శ్రేష్ఠులారా,
నమస్కారం.
అన్నింటి కంటే ముందు, ఎస్ సిఒ కౌన్సిల్ అధ్యక్ష పదవి లో సఫలత ను పొందినందుకు అధ్యక్షుడు శ్రీ రహమోన్ కు నన్ను అభినందనల ను తెలియజేయనివ్వండి. ప్రాంతీయ స్థితిగతులు , ప్రపంచ స్థితిగతులు చాలా సవాళ్ళ తో నిండిపోయిన నేపథ్యం లో తాజిక్ అధ్యక్షత న ఈ సంస్థ ను సమర్థం గా నడపడం జరిగింది. తాజికిస్తాన్ కు స్వాతంత్య్రం వచ్చిన తరువాత 30వ వార్షికోత్సవం కూడా ఇదే సంవత్సరం లో జరుగుతున్నది. ఈ వేళ లో తాజిక్ సోదరుల కు, సోదరీమణుల కు, అధ్యక్షుడు శ్రీ రహమోన్ కు భారతదేశం తరఫు న నేను నా హృదయ పూర్వక అభినందనల ను, శుభాకాంక్షల ను వ్యక్తం చేస్తున్నాను.
శ్రేష్ఠులారా,
ఈ సంవత్సరం మనం ఎస్ సిఒ 20వ వార్షికోత్సవాన్ని సైతం జరుపుకొంటున్నాం. మంగళ ప్రదమైన సందర్భం లో కొత్త మిత్రులు మనతో కలుస్తూ ఉండడం సంతోషాన్ని ఇచ్చే అంశం. ఇరాన్ ను ఎస్ సిఒ లో ఒక కొత్త సభ్యత్వ దేశం గా నేను స్వాగతిస్తున్నాను. కొత్త గా సంభాషణల లో పాలుపంచుకొంటున్న మూడు భాగస్వామ్య దేశాలు.. సౌదీ అరేబియా, జిప్ట్, ఖతర్.. లకు కూడా నేను స్వాగతం పలుకుతున్నాను. ఎస్ సిఒ విస్తరిస్తోంది అంటే అడి మన సంస్థ తాలూకు ప్రభావం పెరుగుతూ ఉండటాన్ని చాటుతున్నదనే చెప్పుకోవాలి. కొత్త సభ్యత్వ దేశం తోను, కొత్త సంభాషణల భాగస్వాముల తోను ఎస్ సిఒ మరింత బలపడి, విశ్వసనీయత ను పుంజుకోనుంది.
శ్రేష్ఠులారా,
ఎస్ సిఒ యొక్క 20వ వార్షికోత్సవం ఈ సంస్థ తాలూకు భవిష్యత్తు ను గురించి ఆలోచించడానికి కూడా తగినటువంటి సందర్భం. ఈ ప్రాంతం లో అతి పెద్ద సవాళ్ళు ఏమేమిటంటే అవి శాంతి, భద్రత, నమ్మకం కొరవడడానికి సంబంధించినవి అనేది నా అభిప్రాయం.. మరి ఈ సమస్యల కు మూల కారణం సమూల సంస్కరణీకరణ వాదం పెరుగుతూ ఉండటమే. అఫ్ గానిస్తాన్ లో ఇటీవలి పరిణామాలు ఈ సవాలు ను మరింత స్పష్టం చేసివేశాయి. ఈ విషయం లో ఎస్ సిఒ చొరవ ను తీసుకోవాలి.
మనం చరిత్ర కేసి చూశామా అంటే, అప్పుడు మధ్య ఆసియా లోని ప్రాంతాలు మితవాద, ప్రగతిశీల సంస్కృతి కి, విలువల కు ఒక పెట్టని కోట మాదిరి గా ఉన్న సంగతి ని గ్రహించ గలుగుతాం. సూఫీవాదం వంటి సంప్రదాయాలు ఇక్కడ శతాబ్దాల కు పైగా పుష్పించాయి. అవి ఈ ప్రాంతం అంతటా, ప్రపంచవ్యాప్తం గా కూడాను విస్తరించాయి. వాటి ప్రభావాన్ని మనం ఈ రోజు కు కూడా ఈ ప్రాంత సాంస్కృతిక వారసత్వం లో చూడవచ్చు. మధ్య ఆసియా తాలూకు ఈ చారిత్రిక వారసత్వం ఆధారం గా ఎస్ సిఒ సమూల సంస్కరణీకరణ తోను, తీవ్రవాదం తోను పోరాడటం కోసం ఒక ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందించాలి.
