మనం ఆదిత్య బిర్లా గ్రూపు స్వర్ణోత్సవాల ను జరుపుకోవడం కోసం ఇక్కడ థాయిలాండ్ లో భేటీ అయ్యాము.
థాయిలాండ్ తో భారతదేశం బలమైన సాంస్కృతిక బంధాల ను కలిగివుంది. మరి, మనం ఈ దేశం లో ఒక ప్రముఖ భారతీయ పారిశ్రామిక సంస్థ యొక్క యాభై సంవత్సరాల ఘట్టాన్ని స్మరించుకొంటున్నాము.
ప్రస్తుతం భారతదేశం లో చోటు చేసుకొంటున్న కొన్ని సకారాత్మకమైన పరివర్తన ల తాలూకు ఒక చిత్రాన్ని మీ సమక్షం లో ఆవిష్కరించాలన్న ఆసక్తి నాలో ఉంది. ఈ మాటల ను నేను పూర్తి విశ్వాసం తో పలుకుతున్నాను.. భారతదేశాని కి రావడాని కి అత్యుత్తమమైనటువంటి తరుణం ఇది.
గడచిన అయిదు సంవత్సరాల కాలం లో వివిధ రంగాల లో భారతదేశం అనేక విజయ గాథల ను చూసింది. దీనికి కారణం కేవలం ప్రభుత్వాలు కాదు, ఒక నియమితమైన పద్ధతి లో, ఆలస్యం చేసే రీతి లో పని చేయడాన్ని భారతదేశం ఆపివేసింది.
ఏళ్ళ తరబడి పేదల పై డబ్బు ను ఖర్చు పెట్టడం జరిగిందని, ఆ డబ్బు నిజాని కి పేదవారి కి అందనే లేదన్న సంగతి తెలిస్తే మీరు దిగ్భ్రమ కు లోనవుతారు. మా ప్రభుత్వం డిబిటి చలువ తో, ఈ సంస్కృతి ని అంతం చేసింది. డిబిటి అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్. ఈ డిబిటి మధ్యవర్తుల సంస్కృతి ని మరియు సామర్ధ్య లేమి ని అంతమొందించింది.
పన్ను వ్యవస్థ ను మెరుగు పరచడం
భారతదేశం లో ప్రస్తుతం కష్టించి పని చేసే పన్ను చెల్లింపుదారు యొక్క తోడ్పాటు ను అభినందించడం జరుగుతోంది. మేము గణనీయమైన కృషి సలిపిన రంగాల లో టాక్సేశన్ ఒక రంగం గా ఉంది. భారతదేశం లో ప్రజల కు అత్యంత స్నేహ పూర్వకమైనటువంటి పన్ను వ్యవస్థ ఏర్పడింది అని చెప్పడం నాకు సంతోషాన్నిస్తోంది. దీని ని మరింత గా చక్కదిద్దుతామని మేము వచనబద్ధులమై ఉన్నాము.
భారతదేశం పెట్టుబడి కి ఒక ఆకర్షణీయమైన గమ్యస్థానం
ఇప్పటి వరకు నేను చెప్పినదంతా కలుపుకొంటే, పెట్టుబడి పెట్టేందుకు ప్రపంచం లోని అత్యంత ఆకర్షణీయం గా ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థల లో ఒక ఆర్థిక వ్యవస్థ గా భారతదేశం నిలుస్తోంది. భారతదేశం గత అయిదు సంవత్సరాల లో 286 బిలియన్ యుఎస్ డాలర్ విలువైన ఎఫ్‌డిఐ ని అందుకొన్నది. ఇది గడచిన 20 సంవత్సరాల కాలం లో భారతదేశాని కి అందిన మొత్తం ఎఫ్‌డిఐ లో దాదాపు సగ భాగం గా లెక్క తేలుతుంది.
5 ట్రిలియన్ డాలర్ విలువైన ఆర్థిక వ్యవస్థ ను ఆవిష్కరించాలన్న కల ను సాకారం చేసే దిశ గా పయనం
భారతదేశం ప్రస్తుతం మరొక స్వప్నాన్ని అనుసరిస్తున్నది. అది.. అయిదు ట్రిలియన్ డాలర్ విలువైన ఆర్థిక వ్యవస్థ గా రూపొందాలి. నా ప్రభుత్వం 2014వ సంవత్సరం లో అధికారం లోకి వచ్చిన వేళ భారతదేశం యొక్క జిడిపి సుమారు 2 ట్రిలియన్ డాలర్లు గా ఉంది. 65 సంవత్సరాల కాలం లో 2 ట్రిలియన్ డాలర్లు. అయితే, కేవలం అయిదు సంవత్సరాల లో దాని ని సుమారు 3 ట్రిలియన్ డాలర్ల కు మేము పెంచాము.
నేను ప్రత్యేకించి గర్వపడే విషయం ఒకటి ఏదైనా ఉంది అంటే అది భారతదేశం లోని ప్రతిభాన్వితమైనటువంటి మరియు ప్రావీణ్యం కలిగినటువంటి మానవ వనరులు అనేదే. మరి భారతదేశం ప్రపంచం లో అత్యంత భారీదైన స్టార్ట్-అప్ ఇకో-సిస్టమ్స్ ను కలిగివున్నటువంటి దేశాల లో ఒకటి కావడం లో ఆశ్చర్యం ఏమీ లేదు.
భారతదేశం సమృద్ధం అయినప్పుడు యావత్తు ప్రపంచం సమృద్ధం అవుతుంది. భారతదేశం యొక్క అభివృద్ధి కై మా దార్శనికత ఎటువంటిది అంటే అది ఒక ఉత్తమమైన భూగ్రహాని కి సైతం బాట ను పరుస్తుంది.
యాక్ట్ ఈస్ట్ పాలిసి
మా యొక్క యాక్ట్ ఈస్ట్ పాలిసి స్ఫూర్తి ని గనుక పరిశీలిస్తే మేము ఈ ప్రాంతం తో సంధానాన్ని వృద్ధి పరచుకోవడం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు స్పష్టం అవుతుంది. థాయిలాండ్ పశ్చిమ కోస్తా తీరం లోని నౌకాశ్రయాల కు మరియు భారతదేశం లోని తూర్పు కోస్తా తీరం లో గల నౌకాశ్రయాల కు మధ్య నేరు సంధానం మన ఆర్థిక భాగస్వామ్యాన్ని ఉన్నతీకరించ గలుగుతుంది.
పెట్టుబడి పెట్టడం కోసం మరియు సులువుగా వ్యాపారం చేయడం కోసం భారతదేశాని కి విచ్చేయండి.
నూతన ఆవిష్కరణల కోసం, స్టార్ట్-అప్ లను చేపట్టడం కోసం భారతదేశాని కి తరలి రండి. కొన్ని అత్యుత్తమ పర్యటక స్థలాల ను ఆస్వాదించడం కోసం, అలాగే, ప్రజల ఆప్యాయత నిండిన ఆతిథ్యాన్ని స్వీకరించడం కోసం భారతదేశాని కి రండి..
చాచి ఉంచినటువంటి విశాలమైన హస్తాల తో భారతదేశం మీకై వేచి ఉంది.
Congratulations to the @AdityaBirlaGrp for 50 years of their global presence. Watch from Bangkok. https://t.co/acZs7WDH38
— Narendra Modi (@narendramodi) November 3, 2019
For investment and easy business, come to India.
— PMO India (@PMOIndia) November 3, 2019
To innovate and starting up, come to India. To experience some of the best tourist sites and warm hospitality of people, come to India. India awaits you with open arms: PM @narendramodi pic.twitter.com/01ytLQfxm8