యువర్ ఎక్స్ లన్సి, నా మిత్రుడు, అధ్యక్షుడు శ్రీ ఇబ్రాహిం సోలిహ్,
మాల్దీవ్స్ కు చెందిన మా విశిష్ట స్నేహితులు,
సహచరులారా,
నమస్కారం,
అధ్యక్షుడు శ్రీ సోలిహ్, మీతో సంభాషించడం ఎల్లప్పటి కీ సంతోషాన్ని ఇచ్చే విషయమే. మాల్దీవ్స్ మరియు మీరు కల కాలం మా హృదయాల లో ఉంటారు.
మీ యొక్క పదవీకాలం లో ఒకటో వార్షికోత్సవాన్ని కొద్ది రోజుల క్రిందటే జరుపుకొన్న సందర్భం లో మిమ్ములను నేను అభినందించదలచాను. అది మాల్దీవ్స్ యొక్క ప్రజాస్వామ్యాని కి మరియు వికాసాని కి ఒక మైలురాయి వంటి సంవత్సరం గా ఉండింది. అది భారతదేశం-మాల్దీవ్స్ సంబంధాల లో కూడాను ఒక ముఖ్యమైన సంవత్సరం గా ఉంది.
నా ప్రభుత్వం అనుసరిస్తున్న ‘‘నైబర్‌హుడ్ ఫస్ట్’’ మరియు మీ ప్రభుత్వం అవలంబిస్తున్న ‘‘ఇండియా ఫస్ట్’’ విధానాలు అన్ని రంగాల లో మన ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేశాయి. మన నిర్ణయాల ను ఆచరణ రూపం లోకి తీసుకు రావడం అనేది మాల్దీవ్స్ యొక్క ఆర్థిక వ్యవస్థ ను, మౌలిక సదుపాయాల ను మరియు సామర్ధ్య నిర్మాణాన్ని ప్రోత్సహించింది.
ఈ పురోగతి ని మాల్దీవ్స్ యొక్క ఆవశ్యకతల కు మరియు ప్రాథమ్యాల కు అనుగుణం గా ఉన్న రంగాల లో సాధించడమనేది మరీ ముఖ్యమైనటువంటి సంగతిగా ఉంది.
‘‘మేడ్ ఇన్ ఇండియా’’ కార్యక్రమం లో భాగం గా రూపొందించిన ఫాస్ట్ ఇంటర్ సెప్టర్ క్రాఫ్ట్ ను మీ యొక్క కోస్తా తీర రక్షక దళాని కి ఈ రోజు న ఆధికారికం గా అప్పగించడమైంది. ఈ అధునాత నౌక ను ఎల్ & టి నా యొక్క స్వరాష్ట్రమైన గుజరాత్ లో నిర్మించింది. ఈ నౌక మాల్దీవ్స్ యొక్క సాగర సంబంధిత భద్రత ను పెంపొందించడం లో సహాయకారి గా ఉంటుంది. అంతేకాదు మీ దేశం యొక్క నీలి ఆర్థిక వ్యవస్థ కు మరియు పర్యటన రంగాని కి సైతం ఇది ప్రోత్సాహాన్ని అందిస్తుంది. గస్తీ నౌక కు ‘‘కామ్ యాబ్’’ అని పేరు పెట్టినందుకు నేను సంతోషిస్తున్నాను. ‘‘కామ్‌యాబ్’’ అనే పదాని కి హిందీ భాష లోను మరియు దివేహీ భాష లోను ‘‘సఫలత’’ అనే అర్థం వస్తుంది.
ఎక్స్ లన్సి,
అడ్డూ ప్రాంత అభివృద్ధి కి మీ ప్రభుత్వం కట్టబెడుతున్నటువంటి ప్రాముఖ్యాన్ని నేను ఒకసారి గుర్తు కు తెచ్చుకొంటాను. భారతదేశం ఆ దీవి యొక్క సముదాయాల బ్రతుకు తెరువు కు అండగా నిలబడేందుకు హై ఇంపాక్ట్ కమ్యూనిటీ డివెలప్‌మెంట్ పథకాల లో భాగస్వామ్యం పంచుకొనేందుకు సంతోషిస్తున్నది.
