‌త్తి ద‌గ్గ‌ర‌నుంచి స‌ర‌ఫ‌రా, పంపిణీ నెట్ వ‌ర్కుల నిర్మాణంవ‌ర‌కూ ప‌నులు చేప‌ట్ట‌వ‌చ్చు. అంతే కాదు జాతీయ ప్ర‌ధాన ర‌హ‌దారులు, వంతెన‌లు, భారీ న‌గ‌ర రవాణా వ్య‌వ‌స్థ‌లు, విద్యాల‌యాలు, ఆసుప‌త్రులు, శిక్ష‌ణా సంస్థ‌లు ఇలా అనేక రంగాల్లో అవ‌కాశాలు పుష్క‌లంగా వున్నాయి.
డిజిట‌ల్ ఇండియా, స్కిల్ ఇండియా ప్ర‌చార కార్య‌క్ర‌మాల ద్వారా మా ప్ర‌జ‌ల్లో సాధికార‌త క‌ల్పించి ఈ అవ‌కాశాల పూర్తి స్థాయిని తెలియ‌జేస్తున్నాం. యువ‌శ‌క్తిని సంపూర్ణంగా వెలికి తీయ‌డానికి వీలుగా స్టార్ట‌ప్ ఇండియా, స్టాండ‌ప్ ఇండియా ఉద్య‌మాల‌నుప్రారంభించాం.
ఛాన్స‌ల‌ర్ మెర్కెల్ , స్నేహితులారా
2015 ఏప్రిల్ లో నేను మాట్లాడిన‌ప్పుడు మా సంస్క‌ర‌ణ‌లు అప్పుడు మొద‌ల‌య్యాయి. నేను ఇప్పుడు చాలా గ‌ట్టిగా చెప్ప‌గ‌ల‌ను..సంస్క‌ర‌ణ‌ల్లో అత్యధికం పూర్త‌య్యాయి. మ‌రిన్ని, మ‌రిన్ని సంస్క‌ర‌ణ‌లు చేప‌ట్ట‌డానికి మేం నిబద్ధుల‌మై వున్నాం. వేగంగాను, మెరుగ్గాను వాటిని చేస్తాం. అలాంటి సంస్క‌ర‌ణ‌లను అవ‌గాహ‌న చేసుకోవ‌డానికి, ప్ర‌చారం చేయ‌డానికి సంస్థాగ‌త నెట్ వ‌ర్కుల‌ను త‌యారు చేసుకోవాల‌ని నేను గ‌ట్టిగా న‌మ్ముతున్నాను. ఇరు దేశాల్లో అంత‌ర్గ‌తంగా దాగిన ఆర్ధిక శ‌క్తిని స‌ద్వినియోగం చేసుకోవ‌డానికి ఇది ముఖ్యం. భార‌త‌దేశంలోకి రావాల్సిందిగా జ‌ర్మ‌నీ స‌హ‌చ‌రులు, కంపెనీల‌కు ఇదే నా స్వాగ‌తం.
ఇరు దేశాల దిశానిర్దేశం, ఆకాంక్ష‌లు, క‌ల‌లు అద్భుత‌మైన వాణిజ్య అవ‌కాశాల‌ను సృష్టిస్తాయి. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా భార‌త‌దేశంలో వాణిజ్య వాతావ‌ర‌ణం నెల‌కొని వుంది. మేం ఇప్పుడు ముందుకు దూకేద‌శ‌లో వున్నాం. అంతే కాదు మా ప్ర‌జాస్వామ్య విలువలు, నిరంత‌రం జాగ్ర‌త్త‌గా వుండే న్యాయ‌వ్య‌వ‌స్థ మీ పెట్టుబ‌డులు భ‌ద్రంగా వుండేలా చూస్తాయి.
మీ కార్య‌క్ర‌మాలు, కృషి విజ‌య‌వంతం కావ‌డానికిగాను మీతో చేయి చేయి క‌లిపి ప‌ని చేయ‌డానికి మేం సిద్ధంగా వున్నామ‌ని నేను హామీ ఇస్తున్నాను.
థ్యాంక్ యూ.....

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Income inequality declining with support from Govt initiatives: Report

Media Coverage

Income inequality declining with support from Govt initiatives: Report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Chairman and CEO of Microsoft, Satya Nadella meets Prime Minister, Shri Narendra Modi
January 06, 2025

Chairman and CEO of Microsoft, Satya Nadella met with Prime Minister, Shri Narendra Modi in New Delhi.

Shri Modi expressed his happiness to know about Microsoft's ambitious expansion and investment plans in India. Both have discussed various aspects of tech, innovation and AI in the meeting.

Responding to the X post of Satya Nadella about the meeting, Shri Modi said;

“It was indeed a delight to meet you, @satyanadella! Glad to know about Microsoft's ambitious expansion and investment plans in India. It was also wonderful discussing various aspects of tech, innovation and AI in our meeting.”