‘ఇ- రూపి’వౌచర్ లక్షిత వర్గాల కు పారదర్శకమైన పద్ధతి లో లీకేజీ కి తావు ఉండనటువంటి సేవ నుఅందించడంలో ప్రతి ఒక్కరికి సాయపడుతుంది: ప్రధాన మంత్రి
డి.బి.టి నిమరింత ప్రభావశీలమైందిగా తయారుచేయడంలో ఇ- రుపీ వౌచర్ ఒక ప్రముఖ పాత్రనుపోషిస్తుంది. అలాగే అది డిజిటల్ గవర్నెన్స్ కు ఒక కొత్త పార్శ్వాన్ని ప్రసాదిస్తుంది:ప్రధాన మంత్రి
మనంసాంకేతిక విజ్ఞానాన్ని పేదలకు తోడ్పడే ఒక పరికరంగా, వారి ప్రగతికి ఉపయోగపడే ఒకసాధనంగా చూస్తున్నాం: ప్రధాన మంత్రి

ఒక వ్యక్తి కి మరియు ఒక ప్రయోజనానికి ప్రత్యేకంగా రూపొందిన డిజిటల్ చెల్లింపు సాధనం అయినటువంటి ‘ఇ-రుపీ’ (e-RUPI) ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించారు. ‘ఇ- రుపీ’ అనేది నగదు రహితమైనటువంటి, ఇచ్చి పుచ్చుకోవడం భౌతికం గా చేయనక్కరలేనటువంటి ఒక సాధనం.

 

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ ప్రత్యక్షం, ప్రయోజనం, బదలాయింపు (డీబీటీ)ని దేశంలోని డిజిటల్ లావాదేవీలలో మరింత ప్రభావవంతమైందిగా రూపొందించడంలో ఇ రూపీ వౌచర్ ఒక ప్రధానమైన పాత్రను పోషించనుందని, అంతేకాకుండా ఇది డిజిటల్ పరిపాలన కోసం ఒక కొత్త పార్శ్వాన్ని ప్రసాదిస్తుందని చెప్పారు. ఇది లక్షిత వర్గాలకు పారదర్శకమయిన పద్ధతిలో ఎలాంటి దారి మళ్లింపులకు తావు ఉండనటువంటి విధంగా సేవల అందజేతలో ప్రతి ఒక్కరికి సాయపడుతుంది అని ఆయన పేర్కొన్నారు. ప్రజల జీవనాలను సాంకేతిక విజ్ఞానంతో కలపడంలో భారతదేశం ఏ విధంగా పురోగమిస్తున్నదో సూచించే ఒక సంకేతమే ‘ఇ- రుపీ’ అనీ ఆయన అన్నారు. భవిష్యత్తును దర్శింపచేసే సంస్కరణాత్మక కార్యక్రమం అయినటువంటి ఈ సాధనం భారతదేశం స్వాతంత్య్ర సాధన తరువాత 75వ వార్షికోత్సవాన్ని ‘అమృత్ మహోత్సవ్’ గా జరుపుకొంటున్న వేళలో రూపుదాల్చినందుకు ఆయన తన సంతోషాన్ని కూడా వ్యక్తం చేశారు.

ప్రభుత్వానికి తోడు మరేదైనా సంస్థ ఎవరికైనా వారి వైద్య చికిత్సలో గాని, విద్యలో గాని లేదా మరే పనిలోనైనా గాని సాయాన్ని అందించాలని కోరుకొనే పక్షంలో, అటువంటప్పుడు అవి నగదు కు బదులు గా ఒక ఇ రుపీ వౌచర్ ను అందించవచ్చు అని ఆయన అన్నారు. దీని తో ఆ వ్యక్తి కి డబ్బు ను దేనికోసమైతే ఇచ్చారో ఆ పనికోసమే ఆ సొమ్ము ను ఉపయోగించేందుకు వీలుగా ఉంటుందన్నారు.