భారతదేశం లోను, ఎస్ సిఒ లో సభ్యత్వం కలిగిన దాదాపు దేశాలు అన్నిటి లోను మితవాద సంస్థ లు, సహనశీల సంస్థ లు, అన్ని వర్గాల ను కలుపుకొని పోతున్న సంస్థ లు, ఇస్లామ్ తో సంబంధం కలిగిన సంప్రదాయాలు ఉన్నాయి. ఎస్ సిఒ వీటి మధ్య ఒక బలమైన నెట్ వర్క్ ను అభివృద్ధి పరచడం కోసం కృషి చేయాలి. ఈ సందర్భం లో ఎస్ సిఒ- ఆర్ఎటిఎస్ యంత్రాంగం ద్వారా చేపట్టిన ఉపయోగకరమైన పనుల ను నేను మెచ్చుకొంటున్నాను. భారతదేశం లో ఎస్ సిఒ- ఆర్ఎటిఎస్ తాలూకు తన అధ్యక్ష బాధ్యతల కాలం లో ఏయే కార్యకలాపాల ను అయితే ప్రతిపాదించిందో, వాటి విషయం లో ఎస్ సిఒ భాగస్వామ్య దేశాలన్నిటి క్రియాశీల సహకారాన్ని మేము ఆశిస్తున్నాం.
శ్రేష్ఠులారా,
సమూల సంస్కరణీకరణ వాదంతో పోరాడడం అనేది ప్రాంతీయ భద్రత కు, పరస్పర విశ్వాసాని కి ఎలాగూ అవసరమే, అది మన యువ తరాల ఉజ్జ్వల భవిష్యత్తు కు కూడాను జరూరుగా జరుగాలి. అభివృద్ధి చెందిన ప్రపంచం తో పోటీ పడాలి అంటే మన ప్రాంతం వృద్ధి లోకి వస్తున్న సాంకేతికత లో ఒక భాగస్వామి గా తప్పక నిలవాలి. దీని కోసం మనం మన ప్రతిభావంతులైన యువతీయువకుల ను విజ్ఞాన శాస్త్రం, హేతుబద్ధమైన ఆలోచన విధానం ల వైపు పయనించేటట్లు గా ప్రోత్సహించవలసివుంటుంది.
మనం మన యువ నవ పారిశ్రామికవేత్తల ను, స్టార్ట్- అప్స్ ను సంధానించడం ద్వారా ఈ రకమైన ఆలోచన విధానాన్ని, నూతన ఆవిష్కరణ ల సంబంధి భావనల ను ప్రోత్సహించేందుకు వీలు ఉంటుంది. ఈ దృష్టికోణం తో భారతదేశం కిందటి సంవత్సరం లో ఒకటో ఎస్ సిఒ స్టార్ట్-అప్ ఫోరమ్ ను మరియు యువ శాస్త్రవేత్త ల సమావేశాన్ని నిర్వహించింది. అంతకు మునుపు భారతదేశం తన అభివృద్ధి యాత్ర లో సాంకేతిక విజ్ఞానాన్ని విజయవంతం గా ఉపయోగించింది.
అది యుపిఐ కావచ్చు లేదా రూపే కార్డు కావచ్చు.. ఆ తరహా సాంకేతికతల ను సమాజం లోని అన్ని వర్గాల వారి ని ఆర్థిక సేవ ల పరిధి లోకి తీసుకు రావడాన్ని అధికం చేయడం కోసం, అలాగే కోవిడ్ కు వ్యతిరేకం గా పోరాడడం లో ‘ఆరోగ్య-సేతు’, ‘కోవిన్’ ల వంటి డిజిటల్ ప్లాట్ ఫార్మ్ స్ కావచ్చు.. వీటిని మేం స్వచ్ఛందం గా ఇతర దేశాల తోనూ పంచుకొన్నాం. ఈ ఓపెన్ సోర్స్ టెక్నాలజీస్ ను మా ఎస్ సిఒ భాగస్వాముల తో పంచుకోవాలన్నా, దీని కోసం సామర్ధ్యాన్ని పెంచే కార్యకలాపాల ను నిర్వహించాలన్నా అది మాకు సంతోషదాయకమే అవుతుంది.
శ్రేష్ఠులారా,
సమూల సంస్కరణీకరణ వాదం, అభద్రత ల కారణం గా ఈ ప్రాంతం లోని విశాల ఆర్థిక అవకాశాలు సైతం తగిన స్థాయి లో వినియోగం కాకుండా మిగిలిపోయాయి. ఖనిజ సంపద కావచ్చు, లేదా ఎస్ సిఒ సభ్యత్వ దేశాల మధ్య జరిగే వ్యాపారం కావచ్చు.. వాటి పూర్తి ప్రయోజనాన్ని పొందాలి అంటే మనం మన మధ్య సంధానానికి పెద్ద పీట ను వేసే తీరాలి. చరిత్ర లో మధ్య ఆసియా పాత్ర ఎటువంటిది అంటే అది ప్రధాన ప్రాంతీయ బజారు ల మధ్య ఒక సంధానాత్మకమైన సేతువు వలె పని చేసింది. అదే ఈ ప్రాంతం సమృద్ధి కి ఒక ఆధారం గా కూడా ఉండింది. మధ్య ఆసియా తో సంధానాన్ని పెంచుకోవాలి అనే విషయానికి భారతదేశం కట్టుబడి ఉంది.
