వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర లబ్ధిదారులతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంభాషించి, ప్రసంగించారు. ఈ కార్యక్రమం సందర్భంగా రాజస్తాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, తెలంగాణ, మిజోరంలలో ప్రధానమంత్రి వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రను ప్రారంభించారు.
పిఎంఎస్ బివై, పిఎంజెబివై, పిఎం కిసాన్ సమ్మాన్ నిధి, కిసాన్ క్రెడిట్ కార్డుల నుంచి తాను లబ్ధి పొందానని కేరళలోని కోజికోడ్ కు చెందిన విబిఎస్ వై లబ్ధిదారు, అరటి రైతు శ్రీ ధర్మరాజన్ ప్రధానమంత్రికి చెప్పారు. గతంతో పోల్చితే ఇప్పుడు అందుబాటులో ఉన్న ఈ ప్రయోజనాల ప్రభావం ఏమిటి అని ప్రధానమంత్రి ప్రశ్నించగా ఎరువులు, ఇతర పరికరాలు అందుబాటులో ఉండడంతో పాటు వ్యవసాయానికి ఆర్థిక సహాయం అందిందని శ్రీ ధర్మరాజన్ వివరించారు. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా అందిన సొమ్మును వ్యవసాయ అవసరాలకు ఉపయోగించుకున్నట్టు చెప్పారు.
ప్రభుత్వ పథకాలు, రుణాలు శ్రీ ధర్మ తన కుటుంబం కోసం మరింత సొమ్ము పొదుపు చేయడానికి ఉపయోగపడ్డాయని ప్రధానమంత్రి అన్నారు. ఆ రుణాలే అందకపోయి ఉంటే అధిక వడ్డీకి తెచ్చిన రుణాలతో ఆ ఖర్చులు భరించాల్సివచ్చేదని ఆయన చెప్పారు. తన ఇద్దరు కుమార్తెలను చదివించుకున్న విషయం ప్రధానమంత్రికి వివరిస్తూ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చేయాలని తలపెట్టిన తన కుమార్తె వివాహానికి కూడా సొమ్ము దాచుకునేందుకు ప్రభుత్వ పథకాలు సహాయపడ్డాయని శ్రీ రాజన్ చెప్పారు.
మెరుగైన జీవితం అందించినందుకు శ్రీ రాజన్ ప్రధానమంత్రికి అభినందనలు తెలిపారు. శ్రీ రాజన్ తన కుమార్తెలను చదివించుకున్న ప్రగతిశీల రైతు అని, తనకు లభించిన సొమ్మును మంచిపనులకు వినియోగించుకున్న అతని జీవితం స్ఫూర్తిదాయకమని ప్రధానమంత్రి అన్నారు.