మిత్రులారా,
మన దేశాల మధ్య సన్నిహిత సంబంధాల లో ప్రజల కు ప్రజల కు మధ్య సంబంధాలు అనేది కీలకాంశాల లో ఒకటి గా ఉంది. మాల్దీవ్స్ ను సందర్శిస్తున్న భారతదేశ యాత్రికుల సంఖ్య లు రెట్టింపు కన్నా అధికం గా ఉన్నాయి. ఈ అంశం లో భారతదేశం అయిదో స్థానం నుండి రెండో స్థానాని కి ఎగసింది. ఢిల్లీ, ముంబయి మరియు బెంగళూరు నుండి మూడు నేరు విమాన సర్వీసులు కూడా ఈ వారం లోనే ఆరంభం అయ్యాయి.
రూపే చెల్లింపు వ్యవస్థ భారతీయులు మాల్దీవ్స్ కు ప్రయాణించడాన్ని మరింత సరళతరం చేయనుంది. ఈ వ్యవస్థ ను బ్యాంక్ ఆఫ్ మాల్దీవ్స్ తోడ్పాటు తో ప్రారంభించడం నాకు సంతోషాన్ని కలిగిస్తున్నది.
ఎక్స్ లన్సి,
ఈ రోజు న మనం మాలే ప్రజల కు ఎల్ఇడి వీధి దీపాల వ్యవస్థ ను కూడా అంకితం చేశాము. ఈ పర్యావరణ మైత్రీపూర్వకమైనటువంటి దీపాల తాలూకు ప్రయోజనాల ను వారికి అందించడం భారతదేశాని కి చాలా సంతోషాన్ని కలిగిస్తున్నది. ఈ తరహా వీధి దీపాలు 80 శాతం వ్యయాన్ని కూడా ఆదా చేస్తాయి.
ఎక్స్ లన్సి,
మనం హుల్‌హుల్‌మాలే లో ఒక కేన్సర్ ఆసుపత్రి ని మరియు ఒక క్రికెట్ స్టేడియమ్ ను నిర్మించే దిశ గా కూడా కృషి చేస్తున్నాము.
అడ్డూ ప్రాంతం లో రహదారులు మరియు పునరుద్ధరణ పనులు త్వరలోనే మొదలవనున్నాయన్న సంగతి ని మరియు 34 దీవుల లో నీటి సరఫరా మరియు పారిశుధ్య పథకాల తాలూకు పనులు జరుగుతున్నాయన్న సంగతి ని నా చెవి న వేశారు.
భారతదేశ సహకారం తో అమలవుతున్న పథకాలు మాల్దీవ్స్ ప్రజల కు రానున్న సంవత్సరం లో మరిన్ని లాభాల ను కొని తేనున్నాయి.
ఒక సన్నిహితమైన మిత్రుని గాను, సముద్ర తీర పొరుగు దేశం గాను భారతదేశం మాల్దీవ్స్ యొక్క అభివృద్ధి లో, మాల్దీవ్స్ ప్రజాస్వామ్యం లో భాగస్వామ్యాన్ని కొనసాగించడాని కి కట్టుబడివుంది. మనం హిందూ మహాసముద్ర ప్రాంతం లో శాంతి సాధన కు మరియు పరస్పర భద్రత లక్ష్య సాధన కు మన సహకారాన్ని పెంపొందించుకొందాము.
ఎక్స్ లన్సి,
ఢిల్లీ లో మీతో భేటీ కావడం కోసం నేను వేచివుంటాను. మాల్దీవ్స్ యొక్క శాంతి కోసం మరియు సమృద్ధి కోసం నేను అక్కడి స్నేహశీలురైన ప్రజల కు ఆప్యాయభరిత శుభాకాంక్షల ను అందజేస్తున్నాను.
మీకు అనేకానేక ధన్యవాదాలు.