ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, రష్యన్ ఫెడరేశన్ అధ్యక్షుడు శ్రీ వ్లాదిమీర్ వి పుతిన్ మరియు పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అధ్యక్షుడు శ్రీ శీ జిన్ పింగ్ లు ఈ రోజు న బ్యూనస్ ఆయర్స్ లో జరిగిన ఒక త్రైపాక్షిక సమావేశంలో పాలుపంచుకొన్నారు.
అంతర్జాతీయ వేదికల లో పరస్పర సహకారాన్ని విస్తరింప చేసుకోవడం, అలాగే మూడు దేశాల మధ్య మరింత సమన్వయాన్ని ప్రోత్సహించడం అనే అంశాలపై ముగ్గురు నాయకులు వారి వారి అభిప్రాయాలను ఈ సందర్భం గా వెల్లడించారు. సంస్కరణలకు, ఐక్య రాజ్య సమితి, డబ్ల్యుటిఒ లతో పాటు సుప్రతిష్టతమైన సంస్థల తో సహా నవీన ప్రపంచ ఆర్థిక సంస్థలు, ఇంకా ప్రపంచానికి లబ్ది ని కలిగించిన బహుళ పార్శిక సంస్థల ను బలోపేతం చేయడానికి ప్రాముఖ్యం ఇవ్వాలని వారు సమ్మతిని వ్యక్తం చేశారు. బహుళ పార్శిక వ్యాపార వ్యవస్థ లతో లాభాలు ఉన్నాయని, ప్రపంచ వృద్ధికి, సమృద్ధికి బాహాటమైనటువంటి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ముఖ్యమని వారు అభిప్రాయపడ్డారు.
అంతర్జాతీయ శాంతిని, స్థిరత్వాన్ని, అలాగే ప్రాంతీయ శాంతి ని, ప్రాంతీయ స్థిరత్వాన్ని కలసికట్టుగా ప్రోత్సహించేందుకు అన్ని స్థాయిల లో క్రమం తప్పక సంప్రదింపులు జరుపుతూ ఉండాలని, ఉగ్రవాదం, జల, వాయు పరివర్తన ల వంటి ప్రపంచ సవాళ్లను పరిష్కరించడం కోసం, ఇంకా అన్ని అభిప్రాయ భేదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవడం కోసం బిఆర్ఐసిఎస్ (బ్రిక్స్), ఎస్ సిఒ మరియు ఇఎఎస్ ల వంటి యంత్రాంగాల ద్వారా సహకారాన్ని పటిష్టపరచుకోవాలని ముగ్గురు నాయకులు తమ అంగీకారాన్ని తెలిపారు.
ఆర్ఐసి ద్వారా సహకరించుకోవడానికి పెద్ద పీట వేయవలసిన ఆవశ్యకత ఉన్నదని, అదే విధం గా వివిధ సందర్భాల లో ఈ తరహా త్రైపాక్షిక సమావేశాలను మరిన్ని మార్లు నిర్వహించాలని ముగ్గురు నేతలూ గుర్తించారు.
Deepening engagement with valued development partners.
— PMO India (@PMOIndia) November 30, 2018
President Vladimir Putin, President Xi Jinping and PM @narendramodi participate in the RIC (Russia, India, China) trilateral in Buenos Aires. @KremlinRussia pic.twitter.com/G8zj5C1ezZ