‘ఇ- రుపీ’ అనేది వ్యక్తికి ప్రత్యేకమైనటువంటిది, నిర్దిష్ట ప్రయోజనానికి ఉద్దేశించినటువంటిది అని ప్రధాన మంత్రి అన్నారు. ఏ సహాయానికైనా గాని, లేదా ఏ ప్రయోజనాన్ని అయినా గాని అందించడం కోసం ధనాన్ని ఉపయోగించేందుకు ఇ- రుపీ పూచీ పడుతుంది అని ఆయన వివరించారు.

 

సాంకేతిక విజ్ఞానం సంపన్నులకు సంబంధించిన అంశమే అని భారతదేశం వంటి ఒక పేద దేశంలో సాంకేతిక విజ్ఞానానికి ఎలాంటి అవకాశం లేదని భావించిన ఒక కాలం అంటూ ఉండేది అని ప్రధాన మంత్రి గుర్తు కు తెచ్చారు. ఈ ప్రభుత్వం సాంకేతిక విజ్ఞానాన్ని ఒక ఉద్యమం గా తీసుకొన్నప్పుడు రాజకీయ నేతలు, కొంతమంది నిపుణులు ప్రశ్నించారని ఆయన జ్ఞాపకం చేసుకొన్నారు. ప్రస్తుతం దేశం ఆ తరహా ప్రజల ఆలోచన విధానాన్ని తిరస్కరించిందని, వారి వైఖరి తప్పు అని రుజువు చేసిందని ఆయన చెప్పారు. ఇవాళ దేశం ఆలోచన విధానం వేరే విధం గా ఉంది. అది సరికొత్తది. ఈ రోజు న మనం సాంకేతిక విజ్ఞానాన్ని పేదలకు సాయపడే ఒక ఉపకరణం గా, వారి పురోగతికి సహకరించే ఒక పనిముట్టు గా చూస్తున్నాం అని ఆయన అన్నారు.

 

సాంకేతిక విజ్ఞానం ఏవిధంగా పారదర్శకత్వాన్ని లావాదేవీలలో ఒక సంపూర్ణత్వాన్ని తీసుకువస్తున్నదీ కొత్త కొత్త అవకాశాలను సృష్టిస్తున్నదీ, మరి వాటిని పేదల అందుబాటులోకి తీసుకువస్తున్నదీ ప్రధాన మంత్రి వివరించారు. ఈనాటి విశిష్టమైన ఉత్పాదన ను ఆవిష్కరించడానికి మొబైల్ ఫోన్ ను, ఆధార్ ను సంధానించిన జెఎఎమ్ వ్యవస్థ ను తీర్చి దిద్దడం కోసం కొన్ని సంవత్సరాల పాటు పునాది ని సిద్ధం చేయడం జరిగిందని ఆయన ప్రస్తావించారు. జెఎఎమ్ తాలూకు లాభాలు ప్రజలకు కంటికి కనిపించడానికి కొంత కాలం పట్టిందని, మరి మనం లాక్ డౌన్ కాలం లో ఆపన్నుల కు ఏవిధంగా సాయాన్ని అందించగలిగామో చూశాం అని, అదేకాలంలో ఇతర దేశాలు వాటి ప్రజల కు దన్నుగా నిలవడానికి సంఘర్షించడాన్ని కూడా మనం గమనించామని ప్రధాన మంత్రి అన్నారు. భారతదేశం లో ప్రత్యక్ష ప్రయోజన బదిలీ మాధ్యమం ద్వారా ప్రజల కు చెందిన ఖాతాల లోకి పదిహేడున్నర లక్షల కోట్ల రూపాయలకు పైగా నేరు గా బదిలీ చేయడం జరిగింది అని ఆయన తెలిపారు. మూడు వందలకు పై చిలుకు పథకాలు డిబిటి ని ఉపయోగించుకొంటున్నాయి. 90 కోట్ల మంది భారతీయులు ఎల్ పిజి, ఆహారపదార్థాలు, వైద్య చికిత్స, ఉపకార వేతనం, పింఛన్, లేదా వేతన పంపిణీ వంటి రంగాల లో ఏదో ఒక విధం గా ప్రయోజనాన్ని పొందుతున్నారు. ‘పిఎమ్ కిసాన్ సమ్మాన్ నిధి’ లో భాగం గా ఒక లక్షా 35 వేల కోట్ల రూపాయలు రైతులకు నేరుగా బదలాయించడం జరిగింది. గోధుమలను ప్రభుత్వం కొనుగోలు చేయడానికి గాను 85 వేల కోట్ల రూపాయలను ఇదేవిధంగా పంపిణీ చేయడమైంది. ఒక లక్షా 78 వేల కోట్ల రూపాయలను అనర్హ వ్యక్తుల చేతుల లోకి వెళ్లకుండా నివారించడం అనేది దీనివల్ల కలిగిన అత్యంత ప్రధానమైన లాభంగా ఉంది అని ఆయన వివరించారు.

