మన దేశం యొక్క గొప్ప విప్లవ కారులను గౌరవించు కోవలసిన రోజు ఇది .
తల్లి భారతి యొక్క అమర పుత్రులైన వీర్ భగత్ సింగ్, సుఖ్ దేవ్ మరియు రాజ్ గురు లను వారి సర్వోచ్చ బలిదానం కొరకు వారికీ తల్లి భారతి శ్రద్ధాంజలి ఆర్పిస్తుంది.
దీనితో పాటు అసామాన్య ఆలోచన పరుడు, విప్లవ వీరుడు మరియు గొప్ప దేశ భక్తుడైన డాక్టర్ రామ్ మనోహర్ లోహియా గారికి వారి జయంతి సందర్భమున సాదర నమస్సులు
ప్రఖరమైన బుధ్ధి కలిగిన డాక్టర్ లోహియా ప్రజలతో సంబంధాలు ఉండే రాజకీయాలంటే యిష్ట పడే వారు.
దేశములో భారత్ చోడో ఉద్యమము నడుస్తున్నప్పుడు ముఖ్యమైన నాయకు లందరు జైలు పాలైనప్పుడు యువ నాయకుడు లోహియా ఉద్యమానికి సారథ్యం వహించాడు.
అతడు అజ్ఞాతంగా వుంటూ రేడియో సేవలను కూడా ప్రారంభించాడు, దీని వాళ్ళ ఉద్యమము లో మందకొడి తనము రాలేదు.
గోవా ముక్తి ఆందోళనలో డాక్టర్ లోహియా పేరు స్వర్ణ అక్షరాలతో లిఖించ దగినది
తాడిత, పీడిత, శోషిత, వంచిత ప్రజలకు అవసరం ఉందంటే అక్కడ లోహియా హాజరు అయ్యేవాడు.
డాక్టర్ లోహియా ఆలోచనలు నేటికీ ప్రేరణ నిస్తుంటాయి. అతడు వ్యవసాయాన్ని ఆధునీకరించడము తో పాటు అన్న దాత సశక్తీకరణ కు చాలా శ్రమించారు. వారి ఆలోచనలకు అనుగుణంగానే ఎన్డీయే ప్రభుత్వము కిసాన్ సమ్మాన్ నిధి, కృషి సించాయి యోజన, ఈ-నామ్, సాయ హెల్త్ కార్డు మరియు మిగతా యోజనాల ద్వారా రైతుల క్షేమం గురించి పని చేస్తున్నది.
సమాజములో నెలకొని ఉన్న కుల వ్యవస్థ మరియు మహిళలు , పురుషుల మధ్య ఉన్న అసమానతలు డాక్టర్ లోహియా లి కలవర పరిచేవి. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ అనే మా మంత్రము గత ౫సంవత్సరాలలో మేమెలా పాలనా చేసామో తెలుపుతుంది. డాక్టర్ లోహియా కళలను ఎన్డీయే పూర్తి చేసింది. నేడు ఒక వేళవారు జీవించి ఉన్నట్లైతే
ఎన్డీయే ప్రభుత్వ పాలనను చూసి తప్పకుండ గర్వ పడే వారు.
డాక్టర్ లోహియా పార్లమెంట్ లో కానీ, బయట కానీ మాట్లాడుతుంటే కాంగ్రెస్ పార్టీలో భయం స్పష్టముగా కనబడేది.
కాంగ్రెస్ దేశానికి ప్రమాద కారముగా మారింది. ఈ విషయము డాక్టర్ లోహియా కు లోకూడా తెలుసు. ౧౯౬౨ సంవత్సరములో మాట్లాడుతూ "కాంగ్రెస్ పాలనలో వ్యవసాయ రంగములో కానీ, ఉద్యోగ రంగములో గాని, రక్షణ రంగములో గాని ఎలాంటి మంచి మార్పులు జరుగ లేదని అన్నారు,
ఆయన చెప్పిన మాటలు కాంగ్రెస్ తరువాత వచ్చిన ప్రభుత్వాలకు కూడా అన్వయిస్తాయి. ఆ తరువాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలూ రైతులను ఇబ్బందులకు గురి చేసాయి. పారిశ్రామిక వేత్తలను బాధ పెట్టారు. ( కాంగ్రెస్ నాయకుల బంధువులను, వారి స్నేహితులను విడిచి పెట్టి.) దేశ రక్షణ విషయములో శీత కన్ను వేశారు.
