ఆస్ట్రేలియా మరియు భారతదేశం ల యొక్క వ్యాపార మంత్రులు,
ఇంకా, మనతో కలసిన రెండు దేశాలకు చెందిన స్నేహితులందరి కి,
నమస్కారాలు.
ఒక నెల కన్నా తక్కువ కాలం లోనే ఈ రోజు న నేను నా మిత్రుడు శ్రీ స్కాట్ తో పాటు గా మూడో సారి నేను ముఖాముఖి గా సమావేశం అవుతున్నాను. కిందటి వారం లో మన మధ్య జరిగిన వర్చువల్ సమిట్ లో చాలా ఫలప్రదం అయినటువంటి చర్చ చోటు చేసుకొంది. ఆ కాలం లో ఇకానామిక్ కోఆపరేశన్ ఎండ్ ట్రేడ్ అగ్రీమెంట్ విషయమై సంప్రదింపుల ను వీలైనంత త్వరలో ముగించవలసింది గా మన బృందాల కు మనం ఆదేశాల ను ఇచ్చాం. మరి ఈ రోజు న ఈ ముఖ్యమైనటువంటి ఒప్పంద పత్రాల పై సంతకాలు జరుగుతూ ఉండటం తో నేను చాలా ప్రసన్నం గా ఉన్నాను. ఈ అసాధారణమైన కార్యసాధన కు గాను, నేను ఇరు దేశాల వ్యాపార మంత్రుల కు మరియు వారి వారి అధికారుల కు హృదయ పూర్వక అభినందనల ను తెలియజేస్తున్నాను.
మరీ ముఖ్యం గా ఆస్ట్రేలియా పూర్వ ప్రధాని మరియు వర్తమానం లో ప్రధాని శ్రీ మారిసన్ కు వ్యాపార విషయాల లో దూత గా ఉన్నటువంటి శ్రీ టోనీ ఎబట్ కు కూడా నేను అభినందించ దలచుకొన్నాను. ఆయన ప్రయాస లు ఈ ప్రక్రియ ను వేగవంతం చేయడం లో తోడ్పడ్డాయి.
మిత్రులారా,
ఇంత తక్కువ కాలం లో అంతటి ఒక ముఖ్యమైన ఒప్పందం కొలిక్కి వచ్చింది అంటే ఉభయ దేశాల కు మధ్య పరస్పర విశ్వాసం ఏ స్థాయి లో ఉందో తెలుస్తున్నది. ఇది మన ద్వైపాక్షిక సంబంధాల లో నిజంగానే ఒక మహత్తరమైనటువంటి ఘడియ గా ఉంది. మన ఆర్థిక వ్యవస్థల మధ్య ఒక దేశం యొక్క అవసరాల ను మరొక దేశం తీర్చేటటువంటి ఘనమైన శక్తి సామర్ధ్యాలు ఉన్నాయి. ఈ ఒప్పందం ద్వారా మనం ఈ అవకాశాల ను పూర్తి స్థాయి లో వినియోగించుకోవడాని కి ముందుకు పోతాం అని నాకు పూర్తి నమ్మకం ఉంది.
ఈ ఒప్పందం మనకు, మన విద్యార్థుల ను, వృత్తి నిపుణుల ను మరియు యాత్రికుల ను పరస్పరం అటూ ఇటూ పంపుకోవడాన్ని సులభతరం చేయగలదు, దీనితో ఈ సంబంధాలు మరింత దృఢం కానున్నాయి. ఇండియా-ఆస్ట్రేలియా ఇకానామిక్ కోఆపరేశన్ ఎండ్ ట్రేడ్ అగ్రీమెంట్ (‘‘IndAus ECTA’’) ను ప్రభావవంతమైన విధం గాను, ఫలప్రదం గాను కొలిక్కి తెచ్చినందుకు ఇరు దేశాల బృందాల కు నేను మరో మారు అభినందనల ను తెలియ జేస్తున్నాను.
నేటి కార్యక్రమం లో పాలుపంచుకొన్నందుకు ప్రధాని శ్రీ మారిసన్ కు ఇవే నా హృదయ పూర్వక ధన్యవాదాలు. ఆస్ట్రేలియా లో త్వరలో జరుగనున్న ఎన్నికల ను ఫలప్రదం గా నిర్వహించాలి అని అభిలషిస్తూ, ఇవే నా శుభాకాంక్షలు. రేపటి రోజు న జరుగనున్న ప్రపంచ కప్ ఫైనల్ లో ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు కు కూడాను ఇవే నా శుభాకాంక్షలు.
నమస్కారం.