నేడు అస్సాం టీ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. టీ గార్డెన్ కమ్యూనిటీ వారు కష్టపడే తత్వాన్ని, వారి కృషిని ఆయన ప్రశంసించారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యమంలో ఈ మేరకు ఒక పోస్ట్ చేసారు:
"అస్సాం అద్భుతమైన తేయాకు తోటలకు ప్రసిద్ధి చెందింది. అస్సాం టీ ప్రపంచమంతటా విస్తరించింది. ప్రపంచవ్యాప్తంగా అస్సాం ప్రతిష్టను పెంపొందిస్తూ కష్టపడి పని చేస్తున్న టీ గార్డెన్ కమ్యూనిటీని నేను అభినందిస్తున్నాను, పర్యాటకులు తమ రాష్ట్ర పర్యటనల సమయంలో ఈ తేయాకు తోటలను సందర్శించాలని కూడా నేను కోరుతున్నాను." అని ప్రధాని పేర్కొన్నారు.
Assam is known for its splendid tea gardens, and Assam Tea has made its way all over the world.
— Narendra Modi (@narendramodi) March 9, 2024
I would like to laud the remarkable tea garden community, which is working hard and enhancing Assam’s prestige all over the world.
I also urge tourists to visit these tea gardens… pic.twitter.com/lCMSyQCPZg