వాయు కాలుష్యాన్ని అరికట్టడం కోసం పంజాబ్, హరియాణా మరియు ఢిల్లీ రాష్ట్రాల తో ఈ రోజు న సాయంత్రం పూట ఒక ఉన్నత స్థాయి సమావేశాన్ని ప్రధాన మంత్రి కి ప్రిన్సిపల్ సెక్రటరీ గా ఉన్నటువంటి డాక్టర్ పి.కె. మిశ్రా నిర్వహించారు. వాయు కాలుష్యం స్థాయి లు పెరిగిపోతూ, ఎన్‌సిఆర్ లో అత్యవసర పరిస్థితి వంటి స్థితి కి దారితీసిన నేపథ్యం లో ఈ సమావేశం చోటు చేసుకొన్నది.
ఈ సమావేశం లో నిర్మాణ కార్యకలాపాలు, వ్యర్థాల మరియు గడ్డి దుబ్బు ల కాల్చివేత, పరిశ్రమల సంబంధిత కాలుష్యం మరియు వాహనాల రాకపోకల కు సంబంధించిన కాలుష్యం ల వల్ల తల ఎత్తిన పరిస్థితి ని సమీక్షించారు. కేబినెట్ సెక్రటరీ శ్రీ రాజీవ్ గాబా ఈ రాష్ట్రాల తో కలసి పరిస్థితుల ను రోజువారీ ప్రాతిపదిక న పర్యవేక్షించాలని నిర్ణయించడం జరిగింది. జిల్లాల లోని స్థితిగతుల ను నిరంతర ప్రాతిపదిక న పర్యవేక్షించాలని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల కు సూచించరుడమైంది.
గత మూడు రోజులు గా ప్రతికూల వాతావరణ పరిస్థితుల ను దృష్టి లో పెట్టుకొని ధూళి, దుమ్ము స్థాయిల ను మరియు అగ్ని ప్రమాద ఘటనల ను తగ్గించే దిశ గా కృషి చేయాలని ఇరుగు పొరుగు రాష్ట్రాల ను కేంద్రం కోరింది. పరిస్థితి ని మెరుగు పరచడం కోసం తీసుకొన్న చర్యల వివరాల ను ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు సమావేశం లో వెల్లడించారు.
వాయు కాలుష్యం విసరుతున్న సవాలు ను పరిష్కరించడం కోసం దేశ రాజధాని నగరం లో సుమారు 300 బృందాల ను రంగం లోకి ప్రవేశపెట్టడమైంది. ఎన్‌సిఆర్ లోని 7 ఇండస్ట్రియల్ క్లస్టర్ ల పైన, ప్రధాన ట్రాఫిక్ కారిడర్ ల పైన ప్రధానం గా శ్రద్ధ వహిస్తున్నారు. పంజాబ్, హరియాణా లలో కూడాను ఇదే విధమైనటువంటి ఏర్పాట్ల ను చేయడమైంది. ఈ రాష్ట్రాల లో అవసరమైన యంత్రాంగాన్ని సమకూర్చడం జరిగింది.
నేటి సమావేశం ప్రధాన మంత్రి కి ప్రిన్సిపల్ సెక్రటరీ 2019వ సంవత్సరం అక్టోబరు 24వ తేదీ నాడు జరిపిన సమావేశాని కి కొనసాగింపు గా చోటు చేసుకొంది. వీలైనంత త్వరలో అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందంటూ రాష్ట్రాలు హామీ ని ఇచ్చాయి. కేబినెట్ సెక్రటరీ 2019వ సంవత్సరం అక్టోబరు 4వ తేదీ నాడు చేపట్టిన ఒక ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం అనంతరం కాలుష్యం సమస్య ను పరిష్కరించే దిశ గా తగినన్ని సన్నాహక చర్యలు చేపట్టడం కోసం కేంద్రం వరుస గా సమావేశాల ను నిర్వహించింది.
ఈ రోజు న జరిగిన సమావేశాని కి ప్రధాన మంత్రి కి ప్రిన్సిపల్ అడ్వయిజర్ గా ఉన్న శ్రీ పి.కె. సిన్హా, కేబినెట్ సెక్రటరీ, పర్యావరణం, అడవులు మరియు జల వాయు పరివర్తన కార్యదర్శి, వ్యవసాయ కార్యదర్శి, కేంద్రీయ కాలుష్య నియంత్రణ మండలి చైర్ మన్, భారత వాతావరణ అధ్యయన విభాగం డైరెక్టర్ జనరల్, పంజాబ్, హరియాణా, ఇంకా ఢిల్లీ ల ప్రధాన కార్యదర్శుల తో పాటు ఇతర సీనియర్ అధికారులు కూడా హాజరయ్యారు.