పార్లమెంటు యొక్క ఉభయ సభల లో రాష్ట్రపతి చేసిన ప్రసంగం సమగ్రమైంది గాను మరియు ప్రగతి, ఇంకా సుపరిపాలన ల తాలూకు మార్గసూచీ ని ఆవిష్కరించినది గాను ఉందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. రాష్ట్రపతి ప్రసంగం పాఠం యొక్క లింకు ను కూడా శ్రీ నరేంద్ర మోదీ పంచుకొన్నారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో -
‘‘పార్లమెంట్ యొక్క ఉభయ సభల లో రాష్ట్రపతి గారి ప్రసంగం సమగ్రంగా ఉందింది. ఆమె ప్రగతి, ఇంకా సుపరిపాలన ల కై ఉద్దేశించిన ఒక మార్గసూచీ ని ఆవిష్కరించారు. దీనిలో భారతదేశం సాధించిన ప్రగతి ని వివరించడంతో పాటు భవిష్యత్తు లో సంభవనీయతలను కూడా తెలియజేసింది. ఆమె ప్రసంగం లో మన పౌరుల జీవనం లో ఒక గుణాత్మకమైన మార్పునకు పూచీ పడడం కోసం మనం అందరం ఉమ్మడి గా అధిగమించవలసిన ప్రధాన సవాళ్ళ లో కొన్ని సవాళ్ళ ప్రస్తావన కూడా ఉంది’’ అని పేర్కొన్నారు.
Rashtrapati Ji's address to both Houses of Parliament was comprehensive and presented a roadmap of progress and good governance. It covered the strides India has been making and also the potential that lies ahead. Her address also mentioned some of the major challenges we have to… pic.twitter.com/hAK6FWfvhU
— Narendra Modi (@narendramodi) June 27, 2024