మాన్యురాలు నెదర్లాండ్స్ రాజ్యానికి మహారాణి మేక్సిమా గారితో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు భేటీ అయ్యారు.
మాహారాణి మేక్సిమా గారు ఇన్‌క్లూసివ్ ఫైనాన్స్ ఫర్ డివెలప్‌మెంట్ అంశాలలో ఐరాస సెక్రటరీ జనరల్ కు విశేష దూత హోదా లో భారతదేశం లో పర్యటిస్తున్నారు.
భారతదేశం లో ఆర్థిక సేవలను అందరికీ అందుబాటు లోకి తీసుకు రావడాన్ని పెంపొందింపచేయడం కోసం భారత ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలుగా అమలు చేసిన వివిధ కార్యక్రమాలను గురించి ప్రధాన మంత్రి శ్రీ మోదీ మరియు మహారాణి మేక్సిమా గారు లు చర్చించారు. ఈ కార్యక్రమాలలో జన్ ధన్ యోజన, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన, మరియు అటల్ పెన్షన్ యోజన ల వంటివి ఉన్నాయి. ఈ కార్యక్రమాల ద్వారా సాధించిన పురోగతిని మహారాణి మేక్సిమా గారు ప్రశంసించారు.
ఉభయ నేతలు ప్రపంచ అభివృద్ధి సంబంధిత ఆర్థిక సహాయం గురించి కూడా చర్చించారు. ఈ దిశగా ఇండియన్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ (ఐటిఇసి) పథకం ద్వారా మరియు విదేశాలలో అభివృద్ధి పథకాలకు ఆతిథేయ ప్రభుత్వం యొక్క ప్రాథమ్యాలు, ఇంకా అవసరాల ప్రాతిపదికన తగ్గింపు రేటులపై లైన్స్ ఆఫ్ క్రెడిట్ ను ఏర్పాటు చేయడం ద్వారా భారతదేశం చేస్తున్న కృషి ని కూడా మహారాణి మేక్సిమా గారు మెచ్చుకొన్నారు.
Queen Máxima of the Netherlands met PM @narendramodi. pic.twitter.com/kpPZdwMTBh
— PMO India (@PMOIndia) May 28, 2018