సెశెల్స్ పార్లమెంటు కు చెందిన 12 మంది సభ్యులతో కూడిన ప్రతినిధి వర్గం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీతో ఈ రోజు సమావేశమైంది. ఈ ప్రతినిధి వర్గానికి స్పీకర్ గౌరవనీయులు శ్రీ పాట్రిక్ పిళ్ళె నేతృత్వం వహించారు. అంతేకాకుండా సభా వ్యవహారాల నాయకుడు గౌరవనీయులు చార్ల్ స్ డి కోమర్ మాండ్ కూడా ఈ ప్రతినిధి వర్గంలో సభ్యుడుగా ఉన్నారు.
ఉభయ దేశాల మధ్య చట్ట సభల ప్రతినిధుల రాకపోకలు అధికం కావడాన్ని ప్రధాన మంత్రి స్వాగతించారు. హిందూ మహా సముద్రంతో సహా వివిధ అంశాలపై భారతదేశానికి మరియు సెశెష్స్ కు మధ్య సన్నిహిత భాగస్వామ్య దేశాలుగా దృఢమైన మరియు హుషారైన సంబంధాలను పటిష్ఠ పరచడంలో వారు పోషిస్తున్న పాత్రను ఆయన ప్రశంసించారు. 2015 మార్చి నెలలో స్వయంగా తాను సెశెల్స్ లో జరిపిన పర్యటన ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింతగా పెంపొందించడంలో ఫలప్రదం అయిన సంగతిని ప్రధాన మంత్రి గుర్తుకు తెచ్చుకున్నారు.
ఇరు దేశాల మధ్య సహకారాన్ని, ప్రజలకు- ప్రజలకు మధ్య సంబంధాలను మరింతగా బలోపేతం చేసుకొనే అంశంపై ప్రతినిధి వర్గం సభ్యులు వారి దృష్టి కోణాన్ని ప్రధాన మంత్రికి వివరించారు.
లోక్ సభ స్పీకర్ ఆహ్వానించిన మీదట, సెశెల్స్ పార్లమెంటరీ ప్రతినిధి వర్గం భారత దేశంలో ఆధికారిక పర్యటనకు తరలి వచ్చింది.