భారతదేశం లో డిజిటల్ లావాదేవీల తాలూకు అభివృద్ధి పేదలు, నిరాదరణ కు లోనయిన వారు, చిన్న వ్యాపారస్తులు, రైతులు, ఇంకా ఆదివాసీ జనాభా ను సాధికారిత ముంగిట నిలిపిందని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. జూలై నెల లో 6 లక్షల కోట్ల రూపాయల మేరకు రికార్డు స్థాయిలో జరిగిన 300 కోట్ల యూపీఐ లావాదేవీల ను పరిశీలిస్తే ఈ విషయాన్ని గ్రహించవచ్చు అని ఆయన చెప్పారు.

సాంకేతిక విజానాన్ని అవగాహన పరచుకోవడంలో, దానిని అమలులోకి తీసుకురావడంలో మనం ఎవరికీ తీసిపోం అని ప్రపంచానికి నిరూపించాం అని ప్రధాన మంత్రి అన్నారు. నూతన ఆవిష్కరణ లు, సేవల అందజేత లో సాంకేతిక విజ్ఞానం వినియోగం విషయానికి వస్తే ప్రపపంచం లోని పెద్ద దేశాలతో పాటు ప్రపంచానికి నాయకత్వాన్ని ఇచ్చే సత్తా భారతదేశాని కి ఉంది అని ఆయన అన్నారు.

‘పిఎమ్ స్వనిధి యోజన’ దేశం లోని పెద్ద నగరాలలో, చిన్న పట్టణాలలో వీధుల లో తిరుగుతూ సరకులను అమ్ముకునే వారు 23 లక్షల మందికి పైగా సాయపడింది అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ మహమ్మారి కాలం లో దాదాపు గా 23 వందల కోట్ల రూపాయలను వారికి ఇవ్వడం జరిగిందని వెల్లడించారు.

దేశం లో డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పన కు, డిజిటల్ లావాదేవీల కు సంబంధించి గత ఆరు- ఏడు సంవత్సరాల లో జరిగిన కృషి తాలూకు ప్రభావాన్ని ప్రపంచం గుర్తిస్తోంది అని ప్రధాన మంత్రి అన్నారు. ప్రత్యేకించి భారతదేశం లో ఫిన్ టెక్ తాలూకు ఒక భారీ పునాది ని ఏర్పాటు చేయడం జరిగింది, ఆ తరహా పునాది అభివృద్ధి చెందిన దేశాల లోనూ లేదు అని కూడా ఆయన అన్నారు.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
PLI, Make in India schemes attracting foreign investors to India: CII

Media Coverage

PLI, Make in India schemes attracting foreign investors to India: CII
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 నవంబర్ 2024
November 21, 2024

PM Modi's International Accolades: A Reflection of India's Growing Influence on the World Stage