కాంగ్రెస్ తీరుని వ్యతిరేకించే డాక్టర్ లోహియా హృదయము అల్ల కల్లోలంగా ఉండేది. వారి కృషి మూలంగానే ౧౯౬౭ ఎన్నికలలో బలమైన కాంగ్రెస్ కు ఒక కుదుపు తగిలింది. ఆ సమయములో వాజ్ పాయి మాట్లాడుతూ డాక్టర్ లోహియా ప్రయత్నాల వల్లనే హౌరా అమృతసర్ రైలు కాంగ్రెస్ పాలించని రాష్ట్రాల గుండా ప్రయాణించేది.
నేడు మన దౌర్భాగ్య మేమంటే ఈ నాటి రాజకీయ ఘటనలు ఎంతగా మారి పోయాయంటే ఉంటె లోహియా కూడా చాలా భాద పడే వాడు,
ఏ రాజకీయ పార్టీ అయితే లోహియా ను తమకు ఆదర్శంగా ప్రకటించుకుంటాయో అలంటి వారే లోహియా సిద్ధాంతాలకు తిలోదకాలు వదిలేస్తున్నారు. వీరు ఎంతగా దిగజారారంటే లోహియాను అవమాన పర్చడానికి ఎలాంటి సందర్భము వదలడం లేదు.
ఒడిశా యొక్క సమాజవాది నాయకుడు శ్రీ సురేంద్ర నాథ్ ద్వివేది మాట్లాడుతూ "ఆంగ్లేయుల కాలములో లోహియా ఎన్ని మార్లు జైలు కెళ్లాడో , అంత కన్నా ఎక్కువ మార్లు కాంగ్రెస్ ప్రభుత్వము లో జైలు కెళ్ళారు ".
నేడు అదే కాంగ్రెస్ తో లోహియా వాది పార్టీలు ఎన్నికలలో పొత్తులు పెట్టుకుంటున్నారు. ఇది చాలా విచారించ వలసిన విషయము. ఇది నిండనీయము కూడా.
డాక్టర్ లోహియా వంశ వాద రాజకీయాలను నిరసించే వాడు. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు లాంటిదని అనేవారు. కానీ నేడు వారి అనుయాయులే కుటుంబ హితమే దేశ హితము కన్నమిన్న అని భావిస్తున్నారు.
డాక్టర్ లోహియా ఉద్దేశ్యముతో వ్యక్తి "సమత, సమానత మరియూ సమత్వ భావము తో పని చేస్తారు. విచారించవలసిన విషయమేమంటే స్వయంగా లోహియవాదులమని చెప్పుకునే వారే దీనిని విస్మరించారు. ఇపుడు వారికి అధికారము, స్వార్ధము మరియు దోపిడీ లో విశ్వాసము నెలకొంది. ఈ పార్టీలు అధికారము లో ఉన్నప్పుడు దళితులను ,పేదవారిని, పీడితులను దోచుకుంటున్నారు. వీరినే కాకుండా మహిళల పట్ల కూడా వీరి ప్రవర్తన మంచిగా లేదు ఎందుకంటే వీరి పాలనలో అసాంఘిక శక్తులకు, నేరస్తులకు స్వేచ్ఛగా తిరిగే అవకాశము ఉండేది.
డాక్టర్ లోహియా జీవనంలో ప్రతి క్షేత్రములో మహిళలను పురుషులతో సమానముగా చూచే వారు. కానీ ఓటు బ్యాంకు రాజకీయాలలో మునిగిన కొన్ని రాజకీయ పార్టీలు దీనిని ఆచరణలో పెట్టలేదు. ఈ కారణంగానే ఈ పార్టీలు ఎన్డీయే ప్రభుత్వము ట్రిపుల్ తలాక్ పై తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించా లేదు.
ఈ పార్టీలకు స్పష్టం చేయాలి. మీకు లోహియా ఆదర్శాలు ముఖ్యమా లేక ఓటు బ్యాంకు రాజకీయాలు ఇష్టమా అని నిలదీయాలి.
నేడు ౧౩౦ కోట్ల భారతీయులను ఈ ప్రశ్న వేధిస్తోంది. ఎవరైతే డాక్టర్ లోహియా విశ్వాసాలనే కల రాచారో అలాంటి వారి నుండి దేశ సేవ ను ఆశించడం అత్యాశే అవుతుంది.
ఎవరైతే డాక్టర్ లోహియా సిద్ధాంతాలకు ద్రోహం చేసారో అలంటి వారు దేశవాసులకు కూడా ద్రోహం చేయగలరు.