ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీతో రిపబ్లిక్ ఆఫ్ కొరియా ప్రెసిడెంట్ యొక్క ప్రత్యేక దూత శ్రీ మూన్ జె-ఇన్ కు, ప్రత్యేక దూత అయిన శ్రీ దోంగ్ చియా చుంగ్ ఈ రోజు సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ప్రధాన మంత్రి భారతదేశానికి శ్రీ చుంగ్ ను, ప్రెసిడెంట్ శ్రీ మూన్ తన ప్రత్యేక దూతగా పంపించింనందుకు ప్రశంసలు కురిపించారు.
2015 మే నెలలో తాను రిపబ్లిక్ ఆఫ్ కొరియాలో పర్యటించిన సంగతిని ప్రధాన మంత్రి గుర్తుకు తెచ్చుకున్నారు. అప్పట్లో రెండు దేశాల మధ్య నెలకొన్న ద్వైపాక్షిక సంబంధాన్ని “ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం” స్థాయికి మెరుగుపరుచుకొన్నట్లు, భారతదేశానికి రిపబ్లిక్ ఆఫ్ కొరియా ఒక ముఖ్య అభివృద్ధి భాగస్వామిగా వ్యవహరిస్తున్నట్లు ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
వ్యాపారం, ఆర్థిక రంగాలలోనే కాకుండా, రక్షణ సంబంధిత సహకారం వంటి కొత్త రంగాలలో కూడా ద్వైపాక్షిక భాగస్వామ్యం విస్తరించడాన్ని ప్రధాన మంత్రి స్వాగతించారు.
ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా పెంపొందించుకోవడం కోసం ప్రెసిడెంట్ శ్రీ మూన్ తో కలిసి పని చేయడానికి తాను కట్టుబడి ఉన్నానని ప్రధాన మంత్రి అన్నారు. అంతేకాకుండా, త్వరలోనే ప్రెసిడెంట్ శ్రీ మూన్ తో భేటీ అయ్యే అవకాశం కోసం తాను వేచి ఉన్నానని కూడా శ్రీ మోదీ చెప్పారు.