ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన మాతృమూర్తి జీవన యాత్ర ను అద్భుత శతాబ్ది అంటూ ఈ రోజు న అభివర్ణించారు. ఆ జీవనాని కి ఈశ్వరుని శ్రీచరణాల లో నేడు శాంతి లభించింది.
ప్రధాన మంత్రి యొక్క తల్లిగారైన శ్రీమతి హీరాబెన్ ఈ రోజు న కన్నుమూశారు. ప్రధాన మంత్రి తాను అమ్మగారి లో ఎల్లప్పటికీ ఆ త్రిమూర్తి యొక్క అనుభూతి ని గ్రహించాను అంటూ గుర్తు కు తెచ్చుకొన్నారు. ఆ త్రిమూర్తుల లో.. ఒక తపస్వి యొక్క యాత్ర, స్వార్థరహితం అయినటువంటి కర్మయోగి యొక్క ప్రతీక యే కాక విలువ లకు సమర్పితం అయినటువంటి జీవనం కూడా మిళితం అయ్యాయి అని ఆయన అన్నారు.
ప్రధాన మంత్రి ఎతన తల్లి గారి తో ఆవిడ వందో పుట్టిన రోజు న భేటీ అయిన వేళ లో తల్లి గారు ఇచ్చినటువంటి ఒక సలహా ను జ్ఞప్తి కి తెచ్చుకొంటూ ఇలా చెప్పారు.. అమ్మ నాతో ఒక మాట ను చెప్పారు; ఆ మాట ఏమిటి అంటే కర్తవ్యాన్ని వివేకయుక్తం గా నెరవేర్చడమూ, జీవనాన్ని శుద్ధం గా జీవించడమూను అనేదే అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి -
‘‘ఒక భవ్యమైన శతాబ్ది జీవనాని కి ఈశ్వరుని చరణాల లో విశ్రాంతి లభించింది.. తల్లి గారి లో నేను సదా ఎటువంటి త్రిమూర్తి తాలూకు అనుభవాన్ని స్వీకరించాను అంటే అందులో ఒక తపస్వి యొక్క యాత్ర, నిష్కామ కర్మయోగి యొక్క ప్రతీక యే కాక విలువ ల పట్ల నిబద్ధత కలిగిన జీవనం కూడాను సమ్మిళితం అయ్యాయి.
ఆవిడ వందో పుట్టిన రోజు సందర్భం లో ఆమె తో నేను భేటీ అయినప్పుడు, నాతో ఆమె ఒక మాట ను చెప్పారు; మరి ఆ మాట నాకు ఎప్పటికీ గుర్తుండిపోయేదే. કામ કરો બુદ્ધિથી, જીવન જીવો શુદ્ધિથી ఈ మాట కు ‘వివేకవంతం గా పని చేయాలి, అంతేకాకుండా జీవనాన్ని శుద్ధం గా జీవించాలి’ అని భావం.’’ అని పేర్కొన్నారు.
शानदार शताब्दी का ईश्वर चरणों में विराम... मां में मैंने हमेशा उस त्रिमूर्ति की अनुभूति की है, जिसमें एक तपस्वी की यात्रा, निष्काम कर्मयोगी का प्रतीक और मूल्यों के प्रति प्रतिबद्ध जीवन समाहित रहा है। pic.twitter.com/yE5xwRogJi
— Narendra Modi (@narendramodi) December 30, 2022