శ్రీ సీతారామ్ కేదిలాయ తాను చేపట్టిన భారత్ పరిక్రమ పాదయాత్ర ను విజయవంతంగా ముగించుకొన్న అనంతరం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఈ రోజు భేటీ అయ్యారు. శ్రీ కేదిలాయ తాను 2012 ఆగస్టు 9వ తేదీన కన్యాకుమారి నుండి భారత్ పరిక్రమ యాత్రను మొదలుపెట్టినట్లు, ఆ యాత్రను ఈ సంవత్సరం జులై 9వ తేదీన కన్యాకుమారిలోనే ముగించినట్లు తెలియజేశారు.
ఈ యాత్ర క్రమంలో, తాను 9000 గ్రామాలను నేరుగా సందర్శించినట్లు శ్రీ కేదిలాయ చెప్పారు. అంతే కాక, యాత్ర యొక్క సందేశాన్ని మరో 20,000 గ్రామాలకు పరోక్షంగా చేరవేసినట్లు కూడా ఆయన తెలిపారు. యాత్ర క్రమంలో లక్షలాది రైతులతోను మరియు గ్రామీణ ప్రాంతాల యువతీయువకులతోను ఆయన సంభాషించారు.
శ్రీ కేదిలాయ ప్రయాసను ప్రధాన మంత్రి ప్రశంసించారు. అలాగే, శ్రీ కేదిలాయ భావి ప్రయత్నం సైతం జయప్రదం కావాలంటూ ప్రధాన మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.