ఐ.ఐ.టి. రూర్కీ నిర్వహించిన, మొదటి జై కృష్ణ స్మారకోపన్యాస కార్యక్రమంలో ప్రధానమంత్రి యొక్క ప్రధాన కార్యదర్శి శ్రీ పి.కె. మిశ్రా ప్రసంగించారు. ఈ ఉపన్యాసం కోవిడ్-19 పైనా, భారతదేశంలో విపత్తు ప్రమాద నిర్వహణ యొక్క భవిష్యత్తుపైనా దృష్టి సారించింది.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ, విపత్తు ప్రమాద నిర్వహణ పరిధి పెరిగిందని చెప్పారు. దాని పరిధి విస్తరించిందనీ, ఇందులో చాలా విషయాలు కలిశాయనీ, ఇకపై దీనిని కేవలం ఒక నిర్దిష్టమైన ప్రాంతంగా చూడలేమనీ, ఆయన పేర్కొన్నారు.
మహమ్మారి కారణంగా తలెత్తే పరిస్థితులను పరిష్కరించడానికి భవిష్యత్తులో తీసుకోవలసిన చర్యలపై శ్రీ మిశ్రా మరింత నొక్కి చెప్పారు. కోవిడ్-19 మహమ్మారి ఒక పాఠం నేర్పిందనీ, దీని ద్వారా దేశం ఒక మంచి భవిష్యత్తును రూపొందించుకోగలదనీ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.