భారతదేశం లో చాలా పెద్దదైన బజారు తో జత పడటం ద్వారా మధ్య ఆసియా ప్రాంత దేశాలు గొప్ప గా లాభపడగలవని మేం నమ్ముతున్నాం. దురదృష్టవశాత్తు అనేక సంధాన పంబంధి ఐచ్చికాలు ఈ రోజు కు కూడా ఆయా దేశాల కు అందుబాటు లో లేవు. దీనికి కారణమల్లా పరస్పర విశ్వాసం కొరవడటమే. ఇరాన్ లోని చాబహార్ ఓడరేవు అభివృద్ధి ప్రక్రియ లో మా పెట్టుబడి, అలాగే ఇంటర్ నేశనల్ నార్థ్-సౌథ్ కారిడోర్ దిశ లో మా ప్రయత్నాలు ఈ వాస్తవం పైనే ఆధారపడి ముందుకు సాగుతున్నాయి.
శ్రేష్ఠులారా,
సంధానానికి సంబంధించిన ఏ చొరవ అయినా ఒకే దారి కల వీధి వలె ఉండిపోజాలదు. పరస్పర విశ్వాసాని కి పూచీపడటం కోసం సంధానం సంబంధిత ప్రాజెక్టు లు సంప్రదింపుల పైన ఆధారపడినవి, పారదర్శకత్వం కలిగినవి అయి ఉండి, భాగస్వామ్య పద్ధతి లో అమలు కు నోచుకోవాలి. ఈ విషయం లో అన్ని దేశాల ప్రాంతీయ సమగ్రత కు గౌరవం ఒక భాగం అయి ఉండాలి. ఈ సిద్ధాంతాల ఆధారం గా ఎస్ సిఒ ఈ ప్రాంతం లో సంధాన సంబంధి ప్రాజెక్టుల కోసం తగిన నియమాల ను రూపొందించాలి.
ఇలా చేసినందువల్ల మనం ఈ ప్రాంతం లో సాంప్రదాయక సంధానాన్ని పునరుద్ధరించినవారం అవుతాం. అలాగైతేనే సంధాన ప్రాజెక్టు లు మన మధ్య ఉన్న దూరాన్ని పెంచడానికి బదులు, మనల ను జోడించే కార్యాన్ని సాధించగలవు. ఈ ప్రయాస కోసం భారతదేశం తన వైపు నుంచి ఎలాంటి తోడ్పాటు ను అయినా సరే అందించడానికి సిద్ధం గా ఉంది.
శ్రేష్ఠులారా,
ఎస్ సిఒ సఫలం కావడానికి గల ప్రధాన కారణాల లో ఒక కారణం ఏమిటంటే అది ఈ ప్రాంతం తాలూకు ప్రాథమ్యాల విషయం లో వహించిన అమిత శ్రద్ధే అని చెప్పాలి. సమూల సంస్కరణీకరణ వాదం, సంధానం, ప్రజలకు - ప్రజల కు మధ్య సంబంధాలు అనే అంశాల లో నేను చేసిన సూచన లు ఎస్ సిఒ తాలూకు ఈ భూమిక ను మరింత బలపరచగలుగుతాయి. నా ప్రసంగాన్ని ముగించడానికన్నా ముందు, మన ఆతిధేయి అధ్యక్షుడు శ్రీ రహమోన్ కు నేను మరో మారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఆయన ఈ హైబ్రిడ్ ఫార్మేట్ తాలూకు సవాలు తలెత్తినప్పటికీ కూడా ఈ శిఖర సమ్మేళనానికి చక్కనైన ప్రణాళిక ను రూపొందించి, మరి దీనిని విజయవంతం గా నడిపారు. ఎస్ సిఒ తదుపరి చైర్ మన్ పదవి లోకి వస్తున్న ఉజ్బెకిస్తాన్ కు కూడా నేను నా శుభాకాంక్షల ను తెలియజేస్తున్నాను; మరి భారతదేశం యొక్క సహకారం ఉంటుందని హామీ ని ఇస్తున్నాను.
మీకు ఇవే ధన్యవాదాలు.